Sri Vamana Mahapuranam    Chapters   

ఆరవ అధ్యాయము

లోమహర్షణ ఉవాచ :

నారాయణస్తుభగవాం చ్చ్రుత్వైవం పరమంస్తవమ్‌ | బ్రహ్మజ్ఞేనద్వి జేంద్రేణ కశ్యపేన సమీరితమ్‌.1

ఉవాచవచనం సమ్యక్‌ తుష్టః పుష్టదాక్షరమ్‌ | శ్రీమాన్‌ ప్రీతమనా దేవో యద్వదేత్‌ ప్రభురీశ్వరః. 2

వరంవృణుధ్వం భద్రంవో వరదోస్మిసురోత్తమాః.

కశ్యప ఉవాచ :

ప్రీతోసినః సురశ్రేష్ఠ ః సర్వేషామేవ నిశ్చయః. 3

వాసవస్యానుజోభ్రాతా జ్ఞాతినాం నందివర్దనః | ఆదిత్యాఅపిచశ్రీమాన్‌ భగవానస్తు వైసుతః. 4

అదితిర్దేవ మాతాచ ఏతమే వార్థ ముత్తమమ్‌ | పుత్రార్థంవరదంప్రాహ భగవంతం వరార్థినీ. 5

దేవాఊచుః :

నిఃశ్రేయసార్థం సర్వేషాం దైవతానాంమహేశ్వరః | త్రాతాభర్తాచదాతాచ శరణం భవ నః సదా. 6

తతస్తానబ్రవీద్విష్ణుర్దేవాన్‌ కశ్యపమేవచ | సర్వేషామేవ యుష్మాకంయే. భవిష్యంతి శత్రవః

ముహూర్తమపి తే సర్వేనస్థాస్యంతి మమాగ్రతః.

హత్వాసురగణాన్‌ సర్వాన్‌ యజ్ఞ భాగాగ్రభోజినః.

హవ్యాదాంశ్చ సురాన్‌ సర్వాన్‌ కవ్యాదాంశ్చ పితౄనపి. 8

కరిష్యేవిబుధశ్రేష్ఠాః పారమేష్ఠ్యేన కర్మణా | యథా೭೭యాతేన మార్గేణ నివర్తధ్వం సురోత్తమాః. 9

లోమహర్షణుడిట్లనియె - బ్రాహ్మణ శ్రేష్ఠుడు బ్రహ్మజ్ఞుడునైన కశ్యపుడొనర్చిన ఆ ఉత్తమస్తోత్రాన్ని విని సంతోషించి నారాయణుడు స్పష్టంగా చక్కని మాటలలో, ఓ దేవతలారా ! మీకు కావలసిన వరమడుగుడు; యిచ్చెదను. మీకు కల్యానమగుగాక యనెను. అప్పుడు కశ్యపు డిట్లనెను. ఓ దేవశ్రేష్ఠా ! మీరు మాయందు ప్రసన్నులగుట నిశ్చయము దయచేసి యింద్రునకు తమ్ముడవుగా, అదితికి పుత్రుడవుగా, జ్ఞాతిలోకాని కానందవర్ధనుడవుగా జన్మించుము. దేవమాత అదితి కూడ నదే సంకల్పంతో నా వరదేశ్వరుని తన గర్భమున జన్మించుమని యాచించినది. దేవతలందరు నా మహేశ్వరుని తమకు అధినాథుడుగా రక్షకుడుగా నుండలసినదని శరణువేడిరి. అంతట నా విష్ణుడు కశ్యపునితో సమస్త దేవతలలో, మీ శత్రువులనందరను ముహూర్త మాత్రాన సంహరించి యజ్ఞభాగభక్కులైన దేవతలకుహవ్యాలు, పితృదేవతలకు కవ్యాలు మరల యిప్పించగలను. మీరు మీమీప్రదేశాలకు మరలి వెళ్ళుడనెను.

లోమహర్షణ ఉవాచ :

ఏవముక్తేతు దేవేన విష్ణునా ప్రభవిష్ణునా | తతఃప్రహృష్టమనసః పూజయంతిస్మతం ప్రభుమ్‌. 10

విశ్వేదేవామహాత్మానః కశ్యపోదితిరేవచ | నమస్కృత్య నురేశాయ తసై#్మదేవాయరంహసా. 11

ప్రయాతాఃప్రాగ్దిశం సర్వే విపులంకశ్యపాశ్రమమ్‌ | తేకశ్యపాశ్రమం గత్వా కురుక్షేత్రవనం మహత్‌. 12

ప్రసాద్యహ్యదితం తత్రతపసే తాం న్యయోజయన్‌ | సాచచారతపోఘోరం వర్షాణామయుతం తదా. 13

తస్యానామ్నావనం దివ్యం సర్వకామప్రదం శుభమ్‌ | ఆరాధనాయకృష్ణస్య వాగ్జితా వాయుభోజనా. 14

దైత్యైర్నిరాకృతాన్‌ దృష్ట్వాతనయాన్‌ బుషిసత్తమాః | వృతాపుత్రాహమితిసా నిర్వేదాత్‌ ప్రణయాద్దరిమ్‌. 15

శరణ్యంశరణంవిష్ణుం ప్రణతా భక్తవత్సలమ్‌ | దేవదైత్యమయం చాదిమధ్యమాంతస్వరూపిణమ్‌. 16

లోమహర్షణుడిలా అన్నాడు ప్రభవిష్ణుడైన విష్ణుదేవుని మాటవిని సంతుష్టాంత రంగులై అదితి కశ్యపులతో కూడిన విశ్వేదేవతలందరు నా దేవదేవునికి పూజా నమస్కారాదు లర్పించి త్వరగా తూర్పు దిశగా పయనించి విశాలమైన కశ్య పాశ్రమానికి వెళ్లారు. కురుక్షేత్రవనమైన ఆ ఆశ్రమానికి వెళ్ళి దేవమాత అదితిని ప్రసన్నురాలిని గావించుకొని ఆమెను తపో దీక్షలో నిలిపిరి. ఆసాధ్వియు పదివేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసింది. సర్వకోర్కెలు తీర్చే ఆవనం ఆమెపేర ప్రసిద్ధి చెందింది. వాక్‌ నియమంతో వాయు భోజనం చేస్తూ తపించే ఆమె, రాక్షసులచే నోటువడిన తన పుత్రుల తలంచుకొని తన మాతృత్వము వ్యర్థమైనదని నిర్వేదం పొందినది. ఆవేదనకు శ్రీహరి మీద ప్రేమతోడుకాగా పరమార్థబోధకాలయిన శ్రేషవచనాలతో ఆమె సర్వలోక శరణ్యుడు, భక్త వత్సలుడు దేవ దైత్యమయుడు నాదిమధ్యాంతస్వరూపి ఆయిన మహావిష్ణువు నిట్లు స్తుతించెను.

అదితిరువాచ :

నమః కృత్యార్తినాశాయ నమః పుస్కరమాలినే | నమః పరమకల్యాణ కల్యాణాయాదివేదసే. 17

నమః పంకజనేత్రాయ నమః పంకజనాభ##యే | నమం పంకజసంభూతిసంభవాయాత్మయోనయే. 18

శ్రియః కాంతాయదాంతాయ దాంతదృశ్యాయచక్రిణ ః | నమః పద్మసిహస్తాయ నమః కనకరేతసే. 19

తథాత్మజ్ఞానయజ్ఞాయ యోగిచింత్యాయ యోగినే ః | నిర్గుణాయవిశేషాయ హరయే బ్రహ్మరూపిణ.20

జగచ్చతిష్ఠతే యత్ర జగతో యోనదృశ్యతే | నమః స్థూలాతిసూక్ష్మాయ తసై#్మదేవాయ శార్‌జ్గణ. 21

యంనపశ్యంతి పశ్యంతో జగదప్యఖిలంనరాః | అపశ్యద్భిర్జగద్యశ్చ దృశ్యతే హృది సంస్థితః. 22

బహిర్జ్యోతిరలక్ష్యో యోలక్ష్యతే జ్యోతిషఃపరః | యస్మిన్నేవయతశ్చైవ యసై#్యతదఖిలం జగత్‌. 23

తసై#్మ సమస్తజగతామమరాయ నమోనమః | ఆద్యః ప్రజాపతిః సోపి పితౄణాం పరమఃపతిః.

పతిఃసురాణాం యస్తసై#్మనమః కృష్ణాయవేధసే. 24

యఃప్రవృత్తైర్నివృత్తైశ్చ కర్మభిస్తు విరజ్యతే | స్వర్గాపవర్గఫలదో నమస్తసై#్మ గదాభృతే. 25

యస్తుసంచింత్యమానోపి సర్వపాపంవ్యపోహతి | నమస్తసై#్మవిశుద్ధాయ పరసై#్మహరిమేదసే. 26

యే పశ్యంత్యఖిలాధార మీశాన మజమవ్యయమ్‌ | నపునర్జన్మమరణం ప్రాప్నువంతి నమామితమ్‌. 27

యోయజ్ఞేయజ్ఞపరమై రిజ్యతే యజ్ఞసంస్థితః | తంయజ్ఞపురుషం విష్ణుం నమామి ప్రభుమీశ్వరమ్‌. 28

గీయతే సర్వవేదేషు వేదవిద్భి ర్విదాంగతిః | యస్తసై#్మ వేదవేద్యాయ నిత్యాయ విష్ణవేనమః . 29

యతోవిశ్వంసముద్భూతం యస్మిన్‌ ప్రలయమేష్యతి | విశ్వోద్భనప్రతిష్ఠాయ నమస్తసై#్మ మహాత్మనే. 30

ఆబ్రహ్మ స్తంబపర్యంతం వ్యాప్తం యేనచరాచరమ్‌ |

మాయాజాలసమున్నద్ధం తముపేంద్రం నమామ్యహమ్‌. 31

యోత్రతోయస్వరూపస్థో బిభర్త్యఖిలమీశ్వరః | విశ్వం విశ్వపతిం విష్ణుం తం నమామి ప్రజాపతిమ్‌ 32

మూర్తంతమోసురమయం తద్విధో వినిహంతియః

రాత్రిజంసూర్యరూపీచ తముపేంద్రం నమామ్యహమ్‌. 33

యస్యాక్షిణీ చంద్రసూర్యౌ సర్వలోకశుభాశుభమ్‌ | పశ్యతః కర్మసతతం తముపేంద్రం నమామ్యహమ్‌. 34

యస్మిన్‌ సర్వేశ్వరేసర్వం తస్యమేతన్మయోదితమ్‌

నానృతం తమజం విష్ణుం నమామి ప్రభవాప్యయమ్‌. 35

యద్యేతత్సత్యముక్తం మే భూయశ్చాతో జనార్దనః | సత్యేనతేనసకలాః పూర్యంతాం మేమనోరథాః. 36

ఇతి శ్రీవామనమహాపురాణ సరోమాహాత్మ్యే షష్ఠోధ్యాయః.

అదితిస్తోత్రం. కృత్యాభిచారాదిపీడితుల ఆర్తి పొగొట్టు వానికి నమస్కారము. పద్మమాలాధరునకు పరమ కల్యాణ రూపికి మొదలి బ్రహ్మకు నమస్సులు. పద్మనేత్రునకు పద్మనాభునకు పంకజ సంభవ జనకునకు ఆత్మ యోనికి లక్ష్మీపతికి దాంతునకు దృశ్యజగత్తునియామకునకు చక్రధరునకు, పద్మపాణికి, ఖడ్గధారికి హిరణ్యరేతునకు నమస్సులు. ఆత్మజ్ఞానయజ్ఞరూపికి, యోగిద్యేయునకు మహాయోగికి, నిర్గుణునకు విశేషునకు బ్రహ్మరూపియగు శ్రీహరికి ప్రణామములు. జగత్తులో ఉంటూనే దాని కగోచరుడగు వానికి స్థూలునకు అతి సూక్ష్మునకు శార్‌జ్గపాణికి నమస్కారము. ప్రపంచాన్నంతా చూడగలిగిన చూపుగలవారలెవని చూడజాలరో జగద్దృష్టి వదలినవారెవనిని తమహృదయంలోనే చూడగలరో అట్టివానికి నమస్కారము. బయటి వెలుగులో ఎవడుకనిపించడో ఎవడు సమస్త వెలుగులకు వెలపలి తత్వమో ఈవిశ్వమంతా ఎవనిలో ఎవని నుంచి ఎవని రూపాన విస్తరించిఉన్నదో అట్టిసర్వజగన్మయునకు మరల మరల నమస్సులు, సర్వానికి, ఆద్యుడు, ప్రజాపతి, పితరులకు పరమాధిపతి, దేవనాథుడనగు శ్రీకృష్ణునకు నమస్కరించుచున్నాను ! ప్రవృత్తి నివృత్త్యాత్మకములగు కర్మలవరినంటజాలవో, స్వర్గాపవర్గ ఫలమలొసంగ గల ఆగదాధరునకు ప్రణామములు. స్మరణమాత్రాన్నే సమస్త పాపములు పోగొట్ట జాలిన శుద్ధస్వరూపియగు శ్రీహరి మేధునకు నమస్సులు. అఖిలాధారుడు ఈశ్వరుడు అజుడు అవ్యయుడైన ఏ ప్రభు దర్శనం చేయువారలు జన్మమరణాలనుండి ముక్తులగుదురో అట్టిమహనీయునకు ప్రణామములు. యజ్ఞపరములగు జ్ఞానులచే యజ్ఞరూపాన యజ్ఞసంస్థితుడై ఆరాధింపబడు యజ్ఞపురుషుడైన విష్ణువుకు పరమేశ్వరునకు వందనములు. వేదవిదులగు జ్ఞానులచేతను వేదములచేతను కీర్తింపబడు శాశ్వతుడగు వేదవేద్యునకు విష్ణువుకు నమస్కారములు. ఎవనినుండి విశ్వంజనించునో ఎవనియందుండి ఎవనిలో లయమగునో అట్టి విశ్వోద్భవ ప్రతిష్ఠుడగు మహాత్మునకు ప్రణామము. బ్రమ్మమొదలు గడ్డిపోచవరకు గల ఈ చరాచర ప్రపంచమంతా ఎవనిచే పరివేష్టితమైనచో అట్టి మాయాశక్తి సమన్వితుడైన ఉపేంద్రునకు నమస్కారము. ఎవడు తోయస్వరూపస్థితుడై (నారాయణుడై) ఈ అఖిల విశ్వాన్ని ధరించి రక్షించు చున్నాడో అట్టి విశ్వరూపడు విశ్వపతి అయిన విష్ణుదేవునకు నమస్కారము. అసుర తత్వరూపాన దైత్యుల లోని తమస్సును, నైశాంధకారాన్ని పోగొట్టు సూర్యునివలె, నశింపజేయునుపేంద్రునకు నమస్కరాము. జీవుల శుభాశుభ కర్మలు, రాత్రింబవళ్ళు సూర్య చంద్రులనే నేత్రాలతో చూచుచుండు ఉపేంద్రునకు నమస్కారము ఆసర్వేశ్వరుని యందే ఈ సకలం యిమిడియున్నదని చెప్పినదిసత్యము. అది ఆనృతంకాదు. అలాంటి జన్మరహితునకు ఆవ్యయుడగు ప్రభువునకు శ్రీ మమావిష్ణువుకు మాటిమాటికి నమస్కరించెదను. ప్రభూ, జనార్దనా ! నేనే చెప్పనదంతయు సత్యమగుచో, ఆ సత్య ప్రభావం వల్లనా మనోరథాలన్నీ సఫలమగు గాక!

ఇది శ్రీ వామన మహాపురాణమందలి సరోమామాత్మ్యంలో ఆరవ అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters