Sri Vamana Mahapuranam    Chapters   

పదకొండవ అధ్యాయము

నారద ఉవాచ :

యదేతద్‌ భవతాప్రోక్తం సుకేశీనగరో7బరాత్‌ | పాతితోభువిసూర్యేణ తత్కాదాకుత్రకుత్రచ. 1

సుకేశీతిచకశ్చాసౌ కేనదత్తః పురో7స్యచ | కిమర్థంపాతితోభూమ్యా మాకాశాద్‌ భాస్కరేణహి. 2

పులస్త్య ఉవాచ :

శ్రుణుష్వావహితో భూత్వా కథామేతాం పురాతనీమ్‌ |

యథోక్తవాన్‌ స్వయంభూర్మాం కథ్యమానాంమయా7నఘ. 3

ఆసీన్నిశాచరపతి ర్విద్యుత్కే శీతివిశ్రుతః | తస్యపుత్రోగుణశ్రేష్ఠః సుకేశిరభవత్తతః . 4

తస్యతుష్టస్తథేశానః పురమాకాశచారిణమ్‌ | ప్రాదాదజేయత్వమపి శత్రుభిశ్చాప్యవధ్యతామ్‌. 5

సచాపిశంకరాత్ర్పాప్య వరంగగనగంపురమ్‌ | రేమే నిశాచరైః సార్థం సదా ధర్మపథిస్థితః. 6

సకదాచిత్‌ గతో7రణ్యం మాగధంరాక్షసేశ్వరః | తత్రాశ్రమాంస్తుదదృశే ఋషీణాంభావితాత్మనామ్‌. 7

మహర్షీన్‌ సతదాదృష్ట్వా ప్రణిపత్యాభివాద్యచ | ప్రత్యువాచఋషీన్సర్వాన్‌ కృతాసనపరిగ్రహః. 8

సుకేశిరువాచ :

ప్రష్టుమిచ్ఛామిభవతః సంశయో7యంహృదిస్థితః | కథయంతుభవంతోమే న చైవాజ్ఞాపయామ్యహమ్‌. 9

కింస్విచ్ఛ్రేయః పరంలోకే కిముచేహ ద్విజోత్తమాః | కేనపూజ్యస్తథా సత్సు కేనాసౌ సుఖమేధతే. 10

నారదుడనెను : మహాత్మా ! నీవింతకుముందు, సుకేశి నగరాన్ని సూర్యుడు క్రిందకు త్రోసివైచెనంటివి. అది ఎప్పుడు ఎక్కడ జరిగినది? ఆసుకేశి ఎవడు? అతనికా నరగం ఎవరిచ్చారు? ఆకాశాన్నుంచి దానిని సూర్యుడెందుకు భూమి మీదకు పడవేశాడు?

పులస్త్యుడనెను : అనఘా : ఇది చాల పురాతన గాథ; శ్రద్ధగా విను. బ్రహ్మ నాకు వినిపించిన ఈ వృత్తాంతం సాకల్యంగా చెబుతున్నాను. ఒకప్పుడు విద్యుత్కేశి అనే రాక్షస రాజుండేవాడు అతనికి సద్గుణవంతుడైన సుకేశియను వాడు కుమారుడు. అతని వల్ల సంతుష్టుడై పరమ శివుడాకాశగమనం కలిగిన ఒక నగరాన్నీ, అజేయత్వాన్నీ, శత్రువుల చేత అవధ్యత్వాన్నీ వరాలుగా యిచ్చాడు. ఆ విధంగా ఆకాశనగరాన్ని సంపాదించి ఆ అసురుడు తనవారలతో కలిసి ధర్మం తప్పకుండా, సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు. ఆ రాక్షస రాజొక పర్యాయం మగధ దేశంలో అడవికి వెళ్ళి అక్కడ మహర్షుల ఆశ్రమాలను దర్శించాడు. ఆ మహనీయులకు పాదాభివందనం చేసి, వారి చేత గౌరవింపబడి వారలతో నిట్లనెను.

సుకేశి: నా మనస్సులో ఒక సందేహం కలిగింది. దయచేసి దానిని తొలగించండి. ఇది మీకు నా ఆజ్ఞ కాదు. విన్నపము. మహనీయులారా ! ఇహ లోకంలోనూ పరలోకంలోనూ శ్రేయస్సు కలిగించేది ఏమిటి? దేనివల్ల సజ్జనులలో గౌరవం లభిస్తుంది? మానవుడు సుఖంగా ఉండకలుగుతాడు?

పులస్త్య ఉవాచ :

ఇత్థంసుకేశివచనం నిశమ్యపరమర్షయః | ప్రోచుర్విమృశ్య శ్రేయో7ర్థమిహలోకే పరత్రచ. 11

ఋషయః ఊచుః :

శ్రూయతాం కథయిష్యామస్తవరాక్షసపుంగవ | యద్దిశ్రేయోభ##వేద్వీర ఇహచాముత్రచావ్యయమ్‌. 12

శ్రేయోధర్మః పరేలోకే ఇహచక్షణదాచర | తస్మిన్‌ సమాశ్రితఃసత్సు పూజ్యస్తేన సుఖీభ##వేత్‌. 13

సుకేశిరువాచ:

కింలక్షణోభ##వేద్దర్మః కిమాచరణసత్ర్కియః | యమాశ్రిత్యన సీదంతి దేవాద్యాస్తుతదుచ్యతామ్‌. 14

ఋషయః ఊచుః :

దేవానాం పరమోధర్మః సదా యజ్ఞాదికాఃక్రియాః | స్వాధ్యాయవేదవేత్తృత్వం విష్ణుపూజారతిఃస్మృతా. 15

దైత్యానాంబాహుశాలిత్వం మాత్సర్యంయుద్ధసత్ర్కియా | వేదనంనీతిశాస్తాణాం హరభక్తిరుదాహృతా. 16

సిద్దానాముదితోధర్మో యోగయుక్తిరనుత్తమా | స్వాధ్యాయంబ్రహ్మ విజ్ఞానం భక్తిర్ద్వాభ్యామపిస్థిరా. 17

ఉత్కృష్టోపాసనంజ్ఞేయం నృత్యవాద్యేషువేదితా | సరస్వత్యాం స్థిరాభక్తి ర్గాంధర్వో దర్మ ఉచ్యతే. 18

విద్యాధరత్వమతులం విజ్ఞానంపౌరుషేమతిః | విద్యాధరాణాంధర్మో7యం భవాన్యాంభక్తిరేవచ. 19

గంధర్వవిద్యావేదిత్వం భక్తిర్భానౌతథాస్థిరా | కౌశల్యంసర్వశిల్పానాం ధర్మఃకింపురుషఃస్మృతః. 20

బ్రహ్మచర్యమమానిత్వం యోగాభ్యాసరతిర్‌ దృఢా | సర్వత్రకామచారిత్వం ధర్మో7యంపైతృకఃస్మృతః.

బ్రహ్మచర్యంయతాశిత్వం జప్యం జ్ఞానం చరాక్షస | నియమాద్ధర్మ వేదిత్వమార్షధర్మోః ప్రచక్ష్యతే. 22

స్వాధ్యాయం బ్రహ్మచర్యంచ దానంయజనమేవచ |

అకార్పణ్య మనాయాసందయా7హింసాక్షమాదమః. 23

జితేంద్రియత్వంశౌచంచమాంగల్యభక్తిరచ్యుతే | శంకరేభాస్కరేదేవ్యాంధర్మో7యంమానవః స్మృతః. 24

ధనాధిపత్యం భోగానిస్వాధ్యాయం శంకరార్చనమ్‌ | అహంకారమశౌండీర్యం ధర్మో7యం గుహ్యకేష్వితి.

పరదారావమర్శిత్వం పారక్యే7ర్థేచలోలుపా | స్వాధ్యాయంత్ర్యంబకేభక్తిర్ధర్మో7యం రాక్షసఃస్మృతః. 26

అవివేకమథాజ్ఞానంశౌచహానిరసత్యాతా | పిశాచానామయం ధర్మః సదాచామిషగృధ్నుతా. 27

యోనయోద్వాదశైవైతాస్తాసు ధర్మాశ్చరాక్షస | బ్రహ్మణాకథితాః పుణ్యాద్వాదశైవగతి ప్రదాః. 28

పులస్త్యవచనము : సుకేశి మాటలు విని ఆమహర్షులు చక్కగా వితర్కించుకొని ఇహపర శ్రేయస్కరమైన ఉపాయాన్ని వివరించారు.

ఋషుల వాక్యము : రాక్షసోత్తమా ! ఇహ పరలోకాల్లో శ్రేయస్కరమైన విషయమేదో చెప్పెదము. శ్రద్ధగా వినుము. నిశాచరా ! ధర్మాచరణ మొక్కటే ఇహ పరాల్లో సుఖం కలిగిస్తుంది. దానిననుష్ఠించిన వారిని సజ్జనులు గౌరవించి పూజిస్తారు.

సుకేశివచనము : ధర్మం యొక్క లక్షణమేమిటి ? దాని ఆచరణ పద్ధతి ఎట్టిది ? దేవాదులకు గూడ సౌఖ్యాపాదియగు ఆ ధర్మస్వరూప స్వభావాలను వివరించండి.

ఋషులన్నారు : యజ్ఞాయాగాదులు చేయడం, వేదాధ్యయనం, వేదార్థజ్ఞాన సంపాదనం, విష్ణుపూజ యివి సదా దేవతలనుష్ఠించ వలసిన ధర్మకార్యాలు యిక బాహుబలం, మాత్సర్యబుద్ధి, యుద్ధం, ఆతిథ్యం, నీతిశాస్త్రజ్ఞానము, శివభక్తి యిది దైత్యదానవ ధర్మాల. యోగాభ్యాసం, వేదాధ్యయనం, బ్రహ్మ విజ్ఞానప్రాప్తి. వీనినిమించి అచంచలమైన భక్తి యివి సిద్ధుల ధర్మాలు. ఇక గంధర్వులకు, పరమమైన ఉపాసన, నృత్యవాద్య పరిజ్ఞానం, స్థిరమైన సరస్వతీ ఆరాధనం అనుష్ఠేయ ధర్మాలు. అసమాన విద్యాసంపాదనం లోకవిజ్ఞానం, పౌరుషం, భవాన పట్ల సద్భక్తి విద్యాధర ధర్మాలు. సంగీత విద్యా నైపుణ్యం, సూర్యునిపట్ల భక్తి, సర్వశిల్ప ప్రావీణ్యం కింపురుష ధర్మాలు. బ్రహ్మచర్యం, అమానిత్వం, దృఢమైన యోగాభ్యాసాసక్తి కామగమనం పితృదేవతల ధర్మాలు; ఇక ఋషులనుష్ఠించ వలసిన ధర్మాలు, బ్రహ్మచర్యం, మితాహారం, జపం, జ్ఞానప్రాప్తి ధర్మస్వరూపజ్ఞానం, యివి; స్వాధ్యాయం , బ్రహ్మచర్యం, దానం, యజనం, ఔదార్యం, సారళ్యం, దయ, అహింసా, ఇంద్రియ విజయం, క్షమాగుణం, ఆత్మ సంయమనం, శుచిత్వం సత్సంకల్పం, శివకేశవ భాస్కర దేవ్యాదుల పట్ల భక్తి యివి మానవులనుష్ఠించవలసిన ధర్మాలు. ధనాధిపత్యం, భోగాలు, స్వాధ్యాయం, శివారాధన, అహంకారం, ఔద్ధత్యం, యక్షుల ధర్మాలు. ఇతరుల భార్యల చెరబట్టడం, పర ధనాపహరణం, త్ర్యంబకారాధన రాక్షస ధర్మాలు. ఇక పిశాచ లక్షణాలు. అవివేకం, అజ్ఞానం, ఆశౌచం, అసత్యం, సదా మాంస భోజనం. దానవా ! యివి ఈ పన్నెండు యోనుల వారికై బ్రహ్మ నిర్దేశించిన లక్షణాలు. వారివారికి సద్గతి ప్రదాలు.

సుకేశిరువాచ :

భవద్భిరుక్తాయేధర్మాః శాశ్వతాద్వాదశావ్యయాః | తత్రయేమానవా ధర్మాస్తాన్‌ భూయోవక్తుమర్హథ. 29

ఋషయః ఊచుః :

శ్రుణుష్వమనుజాదీనాం ధర్మాంస్తుక్షణదాచర | యేవసంతిమహాపృష్ఠే నరాద్వీ పేషు సప్తసు. 30

యోజనానాం ప్రమాణన పంచాశత్కోటిరాయతా | జలోపరిమహీయం హినౌరివాస్తేసరిజ్జలే. 31

తస్యోపరిచ దేవేశోబ్రహ్మాశైలేంద్రముత్తమం | కర్ణికాకారమత్యుచ్చంస్థాపయామాససత్తమ. 32

తస్యేమాంనిర్మమేపుణ్యాం ప్రజాందేవశ్చతుర్దిశమ్‌ | స్థానాని ద్వీపనం జ్ఞాని కృతవాంశ్చ ప్రజాపతిః. 33

తత్రమధ్యేచకృతవాన్‌ జంబూద్వీపమితిశ్రుతమ్‌ | తల్లక్షం యోజనానాంచ ప్రమాణననిగద్యతే. 34

తతోజలనిధీరౌద్రోబాహ్యాతో ద్విగుణఃస్థితః | తస్యాపిద్విగుణః ప్లక్షోబాహ్యతః సంప్రతిష్ఠితః. 35

తతస్త్విక్షురసోదశ్చబాహ్యతో వలయాకృతిః | ద్విగుణః శాల్మలిద్వీపో ద్విగుణో7స్య మహోదధేః. 36

సురోదోద్విగుణ స్తస్యతస్మాచ్చద్వి గుణః కుశః | ఘృతోదోద్వి గుణశ్చైవ కుశద్వీపాత్‌ ప్రకీర్తితః. 37

ఘృతోదాద్ద్విగుణః ప్రోక్తః క్రౌంచద్వీపోనిశాచర | తతో7పి ద్విగుణః ప్రోక్తః సముద్రోదధిసంజ్ఞితః. 38

సముద్రా ద్ద్విగుణః శాకః శాకాద్‌ దుగ్ధాభ్ధిరుత్తమః | ద్విగుణః సంస్థితోయత్ర శేషపర్యంకగోహరిః

ఏతేచద్విగుణాః సర్వేపరస్పర మపిస్థితాః. 39

చత్వారింశదిమాః కోట్యోలక్షాశ్చ నవతిః స్మృతాః | యోజనానాం రాక్షసేంద్ర పంచచాతి సువిస్తృతాః

జంబూద్వీపాత్‌ సమారభ్యయావత్‌ క్షీరాబ్దిరంతతః. 40

సుకేశివచనం: ద్వాదశయోనుల వారు ఆచరించాల్సిన శాశ్వత ధర్మాలేవో చెప్పారు. అయితే వీనిలో మానవుల ధర్మాలేవో మరొక పర్యాయం దయతో వివరించండి.

ఋషులన్నారు : రాత్రించరా ! మహీతతలాన సప్తద్వీపాలలో నివసించే మనుష్యాది జీవుల ధర్మాలు చెబుతున్నాం. వినుము. మహాజలరాశి మీద ఓడకువలె యీ ధరామండలం, ఏబది కోటియోజన విస్తీర్ణం గలిగి సముద్రజలాల మీద నిలచియున్నది. దానిమీద దేవాధిపతి బ్రహ్మ కమల దళాల మధ్య కర్ణికలాగ నొక ఎత్తైన పర్వతం నిర్మించాడు. దానికి నలుదిశలా, యీ పవిత్రమానవాళిని, వివిధద్వీపాలలో ప్రజాపతి సృష్టించాడు. ఆ ద్వీపాల మధ్య లక్షయోజన ప్రమాణం గల ఈ జంబూద్వీపాన్ని నిర్మించాడు. దానిచూట్టూ రెండింతల విస్తీర్ణంగల సముద్రం పరివేష్టించి ఉంది. దానికి వెలుపల రెండింతలు పరిమాణం గల ప్లక్షద్వీపం ఉంది. దాని నలువైపుల యిక్షురస సముద్రం వ్యాపించి ఉంది. దానికి ద్విగుణ ప్రమాణంలో శాల్మలి ద్వీపం దానిచుట్టూ రెండంతలుగా సురాసముద్రం వ్యాపించి ఉన్నాయి. దానికి రెండింతలు గల కుశద్వీపం, అందుకు రెండింతలుగా నేతి సముద్రం ఆవరించి ఉన్నాయి. రాక్షసా! నేతి సంద్రం చుట్టూ రెండింతల ప్రమాణంలో క్రౌంచ ద్వీపం, దానికి రెండితల పెరుగు సముద్రం క్రమ్ముకొని ఉన్నాయి దధి సముద్రాన్ని ద్విగుణ ప్రమాణం గల శాకద్వీపం ఆవరించి ఉంటే దాని చుట్టూ రెండింతలు గల క్షీర సముద్రం విస్తరించి ఉంది. దాని మీద శేష పర్యంకం మీద శ్రీహరి శయనించి ఉంటాడు. ఒకదానికొకటి రెండు రెట్ల విస్తీర్ణంతో యివి అన్నీ వ్యాపించి ఉన్నాయి. రాక్షసేశ్వరా ! జంబూద్వీపం మొదలు క్షీరసముద్రం వరకూ విస్తరించియున్న వీటన్నింటి విస్తీర్ణం నలభైకోట్ల తొంబదియైదు లక్షలయోజనాలు.

తస్మాచ్చ పుష్కరద్వీపః స్వాదూద స్తదనంతరమ్‌ | కోట్యశ్చతస్రోలక్షాణాం ద్విపంచాశచ్చరాక్షస. 41

పుష్కరద్వీపమానో7యం తావదేవతథోదధిః | లక్షమండకటా హేన సమంతాదభిపూరితమ్‌. 42

ఏవం ద్వీపాస్త్విమేసప్తపృథగ్ధర్మాః పృథక్‌ క్రియాః | గదిష్యామస్తవవయం శృణుష్వత్వంనిశాచర. 43

ప్లక్షాదిషు నరావీరయేవసంతి సనాతనాః | శాకాంతేషునతేష్వస్తియుగావస్థాకథంచన 44

మోదంతేదేవవత్తేషాం ధర్మోదివ్య ఉదాహృతః | కల్పాంతే ప్రళయ స్తేషాం నిగద్యతే మహాభుజ. 45

యేజనాఃపుష్కరద్వీపే వసంతేరౌద్రదర్శనే | పైశాచ మాశ్రితాధర్మం కర్మాంతే తేవినాశినః. 46

సుకేశిరువాచ:

కిమర్థం పుష్కరద్వీపో భవద్భిః సముదాహృతః | దుర్దర్శఃశౌచరహితోఘోరః కర్మాంతనాశకృత్‌. 47

ఋషయ ఊచుః :

తస్మిన్‌ నిశాచర ద్వీపే నరకాః సంతిదారుణాః | రౌరవాద్యాస్తతోరౌద్రః పుష్కరో ఘోరదర్శనః. 48

సుకేశిరువాచ:

కియంత్యేతాని రౌద్రాణి నరకాని తపోధనాః | కియన్మాత్రాణి మార్గేణ కాచతేషు స్వరూపతా. 49

ఋషయ ఊచః :

శృణుష్వరాక్షస శ్రేష్ఠప్రమాణం లక్షణం తథా | సర్వేషాం రౌరవాదీనాం సంఖ్యాయా త్వేకవింశతిః. 50

ద్వేనహస్రే యోజనానాం జ్వలితాంగారవిస్తృతే | రౌరవోనామ నరకః ప్రథమః పరికీర్తితః. 51

తప్తతామ్రమయీభూమిరధస్తాద్వహ్ని తాపితా | ద్వితీయో ద్విగుణస్తస్మాన్మహారౌరవ ఉచ్యతే. 52

తతో7పిద్విః స్థితాశ్చాన్యస్తామిస్రోనరకః స్మృతః | అంధతామిస్రకో నామచతుర్థో ద్విగుణఃపురః. 53

తతస్తు కాలచక్రేతి పంచమః పరిగీయతే | అప్రతిష్ఠంచ నరకం ఘటియంత్రంచ సప్తమమ్‌. 54

అసిపత్రవనం చాన్యత్సహస్రాణి ద్వినప్తతిః | యోజనానాం పరిఖ్యాత మష్టమం నరకోత్తమమ్‌. 55

నవమం తప్తకుండం చ దశమం కూటశాల్మలిః | కరపత్రస్తథైవోక్త స్తథా7న్యః శ్వానభోజనః. 56

సందంశోలోహపిండశ్చ కరంభసికతా తథా | ఘోరాక్షారనదీచాన్యా తథాన్యః కృమిభోజనః.

తథా7ష్టాదశమీప్రోక్తా ఘోరావైతరణీ నదీ. 57

తథా7పరః శోణితపూయభోజనః క్షురాగ్రధారో నిశితశ్చచక్రకః|

సంశోషణో నామతథాప్యనంతః ప్రోక్తాస్తవై తే నరకాఃసుకేశిన్‌. 58

ఇతి శ్రీ వామన మహాపురాణ ఏకాదశో7ధ్యాయః.

వాని తర్వాత పుష్కర ద్వీపం దానిని చుట్టి మంచినీటి సముద్రం రెండూ ఒక్కొక్కటి నాలుగు కోట్ల ఏబదిరెండు లక్షల విస్తీర్ణాలతో వ్యాపించి ఉన్నాయి. వీటన్నింటికీ లక్షయోజనాలు ఆవలగా నలువైపులా అండాకారంలో వ్యాపించి ఉన్నది బ్రహ్మాండ కటాహం (పెంకు). ఈ విధంగా ఏర్పడిన సప్తద్వీపాలకు వేర్వేరుగా ధర్మాచరణాలు నిర్దేశింపబడినాయి. చెబుతున్నాము. శ్రద్ధగా విను. మహావీరుడా ! ప్లక్షం మొదలు శాకద్వీపం వరకుగల ద్వీపాలలో నివసించే నరులకు మొదటి నుంచీ యుగాలనేవి లేవు. వారలు ఎల్లప్పుడూ దేవతలకు వలె, దేవ సౌఖ్యాలను అనుభవిస్తూ ఉంటారు. వారలకు కల్పాంత మందే ప్రళయం సంభవిస్తుంది. ఇక భయం గొలిపే పుష్కర ద్వీపవాసులు పిశాచ ధర్మావలంబకులై తమ కర్మ క్షయంతో నశిస్తారు.

వా. పు. 8

సుకేశి అడిగాడు. పుష్కర ద్వీపం భయంకరంగా ఉండటం, అందలి వారు అపవిత్రులుగా, పిశాచ ధర్మంతో క్రూరులుగా, కర్మాంత నాశనులుగా ఉండటానికి కారణాలేమిటి?

ఋషులన్నారు : రాక్షసా ! ఆ ద్వీపం రౌరవాది భయంకర నరకాలకు నిలయం. అందుచేత అది చూచేవారికి భయం కలిగిస్తుంది.

సుకేశి మరల అడిగాడు తపోధనులారా ! ఆ నరకాలెన్ని ! వాని స్వరూప స్వభావాలు వర్ణించండి.

ఋషులన్నారు : దైత్యేశ్వరాః రౌరవాది నరకాలు యిరువది యొక్కటి. వాటి విస్తీర్ణం లక్షణాలు వినుము. మొదటి రౌరవ నరకం రెండు వేల యోజనాల విస్తీర్ణం గలిగి, కణకణమండే నిప్పు కణికలతో నిండి ఉంటుంది. దానికి రెండింతలు ప్రమాణంతో మహారౌరవ నరకం, దిగువ నుంచి అగ్నితప్తమైన రాగిరేకులతో నిండి ఉంటుంది. దానికి ద్విగుణ ప్రమాణంలో తామిస్ర నరకం, దానికి రెండింతలు నాలుగో నరకం అంధతామిస్రం వ్యాపించి ఉంటాయి. ఐదవది కాల చక్రం. ఆరవది అప్రతిష్ఠం. ఏడవది ఘటీయంత్ర నరకం. ఎనిమిదవదైన అసిపత్రవనం డెబ్బది రెండు యోజనాల విస్తీర్ణంతో అన్నింటికన్న ప్రముఖంగా ఘోరంగా కనిపిస్తుంది. తప్తకుంభ కూటశాల్మలాలు తొమ్మిదీ పదీ నరకాలు. అట్లే కరపత్రం, శ్వానభోజనం, సందంశం, లోహపిండం, కరంభసికతం, ఘోరం, క్షారనది, కృమిభోజనం వరసగా ఉంటాయి పదునెనిమిదవది భయంకరమైన వైతరణీనది. మిగిలిన రకాలు శోణిత పూయ భోజనం, క్షురాగ్రధార, చక్కకం సంశోషణం అనంతం అనేవి. ఓ సుకేశీ! ఈ విధంగా నీకు నరకాలను గురించి తెలిపినాము.

ఇది శ్రీ వామన మహా పురాణ మందలి పదునొకండవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters