Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథసప్తమో7ధ్యాయః

(వాల్కలిచరితము)

శ్లో || ఇన్ద్రస్స్వర్గపతిః కదాచిదసురై ః తైర్వాల్కలా ద్యైర్బలాత్‌ |

సజ్గ్రామే విజితో7భవచ్చ శరణం నారాయణం తం హరిమ్‌|

సో7పీన్ద్రేణ చ పుణ్డరీకపురమాగత్యాత్ర తప్త్వాచిరం

శ్రీమూలేశ్వరపూజనాత్పునరరీన్‌ జిత్వాన్వగృహ్ణాద్ధరిమ్‌||

స్వర్గప్రభువగు ఇంద్రుడొకప్పుడు వాల్కలాది రాక్షసులచే యుద్ధమున బలాత్కారముగా జయింపబడి యావిష్ణువును శరణువేడెను.అతడును ఇంద్రునితో గూడ పుండరీకపురమునకు వచ్చి యచ్చట చిరకాలము తపముచేసి శ్రీమూలేశ్వరపూజవలన మరల ఆశత్రువులను జయించి యింద్రుననుగ్రహించెను.

మధ్యందినః :

శ్లో || అన్యమస్య ప్రభావం తే ప్రవక్ష్యామి హితం శృణు|

జయావహం మహాప్రాజ్ఞ కర్ణాయుష్యమనుత్తమమ్‌||

మధ్యందినుడు :

మహాబుద్ధిమంతుడా! దీని మరియొక మహిమను నీకు జెప్పెదను వినుము. అది మేలు చేకూర్చునది, జయమును కలిగించునది, వినుట కింపైనది, సర్వోత్తమైనది.

శ్లో || యస్మిన్కృతేన తపసా మహతా మేఘవాహనః |

భగ్నో7పి శత్రుభిర్లేభే పునస్స్వర్గమకణ్ణకమ్‌||

ఇంద్రుడు శత్రువులకోడినను ఆపురమున జేసిన మహాతపస్సుచే మరల ఉపద్రవములేని స్వర్గమును పొందెను.

శ్లో || ఆసీత్పురా మహావీరః వాల్కలిర్నామ దానవః|

త్రిదశానామజయ్యో7సౌ గన్ధర్వాణాం చ రక్షసామ్‌||

పూర్వము మహావీరుడగు వాల్కలియను పేరుగల దానవుడుండెను. అతడు దేవతలకును, గంధర్వులకును, రాక్షసులకును జయింప శక్యముగానివాడు.

శ్లో || వీర్యోద్రేకాదసౌ సర్వం వశీకృత్య మహీతలే |

కదాచిత్సేవితో దైత్యైః జగామ త్రిదశాలయమ్‌||

బలాధిక్యముచే నతడు భూతలమున సమస్తమును వశము చేసికొని యొకప్పుడు దైత్యులను వెంటబెట్టుకొని స్వర్గమునకేగెను.

శ్లో || తత్రాభవన్మహాయుద్ధమన్యోన్యభయకారణమ్‌|

అమరణాం తు దై త్యానామత్మీయజయమిచ్ఛతామ్‌||

అక్కడ తమతమ జయమును గోరుచున్న దేవతలకును దైత్యులకును పరస్పరము భయమును గలిగించు మహాయుద్ధము జరిగినది.

శ్లో || తేషాం తత్ర చ వర్షాణామయుతం జయకాంక్షి ణామ్‌|

అవిజ్ఞాతం గతం హ్యాసీద్యుద్ధమోహితచేతసామ్‌||

జయమును గోరుచు యుద్ధములో మునిగియున్న మనస్సు గల వారికి తెలియకుండగనే పదివేల సంవత్సరములు గడచినవి.

శ్లో || ఆసీత్కర్దమితా భూమిస్సర్వత స్తదసృగ్జలై ః |

మేరుమన్దరకల్పాశ్చ తదీయా హ్యస్థిసఞ్చయాః ||

భూమి యంతయు వారి రక్తజలముచే బురదగానైనది. వారి యెముకల ప్రోవులు మేరుమందరపర్వతములవలెనున్నవి.

శ్లో || తతోవర్షసహస్రాన్తే క్లాన్తో యుద్దేన వాసవః |

నిర్జితో7భూత్సమం దేవైస్తేన వాల్కలినా తదా ||

వేల సంవత్సరములకు పిమ్మట యుద్ధముచే అలసిన దేవేంద్రుడు దేవతలతో గూడ నావాల్కలిచే జయింపబడెను.

శ్లో || తతస్స్వర్గం పరిత్యజ్య సర్వైర్దేవగణౖ స్సహ |

జగామ శరణం విషుం లక్ష్మీనాథమజం విభుమ్‌||

పిమ్మట నతడు సమస్త దేవగణములతో గూడ స్వర్గమును విడచి లక్ష్మీకాంతుడు, పుట్టుక లేనివాడు, వ్యాపకుడగును విష్ణువును శరణుజొచ్చెను.

శ్లో || శ్వేతద్వీపం సమాసాద్య దృష్ట్వా తం క్షీరసాగరమ్‌|

లోచనానాం సహస్రస్య ప్రపేదే పరమం ఫలమ్‌||

శ్వేతద్వీపమున కేగి యాపాలసముద్రమును జూచి వేయికన్నులకు నుత్తమమైన ఫలమును పొందెను.

శ్లో || యత్ర వై భగవాన్విష్ణుర్యోగనిద్రాం కరోతి వై |

శయానశ్శేషశయనే లక్ష్మీ సంవాహితాంఘ్రికః ||

అక్కడ భగవంతుడగు విష్ణువు శేషశయనమున పరుండి లక్ష్మి పాదము లొత్తుచుండ యోగనిద్రలో నుండెను.

శ్లో || వైదికైరథ తం సూక్తైః స్తుత్వా విష్ణుం జగత్పతిమ్‌|

భక్త్యా పరమయా యుక్తో నమశ్చక్రే సురో త్తమః||

పిమ్మట ఇంద్రుడు జగత్ప్రభువైన యావిష్ణువును వైదిక సూక్తములతో నుంతిచి పరమభక్తితో నమస్కరించెను.

శ్లో || ఉత్థాయాథ జగన్నాథః ఫణిపుఙ్గవతల్పతః |

పురతో వాసవం పశ్యన్‌ ప్రాతఃకమలలోచనః ||

సుధాసృతిసమాం వాచం జగాదానన్దకారిణీమ్‌|

కమలావిద్యుదుద్భాసీ కాలమేఘ ఇవాపరః ||

పిమ్మట జగత్ర్పభువు శేషశయనమునుండి లేచి ప్రాతఃకాలమందలి తామరపువ్వులవంటి కన్నులుగలవాడై లక్ష్మియను మెరపుతో గూడి మరియొక కాలమేఘమో యననొప్పుచు ఎదుట దేవేంద్రుని జూచి లోకమున కానందమును గలిగించు నమృతమును గురియు వాక్యమును పలికెను.

విష్ణుః :

శ్లో || కచ్చిత్సుఖం సహస్రాక్ష తవచైషాం నభస్సదామ్‌|

కచ్చిత్త్వం చ తథైతే చ స్వాధికారే ప్రతిష్ఠితాః ||

విష్ణువు ః

సహస్రాక్ష ! నీకును ఈ స్వర్గవాసులకును సుఖమా ? నీవును వీరును మీమీపదవులయందు స్థిరముగా నుండిరా?

శ్లో || స్వర్గకార్యాణి సన్త్యజ్య సామ్ర్పతం కిం పురన్దర |

పరిక్లాన్త స్సమాయాతః సాకమేతై ర్మరుద్గణౖః ||

పురందర! స్వర్గకార్యములను విడచి యలసి యీ దేవగణములతో గూడ నిపుడేలవచ్చితివి ?

ఇన్ద్రః:

శ్లో || వాల్కలిర్నామ దైత్యేన్ద్రో బలీ లబ్ధవరశ్శివాత్‌ |

అజేయస్త్రిదశైస్తేన నిర్జితో7స్మి రణ విభో||

ఇంద్రుడు :

ప్రభూ! వాల్కలియను బలవంతుడైన దైత్యప్రభువు శివునినుండి వరములు పొంది దేవతలకు జయింప శక్యముగాక యున్నాడు. వానిచే యుద్ధమున జయింపబడితిని.

శ్లో || స్వర్గే కృతా చ వసతిస్తేనాద్య మధుసూదన|

అతస్త్వాం శరణం ప్రాప్తస్సాకం దేవైస్సురోత్తమ||

దేవోత్తమ! మధుసూదన! అతడిప్పుడు స్వర్గములో నివసించియున్నాడు. అందువలన దేవతలతో గూడ నిన్ను శరణు జొచ్చితిని.

శ్లో | పురా భయాద్ధిరణ్యాక్ష హిరణ్యకశిపూద్భవాత్‌ |

వయంత్రాతా స్త్వయైవ స్వస్తథాన్యాసురజాదపి||

పూర్వము హిరణ్యాక్ష హిరణ్యకశిపులవలన కలిగిన భయమునుండియు, ఇతరులైన రాక్షసులవలన కలిగిన భయమునుండియు మమ్ము నీవే రక్షించితివి.

శ్లో || #9; అస్మాదపి విభో త్రాహి దానవాద్బలదర్పితాత్‌ |

వాల్కలేస్త్వాం వినా సత్యం నాస్త్యన్యా గతిరుచ్యతే ||

ప్రభూ ! బలముచే గర్వించిన దానవుడగు ఈ వాల్కలి నుండి కూడ రక్షింపుము. నీవు తప్ప మరియొక దిక్కు లేదనుట నిజము.

విష్ణుః :

శ్లో || తమహం నిగ్రహీష్యామి ప్రాప్తే కాలే బలోత్తరమ్‌|

శక్ర! త్వం సమయో యావత్‌ కురు నిత్యం మహత్తపః ||

విష్ణువు:

ఇంద్ర! సమయము వచ్చినపుడు ఎక్కువ బలముతో వానిని నేను జయించెదను. నీవు సమయము వచ్చువరకు నిత్యము ఎక్కువ తపస్సు చేయుము.

శ్లో || తపసా యేన తే శక్తిర్జాయతే త్రిదశేశ్వర|

దైతేయస్య వధం కర్తుం వాల్కలే స్తస్య పాపినః ||

దేవేశ! ఆతపస్సుచే పాపి, దైత్యుడు నగు వాల్కలిని చంపుటకు నీకు శక్తి కలుగును.

ఇన్ద్రః:

éశ్లో || #9; క్షేత్రే కస్మిన్‌ జగద్యోనే! కరిష్వామి తపో మహత్‌ |

నాశాయ తస్య దైత్యస్య తన్మే కీర్తయ కేశవ! ||

ఇంద్రుడు :

జగత్కారణభూతుడా! కేశవ! ఆదైత్యుని నాశముకొరకే క్షేత్రమున నున్న మహాతపస్సు చేయుమందువో చెప్పుము.

సూతః :

శ్లో || క్షేత్రాణ్యపి చ తీర్థాని చిరమాలోచ్య చేతసా|

నిశ్చిత్య ప్రాహ భగవాన్‌ ప్రసన్నస్సురనాయకః ||

సూతుడు :

భగవంతుడగు విష్ణువు క్షేత్రములను తీర్థములను చాలత డవు మనస్సుతో నాలోచించి , నిశ్చయించిప్రసన్నుడైపలికెను.

భగవానువాచ :

శ్లో || విశ్వభూత్యై తు విశ్వాత్మా పరమానన్దతాణ్డవమ్‌ |

సదా యత్ర కరోతీశః పార్వతీనయనోత్సవమ్‌ ||

శ్రీమత్తిల్లవనం శస్తం పరం తత్సర్వసిద్ధిదమ్‌|

శక్ర! తత్ర ద్రుతం గత్వా తద్వధార్థం తపః కురు||

విష్ణువు పలికెను :

దేవేంద్రా ! ప్రపంచస్వరూపుడగు శివుడు ప్రపంచ శ్రేయస్సుకొరకు పార్వతికన్నులకు పండువైన పరమానంద తాండవము నెచ్చట యెల్లప్పుడు చేయుచుండునో, అట్టి శ్రీతిల్లవనము మిక్కిలి ప్రశస్తమైనది, సర్వసిద్ధుల నిచ్చునది. అచ్చటకు వేగముగా వెళ్లి వాని వధకొరకు తపస్సు చేయుము.

ఇన్ద్రః :

శ్లో || వినా భగవతా తత్ర యాస్యామో నైవ కేశవ!

తస్య వీర్యాద్వయం సర్వే సదా భీతా జగత్పతే ||

ఇంద్రుడు :

జగద్రక్షక! కేశవ! నీవు లేకుండ మేమక్కడక వెళ్ళలేము. అతని పరాక్రమమువలన మేమందర మెల్లప్పుడు భయము చెందితిమి.

శ్లో || దేవ! తస్మా త్త్వమాగచ్ఛ స్వయమేవ జనార్థన!

త్వయాహం రక్షితస్తత్ర కరిష్యామి తపో మహత్‌ ||

దేవా!జనార్దన! కనుక నీవు స్వయముగా నచ్చటకు రమ్ము. నీవు రక్షించుచుండనచ్చట మహాతపస్సు చేయుదును.

శ్లో || తథేత్యుక్త్వాథ భగవాన్‌ విష్ణుస్సర్వసుర్వసురై స్సహ |

లక్ష్మ్యాథ సేవితః ప్రాప శ్రీమద్వ్యాఘ్రపురం తదా ||

పిమ్మట భగానుడగు విష్ణువట్లేయని పలికి యపుడు లక్ష్మి సేవింప దేవతలందరితో కూడ శ్రీవ్యాఘ్రపురమును చేరెను.

శ్లో || తత్ర గత్వా సురాస్సర్వే మహితానాశ్రమాన్‌ క్షణాత్‌|

తపసే మహతే చక్రురతిప్రీతిసమన్వితాః ||

అక్కడకు వెళ్లి దేవతలందరు మిక్కిలి ప్రీతితో మహాతపస్సుకొరకు పవిత్రమైన యాశ్రమములను క్షణములో నిర్మించిరి.

శ్లో || పుణ్యాలయే తదా తస్మిన్‌ భగవాన్‌ భక్తవత్సలః |

ఆనినాయ క్షణనైవ క్షీరామ్భోధిం సుశోభితమ్‌ ||

భక్తవత్సలుడైన భగవంతు డపుడాపుణ్యస్థలమునకు మిగుల శోభిల్లు క్షీరసముద్రమును క్షణములో రప్పించెను.

శ్లో || తత్కృతృ శయనం తస్మిన్‌ యోగనిద్రారతో7భవత్‌ |

స్తూయమానస్సురై ః పశ్యన్‌ శమ్భోరానన్దతాణ్డవమ్‌ ||

దానిని ప్రక్కగా జేసికొని దేవతలు స్తుతించుచుండ శివుని యానందతాండవము జూచుచు దానిమీద యోగ నిద్రాసక్తుడయ్యెను.

శ్లో || #9; ఆషాఢస్యాథ సమ్ప్రాప్తే ద్వితీయే తు తిథౌ శుభే|

కృష్ణపక్షే తపస్యన్తం జగాదేన్ద్రం బహస్పతిః ||

పిమ్మట శుభతిథియగు ఆషాడ బహుళ విదియ ప్రాప్తింపగనే తపస్సు చేయుచున్న ఇంద్రునిగూర్చి బృహస్పతి పలికెను.

శ్లో || అశూన్యశయనం నామ ద్వితీయాయాం పురన్దర|

వ్రతం ప్రియతరం విష్ణోః ప్రసుప్తస్య మహోదధౌ||

ఇంద్రా ! విదియయందు అశూన్యశయనమను వ్రతము క్షీరసముద్రములో పరుండిన విష్ణువున కెక్కువ ప్రియమైనది.

శ్లో || అస్యాం ప్రపూజితో విష్ణుః యావన్మాసచతుష్టయమ్‌|

హృది ధ్యాతో దదాత్యేవ సర్వాన్‌ కామాన్‌ దయానిధిః ||

దయానిధియగు విష్ణువును నాలుగు మాసములవరకు మాసమాసమున ఈతిథియందు పూజించి హృదయమున ధ్యానించిన నతడు సమస్తమైన కోరికల నిచ్చును.

శ్లో || తస్మాచ్ఛాస్త్రవిధానేన త్వమింద్రైనం ప్రపూజయ|

సంప్రాప్స్యపి పునస్సద్యస్స్వర్గం లోకమకణ్టకమ్‌||

కనుక ఇంద్రా ! నీవు శాస్త్రవిధానముగా వీనిని బూజింపుము. నిష్కంటకమైన స్వర్గమును మరల వెంటనే పొందగలవు.

సూతః :

శ్లో || గురుణోక్తం వచశ్ర్శుత్వా సహస్రాక్షో7పి సాదరః |

అశూన్యశయనం నామ వ్రతం చక్రే యథావిధి||

సూతుడు :

గురువు చెప్పిన మాటను విని ఇంద్రుడను ఆదరముతో అశూన్యశయనమను వ్రతమును యథావిధిగా జేసెను.

శ్లో || ఆషాఢస్య ద్వితీయాయాం కృష్ణపక్షే పురన్దరః |

సమారభ్య జగద్యోనిం కమలాప్రాణనాయకమ్‌||

శంఖచక్రాదిభిర్దివ్యైరాయుధైః పరిసేవితమ్‌ |

తార్ష్యధ్వజం స్ఫురద్వక్త్రం లక్ష్మీ శోభి భుజాన్తరమ్‌||

విస్తీర్ణదివ్యశయనే దివ్యపుషై#్పరలఙ్కృతే |

శయానం పుణ్డరీకాక్షం మఘవాన్‌ వరదం హరిమ్‌|

సశ్రద్ధం పూజయామాస మాసి మాసి యథావిధి||

గన్ధైః పుషై#్పశ్చ దూపైశ్చ దీపికాభిస్తథైవ చ ||

నైవేద్యై ర్వివిధైశ్చాపి భక్ష్యభోజ్యైరనేకశః |

అకృత్రిమేణ చిత్తేన సదా విజయకాంక్షిణా||

శత్రుపుర నాశకుడైన ఇంద్రుడు ఆషాఢ బహుళ విదియయందు ప్రారంభించి జగత్కారణభూతుడు, లక్ష్మీ వల్లభుడు, శంఖచక్రాది దివ్యాయుధములచే సేవింపబడినవాడు, గరుడధ్వజుడు, ప్రకాశించు ముఖముగలవాడు, లక్ష్మితో శోభిల్లు రొమ్ముగలవాడు, దివ్యపుష్పములచే నలంకరింపబడి విశాలమైన దివ్యశయనమున పరుండినవాడు, తామరపువ్వుల వంటి కన్నులుగలవాడు, వరములనిచ్చువాడునగు హరిని యథావిధిగా శ్రద్ధతో ప్రతిమాసమందును గంధములతోను, పుష్పములతోను, ధూపదీపములతోను, పలువిధములైన నైవేద్యములతోను, అనేకమైన భక్ష్య భోజ్యములతోను ఎల్లప్పుడు విజయమును గోరుచు అకృత్రిమమైన చిత్తముతో పూజించెను.

శ్లో || కృతస్నానశ్శుచిర్వజ్రీ తస్మిన్‌ క్షేత్రే జయావ హే |

పూజయామాస తం దేవం యావన్మాసచతుష్టయమ్‌||

జయమును గలిగించు నాక్షేత్రమున నింద్రుడు స్నానముచేసి శుచియై ఆ దేవుని నాలుగు మాసములు పూజించెను.

శ్లో || కార్తికే మాసి సంప్రాప్తే సమారాధ్య హరిర్హరిమ్‌|

ఉత్థానసమయే చక్రే పునరుద్వాసనం హరేః ||

కార్తిక మాసము వచ్చినతోడనే ఇంద్రుడు హరిని మరల పూజించి హరి లేచుసమయామున ఉద్వాసనము చేసెను.

శ్లో || #9; అథానీయ మునీనిన్ద్రో వేదవేదాఙ్గపారగాన్‌|

అర్చయామాస తత్రైవ వసై#్త్రరాభరణౖ రపి ||

పిమ్మట ఇంద్రుడు వేద వేదాంగములను బూర్ణముగా జదివిన మునులను రప్పించి అక్కడనే వస్త్రాభరణములతో బూజించెను.

శ్లో || వైదికైశ్చ స్తవైః స్తుత్వా చక్రపాణిం సవల్లభమ్‌|

జిష్ణుస్సమాపయామాస అశూన్యశయనం వ్రతమ్‌||

వేదమందలిస్తుతులతో లక్ష్మీ నారాయణులను స్తుతించి ఇంద్రు డశూన్యశయన వ్రతమును సమాప్తి చేసెను.

శ్లో || #9; అథ తస్య ప్రభావేన మహతా స పురన్దరః |

విజయా బుభుజే స్వర్గం విధ్వస్తారిభయం భృశమ్‌||

పిమ్మట దాని గొప్ప ప్రభావముచే ఆదేవేంద్రుడు శుత్రుభయము పూర్తిగా నశించి విజయముతో స్వర్గము ననుభవించెను.

శ్లో || అతస్త్వం దేవదేవస్య సేవాయై కరుణానిధేః |

శ్రీమత్తిల్లవనే దివ్యే కురు నిత్యం తపో మహత్‌||

కనుక నీవా కరుణానిధియగు దేవదేవుని సేవకొరకు దివ్యమైన శ్రీతిల్లవనమున నిత్యము మహాతపస్సు చేయుము.

శ్లో || ఏవం పఠితి సశ్రద్ధమధ్యాయం యశ్శృణోతి వా|

విజయస్సర్వతస్తస్య భవతి శ్రీశ్చ నిశ్చలా|| 49

ఈవిధముగా నీయధ్యాయము నెవడు శ్రద్ధతో జదువునో లేక వినునో వాని కంతటను జయము కలుగును. లక్ష్మి స్థిరముగా నుండును.

ఇతి శ్రీస్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం

శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమాహాత్మ్యే

వాసవతపస్సిద్ధిర్నామ సప్తమో7ధ్యాయః

----0----

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters