Sri Tattvamu    Chapters   

మహేశ్వరస్వరూప మెట్టిది?

శ్రు|| యో వేదాదౌ స్వరఃప్రోక్తో వేదాన్తే చ ప్రతిష్ఠితః

తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః||

వేదారంభమందును సమాప్తియందును 'ఓం' అనెడి ప్రణవోచ్చారణము విహితముగానున్నది. అది వైఖరీరూపము గాన, ప్రకృతిరూపమైన పరానాదమందు లీనమగుచున్నది. అప్రకృతికంటెను బైదయిన తత్త్వము పురుషుఁడు. అతఁడె మహేశ్వరుఁడు. అదె పరమాత్మ.

''పరో రజసి సావదోమ్‌'' పదవాచ్యమైన అమృత ధామము ఇతని నివాసస్థానము.

విస్తార వివరణము:-

1. ఋ|| ''అగ్నిమీళేపురోహితమ్‌ యజ్ఞస్య దేవమృత్వి జమ్‌ హోతారం రత్నధాతమమ్‌||''

బాహ్యార్థము:- వైదికాగ్ని ప్రార్థనము. యజ్ఞమునకు పురోహితుఁడు - దానాదిగుణయుక్తుడు. దేవయజ్ఞమునకు హోత యను పేరు గల ఋత్విఁజుడు.

యాగఫలములు- అనెడి రత్నములను ధరించువాడు. ఇట్టి గుణవిశిష్ఠుడైన అగ్ని దేవుని స్తుతించుచున్నాను.

1 శ్రు|| ''అగ్నిస్తుష్టో యజమానాయ శ్రియం ప్రయచ్ఛతి'' 2 ''అగ్నిర్నారాయణో హరిః'' 3 ''రుద్రో వా ఏషో7గ్నిః'' 4, ''అగ్నిర్మార్థా చక్షుషీ చంద్రసూర్యౌ దిశః శ్రోత్రే వాగ్వివృతాశ్చవేదాః వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మా||''

- ముండకోపనిసత్‌

ఇత్యాది శ్రుతిప్రమాణములచకే అగ్ని శబ్దవాచ్యుడు. రుద్రాంశ##మైన అగ్ని స్వాధిష్ఠానగతము. ఎట్టి యింధనము లేకయే సాధకుని కుంభరూప్రాణవాయువుచే స్వసామర్థ్యమున జ్వలనధర్మము గలది. జలతత్త్వపూర్ణము. మణి పూరము. కుండలినీనామ పరాశక్తినిలయము, మూలా ధారము. మణిపూరమునందలి జలసంపర్కముచే సుఖముగా సుప్తమై యుండును. సాధకుని ప్రాణకుంభనప్రయత్నముచే స్వాధిష్ఠానగతరుద్రరూపాగ్నిచే మణిపూరమునందలిజలము హరించిపోగా సుప్తమై యున్న కుండలినికి (పరాశక్తికి) అగ్ని స్పర్శము తగులును. తోడనే జాగరితయై కుండలిని జంటవీడినన భుజగమువలె బస్సుమను సీత్కారముతో లేచి సుషుమ్నాంతర్గత బిసతంతుతనీయసమైన సూక్ష్మతరమార్గమున శరవేగమున తటిల్ల తాసరమరుచితో సహస్రారమును జేరును.

క్షీరసముద్రము రజితశైలము హిమగిరి సంజ్ఞలతో నొప్పునది యీ సహస్రారమే.

సుషుమ్నా బద్ధచక్రములు ఉత్తేజితములుకాగా ప్రత్యేక చక్రమునందును భిన్నభిన్నరత్న కాంతిని సాధకుడు కాంచగల్గును. కుండలిన్యుత్థాపనమగా నిదియే, భవిష్యత్తున సాధక జీవునికి మేలుగోరువాడు, ఈయుత్థాపనమునకు మార్గదర్శి, పురోహితుడు, అగ్ని, చక్రములందు వివిధ రూపముల గాన నగును. రత్నసదృశకాంతులే అతని యాభరణములు. సాధకుని యోగరూపయజ్ఞమునందు హోత.

అంతర్యాగమున మార్గదర్శియై, హోతయై మా సాధనను సఫలము చేయుగాక.

2 ''ఇషేతోర్జేత్వా వాయవస్థో పాయవస్థ దేవో వస్సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణఅప్యాయధ్వ మఘ్నియా దేవభాగమూర్జస్వతీః పయస్వతీః ప్రజావతీరన మీవాఅయక్ష్మా మానస్తేన ఈశతమాఘ శగ్‌ంసో రుద్రస్య హేతిం పరితో వృణక్తు ధ్రువా ఆస్మి& గోపతౌ స్యాత బహ్వీ ర్యజమానస్య పశూ& పాహి||''

-యుజర్వేదము

వైయాకరణశిరోమణి శ్రీరామవరపు కృష్ణమూర్తి శాస్త్ర దీనికి వ్రాసిన దండాన్వయము!-

1 ఇషేత్వోర్జేత్వా = ఓమోదుగకొమ్మా! అన్నము కొఱకును, బలమునకును, కారణమగు రసముకొఱకును నిన్ను నఱకుచున్నాను.

2. పాయవః = స్థోపాయవఃస్థం = ఓదూడలారా! మీరు లేతగడ్డిని దినుటకై మీతల్లుల సమీపమునుండి తొలగి స్వేచ్ఛగా అరణ్యమునకు పొండు.

3. దేవోవఃసవితా ప్రార్పయతు, శ్రేష్ఠతమాయకర్మణ అప్యాయధ్వమఘ్నియా, దేవభాగమూర్జస్వతీః పయస్వతీఃప్రజావతీరనమీనా అయక్ష్మామాన స్తేన ఈశతమాఘశగ్‌ం సోరుద్రస్య హేతిః పరివోవృణక్తు =ఓగోవులారా! ప్రేరకుడును అంతర్యామియు నగు నీశ్వరుడు మిక్కిలి యోగ్యమగు ఇంద్రదధిరూపమైన కర్మకొఱకు మిమ్ము (అరణ్యమునందు తృణాదికమును దినుటకై) పేరేచుగాక. ఓగోపులారా ఇంద్రునికి దధిరూపమగు భాగమును (అధికముగా గడ్డితినుటచే) వృత్తి చేయుఁడు. బలహేతువగు రసము గలిగినట్టియు, అధికమైన పాలు గలిగినట్టియు, క్రిమిదోషరహితమైనట్టియు, ఇతరరోగములు లేనట్టియు మిమ్ము, దొంగలు అపహరించుటకు సమర్థులు కాకపోవుదురుగాక.

4. ధ్రువా అస్మి& గోపతౌ స్యాత బహ్వీః = గోవులారా! గోస్వామి యగు యజమానునియందు స్థిరబుద్ధికల వారలై యుండుడు. సంతానపరంపరచే బహుకుటుంబవతులై యుండుడు.

5. యజమానస్య పశూ& పాహి = ఓ మోదుగకొమ్మా! నీవు యజమానుని, గోవులను రక్షింపుము.

(ఇచట మోదుగకొమ్మ పరమశివ పరముగా వాడబడినది. అతడు పశుపతి.)

'అగ్నిమీళే పురోహితం' ఇషేత్వోర్జా' మున్నగు వేదమంత్రాదియం దమర్పబడిన యాప్రణవస్వరమే ఉపనిషత్తులందు ప్రతిపాదింప బడినది.

శ్రు|| ''ఓమితి బ్రహ్మ ఓమితీదగ్‌ం సర్వం, ఓమిత్యే తదను కృతిహస్మృతా, అప్యో శ్రావమే త్యాశ్రావయన్తి, ఓమితి సామాని గాయన్తి, ఓగ్‌ం శోమితి శస్తాణి శగ్‌ంసన్తి, ఓమిత్య ధ్వర్యుః ప్రతి గరం ప్రతిగృణాతి ఓమితి బ్రాహ్మణః ప్రవ, క్ష్యన్నాహ, బ్రహ్మప్రాప్నువానీతి, బ్రహ్మైవాప్నోతి||

- తైత్తిరియము.

బ్రహ్మపదవాచ్యము ఓంకారము. చరాచరజగత్తునకు బ్రహ్మయే ఆత్మగాన, విశ్వజగత్తునకు ప్రణవము ఆత్మ. ఓంకార మంతటను సుప్రసిద్ధము. కనుక 'ఓం, ఓం' అని పలుకగోరు చున్నారు. ఆర్యర్షులు, 'హరిః ఓం' అని వేదపాఠ మారంభింతురు. హరిఃఓం అని ముగింతురు. 'ఓం' అని శస్త్రపాఠము చేయుచున్నారు. ఓం అని సవనములయందు హోమము చేయుచున్నారు. యజ్ఞములయందు ఉపద్రష్టయగు ప్రథముడు 'ఓం' అని యనజ్ఞ నిచ్చుచున్నాడు. ఓమ్మని అగ్నిని ప్రజ్జ్వలింప జేయుచున్నాడు. ప్రణనోచ్చారణముతోనే బ్రాహ్మణులు వేదపఠనము చేయుచుబ్రహ్మము నొందుచున్నారు.

ఆ ప్రణవము ధ్యానకాలమునందు, అవ్యాకృతమగు జగత్కారణమందు లీనమగును. దాని క్రమమేమి? అకార ఉకార మకారములందు, విరాట్‌ - హీరణ్యగర్భ - అవ్యాకృత ములను ధ్యానించి, విరాడ్రూపమగు అకారమును ఉకారము నందు విలీనమొనర్చి, హీరణ్యగర్భరూపమగు ఉకారమును మూలప్రకృతిరూపమగు మకారమునందు విలీనమొనర్ప వలయును. ఈ రీతిని మూలప్రకృతియందు లీనమగు ప్రణవము యొక్క శ్రేష్ఠభాగము అనగా చతుర్థామాత్రారూపమగు నాదమునందు ధ్యానింపదగినది యేదికలదో అవస్తువే మహేశ్వరపదవాచ్యము.

శ్రు|| అథ కస్మాదుచ్యతే మహేశ్వరః యస్సద్వా& లోకా& సంభక్ష స్సంభక్షత్యజస్రం సృజతి - విసృజతి తస్మాదుచ్యతే మహేశ్వరః||

- అధ్వశిరోపనిషత్‌.

చతుర్దశ భువనములు గర్భమందిముడ్చుకొనుచు, విశ్వసృష్టిస్థితి లయములు చేయువాడు మహేశ్వరుడు, విరాడ్ఢిరణ్య గర్భ అవ్యాకృతములను దనయందు లీనము చేసికొనువాడు మహేశ్వరుడు, ఈ మహేశ్వరునియందు అన్తర్లీనమై చైతన్యమును గలుగజేయు రక్తవర్ణ హంసవాహన బ్రహ్మస్వరూపిణి, బాలరూపయగు, గాయత్రీరూప యగు పరాశక్తియే, ''పరో రజసి సావదోం'' పదవాచ్యము, శ్రుతులచే ''పరమే న్యోమ&'' అని నిర్దేశింపబడిన పరమపదమే ఆమె దివ్యని కేతనము; అదియే వైకుంఠము; అదే స్వర్గధామము; అదే కైలాసము; అదే సత్యలోకము; అదే కైవల్యము.

గాయత్రియే సావిత్రి, సరస్వతి, లక్ష్మి, షోడశి, రాజరాజేశ్వరి, సంధ్యాదేవి; ప్రత్యేకలక్షణశక్తులను దెలుపునామములతో వ్యవహరింపబడును.

పరమపద మనగా నేమి? - 'పరమపదమితిచ'

1. ప్రాణంద్రియాద్యంతఃకరణ గుణాదేః పరతమ సచ్చిదానందమయం సర్వసాక్షికం నిత్యముక్త బ్రహ్మస్థానం పరమ పదం'' - నిరాలంబోపనిషత్‌.

ప్రాణము, దశేంద్రియములు, అంతఃకరణము, సత్యాది గుణములు మొదలగు వానికంటెను శ్రేష్ఠమైనది స్వస్వరూపము, నిష్కలంక సచ్చిదానందబ్రహ్మమగు స్వస్వరూపము కంటెను వేఱుకాని నిత్యముక్తస్థానమే పరమపదము.

2. శ్రు|| చేతసో యదకర్తృత్వం తత్సమాధాన మీరితం|

తదేవ దేవకీ భావం, సాశుభానిర్వృతిః పరాః||

- మహోపనిషత్‌.

సాధకుడు కర్తృత్వభోక్తృత్వరూప మలిన వాసనా రహితమైన, పరిశుద్ధమైన మనస్సును లీనము చేసి బ్రహ్మమునందు తైలధారాసదృశముగా నిశ్చలధ్యాన మగ్నుడగుటయే సమాధి యనబడును. నామాన్తరయిన ఆ సమాద్యవస్థయే కైవల్యము, పరమపదము అనబడును.

3. కేళీనాం = అనందానాం సమూహః కైలం, తేన అస్యతే = స్థీయతే, ఇతి కైలాసం. అసఉపవిశ##నే ----

కేళియనగా ఆనందము, దానిసమూహము కైలము, ఆ చిదానంద బ్రహ్మష్ఠాస్థానము కైలాసము.

4. కుంఠం = నాశం; వైకుంఠం = నాశరహీత స్థానం. నశించు ధర్మముగలది కుంఠము. అనగా అవిద్య, అజ్ఞానము. నాశరహీతమైనది వైకుంఠము అనగా నిత్యజ్ఞానము. పరిపూర్ణ పరిశుద్ధ జ్ఞానానుభవస్థితియే వైకుంఠము.

5. సత్యం సదితి కథ్యతే - 'స దేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్‌' సత్‌ బ్రహ్మము. సత్యము అనగా కాలత్రయ మందును నాశము లేనిది. అదె ఆత్మ. తదనుభవజ్ఞానమే సత్యలోకము.

6. నీలతో యద మధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా

నీవార శూకవ త్వన్తీ పీతా భాస్వత్యణూపమా

తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మశివః స హరిః సేంద్రః స్కో7క్షరః

పరమస్వరాట్‌. - తైత్తిరీయోపనిషత్‌.

నల్లని మేఘము నడుమ ప్రకాశించు మెఱుపుతీవవలె వెలయునది, నివ్వరిగింజ మొనవలె నన్నవై సూక్ష్మాతి సూక్ష్మమై, అణువువలె శోభిల్లు దానికొనయందు నడుమ (అగ్నిజ్వాలవలె నున్న దాని నడుమ) పరమాత్మకలడు. అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే హరి, అతడే ఇంద్రుడు, అతడే అక్షరుడు, పరముడు, స్వరాట్టు. ఆ పరమాత్మయే సరస్వతి, మహాలక్ష్మి రాజరాజేశ్వరి నామముల నొప్పుచున్నది.

ఆపరమాత్మ స్థానమే సత్యలోకము, వైకుంఠము, కైలాసమ, పరమదము, కైవల్యము, స్వర్గము అనునామాంతరములు గలది.

నీలతో యదము - తయోగుణ ప్రధాన ప్రకృతి.

విద్యుత్తు - రజోగుణ ప్రధానుడైన పరశివుడు.

పరశివునియందు లీనమైయున్న 'అరుణయే' కరుణా రూపిణి. (క్‌=బ్రహ్మము, అరుణా= ఎఱ్ఱనిది= విమర్శశక్తి, జ్ఞానశక్తి) అదె 'పరో రజసి సావదోం' పదవాచ్య గాయత్రి.

శ్రు|| భూర్భువస్సువరితి వా ఏతాస్తిస్రో వ్యాహృతయః| తాసా ముహసై#్మ తాం చతుర్థీమ్‌ మహాచమస్యః ప్రవేశ##యేత్‌ | మహ ఇతి | తద్బ్రహ్మస ఆత్మా అఙ్గాన్యవ్యా దేవతాః|| - తైత్తిరియము.

భూః - భువః - సువః అనునవి వ్యాహృతులు. మహాచయుఁడు అను ఋషిచే - త్వష్ట్యము - నాలవదగు వ్యాహృతి మహః అనునది. ఇది బ్రహ్మవాచ్యము. ఇదె పరమాత్మ; ఇతర దేవతలు తదంగభూతములు.

శ్రు|| తస్మాదుచ్యత ఈశానః యస్సర్వా& లోకా& ఈశత ఈశ##నేభిః జననీభిః పరమశక్తిభి రభిత్వా శూరమో నుమో అదుగ్ధా ఇవధేనవః ఈశానమప్య జగతస్సువర్దృశ మీశాన మింద్రతస్థుతషస్తస్మాదుచ్యత ఈశానః|| -అధర్వణము.

స్వీయ నియమన సామర్థ్యముచే స్థావరజంగమాత్మక ప్రపంచమునకు అధిపతి స్వప్రకాశానంద స్వరూపుఁఁడు. ఈశానుడు ఈశ్వరుడు, మహేశుడు మహేశ్వరుడు అని నామాం తరములు.

శ్రు|| తస్మాదాత్మన ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయో రగ్నిః అగ్నే రాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నమ్‌ అన్నాత్పురుషః|| --- తైత్తిరీయయు.

జగత్కారణ తత్త్వములు పంచభూతములు. అందు అంతరాత్మ రూపమున నున్న పురుషుడే నారాయణుఁడు.

''సహస్రశీర్‌ షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం |

విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదమ్‌ ||

నాశరహితమగు సద్వస్తువగుట చేత సత్యనారాయణుఁడు, అఖండ పరిపూర్ణ శ్రియానందుఁడు. 'ఈశ్వర - సత్యనారాయణ' అభిధానుఁడు, మహేశ్వరుఁడు.

సర్వజగదాత్మకముగ విరాడ్రూపమే మహేశ్వరుని శరీరము స్థూలరూపము - సగుణరూపము. లెక్కలేని మన యెల్లర శిరస్సులు, నేత్రములు, పాదములు అతనివే. విశ్వశ్రేయస్సునకును (సుఖమునకు) గారణభూతుడగుటను - ''విశ్వ-- శంభు'' నామము లతనివి.

''ఇంద్రం మిత్రం వరుణ మగ్ని మాహు రథో దివ్యః ససుపర్ణో గరుత్మా& | ఏకం సద్విప్రా బహుధా పదం త్యగ్నిం యమం మాతరిశ్వాన మాహుః | '' -- ఋగ్వేదమహాసౌరము.

ఇంద్ర, ఆదిత్య-వరుణ, అగ్ని గురుత్మా& మున్నగు నామములతో బ్రహ్మవేత్త లాతనినే వ్యవహరించిరి. అతఁడు మహేశ్వరుఁడు.

శ్రు|| సర్వజ్ఞ తాశక్తి రనాదిబోధః

స్వతంత్రతా నిత్య మలు ప్తశక్తిః |

అనంతతాచేతి విభో ర్విధిజ్ఞాః

షడ్ధాహురంగాని మహేశ్వరస్య||

సర్వజ్ఞత్వము. అనాదిబోధత్వము, స్వతంత్రత, నిత్య సంపూర్ణతలు అనంతత్వము అను నీ షడంగములచే బరిపూర్ణుఁడు మహేశ్వరుఁడు.

''జ్ఞానంబు& బరిపూర్ణసంపదయు, రాగత్యాగముల్‌ ధైర్యము&

నానాలోక పరీతకీర్తియు, లసన్మాహాత్మ్య మీ షట్క మీ

శా! నీదౌటను, నీవెనూ భగవతీ సంజ్ఞార్హవో యద్రి పు

త్త్రీ ! నా వందనముల్‌ కృపంగొనుము, శ్రీదేవీ! కలామాలినీ !

--శ్రీ శ్రియానంద.

1 శ్రు|| అంభస్య పారే భువనస్య మధ్యే

నాకస్య పృష్ఠే మహతో మహీయా& |

శుక్రేణ జ్యోతీగ్‌ంషి సమనుప్రవిష్టః

ప్రజాపతిశ్చరతి గర్భే అంతః ||

2 శ్రు|| యస్మిన్నిదగ్‌ ం పంచ విచైతి సర్వం

యస్మిన్దేవా అధి విశ్వే నిషేదుః |

తదేవ భూతం తదు భవ్యమా ఇదం

తదక్షరే పరమే వ్యోమ &|

3 శ్రు|| యేనావృతం ఖంచ దివం మహీ చ

యేనాదిత్యస్తపతి తేజసా భ్రాజసా చ |

యమన్తః సముద్రే కదయో వయన్తి

యదక్షరే పరమే ప్రజాః||

4 శ్రు-- యతః ప్రసూతా జగతః ప్రసూతే

తోయేన జీవాన్వ్య ససర్జ భూమ్యామ్‌ |

యదోషధీభిః పురుషాన్పశూగ్‌ంశ్చ

వివేశ భూతాని చరాచరాణి ||

5 శ్రు|| అతః పరం నాన్యదణీయసగ్‌ం హి

పరాత్సరం యన్మహతో మహాన్తమ్‌ |

యదేక మవ్యక్త మనన్తరూపం

విశ్వం పురాణం తమసః పరస్తాత్‌ ||

6 శ్రు|| తదేవర్తం తదు సత్యమాహు

స్తదేవ బ్రహ్మ పరమం కవీనాం |

ఇష్టాపూర్తం బహుధా జాతం జాయమానం

విశ్వం బిభర్త భువనస్య నాభిః ||

7 శ్రు|| తదేవాగ్ని స్తద్వాయు స్తత్సూర్య స్తదుచంద్రమాః

తదేవ శుక్రమమృతం తద్ర్బహ్మతదాపస్స ప్రజాపతిః||

--- తైతిరీయము.

పిండాండమున జీవాత్మ. బ్రహ్మాండమున విరాడ్రూపుడు. సప్తసముద్రముల కావలి పారముననున్న లోకాలోక ములకంటెను మహత్తరుడు. మేరువుకంటెను ఉన్నతుడు. సప్తలోకములను అధిగమించిన మహద్వస్తువు మహేశ్వరుడు.

శ్రు|| సో కామయత| బహుస్యాం ప్రజాయే యేతి | న తపోతప్యత | సతపస్తప్త్వా | ఇదగ్‌ ం సర్వమసృజత | యదిదం కించ | తత్‌ సృష్ట్వా | తదేవాను ప్రావిశత్‌ || ---తైతిరీయము.

ఏకాంశ##మైన చతుర్థపాదము చరాచర జగత్తు. అంతర్యామిరూపమున చరించుజీవచైతన్యముమహేశ్వరుడు. మహాప్రలయమున జీవకోటికి ఆశ్రయభూతమగు అవ్యాకృత చైతన్యము మహేశ్వరుడు. అపరిమిత కాముకత్వమున పునః సృష్టి చేసి, చరాచర జీవకోటిని గాఢపరిష్వంగమున నిముడ్చుకొను కామేశ్వరుడు.

పశు పక్షి పిపీలికాది జీవసముదాయమును పాలించు జగదీశ్వరుడు హిరణ్య గర్భాది దేవగణముకన్నను శ్రేష్ఠుడు. మహదాకాశముకన్నను విస్తృతుడు. సజాతీయ విజాతీయ స్వగతభేద రహితుడు. అవాఙ్మానస గోచరుడు. సనాతనుడు. పరిశుద్ధ జ్ఞానస్వరూపుడు. అతడే అగ్ని; అతడే సూర్యుడు; అతడే చంద్రుడు; అతడే నక్షత్రాది తేజస్సు; అతడే సూర్యుడు; అతడే చంద్రుడు; అతడే నక్షత్రాది తేజస్సు అతడు వేల్పులు బువ్వ యగు అమృతము; అతడే బ్రహ్మ; అతడే పంచ భూతములు; ఆతని కన్యమైన వస్తువు లేదు; అతడే ఆత్మ; అతడే మహేశ్వరుడు.

ఇట్టిదని వాక్కుచే జెప్పుటకును, మనసుచే నిట్టిదని యూహించుటకును నలవికాని సద్వస్తువు ఆత్మ. అట్టి వస్తువును బోధించుటకు జీవునిగాని, ఈశ్వరునిగాని, జగత్తునుగాని, పురస్కరించుకొని ఆలంబనముగా జేసికొన, ఉపనిషత్తులు బూనుకొన్నవి. వెలసినవి. స్వరూపజ్ఞాన సముపార్జనమునకు ఇదియొక్కటే సులభమార్గము.

విరాట్పురుషునకు ఆధారమేది ? ఏకాకియై- ఒక్కడే- ఇహపరముల నెటుల ధరించెను ? ఆతని బలమేమి ? ప్రకాశ మెంత?

1. కిం తద్విష్ణోర్బలమాహుః కాదీ ప్తిః కిం పరాయణమ్‌ |

ఏకో యద్ధార యద్దేవః తేజసీ రోదసీ ఉభే ||

2. వాతాద్విష్ణో ర్బలమాహుః అక్ష రాద్దీప్తి రుచ్యతే |

త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేక ముత్తమం|| -- యజుః

3. స భగవః కస్మి& ప్రతిష్టిత ఇతి ? స్వేమహిమ్ని ||

--- ఛాందోగ్యము.

4. ఏతస్మి& ఖల్వక్షరే గార్గ్యాకాశ ఓతశ్చప్రోతశ్చ ||

--- బృహదారణ్యకము.

అతని బలము ప్రాణాయామాదిధారణయే. అతడు అక్షరుడు. నాశరహితుడు. స్వప్రకాశముచే త్రిపాద్విభూతి నార్జించిన విశ్వవ్యాపకశీలి. నారాయణుడు. అతడే మహేశ్వరుడ.

స్వరూపజ్ఞాన సాధనకు అవాఙ్మానసగోచరమైన బ్రహ్మ వస్తువే ఏల - చెప్పుచున్నాడు ?

శ్రు|| అనంతశాస్త్రం బహువేదితవ్యం

అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః |

హంసో యథా క్షీరమివాంబు మధ్యాత్‌

యత్సారభూతం తదుపాసి తవ్యమ్‌ ||

తెలిసికొనదగిన శాస్త్రములు పెక్కులు; జీవితము పరిమితము. అంతరాయములు మెండు. జలము గలిసిన పాలనుండి సారభూతమైన పాలనుమాత్రమే గ్రహించు హంసమువలె, సర్వవేదాంతసారభూతమైన 'ఆత్మతత్వమునే' సాధకుడు గ్రహింప యత్నింపవలయును.

శ్రు|| తదనుప్రవిశ్య- సచ్చత్యచ్చా భవత్‌ || తైతిరీయము.

నామరూపాత్మకజగత్తు సత్యాసత్యవస్తు సమ్మిళితము. బహుధా సత్యగ్రస్తులమై అసత్యమునే సత్యముగా స్వీకరించుచున్నాము.

రజ్జు సర్వభ్రాంతిచే జగత్తు అసత్యము. జగత్తునకు చైతన్యమును గలిగించు స్వప్రకాశవస్తువు సత్యము. తిలలందు తైలము సత్యము. పిష్టము అసత్యము. మనుజునిలో జీవుడు సత్యము. దేహము అసత్యము. ''తైలము- పిష్టము, జీవుడు - దేహము'' రెంటిసమ్మేళన ప్రవృత్తిచేనైన ''తిలలు- దేహము'' ''బ్రహ్మము- జగత్తు'' సత్యాసత్య సమ్మిళితములు. ఇందు సారభూతమైనది సత్యవస్తువు. సారమనఁగా - రసము.

శ్రు|| ''రసోవై సః | రసగ్గ్‌ హ్యేవాయం లబ్ధ్వా೭೭నందీ భవతి'' సారభూతమైన వస్తువు - రసము. అదే ఆత్మ - బ్రహ్మము. దీని నుపాసించినవారు బ్రహ్మానందము నొందుచున్నారు. బ్రహ్మానందము - సుఖస్వరూపము. ఆత్మపద వాచ్యము మహేశ్వరుఁడు. మహేశ్వరునియందు సత్యభాగము చైతన్యము.

శ్రు|| మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయినంతు మహేశ్వరం,

అస్యావయవ భూతేస్తు వ్యాప్తం సర్వచరాచరం

తస్మాన్మాయీ సృజద్విశ్వమేతత్‌ || --- శ్వేతాశ్వతరము

అను శ్రుతి ననుసరించి, మహేశ్వరుఁడు మాయావి; అనగా అసత్యభాగము, అనగా మహేశ్వరుని యందు చైతన్యము - సత్యభాగము. ఆవరణ - అసత్యభాగము.

శ్రు|| యత్రహి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి |

యత్రత్వస్య సర్వమాత్మైవాభూ త్తత్కేనకిం పశ్యేత్‌ || --- బృమదారణ్యకము.

అవిద్యాదృష్టిచే బలువిధములుగా గనబడు ప్రపంచము, విద్యాదృష్టియందు ద్వైతభావము నశించి, ఉపాధి విలయమైనపుడు, ప్రతిబింబము బింబమందు లయమగురీతిని బ్రహ్మమందు లయమై, సర్వమును అఖండైక బ్రహ్మరూపముగా గోచరించును. ఇదియే జీవన్ముక్తుని లక్షణము.

(3) త్యాగలక్షణమేమి ? --- న కర్మణా న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః|| జననమరణ రాహిత్యమనెడి అతమృతత్వము నొందుటకు యాగాదికర్మములు గాని, పుత్త్రాదులుగాని, ధనముగాని సాధనములుకావు. భ్రాంతి జనకములైన ద్వైతవస్తురూపముననున్న బ్రహ్మాండమునందును పిండాండమునందును సత్యత్వబుద్ధిని విడుచుటే త్యాగము. భ్రాంతి వీడినపుడు సంవిద్రూపమైన 'సాక్షియే| తానను జ్ఞానోదయమగును. సాక్షి జన్మజరావర్జితుఁడు. మిథ్యారూపవస్తువులందు అసత్యమునుగాంచి, వానియందుగల సచ్చదానందరూపమును మాత్రమే గ్రహించుట వాస్తవమైన త్యాగము. అవిద్యాత్యాగమే నిజమైన త్యాగము.

శివపంచాక్షర మహామంత్ర పరమార్థమిదియే. శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీనారాయణాశ్రమ యతి వర్యులు (పూర్వాశ్రమమున నెల్లూరు పురవాసలు కనుపర్తి నారాయణశర్మగారు) సెలవిచ్చిన 'నమశ్శివాయ' వాక్యయోజనాప్రకారమును చిత్తగింపుడు.

1. శివాయ - ఆనందాయ.

2. నమః - త్యాగః (సమర్పణం (మంగళం))

3. కేషాం ? యజ్ఞోపలబ్ధిం - పత్రఫలపుష్పాదీనామ్‌.

4. కిమర్థం ? - ధర్మాదీనాం చ సిద్ధయే. (ఫలం)

5. ఉత్సర్జనం - (వదలిపెట్టుట) అనాత్మ ప్రపంచస్య - దేహేగేహే ప్రియాంతఃకరణాదేః ||

6. త్యజామి - బ్రహ్మలోకాన్తం - మమభావం - అహంభావం చ తతః స్వరూపవాసనాంచ - ఉత్సృజామి.

7. అవాంతర ఫలం - అర్థకామాదీనాం సిద్ధిః పరమ ప్రయోజనం - మోక్షసిద్ధిః ||

స్థూలముగా తాత్పర్యము:- సృష్టికి పూర్వము అవ్యాకృత సద్వస్తువునుండి - బాజమునుండి అంకురమువలె వ్యాకృతమైన ప్రపంచము పుట్టినది. అది మాయావృతము. అవిద్యచే గప్పబడినది. అవిద్యామోహితులైన కర్మిష్ఠులు ఇష్టఫలప్రాప్తికినిత, అనిష్టఫలనివృత్తికిని అర్ధమును, కామమును అభిలషించి యజ్ఞ యాగాదు లనెడి ధర్మకార్యములు చేయుచున్నారు. ఇట్టి విద్వాంసులు స్వర్గాద్యవాంతర ఫలములను పొందుచున్నారు.

నిజమే 'ఆత్మ' యనెడి స్వస్తువొకటి యున్నది. అది ప్రత్యక్షముచేతను, అనుమానముచేతను తెలియబడదు అనెడి పరిమితజ్ఞానముచేతనే సంతృప్తులై, క్షణికఫలదములు, అవిద్యాదోషభూయిష్ఠములునైన నామరూపకర్మము లాచరించి, అల్ప ఫలమును, అల్పక్షణికానందమునుమాత్రమే పొందుచున్నారు.

''శివాయా'' - కామోపభోగఫలమైన స్వర్గము సభిలషించి యధోపలబ్ధమైన పత్ర పుష్ప ఫలాదికమును 'నమః' ప్రేమించుచున్నారు (నమస్కరించుచున్నారు).

'కేవల కర్మోపాసకులు' ఇట్టి దృష్టితోనే, 'పంచాక్షరినుసాసించి, ఇష్టఫలప్రాప్తినొంది సంసరణచక్రమున పరిభ్రమించుచున్నారు.

కేవల జ్ఞానసహిత కర్మోపాసకులు కొందఱు 'శివాయ' అనగా అఖండితమైన, అద్వితీయమైన, పరిపూర్ణమైన శ్రియానండము నభిలషించి, 'నమః' అనగా క్లేశభరితమైన అవిద్య తొలగుటను; ఇంద్రియప్రపంచమునుందు బలీయమైన 'అయ మహమహం ' ఈ అహం నేనే యను స్వరూపవాసనను త్రికరణ శుద్ధితో త్యాగము చేయుచున్నారు. పంచాక్షరి నుపాసించుచున్నారు. అట్టివారు బ్రహ్మమును 'ఆత్మను' పొందుచున్నారు.

'యే యధా మాం ప్రపద్యంతే తాం స్తధైవ భజామ్యహం |' అను భగవద్వాక్యానుసారము ఈ యిరు తెగలవారు అనఁగా కేవల కర్మోపాసకులు, జ్ఞానసహిత కర్మోపాసకులు శివపంచాక్షరి నుపాసించి, తమతమ అభీష్టఫలములు నొందుచున్నారు.

'తదేతత్సత్యం' చతుర్విధ పురుషార్థఫలముల నపేక్షింపక విసర్జించుటే వాస్తవమైన త్యాగము. ఇది నిజము.

14. షోడశీకళాస్వరూప మెట్టిది ?

'మిహిరబిందు ముఖీం తదధోలస

చ్ఛశి హుతాశన బిందుయుగస్తనీం

సహపదార్థ కలారశనాస్పదాం

భజత సత్యమిమాం పరదేవతామ్‌||'

-- మాతృకావివేకము.

'అగ్రబిందు పరికల్పితాననాం

అవ్యబిందురచిత స్తనద్వయామ్‌

బిందునాదరశనా గుణాస్పదాం

నౌమి తే పరశివాం పరాం కళామ్‌||' -- కల్పమాత్రము.

'ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో

హరార్థం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథకలామ్‌||'

మిశ్రబిందు వనెడి రవిబింబము ముఖము. చంద్రాగ్నులనెడి శుక్ల రక్తబిందువులు స్తనద్వయి. నాదబిందువులు కటిప్రదేశము. స్వప్రకాశాత్మకమైన సత్యమే స్వరూపము.

ఇట్టి షోడశిని భావించి 'షోడశి' నిగా ధ్యానించు భాగ్యవంతుఁడు --

'స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు

త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగామ్‌| --- సౌందర్యలహరి.

'మొగపయి బొట్టు; క్రిందిదుగ బొట్టులు చన్గవ; దానిక్రిందుగా నగపడు హార్థమున్నిగులు నంగము గాఁగని నీదుకామ బీజగణన చేయువానికి నచంద్ర కుచద్వయి ¸° త్రిలోకియే యగపడు నన్న, నెంతపని యన్నువలం గలఁగించు టీశ్వరీ.' -- శ్రీశ్రియానంద.

శ్రీశ్రియానందగురుజీ వ్యాఖ్యానమును జూడుడు. ఇది స్త్రీ మాదన ప్రయోగము. ''ఓ హరురాణీ ! నీ కామబీజమును (చదువరులు దేవనాగరలిపిలోని క్లీం అను దానిని గ్రహించునది.) దానిని జపించునపుడు, పై బొట్టు మొగము గాను, క్రింది రెండుబొట్లు (నిలువుగీర కిరువంకల నున్న బిందువులు) - కుచములుగాను, ఆక్రిందిభాగము హకారార్థముగాను (త్రికోణముగాను) భావించువాఁడు, సూర్యచంద్రులనెడి కుచములు గల త్రిలోకినే లోఁగొనుననగా, స్త్రీలను గలగించుటేమి వింత ?

కకార లకారములను దొలఁగించునపుడు మిగులు 'ఈం' గుప్తమహాసారస్వత బీజము. హరార్థమనునపుడు హకారము శివవాచకముగాతన హార్థమని భావము. హకారమందలి మీది సగమును విడిచినపడు, క్రిందిసగము (నాగరలిపి) ఏకారమును బోలియుండును. అది త్రికోణాకారము. హకారము శివవాచకము. హరార్థము (హార్థము) పార్వతీవాచకము. అదె కామశక్తివాచకము. 'ఈం'

త్రికోణము బిందుస్థానము. బిందువనగా శక్తివిశిష్ట శివుఁడు. పైని జెప్పిన ఈం కారము దేవనాగర లిపియందు మూడు బిందువలు చేరిక. మీది బిందువు సూర్యుని - క్రింది రెండును చంద్రాగ్నులను సూచించును.

శివశక్తి సమాయోగముననైన జగత్తు త్రిగుణాత్మకము. శక్తిత్రిగుణాత్మికశివుడు బిందువు. శక్తి రెండుబిందువులు. 'ః' విసర్గాత్మకము - విశేషసృష్టి.

= రవి; అందు రకార వకారములు (ర్‌, వ్‌ ) తొలగించినపుడు అ+ ఇ మిగులును. అవి చేరి ఏకారమగును. అది యోని. మూడుబిందువులు చేర్పగానగు త్రికోణము. ఈ మూడు బిందువులలో మొదటిది అగ్ని, రజోగుణముం దెలుపును. బ్రహ్మాదిదైవతమున కదే ముఖము. తక్కు రెండు బిందువులు సూర్య చంద్రులు . సత్త్వతమస్సులను దెల్పును. అవె కుచములు. ఆ దిగువ సూక్ష్మ చిత్కళ##యే యోన్యాకారహార్థము (హరార్థము). అదె త్రిగుణాత్మక యోని (శక్తి). బ్రహ్మ విష్ణు రుద్ర సూచకము.

హ హంసః. (సూర్యుఁడు - ఆత్మ ) హంసలను దొలగించిపుడు మిగులు మూడు బిందువులు - ంః. మన్మథకళ##యైన యోనిగా - (ఏకారము) ధ్యానింపదగును. ఆంగ్లభాషయందు (గణితమున) మూడు బిందువుల, ఈ చేరికకు Therefore - అన'అదికారణముగా' అని యర్థము. 'శ్రీ గురుః సర్వకారణభూతాశక్తిః' శ్రుతి. శివశక్తియే సర్వకారణము. అదె కామకళ. సృష్టిని కామించిన శివుని శ్రేష్ఠశక్తి ఇదె ఇచ్ఛాశక్తి.

''తటిల్లేకా తన్వీం తపనశశి వైశ్వానరమయీం

నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవకలామ్‌

మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా

మహాన్తం పశ్యంతో దధతి పరమానందలహరీమ్‌||''

''ఈరగు మెర్పుగీరవలె నేసిరి సూర్యశశాంకవహ్ని రు

క్సారము నౌచు, నాఱుజలజమ్ములపై బలుతమ్మికోనలో

దీరగు 'సాద' పేరి భవదీయకళ& ధుత పాపమాయు లౌ

ధీరులుగాంచి సంతతము దేలుదు రుద్ధత శర్మవీచిలో& .''

-- శ్రీ శ్రియానంద.

ఓ దేవీ! సూర్యచంద్రాగ్నికళాసారమై ఆజ్ఞాది ద్వాదశాంతముగా మెఱుపుదీగవలె ప్రసరించు 'సాదా' ఖ్య యైన నీకళను ఆఱుచక్రములకు బిఱుదయిన సహస్రారమునందు ధ్యానించు మాయాపాపదూరులై నధీరులు సదానందమయులై వెలయుదురు.

ఇది యుత్తమాధికారి సాధకధ్యాన విషయము. విద్యాపంచదశాక్షరములు క్రిందినుండి యొకదానిలో నొకటి లయమగుచుఁ బోఁగా బోఁగాఁ బదునేనపది బిందుత్రయాత్మక త్రికోణమందు లీనమగునట్లు ధ్యానక్రమము.

సూర్యఁ డగ్నియందును, అగ్ని సోమునందును, సోముఁడు సపరార్థకల సకారమునకుఁ బరమైనది 'హ' దాని యర్థము (పైని వివరింపఁ బడినది) నందును (ఇదె ఉన్ననా స్థానము) లీనము కాఁగా సాధకుఁడు శివశక్తి యోగావస్థ యైన సదాశివైక్యము నొంది జీవన్ముక్తుఁ డగును.

-- శ్రీ శ్రియానంద.

స్వరూప నిరూపణ విషయమున ఉపనిషస్తులను ప్రమాణముగా గ్రహించిరి. ఏల ?

స్వరూ నిరూపణము సుఖప్రాప్తి సాధనము. ఇది అతి క్లిష్టమైన సాధనము.

పరోక్ష జ్ఞానమును బ్రకాశింపజేయు ఈ శ్రుతిస్మృతులు కర్మకాండ ప్రతిపాదకములు.

''అయ మహ మమాం'' ఈ ''నేను నేనే'' సర్వసాధారణముగా మనచే వ్యవహరింపబడుచున్న జీవాత్మ, స్థూల సూక్ష్మ శరీరముల రెండిటియందును ఉన్నటుల ప్రతిపాదింపబడుచున్నది. ఇవి సాధకుని సందిగ్ధావస్థయందు బడవేయుచున్నవి.

ధర్మార్థకామములందే సాధకుని యాసక్తిని ఇనుమడింపజేయునవి శ్రుతులు. అవిద్యా దోషభూయిష్టమైన నామరూపకర్మల నాచరించి ఆశ్రితుల బ్రేరేపించునవి శ్రుతులు. పరిమిత భోగఫలముల బ్రాపింపజేయునవి శ్రుతులు. కర్తృత్వ భోక్తృత్వ స్వరూపావబోధకములు శ్రుతులు. కనుక సంసార వృక్ష బీజరూపమైన అజ్ఞానమును నిర్మూలింపజాలవు.

బ్రహ్మకాండ (తత్త్వజ్ఞానకాండ) ప్రతిపాదకములు. ఇవె ఉపనిత్తులు, వేదాంతములు, నామాంతరము.

ఉపనిషత్‌ - శబ్దనిర్వచనము :- ఉప+ ని +షద్‌ ల్‌ - విశరణ గత్యవసాదనేషు - నాశము చేయుట, హింసించుట, పోవుట, ముగియుట అను నర్థములు గలది.

అజ్ఞానము - సంసారవృక్షబీజము. అది నశింపక బ్రహ్మ స్వరూపావగాహనము కాదు. స్వరూపము తెలియక తదైక్యము నొందలేము. ఐక్యము నొందుటే జనన మరణ రాహిత్యము. ఆశ్రితో పాసకులకు అవిద్యాబీజమును నశింపజేసి --

''పరమాత్మ- బ్రహ్మవస్తువు- సాఓఇ - చిత్క ళారూపి - చిత్కల నిత్యము- సత్యము. ఈ 'అహం' అను వస్తువు - సాక్షి యందున్నది'' అని చాటుచున్నాది.

స్వరూప నిరూణమునకు మనము ప్రమాణములుగా గ్రహింపదగినవి మూడువిషయములు. అవి (1) లిఖితములు (2) సాక్ష్యములు (3) అనుభవజ్ఞులు.

అందు లిఖితములు ఉపనిషత్తులు; విభిన్న మార్గసాధనములైన శ్రుతులును అంతమున సాగరమునేచేరు నదులు వలెనే, ఉపనిషదర్థమందు లయమగును. బ్రహ్మవేత్తలు తమ అనుభవజ్ఞానముచే సాధకులకు మార్గదర్శకు లగుదురు. మంత్రదద్రష్టలు స్వరూపనిరూపణకు సాక్షులుగా నున్నారు. బ్రహ్మవేత్తలు, మంత్రద్రష్టలును ఉపనిషత్తులనే ప్రమాణభూతములుగా ప్రతిపాదించుచున్నారు. ఇది ఆచరణీయము గదా.

'' శ్రుతి తాత్పర్య మఖిల మబుధ్వా భ్రామ్య తే నరః

వివేకీ త్వఖిలం బుధ్వా తిష్ఠత్యానందవారిధౌ||''

ఇక్షురసముకన్నను, సోమపానముకన్నను మధురతరము. ఈ యుపనిషన్మధువును పానముచేసినవాడు బ్రహ్మవిదుడగుచున్నాడు. 'నేను' అనెడి వస్తువు స్వరూపమును దెలిసికొని ''నా కెవ్వరును లేరు; నాకు మూలము 'నేనే'. చరాచరము నందంతటను నేనే పరిపూర్ణడనై యున్నాను. నాకు అన్యమైన దేదియు లేదు'' అని ఆనందతాండవము చేయుము.

''అహమన్న మహమన్న మహమన్నమ్‌

అహమన్నాదో హమన్నాదో హమన్నాదః.''

భోజ్యము నేనే, భోక్తను నేనే, బ్రహ్మమే తమః ప్రధానమైన ప్రకృతినిగూడి భోగ్యపదార్థమైనది. బ్రహ్మే అవిద్య - అజ్ఞానము అను మలినసత్వపదార్థ సంపర్కముచేత ''జీవ'' సంజ్ఞలదియై భోక్తయైనది. భోక్త భోజ్యము - నామ రూపములచే ద్వంద్వభావమున దోచుచున్నను, రెంటియందును బ్రధానభూతమైన బ్రహ్మము - ఆత్మ ఒక్కటియే అని తెలిసికొనును.

శ్రు|| అహమే వేదం సర్వమశ్నామి|| --- బృహదారణ్యక

సూర్యచంద్రాది గ్రహములు, శ్రుతి స్మృతి పురాణతి హాసాది గ్రంథప్రవర్తకులు - పపీలికాది బ్రహ్‌మపర్యంతము, విశ్వజీవకోటియు, సర్వమును నేనే పొందుచున్నాను.

శ్రు|| యథాఫేన తరంగాది సముద్రాదుత్థితం పుః |

సముద్రే లీయతే తద్వ జ్జగన్మయ్యేవ లీయతే ||

సాగరోద్భవములై తరంగఫేన బుద్బుదాదులు మఱల నందే లయమగును. ఈ చరాచరప్రపంచమును అట్లే నేను (బ్రహ్మము) నందు లీనమగునని జీవన్ముక్తుడు విశ్వసించును.

''జపో జల్పః శిల్పం సకలమపి ముద్రా విరచినా

గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతి విధిః |

ప్రణామః సంవేశః సుఖమఖిల మాత్మార్పణ దృశా

సవర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితమ్‌ ||''

అమ్మా ! ఆత్మసమర్పణబుద్ధితో, నా నోరి పలుకెల్ల మాతృకా నిర్మాణమే. కావున నది నీ మంత్రజపమే. ఈ శరీరము నీ విచ్చినది గాన, దీనితో నా చేయుపనులెల్ల నీ పూజకగు ముద్రలే. అంతట నిండియున్న దానవు గాన, నా నడక నీ కగు నా ప్రదక్షిణ క్రియయే. నా తొంగుండుట నీకు మ్రొక్కుటే . మఱి నీవే జఠరాగ్ని రూపమున ఆహారపాకము చేయుదువుగాన, శరీరపోషణమునకై నా భుజించుట నీ ప్రీతికై చేయు హోమమే. -- శ్రీశ్రియానంద.

స్వరూపజ్ఞానోద్దీకములు ఉపనిషత్తులు, గాన అని ప్రమాణములుగా చేకొనబడినవి.

''సంజ్ఞాన మాజ్ఞానం, విజ్ఞానం ప్రజ్ఞానం, మేధాదృష్టి ర్ధృతి ర్మతి ర్మనీషా జాతిః స్మృతిః సంకల్పః క్రతురసః కామోవశ ఇతి సర్వాణ్య తానివై తాని ప్రజ్ఞానస్య నామధేయాని భవన్తి.''

2. ఏషబ్రహ్మ, ఏషఇంద్ర, ఏషఃప్రజాపతి, రేతేనర్వేదేవా, ఇమానిచ పంచమహాభూతాని, పృథివీ వాయురాకాశ ఆపోజ్యోతీం షీత్యేతా నీమాని చ క్షుద్ర మిశ్రాణివ బీజానీతరాణి చేతరాణి చాండజాని చ జరాయుజానిచ స్వేదజాని చోద్భిజ్జాని చాశ్వాగావః పురుషా హస్తినో యత్కించేదం ప్రాణి జంగమం చ పతత్రిచ, యచ్చస్థావరం సత్వంతత్ర్పజ్ఞానేత్రం, ప్రజ్ఞానే ప్రతిష్టితం- ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠా ప్రజ్ఞానం బ్రహ్మ||

3. శ్రు|| స ఏ తేన ప్రజ్ఞానా೭೭త్మనాస్మాల్లోదుత్ర్కమ్యాముష్మి& స్వర్గే లోకే సర్వా& కామానాప్తామృతః సమభవత్‌ || సమభవదితి - ఓమ్‌. ---- ఐతిరేయోపనిషత్‌.

1 సంజ్ఞానము = ప్రాణిత్వము = చేతనభావము.

2 ఆ జ్ఞానము = ఈశ్వరభావము.

3 విజ్ఞానము = కళావివేకజ్ఞానము.

4 ప్రజ్ఞానము = ప్రజ్ఞ - తెలివి.

5 మేధ - శ్రుత (గ్రంథ) ధారణ శక్తి.

6 ధృతి - ధైర్యము.

7 దృష్టి - ఇంద్రియ సహాయముతో సర్వవిషయములను దెలిసికొనుట.

8 మతి - తలంపు (మనము)

9 మనీష - నిశ్చలబుద్ధి; మనః స్వాతంత్ర్యము.

10 స్మృతి - స్మరణము (జ్ఞాపకము)

11 జాతి - మనోదుఃఖావస్థ, ఆధివ్యాధిజక్లేశము. (ఇచ్ఛ.

12 సంకల్పము - గుణత్రయసంపర్కముచే వస్తువులయందు

13 క్రతువు - నిర్ణయము - అధ్యవసాయము.

14 కామము - లభింపని దానియందలి కోరిక - చేంతలేని వస్తువులయం దాకాంక్ష, తృష్ణ.

15 అసువు - జీవనక్రియా నిమిత్తమైన ప్రాణవృత్తి.

16 వశము - స్త్రీధనారామాదులయందు గలుగు ఇచ్ఛ.

ఈ పదునాఱును ప్రజ్ఞానము యొక్క నామములు.

శ్రు|| తదేతత్‌ - హృదయం - మనశ్చైతత్‌ ''

ఐతరేయము.

ప్రజ్ఞానమే ఆత్మ-అదే మనస్సు. మనస్సులిన గ్రహించి నపుడు ప్రధానవస్తువు కామము. కామమునకు పై నుదహరించిన పదునాఱును కళలు. కనుక మనస్సు 'షోడశీ' కామకళ.

శ్రు|| 'యధోర్ణనాభిః సృజతే గృహ్ణతేచ'. -- ముండకోపనిషత్‌.

సాలెపురుగు ఇచ్చాశక్తిచే క్రియారూపమైన తంతువు సృజించుకొని, జ్‌ఒఆనశకత్‌ఇచే మఱల తనయందె లీనముచేసి కొనును.

మనస్సు (షోడశి) త్రిగుణముల ప్రభావమునకు లోనై ఆ యా గుణముల ఉద్రికత్త ననుసరించి తదనుగుణములైన కళలను బయల్పఱచును. తిరిగి మూల ప్రకృతి యదు - అనగా ప్రధానవస్తువు మనస్సు అను ధృవకలయదు లయము చేసికొనును. ఇచట ప్రధానవస్తువు కామకల. తక్కిన పదునైదును ప్రకృతి నననుసరించి వృద్ధిక్షయము లొందుచుండును.

ప్రజ్ఞానము - 'యేనేక్షతే శ్రుణోతీదం జిఘ్రతివ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ర్పజ్ఞాన మతీరితమ్‌' 2 'చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వ గజాదిషు | చైతన్యదీపకం బ్రహ్మ తం ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి' ---ఈశ.

సర్వస్ఫురణ హేతుభూతమగు జ్ఞాననేత్రము ప్రజ్ఞానము. ఈప్రజ్ఞానేత్రము కలుగుటవల్లనే మనము సకలమును చూడగలుగుచున్నాము, వినగల్గుచున్నాము, ఆఘ్రాణించుచున్నాము. ఉచ్చరించుచున్నాము. తీపి పులుసు మున్నగు రసముల తెలిసికొనుచున్నాము.

ఉత్తమము, మధ్యమము, అధమము అని మూడువిధములుగా సౌలభ్యము కొఱకు నిర్ణయింపబడినది. బ్రహ్మాది దేవతలు ఉత్తమ తరగతికి చెందినవారు మానవులు మధ్యమ తరగతికి చెందినవారు. గజములు, అశ్వములు, స్వేదజములు, అండజములు మున్నగునవి అధమతరగతికి చెందినవి. ఈ మూడు తరగతుల జీవకోటియందును ఆకాశాది పంచభూతములందును గల సృజనాత్మకమైన చైతన్యము 'కామకల' ప్రజ్ఞానమనబడును. అది బ్రహ్మమే. 'ప్రజ్ఞానం బ్రహ్మ' అను నది బ్రహ్మసూత్రములంఉ ఒక మహావాక్యము. ఇది బుగ్వేదాంతర్గత ఐతరేయోపనిషత్తునుండి గ్రహింపబడినది.

అమ్మా! నిర్మలబుద్ధి తత్త్వమది ప్రజ్ఞాఖ్యంబగు& ; తత్ర్పకా

శమ్మౌనాఁడె భవత్స్వరూప మెఱుఁగ& శక్తుండు జీవుం డభౌ

వమ్ముల్‌ భీతులు తోఁపవప్పు; డదిలు ప్తంబైన యానాఁడె,నూ

త్నమ్ముల్‌ లేములు, ధావనమ్మ లతని& దావమ్మలైకాల్ప వే ||

-- శ్రీ శ్రియానందుల అమ్మతో ముచ్చుటలు.

''అరాళా కేశేషు ప్రకృతి సరళా మందహసితే

శిరీషాభాగాత్రే ద్రుషదివకఠోరా కుచతటే

భృశం తన్వీ మధ్యే పృథురపి వరారోహ విషయే

జగత్త్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా|''

-- సౌందర్యలహరి.

అమ్మా! నీకొప్పు వంకరయుగ్గులు గలది. నీచిఱునవ్వు స్వభావసరళము. నీ దేహము దిరిసెనపూవువలె కడుమెత్తన. నీకుచతటము (ఎందఱు బిడ్డలు త్రతాగినను) సడలనిది. నీనడుము కడుసన్నమను. నీపిఱుదు విశాలము. ఈ జగములగాచు శివుని యరుణాశక్తివగు కరుణవే నీవు. నీవే 'అరుణ' యనుపేరి కామేశ్వరివి. శంభుని కరుణయన్నను అరుణ యన్నను నొకటే. 'అరుణా' బగవతీనామములలో నొకటి. ఆమె యరుణవర్ణకారణము ప్రసిద్ధము. కకారపూర్వకమైన అరుణయే కరుణ. కకారమువలన కాచిత్‌ అను భావము వ్యక్తమగుచున్నది. కాచిత్‌ ఒకానొకయిన యర్థమగుచటచే, కరుణను అరుణ యొక్క అంశముగా తెలియవలయును. ''పరాశక్తి!, అరుణ'' ఎవరో తెలియనివారు, అది శంభుని కరునారూప యనియే. తెలియవలయును.

రెండవభావమేమన - శంభుని స్ఫటిక సదృశ శరీరమందు ప్రతిఫలించు అరునిమయే (భగవతి అరుణాదేవి కాంతి) కరునాస్వరూపముగా గనవచ్చును. కుటిలత కఠోరత. శీర్ణతాదులు కరుణకు విరోధములు. దయకు మందతయు ఒక వెలితియే; కావున శంభుని కరుణయందు కుటిలతా మందతా కఠోరతాదుల తమ భావములు కారాదు. ఏలన, శంభుని కరుణగా జగద్రక్షణమునకై యరుణయే యీ రూపధారణము చేసినది.

అరాలమనగా కుటిలము; అయినను కుటిలత భగవతి కేశశోభను పెంపొందించునది. శంభుని కరుణ యేనాడును మదము కాదు. అయినను మందత నవ్వునందుండి కరుణను వృద్ధి చేయుచుండును. శిరీషశబ్దము 'శ్రూ' హింసాయాం అను ధాతువువలన నిష్పన్నమై, 'శృణాతిశీర్య తే ఇతి శిరీషః' కోమల మగుటచే శీర్ణించునది. నలిగిచెడునది. తద్భవము 'దిరిసెనము'. ఇది శుబసూచకములం దొకటి. అనగా భగవతియందు హింసాభావము శిరీషమనందువలెనే యున్నదనుట. భగవతి శరీరము శిరీషాభ##మైనదనుట, సర్వజగత్కల్యాణ తత్పరమైన దనుటే. భగవతి కేశములందు కుటిలతను దాల్చినను, వెన్ను వైపునకు ద్రోసివేసినది.

ఇటులే కఠోరత - కాఠిన్యము కరుణకు విరోధిభావమే. కాని భగవతి దానిని పాలిండ్లయందు ధరించినది. స్తన్యరూపపోషణశక్తిగల స్తనములయందలి కఠోరత, భగవతి తన సంతానమైన జీవజగత్తు నంతటిని పోషించుచున్నను, సంతత దయార్ద్రతచే చేసుచునే యుండునని తోఁచునుగదా.

శంభునికరుణయందు కటిలతా హింసా మందతా కఠోరతలకు తావులేదు. దానియందెన్నడును తఱుగులేదు. అది సదా సంపూర్ణము. క్షణించునని యూహించుటెట్లు ? కావున అది పృథువు - గొప్పది. ఈ పృథుత్వమును భగవతి నితంబములందు దాల్చినది. క్రింది నితంబ భాగము బరువు స్థిరత్వమును దెల్పును. అనగా శంభుని కరుణ గొప్పదిన, స్థిరము అనుట.

మఱి భగవతి నడుము సన్నమైనను, అది ఆడుదాని కందము, కరుణయొక్క మధ్యభాగము తనుత్వము నొందిన దనుటచే, అది క్షీణమని తలంపరాదు. దానిభావ మేమనగా, నడుమునందలి మణిపూరచక్రము రుద్రస్థానము గాన, భగవతి యందు రుద్రుని రౌద్రము సన్నగిల్లినదనుట చెల్లును. రుద్రుని రౌద్రమును భగవతి యణచినదని భావము.

అభిప్రాయ మేమనగా - భగవతి శరీరము శంభుని కరుణావతారము. జగద్రక్షణమునకై యవతరించినది.

ఇందు మఱియొకటియుందోచును. సద్గురుస్వరూప శివుననుగ్రహముననే శక్తిజాగరణ మగును. మఱి పైని జెప్పిన కరుణాస్వరూపమందే సాధకులు దానిని తమలోనే యనుభవింతురు. అదే శంభుకరుణ. శివస్వరూపగురు ననుగ్రహమే శంభుననుగ్రహము. దానివల్లనే శిష్యేనందు శక్త్యుత్థానమగునను. గాన గురుకృప, శక్త్యభివ్యక్తి, శంభుకరుణ పర్యాయపదములు. 'శ్రీగురుఃసర్వకారణభూతాశక్తిః' --- అరుణోపనిషత్‌.

బాలార్కానంతకోటి ర్నిజతనుకొరణౖ ర్దీపయ న్తీం దిగంతా

దీపై#్తర్దేదీప్యమానాం దనుజబలవనానల్ప దావానలాభామ్‌

దాంతో దంతో గ్రచిత్తాం దళితదితిసుతాం దర్శనీయాందురన్తాం

దేవీం దీనార్త్రచిత్తాం హృదిముదితమనాః షోడశీం సంస్మరామిః

శ్రీర్మే భజతు | అలక్ష్మీ ర్మే నశ్యతు | విష్ణుమూఖావై దేవాశ్ఛందోభి రిమా& లోకా ననపజయ్య మభజయ& | మహాగ్‌ం ఇంద్రో వజ్రబాహుః షోడశీశర్మ యచ్ఛతు ||

--- తైతిరీయము.

గజాంతైశ్వర్యము లభించుగాక ! అలక్ష్మి (అజ్ఞానము) నశించుగాక ! వేదహిత ధర్మకర్మాచరణ పటుత్వమున విష్ణు ప్రధానులు మమాశక్తివంతులై చతుర్దశభువనాధిపత్యము వహించిరి. షోడశీమంత్రరాజమును జపించియే, వజ్రబాహు డింద్రుడు దేవలోకాధిపత్యము వహించెను. అతడు మాకాహ్లాదకరములగు నిత్యసుఖములను ప్రసాదించుగాక. ఓం తత్సత్‌.

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్నాత్పూర్నముదచ్యతే |

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||

-----0----

Sri Tattvamu    Chapters