Sri Vamana Mahapuranam    Chapters   

పదనొకండవ అధ్యాయము

ఋషయః ఊచుః :

కథమేషా సముత్పన్నా నదీనాముత్తమా నదీ | సరస్వతీ మహాభాగా కురుక్షేత్రప్రవాహినీ.

1

కథంసరః సమాసాద్యకృత్యా తీర్థాని పార్శ్వతః | ప్రయాతా పశ్చిమామాశాం దృశ్యాదృశ్యగతిః శుభా|

ఏతద్విస్తరతో బ్రూహితీర్థవంశం సనాతనమ్‌. 2

లోమహర్షణ ఉవాచ |

ప్లక్షవృక్షాత్సముద్భూతా సరిచ్ఛ్రేష్ఠా సనాతనీ | సర్వపాపక్షయకరీ స్మరణాదేవ నిత్యశః.

3

సేషాశైలసహస్రాణి విదార్య చమహానదీ ప్రవిష్టాపుణ్యతో¸°ఘా వనం ద్వైతమితిస్మృతమ్‌. 4

తస్మిన్‌ ప్లక్షేస్థితాం దృష్ట్వా మార్కండేయోమహామునిః|

ప్రణిపత్యతదా మూర్ద్నా తుష్టావాథ సరస్వతీమ్‌.

త్వందేవిః సర్వలోకానాం మాతా దేవారణిః శుభా | సదసద్దేవి ః యత్కించి న్మోక్షదాయ్యర్థవత్‌ పదమ్‌. 6

తత్సర్వంత్వయి సంయోగి యోగివత్‌ దేవి సంస్థితమ్‌ | అక్షరం పరమం దేవి యత్ర సర్వంప్రతిష్ఠితమమ్‌ |

అక్షరం పరమం బ్రహ్మ విశ్వంచైతత్‌ క్షరాత్మకమ్‌. 7

దారుణ్యవస్థితో వహ్ని ర్భూమౌ గంధో యథాద్రువమ్‌ | తథాత్వయి స్థితం బ్రహ్మ జగచ్చేద మశేషతః.

ఓంకారాక్షరసంస్థానం యత్‌ తద్దేవి స్థిరాస్థిరమ్‌ | తత్రమాత్రాత్రయం సర్వమస్తియద్‌ దేవి నాస్తి చ. 9

త్రయోలోకాస్త్రయో వేదాసై#్త్రవిద్యం పావకత్రయమ్‌|

త్రిణిజ్యోతీంషీవర్గాశ్చ త్రయో ధర్మాదయ స్తథా . 10

త్రయోగుణాస్త్రయో వర్ణాస్త్రయో దేవా స్తథాక్రమాత్‌ | త్రైధాతవస్తథా7వస్థాః పితరశ్చైవ మాదయః. 11

ఏతన్మాత్రాత్రయం దేవి ః తవరూపం సరస్వతి | విభిన్నదర్శనామాద్యాం బ్రహ్మణో హి సనాతనీమ్‌. 12

ఋషులు ప్రశ్నించారు. కురుక్షేత్రంగుండా ప్రవహించే నదులలోకెల్ల ఉత్తమమైన సరస్వతినది ఎలా పుట్టింది ? సరోవరంలోచేరి, తన తటాన అనేకతీర్థాలు నెలకొల్పి, దృశ్యాదృశ్య గమనంతో ఈ పవిత్ర స్రోతస్విని, పశ్చిమాభిముఖంగా ఎల్లా ప్రవహించింది? అతి ప్రాచీనమైన తీర్థములవంశ క్రమమంతా మాకువివరంగా చెప్పండి. మునులప్రశ్నకురోమహర్షణుడిలా బదులుచెప్ప ప్రారంభించాడు. ''స్మరణ మాత్రాన్నే సర్వపాపాలు పోగొట్టునదీ, అతిప్రాచీనమైనది ఉత్తమమైనదీ అయిన సరస్వతి ప్లక్ష (మేడి) వృక్షంనుంచి ఉద్భవించింది. వేలపర్వతాలను చీల్చుకుంటూ, ఆ మహానది తనపుణ్య జలాలతో ద్వైతవనంలోకి చేరింది. ప్లక్ష వృక్షంలో ఉండగనామెనుచూచిన మార్కండేయ మహాముని శిరసాప్రణామంచేసి ఆదేవిని స్తోత్రంచేశాడు. ''దేవీ ! నీవు సర్వలోక జననివి. మంగళమూర్తివైన దేవమాతవు (దేవారణివి) సదసద్రూపమైనదంతయూ, మోక్షదాయి అయినదీ, అర్థవంతమైన పదమేదైతేకలదో ఆదంతయు, యోనిలో సర్వంనిహితమైనట్లు, నీలో గర్భితమై ఉన్నది. అక్షరమైన పరబ్రహ్మతత్వం, క్షరాత్మకమైన (మారుతున్న) విశ్వంఅతంయు పరాశక్తివగు నీలో యిమిడియున్నది. దారువు (కొయ్య) లో అగ్నివలె, భూమిలోగంధ (వాసన) గుణంమాదిరి అనంతమైన జగత్తు, బ్రహ్మతత్వం నీలో నిండియున్నది. ఓ దేవీ! ఓంకారంలోని స్థిరాస్థిరమైన త్రివర్ణ మాత్రాక్రమం, ఉన్నది లేదను భావం. మూడులోకాలు, మూడు వేదాలు, మూడు విద్యలు, త్రేతాగ్నులు, జ్యోతిత్రయం, త్రివర్గాలు, ధర్మాదిత్రయం, త్రిగుణాలు, త్రివర్ణాలు, త్రిముర్తులు, మూడు ధాతువులు, అవస్థాత్రయం, పితరులు, మాత్రాత్రయం మొదలుగాగల త్రిపుటిఅంతా ఓ సరస్వతీదేవీ, నీరూపమే పరతత్వం యొక్క విభిన్న దర్శనాలన్నీ సనాతనివగు నీ లీలలేనమ్మా !

సోమసంస్థా హవిఃసంస్థా పాకసంస్థా సనాతనీ | తాస్త్వదుచ్చారణాద్దేవి క్రియంతే బ్రహ్మా వాదిభిః. 13

అనిర్దేశ్యపదంత్యేత దర్దమాత్రాశ్రితం పరమ్‌ | అవికార్యక్షయందివ్యం పరిణామవివర్జితమ్‌ 14

తవైతత్పరమంరూపం యన్నశక్యం మయోదితుమ్‌ | నచాస్యేననవాజిహ్వా తాల్వోష్ఠాదిభి రుచ్యతే. 15

సవిష్ణుః సవృషో బ్రహ్మా చంద్రార్కజ్యోతిరేవచ | విశ్వవాసం విశ్వరూపం విశ్వాత్మాన మనీశ్వరమ్‌. 16

సాంఖ్యసిద్ధాంత వేదోక్తంబహుశాఖాస్థిరీకృతమ్‌ | అనాదిమధ్యనిధనం సదసచ్చ సదేవతు.

17

ఏకం త్వనేకధాప్యేకభావవేద సమాశ్రితమ్‌ | అనాఖ్యం షడ్గుణాఖ్యం చ బహ్వాఖ్యం త్రిగుణాశ్రయమ్‌. 18

నానాశక్తి విబావజ్ఞం నానాశ క్తి విభావకమ్‌ | సుఖాత్సుఖంమహత్సౌఖ్యం రూపం తత్త్వగుణాత్మకమ్‌. 19

ఏవందేవిః త్వయావ్యాప్తం సకలం నిష్కలంచ యత్‌ |

అద్వైతావస్థితంబ్రహ్మ యచ్చ ద్వైతే వ్యవస్థితమ్‌. 20

యే7ర్థా నిత్యా యే వినశ్యంతి చాన్యే | యో7ర్థాః స్థూలా యే తథా సంతి సూక్ష్మాః || 21

యే వా భూమౌ యో7తరిక్షే7న్యతో వా తేషాం దేవి త్వత్త ఏవోపలబ్థి.

యద్వా మూర్తం యదమూర్తం సమస్తం యద్వా భూతేష్వేకమేకం చ కించిత్‌ |

యచ్చద్వైతే వ్యస్తభూతం చ లక్ష్యం తత్సంబద్ధం తత్స్వరైర్వ్యంజనైశ్చ. 22

ఏవం స్తుతా తదాదేనీ విష్ణోర్జిహ్వా సరస్వతీ | ప్రత్యువాచ మహాత్మానం మార్కండేయం మహామునిమ్‌.

యత్ర త్వం నేష్యసే విప్రత్రత తయాస్యామ్యతంద్రితా. 23

మార్కండేయ ఉవాచ :

ఆద్యం బ్రహ్మసరః పుణ్యం తతో రామహ్రదః స్మృతః|

కురుణాఋషిణా కృష్టం కురుక్షేత్రం తతః స్మృతమ్‌ | తస్య మధ్యే నవైగాఢం పుణ్యాపుణ్యజలావహా. 24

ఇతి శ్రీ వామనమహాపురాణ సరోమహత్మ్యే ఏకాదశో7ధ్యాయః.

''ఓ దేవీ! బ్రహ్మవాదులగువారు నిన్ను ఉచ్చిరించిన మాత్రాన్నే సోమ, హవిర్‌ః పాకయజ్ఞాలు చేయగలుగుచున్నారు. అర్ధ మాత్రాపరిమితమైన నీ పరమపదమట్టిదని నిర్దేశింపరాకున్నది. అది అవికారి అక్షయమైనది దివ్యమైనది సర్వపరిణామరహితమైనది అట్టినీ దివ్య రూపాన్ని నేనేకాదు యితరు లెవ్వరును వర్ణింపజాలరు. నోటికిగాని నాలుకకుగాని తాలువులు పెదవులకు గాని దానిని వర్ణించగల శక్తిలేదు.ఆ నీరూపమే విష్ణువు, శివుడు, బ్రహ్మ, సూర్యచంద్రాగ్నులు, ప్రపంచానికి ఆశ్రయం, విశ్వమే.విశ్వంయొక్క ఆత్మ, సాంఖ్యం, బహు శాఖావిస్త్రుతమైన వేదములద్వారా అది మధ్యాంతహీనమనీ, సత్తనీ, అసత్తనీ, చెప్పబడినది. ఒకటి అయిగూడ అనేకము. ఒకే భావాన్ని ఆశ్రయించియున్నది. పేరులేనిది, అయినా ఆరువిధాల అనేకవిధాల పేర్కొనబడినది. త్రిగుణాలతోగూడినది నానాశక్తుల తత్వంతెలిసనది నానాశక్తుల సంపుటి అయినది. సుఖాలన్నింటికి సుఖమైనది. సర్వతత్వ గుణాత్మకమైనమహాసుఖమే నీరూపం సగుణ నిర్గుణాత్మకమైన ఈ విశ్వానంతా ఓ భగవతీ ! ఇలాంటి అద్భుతరూపంతో ఆవరించియున్నావు ! అద్వయ బ్రహ్మగా, ద్వైతబ్రహ్మగా నీవే వ్యవహరిస్తున్నావు ! ఈ భూమిమీదగాని, అంతరిక్షంలోగాని యితరత్రాగాని ఉన్నట్టి శాశ్వత అశాశ్వత స్థూల సూక్ష్మాది వస్తుం జాలమంతకు నాధారమునీవే! రూపు కట్టియు, కంటికగపడకయు, ఒకటి గాను అనేకంగాను, వ్యస్తంగాను, సమస్తంగాను కనుపించే ఈ అఖిలము ఓదేవీ! నీవగుస్వర వ్యంజనాల సమాహారమే! మనోహరవిన్యాసమే!''

తననీ విధంగా స్తుతించిన మహాత్ముడగు మార్కండేయ మహామునితో విష్ణుజిహ్వఅయిన ఆ సరస్వతీదేవి యిలా పలికినది. విప్రోత్తమా! నీవెచ్చటకుగొనిపోవుదువో అచ్చకటల్లా నీవెంట అవిశ్రాంతంగా వస్తున్నాను. నడువుము.'' అంతటనామార్కండేయుడా పరమేశ్వరితో ''తల్లీ మొదట బ్రహ్మ సరోవరం అనంతరం రామసరస్సుగా, ఆతర్వాత మహర్షికురువుచేతదున్నబడి కురుక్షేత్రంగా విఖ్యాంతిగాంచిన పవిత్రక్షేత్రంగా విఖ్యాంతిగాంచిన పవిత్రక్షేత్రం మధ్యనీ పావన జలాలతోత్వరితంగా ప్రవహింపు'' మనెను.

ఇది శ్రీ వామన మహా పురాణంలో సరోమాహాత్మ్యంలో పదకొండవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters