Sri Vamana Mahapuranam    Chapters   

పందొమ్మిదవ అధ్యాయము

పులస్త్య ఉవాచ:

తతస్తు దేవా మహిషేన నిర్జితాః స్థానాని సంత్యజ్యసవాహనాయుధాః

జగ్ముః పురస్కృత్యపితామహంతే ద్రష్టుం తదా చక్రధరంశ్రియఃపతిమ్‌. 1

గత్వాత్వపశ్యంశ్చ మిథఃసురో త్తమౌ స్థితౌఖగేంద్రాసనశంకరౌహి|

దృష్ట్వాప్రణమ్యైవచ సిద్ధిసాధకౌ న్యవేదయం స్తన్మహిషాదిచేష్టితమ్‌. 2

ప్రభో7శ్విసూర్యేంద్వనిలాగ్ని వేధసాం జలేశశక్రాదిషు చాధికారాన్‌ |

ఆక్రమ్యనాకాత్తునిరాకృతావయం కృతావనిస్థామహిషాసురేణ. 3

ఏతద్భవంతౌశరణాగతానాం శ్రుత్వావచోబ్రూతహితంసురాణాం |

నచేద్వ్రజామో7ద్యరసాతలంహి సంకాల్యమానా యుధిదానవేన 4

ఇత్థంమురారిఃసహశంకరేణ శ్రుత్వావచోవిప్లుతచేతసస్తాన్‌ |

దృష్ట్వా7థచక్రేసహసైవకోపం కాలాగ్ని కల్పో హరిరవ్యయాత్మా. 5

తతో7నుకోపాన్మధుసూదనస్య సశంకరస్యాపిపితామహస్య |

తథైవశక్రాదిషుదైవతేషు మహర్దితేజో వదనాద్వినిఃసృతమ్‌. 6

తచ్చైకతాంపర్వకూటసన్నిభం జగామ తేజః ప్రవరాశ్రమేమునే |

కాత్యాయనస్యాప్రతిమస్యతేన మహర్షిణా తేజ ఉపాకృతంచ. 7

తేనర్షిసృష్టేన చ తేజసావృతం జ్వలత్ర్పకాశార్కసహస్రతుల్యమ్‌|

తస్మాచ్చ జాతాతరలాయతాక్షి కాత్యాయనీయోగవిశుద్ధదేహా. 8

మహేశ్వరాద్వక్త్రమథోబభూవ నేత్రత్రయం పావకతేజసాచ |

యామ్యేనకేశాహరితేజసాచ భుజాస్తథాష్టాదశ సంప్రజజ్ఞిరే. 9

సౌమ్యేనయుగ్మంస్తనయోఃసుసంహతం మధ్యంతథైంద్రేణచ తేజసా7భవత్‌|

ఊరూచ జంఘేచ నితంబసంయుతే జాతే జలేశస్యతు తేజసాహి. 10

పాదౌచలోకప్రపితామహస్య పద్మాభికోశప్రతిమౌ బభూవతుః |

దివాకరాణామపి తేజసా7గుళీః కరాంగుళీచవసుతేజసైవ. 11

ప్రజాపతీనాం దశనాశ్చతేజసా యాక్షేణ నాసా శ్రవణౌచ మారుతాతా |

సాధ్యేనచభ్రూయుగళంసుకాంతిమ త్కందర్పబాణాసనసంనిభంబభౌ. 12

తథర్షితేజోత్తమముత్తమంమహ న్నామ్నాపృథివ్యామభవత్ర్పసిద్దమ్‌ |

కాత్యాయనీత్యేవతదాబభౌసా నామ్నాచ తేనైవ జగత్ర్పసిద్ధా. 13

పులస్త్యుడనెను : మునే! మహిషునిచే నిర్జింపబడి దేవతలెల్లరు తమతమ లోకాలను ఆయుధాలు వాహనాలతోసహా వదలి బ్రహ్మను ముందుంచుకొని లక్ష్మీపతియైన నారాయణుని వద్దకువెళ్ళిరి. అచట శివకేశవుల నిర్వురను చూచినమస్కరించి ఆ సిద్ధి ప్రదాయకులతో దుష్టుడైన మహిషుని అత్యాచారాలను యిలా విన్నవించారు- ''ప్రభో ! దురాత్ముడైన మహిష దానవుడు సూర్యచంద్ర వాయ్వగ్ని పితామహరుణంద్ర అశ్వినులాదిగ గల దేవతల అధికారాలను అపహరించి వారలను స్వర్గం నుంచి భూమికితరిమివైచినాడు. అలాతరుమబడిన మేమందరం మీ శరణాగతులమైనాము. మాకు మేలగు విధానము చెప్పండి. లేనిచో ఆ దానవుని దెబ్బల కోడి మేమురసాతలానికి పోయెదము దేవతల దీనవచనాలను వినిన వెంటనే అవ్యయుడైన శ్రీహరికాలాగ్ని వలె క్రోధంతో నిండిపోయినాడు. ఆ వెంటనే శంకర పితామహులు క్రోధ మూర్చితులయ్యారు. వారితో బాటు యింద్రాది దేవతలందరి ముఖాలు క్రోధారుణాలైనాయి. ఆ విధంగా దేవతల నుండి బయలు దేరిన క్రోధాగ్ని ఒక భయంకరమైన తేజః శిఖరంగా ఆవిర్భవించి అసమానతేజస్వి అయిన కాత్యాయన మహర్షి ఆశ్రమంలో ఆయన తేజంతో కలిసి విజృంభించింది. జ్వలించుచున్న సహస్ర సూర్యకాంతితో వెలిగే ఆ మహాజ్యోతి నుంచి యోగ విశుద్ధ శరీరంతో అతి సుందరమూర్తి అయిన కాత్యాయనీ దేవి నిర్గమించింది. శివుని జ్యోతిని ఆమె ముఖము, అగ్ని కాంతితో మూడు కన్నులు, యముని తేజస్సు వల్ల కేశాలు, విష్ణుతేజం వల్ల పదునెనిమిది బాహువులు ఏర్వడినవి. చంద్రుని కాంతి చక్కనిస్తనయుగంగా, యింద్రతేజంతో నడుము, వరుణ కోపాగ్ని వల్ల తొడలు జంఘలు పిరుదులు, బ్రహ్మ తేజం వల్ల పాదాబ్డాలు, ఆదిత్యులకాంతి వల్ల పాదాంగుళులు, వసువుల తేజస్సుతో చేతివ్రేళ్లు ప్రజాపతుల కాంతితో దంతములు, యక్షతేజంతో నాసిక, మరుత్తుల వల్ల చేతులు, సాధ్యుల తేజంతో కనుబొమలు, రూపొంది ఆమె కందర్పుని బాణాసనఁలాగ తేజరిల్లింది. కాత్యాయన మహర్షి తపశ్శక్తితో నిండిన ఆతేజోమూర్తి అసమయాన్నుంచీ కాత్యాయనీ దేవిగా జగత్ర్పసిద్ధివహించిది.

దదౌ త్రిశూలం వరదస్త్రిశూలీ చక్రంమురారిర్వరుణశ్చ శంఖమ్‌ |

శక్తంహుతాశఃశ్వసనశ్చచాపం తూణౌ తథాక్షయ్యశరౌ వివస్వాన్‌. 14

వజ్రంతథేంద్రఃసహఘంటయాచ యమో7థ దండం ధనదో గదాంచ |

బ్రహ్మా7క్షమాలాంసకమండలుంచ కాలోసిముగ్రం సహచర్మణాచ. 15

హారంచసోమః సహచామరేణ మాలాం సముద్రో హిమవాన్‌ మృగేంద్రమ్‌|

చూడామణింకుండలమర్దచంద్రం ప్రాదాత్‌ కుఠారం వసుశిల్పకర్తా. 16

గంధర్వరాజోరజతాలినుప్తం పానస్య పూర్ణంసదృశం చ భాజనమ్‌.

భుజంగహారంభుజగేశ్వరో7పి అవ్లూనపుష్పామృతవఃస్రజంచ. 17

తదా7తితుష్టాసురసత్తమానాం అట్టాట్టహాసం ముముచే త్రినేత్రా|

తాంతుష్టువుర్దేవవరాః సహేంద్రాః సహిష్ణురుద్రేంద్వనిలాగ్ని భాస్కరాః. 18

నమోస్తుదేవ్యైసురపూజితాయై యాసంస్థితాయోగవిశుద్దహేహా |

నిద్రాస్వరూపేణమహీం వితత్యతృష్ణాత్రపాక్షుద్‌ భయదా7థకాంతిః. 19

శ్రద్దాస్మృతిఃపుష్టిరథోక్షమాచ | ఛాయాచ శక్తిః కమలాలయాచ |

వృత్తిర్దయాభ్రాంతిరథేహమాయా నమో7స్తు దేవ్యై భవరూపికాయై. 20

తతఃస్తుతాదేవవరైర్మృగేంద్ర మారుహ్య దేవీప్రగతా7వనీధ్రమ్‌|

వింద్యంమహాపర్వతముచ్చశృంగం చకార యం నిమ్నతరం త్వగస్త్యః. 21

ఆ దేవికి వరప్రదాతయగు శూలపాణి త్రిశూలంయిచ్చాడు. శ్రీహరి చక్రం యిచ్చాడు. వరుణుడు శంఖం, అగ్ని శక్తి ఆయుధం, వాయువు ధనుస్సు సూర్యుడు అక్షయ శరతూణీరాలు, యింద్రుడు వజ్రంఘంట, యముడు దండం కుబేరుడుగద, అక్షమాలకమండలములు బ్రహ్మ, కాలుడు మహోగ్ర ఖడ్గం డాలు, యిచ్చారు. చంద్రుడు కంఠహారం చామరాలు, సముద్రుడు మాలను, హిమవంతుడు మృగరాజును (వాహనం, సింహం) శిరోమణి, కుండలాలు, చంద్రరేఖను విశ్వకర్మ గండ్రగొడ్డలిని ఆదేవికి యిచ్చారు. కుబేరుడు రజతానులిప్తమైన ఉత్తమ పానపాత్రను శేషుడు సర్పమణి హారం, ఋతువులు ఎన్నడు వాడని పుష్పమాలను సమర్పించారు. ఆ విధంగా దేవతా శ్రేష్ఠుల చేత సంభావించ బడి ఆత్ర్యంబకేశ్వరి అట్టాట్టహాసం చేసింది. దానితో బ్రహ్మ విష్ణురుద్రేంద్రాదులతో గూడిన దేవసమూహమంతా సంతోషించారు. ఈ విధంగా స్తోత్రంచేశారు. ''దేవతల చేత పూజింపబడు దేవీ ! నీకు నమస్కారము ! పృథివి యందలి సకల జీవులలో నిద్రారూపాన తృష్ణగా , లజ్జగా, ఆకలిగా, భయంగా, కాంతిగా, శ్రద్ధగా, స్మృతి, పుష్టి, క్షమ, ఛాయ, శక్తి, లక్ష్మి, వృత్తి, దయా, భ్రాంతి, కోరిక, మాయ, యిత్యాది రూపాల్లో నిండి సంసారరూపాన ఉండే పరమేశ్వరీ! నీకు నమస్కారము; తల్లీ నీకు నమస్సులు !'' ఆ విధంగా దేవతలంతా స్తోత్రం చేసిన వెంటనే ఆ దేవి సింహం మీద స్వారి చేస్తూ, ఎత్తైన శిఖరాలతో ఉంటూ, అగస్త్యముని వల్ల అనంతరం తగ్గికుంచించుకు పోయిన వింధ్య పర్వతానికి వెడలిపోయెను.

నారద ఉవాచ :

కిమర్థమద్రింభవానగస్త్య స్తంనిమ్నశృంగం కృతవాన్‌ మహర్షిః |

కసై#్మక్వతేకేనచకారణన ఏతద్వదస్వామలసత్త్వవృత్తే. 22

పులస్త్య ఉవాచ :

పురాహివింధ్యేనదివాకరస్య గతిర్నిరుద్ధా గగనేచరస్య |

రవిస్తతః కుంభభవంనమేత్య హోమావసానే వచనంబభాషే. 23

సమాగతో7హం ద్విజదూరతస్త్వాం కురుష్వ మాముద్దరణం మునీంద్రః |

దదస్వదానంమమయన్మనీషితం చరామి యేన త్రిదివేషునిర్వృతః. 24

ఇత్థందివాకరవచోగుణసంప్రయోగి శ్రుత్వా తదాకలశజో వచనం బభాషే |

దానందదామి తవయన్మనస స్త్వభీష్టం నార్థీ ప్రయాతి విముఖోమమకశ్చిదేవ. 25

శ్రుత్వావచో7మృతమయం కలశోద్భవస్యప్రాహ ప్రభుః కరతలేవినిధాయమూర్ధ్ని|

ఏషో7ద్యమేగిరివరః ప్రరుణద్దిమార్గం వింధ్యస్య నిమ్న కరణభగవన్‌ యతస్వ. 26

ఇతిరవివచనాదథాహ కుంభజన్మా కృతమితి విద్ధిమయాహి నీచశృంగమ్‌ |

తవకిరణజితోభవిష్యతేమహీధ్రో మమచరణసమాశ్రితస్య కావ్యథాతే| 27

ఇత్యేవముక్త్వాకలశోద్భవస్తు సూర్యంహి సంస్తూయ వినమ్యభక్త్యా |

జగామసంత్యజ్యహిదండకంహి వింధ్యాచలం వృద్ధవపుర్మహర్షిః. 28

గత్వావచః ప్రాహమునిర్మహీధ్రం యాస్యే మహాతీర్థవరం సుపుణ్యం |

వృద్ధోస్మ్యశక్తశ్చతవాధిరోఢుం తస్మాద్బవాన్‌ నీచతరో7స్తు సద్యః. 29

ఇత్యేవముక్తోవమునిసత్తమేన సనీచశృంగస్త్వభవన్మహీధ్రః |

సమాక్రమచ్చాపి మహర్షిముఖ్యః ప్రోల్లంఘ్య వింధ్యంత్విదమాహశైలమ్‌. 30

యావన్నభూయోనిజమావ్రజామి మహాశ్రమం ధౌతవపుఃసుతీర్థాత్‌ |

త్వయానతావత్త్విహవర్ధితవ్యం నోచేద్‌ విశ##ప్స్యే7హ మవజ్ఞయాతే. 31

ఇత్యేవముక్త్వాభగవాన్‌ జగామ దిశం స యామ్యాం సహసా7తరిక్షమ్‌.

ఆక్రమత్యస్థేసహితాం తదాశాం కాలే వ్రజామ్యత్ర యదామునీంద్రః. 32

తత్రాశ్రమంరమ్యతరంహికృత్వా సంశుద్ధజాంబూనదతోరణాంతమ్‌ |

తత్రాథనిక్షిప్యవిదర్భపుత్రీం స్వమాశ్రమం సౌమ్యముపాజగామ. 33

ఋతావృతౌ పర్వకాలేషునిత్యం తమంబరే హ్యాశ్రమమావసత్‌ సః|

శేషంచకాలంసహిదండకస్థః తపశ్చచారామితకాంతిమాన్‌ మునిః. 34

వింధ్యో7పిదృష్ట్వాగగనేమహాశ్రమం వృద్ధిం నయాత్యేవ భయాన్మహర్షేః |

నాసౌనివృత్తేతిమతింవిధాయ నసంస్థితో నీచతరాగ్రశృంగః. 35

ఏవంత్వగస్త్యేనమహాచలేంద్రః సనీచశృంగోహి కృతోమహర్షే |

తస్యోర్త్వశృంగేమునిసంస్తుతాసా దుర్గాస్థితా దానవనాశనార్థమ్‌. 36

దేవాశ్చసిద్ధాశ్చమహోరగాశ్చ విద్యాధరాభూతగణాశ్చ సర్వే |

సర్వాప్సరోభిః ప్రతిరామయంతః కాత్యాయనీంతస్థుర పేతశోకాః. 37

ఇతి శ్రీ వామన మహాపురాణ ఏకోనవింశో7ధ్యాయః.

నారదుడనియెను : మహర్షే ! భగవంతుడగు నగస్త్య మహర్షి ఎందువలన ఎవరి కొరకు వింధ్యాద్రి ఔన్నత్యాన్ని తగ్గించెను. పుణ్యపురుషులగు మీరు నాకవివివరించుడు.

పులస్త్యుడనియెను : పూర్వమొక పర్యాయం వింధ్యుడు ఆకాశం పొడవున పెరిగిన సూర్యుని గమనాన్ని నిరోధించెను. అంతట రవి కుంభజుడగు నగస్త్యుని చేరి ఆ ముని హోమకార్యానంతరం యిట్లనెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా ! బహుదూరాన్నుంచి వచ్చియున్నాను; నన్నుద్ధరింపుము. నేను నిరాటంకంగా అంతరిక్షగమనం చేయుటకు వీలుగ నామనోవాంఛితాన్ని ప్రదానం చేయుము. సూర్యుని అర్ధగర్భితాలయిన మాటలు విని అగస్త్యుడు - నన్నర్థించిన వారెవ్వరూ విఫలులై తిరిగి వెళ్ళరు. నీ మనోవాంఛితము తెలుపుము. నెరవేర్చెదను. అనగా అమృతోపమాలైన ఆమాటలకు సంతోషించి చేతులు జోడించుకొని సూర్యుడు - 'ఈ పర్వత శ్రేష్ఠుడు నామార్గాన్ని నిరోధించినాడు. ఈ వింధ్యుని ఔన్నత్యాన్ని తగ్గించండి. అని విన్నవించెను. అ'దివాకరా ! నన్నాశ్రయించితివి. నీకేమి భాధకలుగును ? వింధ్యుని శిఖరములను అణచినట్లే తెలియుము. నీ కిరణ ప్రసారానికిక ఆటంకం ఉండదు, అని సూర్యుని ఊరడించి అగస్త్యుడు, భక్తితో రవికి మ్రొక్కి దండకారణ్యం వదలి వింధ్యాచలానికి ప్రయాణించెను. వింధ్యుని చూచి కుంభజుడు అచలోత్తమా ! నేను ముసలివాడను. పుణ్యతీర్థయాత్రలకై వెళ్ళుచున్నాను. నిన్ను దాటిపోజాలకున్నాను. కనుకనీవు వెంటనే క్రిందకు వంగి నాకు దారియిమ్మనియెను. ఆ ముని శ్రేష్ఠుని కోరికను తలదాల్చి వెంటనే వింధ్యుడు పొట్టి వాడాయెను. ఆ పర్వతాన్ని దాటిన తర్వాత నగస్త్యుడతనితో నిట్లనెను.- ఓ శైలమా! నేను తీర్థావగాహనం చేసి పరిశుద్ధుడ నై నిజాశ్రమానికి తిరిగి వచ్చువరకు నీవు పెరగకుండా యిట్లే పడియుండుము. లేనిచో నీయవజ్ఞకు శపింపగలను. ఆ విధంగా ఉద్ధతుడగు వింధ్యుని హెచ్చరించి అగస్త్యుడాకాశామార్గాన దక్షిణ దిశగా వెళ్ళి, తగిన అదనుచూచి తిరిగి పోవునుద్దేశ్యముతో నచటనే స్థిరపడిపోయెను. అచట బంగారు తోరణాలతో రమ్యంగా ఉండే ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకొని విదర్భ రాజపుత్రియగు భార్య లోపాముద్ర నచటవదలి నిజాశ్రమానికి వెళ్ళెను. ఋతు ఋతువుకూ పర్వసమయాల్లో ఆమహర్షి ఆకాశంలోని ఆ ఆశ్రమంలో ఉంటూ ఇతర సమయాల్లో దండ కారణ్యంలోని నిజాశ్రమానికి వెళ్తూ ఉంటాడు. ఇక వింధ్యుడు గూడ ఆకాశంలోని ఆ దివ్యాశ్రమాన్ని చూచి భయపడి పెరుగుటమాని ఆ తేజస్వి తిరిగి వస్తాడని ప్రతీక్షిస్తూ తన శిఖరాలను వంచుకొనియే యున్నాడు. ఈవిధంగా తపోధనుడగు నగస్త్యుడా వింధ్యుని తలపొగరణచి పాదాక్రాంతు నొనరించినాడు. మహర్షే! మునీశ్వరులంతా స్తోత్రాలు చేస్తూండగా నాకాత్యాయనీ దుర్గ రాక్షససంహారంచేసే సంకల్పంతో ఆ వింధ్యాద్రి ఊర్ధ్వశృంగాన్ని అధిరోహించి నిలచింది. ఇక తమ బాధలు మరచి దేవతలు సిద్ధులు, ఉరగులు, విద్యాధరులు, భూతగణాలు, అప్సరసలు ఆ కాత్యాయనీ దేవిని రంజింపజేస్తూ ఆమె సేవలో ఉండి పోయారు.

ఇది శ్రీవామనమహాపురాణంలో పందొమ్మిదవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters