Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters   

అథ త్రయోదశో7ధ్యాయః

(ఆనందన ర్తనదర్శనము)

శ్లో|| మోహిన్యా హరిణా విమూఢమనసో విప్రా వనే భిక్షుకమ్‌|

వీక్ష్యాన్తః పురదూషకం ప్రకుపితా హస్తుం చ చేరుర్విధిమ్‌|

జప్తా మారమన్త్రకా అపిచతైః సర్వం శివే నిష్పలం|

జ్ఞాత్వా తే గతమత్సరాః స భగవానీశో ప్యనృత్య న్ముదా|

మోహింపజేయు స్త్రీరూపమును ధరించిన హరిచేత మూఢమనస్కులైన వనములోని బ్రాహ్మణులు తమ భార్యల శీలమును చెడగొట్టుచున్న భిక్షకుని జూచి కోపించి వానిని చంపువిధానము నాచరించిరి. మారణమంత్రములను గూడ వారు జపించిరి. అవియన్నియు శివునియందు నిష్ఫలముమైనవని వారు తెలిసుకొని ద్వేషమును విడచిరి. ఆ భగవంతుడగు ఈశ్వరుడును సంతోషముతో నృత్యముచేసెను.

మాధవః :

శ్లో || తద్భర్తృషు చ సర్వేషు తావసేషు మహాత్మసు|

మయా కృతం ప్రవక్ష్యామి తాపసీనాం తు సన్నిధౌ||

మాధవుడు :

తాపసస్త్రీలయెదుట వారి భర్తలు, మహాత్ములునగు తాపసులందరి విషయమున నేను చేసినపని జెప్పెదను.

శ్లో || ఏషా న సాధ్వీ వనితా న చ వారవిలాసినీ|

ఇత తత్ర యథా సర్వే మన్యేరన్మాం మునీశ్వరాః||

తథా చాహం క్షణనైవా కామినీరూపమాశ్రితః|

సవిధే చ మహేశస్య స్థిత్వా మన్దం విహస్య చ ||

కచటులానుల్లసద్భాసస్సు తీక్‌ష్ణ న్దృష్టిసాయకాన్‌|

సన్థాయ భ్రూలతాచాపే దృడం సమ్యగభ ఙ్గురే||

అశ్రమాభ్యర్ణదృష్టానాం మునీనాం దివ్యతేజసామ్‌||

నిశ్చలాన్యక్షిలాక్షాని మయి వేద్ధుం కృతోద్యమే||

తపోవీర్యేణ మహితా తే7పి తత్ర తపోధనాః|

యజ్ఞసూత్రం వినా సర్వం ముముచుస్స్వియ లక్షణమ్‌||

ఈమె పతివ్రతయు కాదు. వారకాంతయు కాదు. అని అక్కడ మునీశ్వరులందరు నన్ను జూచి అనుకొను విధమున నేను క్షణములో కామినీరూపమును ధరించి ఈశ్వరునిదగ్గర నిలబడి చిరునవ్వు నవ్వి చంచలమైనవి, కాంతిగలవి, తీక్షణమైనవియునగు దృష్టులనెడు బాణములను వ్యర్థముకాని కనుబొమయనెడు వింటియందు దృఢముగా సంధించి ఆశ్రమసమీపమున కనబడిన దివ్యతేజస్సుగల మునుల నేత్రలక్ష్యములను కొట్టుటకు ప్రయత్నము చేయుచుండగా నక్కడ తపోధనులందరును యజ్ఞోపవీతముతప్ప గొప్ప తపోబలముతో తమ లక్షణమునంతను విడచిరి.

శ్లో || ముక్త్వా చ పరమం ధైర్యం స్రస్తబద్ధజటాభరాః|

హస్తస్రస్తాక్షరమాలాశ్చ గలన్మృదుత్వచః|

భూత్వా సరవశా స్తస్య మత్పతేః కిల శూలినః|

సన్నిధావేన తే వాంఛాం తేసు స్తత్ర మమోపరి||

ఆ మునులు కట్టిన జటల ముడులు విడినవారు, చేతిలోని జపమాల జారినవారు, కట్టుకొనిన మృదువైన చెట్లపట్టలు జారినవారునగచు పరమధైర్యమును విడచి పరవశులై నాపతియగు నీశ్వరుని సన్నిధియందే నామీద కోరికను వెల్లడించిరి.

శ్లో|| బ్రహ్మవిద్భిర్మయా చాపి తస్మిన్నమితతేజసి|

భిక్షాటనపరే మన్దమేవమాశ్రమపంక్తిషు||

బ్రహ్మణీవ పరం సక్తాఃక పశ్యన్తో మవ్ఖుంభృశమ్‌|

వితేనుర్జన్మనో హేతుమపరాధపరమ్పరామ్‌||

మహాతేజోవంతుడైన ఆయీశ్వరుడు బ్రహ్మవేత్తలతోడను, నాతోడను కలసి యాశ్రమసంపక్తులలో నీవిధముగా మెల్లగా భిక్షాటనము చేయుచుండ మునులు నాముఖము నెక్కువగా జూచుచు బ్రహ్మయందు వలెనే మిక్కిలి ఆసక్తులై జన్మకు కారణమగు నపరాథములను వరుసగా జేసిరి.

శ్లో || అథ తేషు భృశం క్రుద్ధాః ఏచిద్వృద్ధాస్తపోధనాః|

కాపాలికాకృతిః కో7సౌ ప్రాప్య నిర్భయమాశ్రమాన్‌||

పాతివ్రత్యం తుసాధ్వీనామాధారం జగతామయమ్‌|

క్షణాద్ధ్వంసయతీత్యుగ్రానముఞ్చన్‌ శాపసాయ కాన్‌||

పిమ్మట వారియందు మిక్కిలి కోపించి వృద్ధతాపసులు కొందరు కాపాలికాకారముగల వీడెవడో నిర్భయముగా నాశ్రమములలో బ్రవేశించి లోకముల కాధారమైన ప్రతివతల పాతివ్రత్యమును క్షణములో నాశనము చేయుచున్నాడు. అని ఉగ్రమైన శాపబాణములను విడచిరి.

శ్లో || ముక్తాం స్తథావిధాన్సద్యస్తమప్రాప్య నివర్తినః|

అశాన్తకోపాః పశ్యన్తస్సర్వే తే మునిపుఙ్గవాః||

సఙ్గప్య నియమం కేచిత్కుణ్డాన్యసి వితేనిరే|

వదన్త ఇవ తం రుద్ధ్వా దర్శయాత్రేతి తాణ్డవమ్‌||

ఆ మునిపుంగవులందరు విడిచిన యాశాపబాణములు వానికి తగులక వెంటనే వెనుదిరుగుట చూచి కోపముశాంతింపక నియమమును కాపాడుకొని కొందరు వానినడ్డగించి ఇక్కడ నీతాండవమును జూపుమని పలుకుచున్నవారు వలె హోమకుండములను ఏర్పరచిరి.

శ్లో || నిధాయ పావరకం తేషు మహాజ్వాలాసమన్వితమ్‌|

జప్త్వా తథా చతే మన్త్రాన్‌ తేషాం వృత్తిర్యథా భ##వేత్‌||

ద్రవ్యజాలేన సర్వేణ విధేస్తస్యోచితేన చ |

దేవదారువనే దివ్యే మునిసేవ్యే హరీశ్వరమ్‌|

నిర్మలం శివముద్దిశ్య సర్వదోషవినాశనమ్‌

అవిచారేణ తే చక్రురాభిచారాన్‌ తపోధనాః||

ఆ కుండములయం దాతపోధనులు మహాజ్వాలలతో కూడిన అగ్నినుంచి మంత్రములను అర్థకారియగునటుల జపించి ఆక్రియకు తగిన సమస్తద్రవ్యసమూహముతో మునులుండెను. దివ్యమైన యాదేవదారువనమున యమునకు శాసకుడు, దోషరహితుడు, సర్వదోషములను నశింపజేయువాడు నగు శివునుద్దేశించి ఆలోచింపకుండ అభిచారహోమములను జేసిరి.

శ్లో|| తథా చిత్తే షు నేత్రేషు ప్రజ్వలత్కో పవహ్నిషు|

తత్కర్మ విపినే తస్మిన్‌ తేషు కుర్వత్సు భీతిదమ్‌||

ప్రబభూవాతివేగేన వ్యాఘ్ర స్తస్మాద్ధవిర్భుజః|

జ్వాలాచక్రైరివోచ్చణ్డౖ స్సృష్టోనేత్రైస్సముద్భటః||

అట్లు కోపాగ్నితో మండు చిత్తములు నేత్రములు గల ఆమునులావనమున భయంకరమైన అభిచారికహోమమును జేయుచుండగా నాయగ్నినుండి జ్వాలాచక్రములవలె భయంకరమైన కన్నులతో సృజింపబడి పరాక్రమముగల పులి మిక్కలి వేగముతో పుట్టెను.

శ్లో || దలయ న్తమివోప్నాదైర్దిశస్సర్వా మునీశ్వరాః|

సహసా ప్రేషయామాసురీశే సర్వహరే శుబే||

పెద్ద అరుపులతో దిక్కులన్నిటిని బ్రద్దలు చేయుచున్నటులున్న ఆపులిని మునులు వెంటనే శుభడు, సమస్తమునుహరించువాడునగు ఈశ్వరునిమీదకు పంపిరి.

శ్లో|| అథ సో7పి మహేశానః కృత్వా మన్దస్మితం ముదా|

కరజాగ్రేణ తం హత్వా తరక్షుం సర్వభీతిదమ్‌||

పరిధాయ తదాక్షిప్తాం త్వచం పట్టాంశుకత్విషమ్‌||

అమ్బరాణాం స దివ్యావాముచితో7పి తథా బభౌ||

పిమ్మట నామహేశ్వరుడు చిరునవ్వునవ్వి సంతోషముతో అందరకుని భయము గొల్పు నాక్రూరమృగమును గోటికొనతో జంపి దివ్యాంబరములకు దగినవాడైనను ఆపులినుండి తీయబడి పట్టుబట్టవలె ప్రకాశించు చర్మమును గట్టు కొని యట్లే విలసిల్లేను.

శ్లో || తతశ్చ వహ్నేరుద్భూతో భోగీ భూతనిషేవితః

దుర్వారవిషదీప్తాగ్నిర్జ్వలన్నే త్రఫణామణిః|

తమఃపుంజసమో భీమో ము క్తదుస్సహపూత్కృతిః

ఋషిభిః ప్రేరితశ్శమ్భోః వేగేనాభిముఖం య¸°||

పిమ్మట అగ్నినుండి పుట్టినది, భూతములచే సేవింబడినది, అడ్డగింపరాని, మండు, నిషాగ్నిగలది, జ్వలించు కన్నులు, పడగలమీది మణులు గలది, చీకటిసమూహముతో సమానమైనది, భయంకరమైనది, దుస్సాహముగా బుసకొట్టుచున్నదియు నగు పాముఋషులుపంపగా వేగముతో శివుని కెదురుగా వెళ్లెను.

శ్లో || అగచ్ఛన్తం మహావేగమభిదీ ప్తఫణామణిమ్‌|

అకారోత్కంకణం దేవః కరే కల్యాణలక్షణః||

ప్రకాశించు పడగమీది మణిగలిగి మహావేగముగావచ్చుచున్న సర్పము నీశ్వరుడు శుభలక్షణముగల చేతికి కంకణముగా ధరించెను.

శ్లో || భక్తానామప్యసౌ తేషాం మోహాచ్చాత్రవకారిణామ్‌

మునీనాం పురతో రూపంకారుణ్యాదాదదేస్వకమ్‌||

భక్తులైనను అజ్ఞానమువలన విరోధించుచున్న ఆమునులయెదుట నితడు దయతో తన రూపమును ధరించెను.

శ్లో|| తే తస్య కు న్తలాః కాన్తాః బభూవుః పిఙ్గలా జటాః|

ప్రస్తావనాపదం కర్తుం తాణ్డవస్యోపచక్రమే||

మనోహరమైన వాని యాకేశములు గోరోజనపురంగు జటలైనవి. తాండవము యొక్క తోలియడుగును వేయనారంభించెను.

శ్లో || అన్యౌ చ పరమౌ హస్తౌ దృష్టౌ తత్ర మునీశ్వరైః|

లలాటే చ దధౌ నేత్రం కాలం కణ్ఠ మహేశ్వరః||

ఉత్తమమైన మరిరెండు చేతులు మునులకు గనబడెను. మహేశ్వరుడు నుదుట కన్నును కంఠమును సలుపును ధరించెను.

శ్లో || జాజ్వల్యమానైసై#్తః పూర్వం యదపాయి తమో7గ్నిభిః|

తద్వాన్తమివతై ర్భూయః పిణ్డితం భూతముత్థితమ్‌||

మండుచున్న ఆయాగ్నులు పూర్వముత్రాగిన చీకటిని ముద్దచేసి మరల గ్రక్కినటుల ఒక భూతము పుట్టినది.

శ్లో || అంగారాభవలన్నే త్రజ్వాలాబభ్రు శిరోరుహమ్‌||

వామనాఙ్గం మహావక్త్రం దీర్ఘ దంష్ట్రం లసద్భుజమ్‌||

అనేకేషాం భుజఙ్గానాం సమూహైః పరిసేవితమ్‌|

త్యక్తభీతి మహావేగాచ్ఛంకరస్యాన్తికం య¸°||

నిప్పులవంటి తిరుగుచున్న కన్నులు, మంటవలె పింగళవర్ణపు జుట్టు పొట్టి శరీరము, పెద్దనోరు, పొడవైన కోరలు, ప్రకాశించు భుజములు గలది, అనేక సర్పసమూహములచే సేవింపబడునదియునగు నాభూతము భయము విడచి మహావేగముగా శంకరుని సమీపమున కేగెను.

శ్లో || తదాలోక్య మహేశస్తు నటనాభిముఖో ముదా|

పీడయుత్వా పదాబ్జేన పీఠం తత్ర చకార సః|

అది చూచి నాట్యమునకు సిద్దముగానున్న మహేశ్వరుడు సంతోషముతో ఆ భూతమునక్కడ పాదపద్మముతో త్రొక్కి పీఠముగా జేసికొనెను.

శ్లో || స్వప్రయుక్తైరజేయం తమాలోక్యైతే సుదుస్సహైః|

తమేవ ముముచుర్వహ్నిం వేగాత్తస్యోపదిక్రుధా||

తాము ప్రయోగించిన సహింపరాని సాధనములచేత గూడ శివుడు జయింపబడకపోవుట చూచి యామునులు కోపముతో అగ్నినే వేగముగా వానిమీదకు విడచిరి.

శ్లో || సో7పి వేగాత్సమాయా న్తం జ్వాలాచక్రసమన్వి తమ్‌|

లీలయైన సమాదాయ దధౌ హన్తతలే శుభే||

ఆశివుడును జ్వాలాచక్రములతో వేగముగా వచ్చుచున్న అగ్నిని విలాసముగా బట్టుకొని శుభ##మైన యరచేతిలో ధరించెను.

శ్లో|| తతశ్చ వరమక్రద్ధా మునయస్తే మహౌజసః|

ఏతత్కిమితి సంచి న్త్య మన్త్రాన్‌ తసై#్మ ప్రచిక్షిపుః||

పిమ్మట తేజోవంతులైన యామునులు మిక్కిలి కోపించి ఇదియేమని యాలోచించి మంత్రములను వాని మీదకు ప్రయోగించిరి.

శ్లో|| ప్రయుక్తాన్మునిభిర్మిన్త్రాన్‌ శివస్సఙ్గృహ్యపాణినా|

దివ్యకా న్తిం తులాకోటిం కృత్వా పాదే సమార్పయత్‌||

మునులు ప్రయోగించిన మంత్రములను శివుడు చేతితో పట్టుకొని దివ్యమైన కాంతిగల అందెగాజేసి పాదమునకు ధరించెను.

శ్లో || అథ తత్ర మహాదేవః చలచ్చారుజటాభరః|

తాణ్డవాబిముఖం మన్దం చక్రే చిత్తం దయానిధిః||

పిమ్మట నక్కడ దయాసముద్రుడు, కదలుచున్న సుందరమైన జటలు గలవాడునగు మహాదేవుడు చిత్తమును మెల్లగా తాణ్డవమువైపు ప్రవర్తింపజేసెను.

శ్లో || మునయో7వ్యథ తే మోహాన్ము క్తమన్త్ర కృశానవః||

శస్త్రహీనా ఇవ క్లాన్తాశ్చిన్తా విష్టాస్థ్సితాః క్షణమ్‌||

పిమ్మట అజ్ఞానము వలన మన్త్రాగ్నులను బ్రయోగించిన మునులును ఆయుధములు లేనివారువలె అలసి విచార ముతో క్షణకాలుము ఆగిరి.

శ్లో || తస్య తాణ్డవవేగేన మహతా మునయస్తతః|

మోహితాః క్షణమాత్రేణ నిపేతుః పృథివీతలే||

పిమ్మట మునులు వాని గొప్ప తాండవవేగముచే మైమరచి క్షణములో భూమిమీద పడిరి.

శ్లో||వృత్తాతాండవే తస్మిన్న హమప్యపార్శ్వగః|

అభూతపూర్వాం మహతీంభీతిం ప్రాప్తో విశఙ్కితః||

అతడు తాండవము చేయుచుండగా చేనుకూడ వాని ప్రక్కనుండి అనుమానముతో నెన్నడు నెరుగని మహాభయమును బొందితిని.

శ్లో|| పాణినా మమ తాం భీతిం ఫణికఙ్కణశోభినా|

తాదృశీం శమయన్‌ వేగాత్పర్వతీ చిన్తితాగతా||

సర్పకంకణముతో శోభిల్లు చేతితో నాయొక్క అట్టి యాభయమును బోగొట్టుచు పార్వతిని స్మరింపగా వేగముగా నామె వచ్చినది.

శ్లో || తస్యాం గిరీన్ద్రకన్యాయా మాగతాయాం తదన్తి కమ్‌|

పుష్పపృష్టిం తతః ప్రీత్యా ససృజు స్త్రిదివౌకసః||

ఆపార్వతి శివునిదగ్గరకు వచ్చినవెంటనే దేవతలు సంతోషముతో పుష్పవర్షమును కురుపించిరి.

శ్లో || తదద్భుతమహం త్యక్త్వా కాన్తారూపం పునశ్శివమ్‌|

స్వాభావికం వపుర్దివ్యం సంప్రాప్తస్తదనుజ్ఞయా||

నేను వానియాజ్ఞచే నాశ్చర్యకరమైన కాంతరూపమును విడచి మరల మంగళప్రదమైనది దివ్యమైనదియునగు స్వాభివికశరీరమును పొందితిని.

శ్లో|| తతః పరమకల్యాణి శర్వాణీ శంకరప్రియా|

యథాపూర్వమలఞ్చక్రే పార్శ్వమస్య జగద్గురోః||

పిమ్మట సర్వమంగళరూపురాలు శంకరునికి ప్రియురాలునగు శర్వాణి పూర్వవలెనే జగద్గురువైన శివుని పార్శ్వభాగము నలంకరించెను.

శ్లో || సా దేవీ జగతాం మాతా పుల్లపద్మసమానవా|

సాధుసాధ్వితి మాం దృష్ట్వా సనన్ద సుచిరం ముదా||

విడిచిన పద్మమువంటి ముఖముగల యాజగన్మాత నన్ను జూచి బాగుబాగు' అని సంతోషముతో చాలసేపానందించెను.

శ్లో|| శోభమానస్తతస్సో7యం దేవః కారుణ్యవిగ్రహః

దిగన్తస న్తతాస క్తలోలపిఙ్గజటాభరః||

పావకేన లసద్భాసా శోభమానకరామ్బుజః|

ఉత్కూలకరుణాపూరవహదుజ్జ్వలలోచనః||

పూరయన్‌ కకుభస్సర్వాస్తారైర్డామరజైరవైః|

కాలా న్తసహసోద్భూతని ఘాతపరిపన్థిభిః||

సమాశ్రితాష్టదిగ్బాగైస్సర్వైర్లోకైర్ధృతాదరైః||

వన్ద్యమానపదామ్బోజః శిఞ్జానమణి నూపురః|

పార్శ్వస్థాయాశ్చ పార్వత్యా భయముత్పాదయన్‌ మహత్‌|

పాణినాచసముద్భాసిఫణికఙ్కణశోభినా||

ఉచ్ఛైర్భ్రమణవేగేన లసద్వ్యాఘ్రాజినామ్బరః||

జగన్మూర్తిస్తదా శమ్భుస్తాణ్డవం కర్తుముద్యతః|

ఆకుఞ్చితేన పాదేన చలన్నూపురచారుణా|

అన న్తం కఙ్కణం కృత్వామయాప్యనవలోకితమ్‌||

పిమ్మట ప్రకాశించువాడు , దయాస్వరూపుడునగు నాదేవుడు దిక్కుల చివరలకెల్లప్పుడు నంటుచున్న కదలెడు గోరోజనపురంగు జటలుగలవాడు, ప్రకాశించుకాంతిగల అగ్నితో శోభిల్లు హస్తపద్మముగలవాడు, పొంగివచ్చు దయాప్రవాహమును ధరించిన కాంతిమంతమైన కన్నులుగల వాడు, ప్రళయకాలమున నాకస్మికముగా బుట్టిన పెద్దచప్పుడుతో సమానమైన పెద్దడమరుధ్వనులతో దిక్కులన్నిటిని నింపుచున్నవాడు, ఎనిమిది దిక్కులయందున్న లోకులందిరి చేత నమస్కరింపబడు పాదపద్మములు గలవాడు, ధ్వనించుమణిసూపురముగలవాడునై ప్రకాశించు సర్పకంకణముచే శోభిల్లు చేతిచే ప్రక్కన ఉన్న పార్వతికూడ మహాభయమును కలిగించుచు ఎక్కువ భ్రమణవేగముచే ప్రకాశించు వ్యాఘ్రచర్మరూపమైన బట్టతో కూడిన జగన్మూర్తియగు శివుడపుడు అనంతుని కంకణముగా ధిరంచి కదలుచున్న అందెతో సుందరమైన అంకుచిత(వంచబడిన) పాదముతో నేను కూడ చూడని తాండవము చేయుటకు సిద్ధపడెను.

శ్లో|| సదేశస్థానముమాం దేవీం భయవిహ్వలమానసామ్‌|

కృపాదృష్ట్యా భృశం పశ్యన్సదా సానన్దతాణ్డవమ్‌||

త్వమిమం తాణ్డవరసం సిబేత్యుక్త్వా థ పార్వతీమ్‌|

ఆదిదేశ వృష! త్వం చ భవ తుష్ట ఇతీశ్వరః||

భయముచే కలతచెందిన మనస్పుతో దగ్గరనున్న పార్వతిని ఆనందతాండవము చేయుచు మిక్కిలి దయాదృష్టితో నెల్లప్పుడు చూచుచు నీవీతాండవరసమును త్రాగుమని పార్వతికి జెప్పి వృష! నీవు కూడ సంతుష్టుడవగుమని వానినాజ్ఞాపించెను.

శ్లో|| తతశ్చ మోహితాత్మా నస్సర్వే తే మునిపుఙ్గవాః||

శివ!శఙ్కర! దేవేతి వదన్తో వినయాన్వితాః|

నమశ్చ క్రురుమాభ##ర్త్రే చన్ద్రచూడయ శమ్భవేః|

జ్ఞానదృష్టిం దదౌ సో7పి తేషాం తాణ్డవదర్శనే||

పిమ్మట మోహముచెందిన మనస్సుగల యామునిపుంగవులందరు శివ!శంకర! దేవ! అని పలుకుచు వినయముతో పార్వతీపతి, చంద్రశేఖరుడునగు శివునకు నమస్కరించిరి. అతడును వారికి తాండవమును జూచుటకు జ్ఞానదృష్టిని చ్చెను.

శ్లో|| నృత్తశోభీ తదా శమ్భుః నృత్యత్కారుణ్యలోచనః|

మన్దస్మితకాసేన నిర్మలీకృతకాననః|

సమూహమపరాధానాం తదీయానామివస్థితమ్‌|

జిఘాంసురివ తద్భూతం పదా తస్యోపరి స్థితః|

తదాగసాం వినాశాయ సఞ్చితానాం భ##వేభ##వే|

కిఞ్చిదాకుఞ్చితం పౌదం దర్శయామాసతం శివమ్‌||

నృత్యముచేయుచు శోభిల్లువాడు, నృత్యముచేయుచున్న కారుణ్యము కన్నులలోగలవాడు, చిరునవ్వువికాసముచే అడవిని నిర్మలముగా జేయుచున్నవాడునగు శివుడప్పుడు వారియపరాధముల సమూహమువలెనున్న యాభూతుమును చంపువాడువలె దానిమీద నిలబడి వారు జన్మజన్మలలో సంపాదించిన దోషములు నశించుటకు కొంచెమువంచిన మంగళప్రదమైన యాపాదమును జూపెను.

శ్లో || చక్షుషాముత్సవం దివ్యం పరమానన్దతాణ్డవమ్‌|

కృపయా దేవదేవస్యదదృశుస్తే తపోధనాః||

కన్నుల కానందమున చేకూర్చు దివ్యమైన పరమానందతాండవమును దేవదేవుని కృపచే నాతపోధనులుచూచిరి.

శ్లో || దృష్ట్వా నృత్తం పరం శమ్భోర్హర్షవిస్మయసంయుతాః|

ఆబద్ధ్య కుణ్డికాదణ్డానూర్ధ్వీ కృత్యాశు పాణిభిః|

అలోడితజటాభారపిశఙ్గీకృతకాననాః|

శివానన్దరసావిష్టా ననృతుర్ముదితాశయాః||

వారు శివుని యుత్తమమైన నృత్తమును జూచుటచే సంతోషము ఆశ్చర్యము కలుగగా కుండికలను దండములను కట్టి వెంటనే చేతులతో నెత్తి విడిపోయిన జటలచే అడవి గోరోజనపురంగు కలదికాగా శివానందరసముతోనిండి సంతోషముతో నృత్యము చేసిరి.

శ్లో || కిరీటకోటి సన్దష్ట సుపుష్పాఞ్జలిసఞ్చయాః|

స్తువన్తస్తం మహేశానం విబుధాఃపర్యవారయన్‌||

దేవతలు కిరీటములపై పుష్పాంజలులు ఘటించి అమహేశ్వరుని స్తుతించుచు చుట్టునచేరిరి.

శ్లో || ప్రవీణా నారదముఖా వీణాలంకృతపాణయః|

న గాయన్తో న జానన్త స్సబ్ధాస్తే కేవలం స్థితాః||

నిపుణులైననారదుడు మొదలగువారు వీణలు చేతులతో పట్టుకొని పాడక ఏమియు తెలియక కేవలము నిశ్చేష్టులై నిలబడిరి.

శ్లో || సర్వాణి తత్ర భూతాని స్థిత్వా తస్య పురస్తదా|

వితేనురమితం తాని నృత్తం కిమపి వేగతః||

అపుడక్కడ సమస్తప్రాణులు వానియెదుట నిలబడి వేగముగా నేదో అమితమైన నృత్తమును జేసినవి.

శ్లో || కరణాని గణాస్సర్వే వివిధాని ముహుర్ముహుః|

పతిత్వా పునరుత్థాయ భృశం చక్రుర్ముదాకులాః||

గణములన్నియు సంతోషముతో నిండి పడుచు లేచుచు మరలమరల అనేకవిధములైన చేష్టలను (నృత్తవిశేషములగు కరణములను )ఎక్కువగా జేసిరి.

శ్లో|| అథ దేవో మహాదేవోమునీన్‌ బ్రహ్మపరాయణాన్‌|

ప్రీతచేతా జగాదైతానతిసన్తుష్టమానసాన్‌||

పిమ్మట మహాదేవుడు మనస్సును సంతోషించి బ్రహ్మపరాయణులై మనస్సున మిక్కిలి సంతోషించిన యామును లను గూర్చి పలికెను.

శ్లో|| బ్రహ్మవిష్ణుసురేన్ద్రాద్యాః! శృణుధ్వం మునిపుఙ్గవాః!

వచో మమాశ్రుతతరమశేషామరపూజితమ్‌||

బ్రహ్మ, విష్ణవు, ఇంద్రుడు మొదలగు దేవతలారా! మునిపుంగవులారా! సమస్త దేవతలచే పూజింపబడినది, పూర్వమెన్నడు విననిదియునగు నామాటను వినుడు

శ్లో|| పరానన్దమహాసిన్ధుపూర్ణచన్ద్రో హ్యాయం మమ|

అనన్దతాణ్డివం మత్వా శివలిఙ్గమిదం ధియా|

అస్మిన్నేవ వనే తస్మిన్‌ మమ నృత్తాఙ్గణ శుభే|

శివలిఙ్గం ప్రతిష్టాప్య పూజయధ్వమతన్ద్రితాః||

ఈ నా తాండవము బ్రహ్మానందమనెడి మహాసముద్రునకు పూర్ణచంద్రుడే గదా. ఈయానందతాండవమును బుద్ధితో శివలింగముగా భావించి ఈవనమందే శుభ##మైన నానృత్తరంగమున శివలింగుమును ప్రతిష్టించి అలసతలేక పూజింపుడు.

శ్లో || పూజయా తస్య లిఙ్గస్య భోగమోక్షై క హేతునా|

అనన్యలబ్దం పరమం లభద్వం పదమవ్యయమ్‌||

భోగమోక్షముల కుత్తమసాధనమైన యాలింగము యొక్క పూజచే మరియొక విధముగా లభింపని నాశరహితమైన పరమపదమును పొందుడు.

శ్లో || ఇత్యేవముక్త్వా భగవాన్‌ గిరీశో గౌరీకటాక్షో కరుణార్ణవేన్దుః|

పయోముచాం వర్త్మని తత్ర వేగాద న్తర్దధే శేష! భవో భవాన్యా||

శేష! గౌరీకటాక్షముగలవాడు, కరుణాసముద్రమునకు చంద్రుడు, భగవంతుడునగు ఈశ్వరుడు, ఈవిధముగా జెప్పిపార్వతితో కూడ వేగముగా మేఘమార్గమున నంతర్ధానము నొందెను.

శ్లో || తద్గతామథ తాం దేవాఃప్రణిపత్య దిశం ముదా|

శివాలోకనసన్తుష్టాః ప్రతిజగ్ముర్యథాగతమ్‌||

దేవతలు పిమ్మట పార్వతీపరమేశ్వరులు వెడలిన దిక్కునకు సంతోషముతో నమస్కరించి శివదర్శనముచే సంతుష్టులై వచ్చి న విధమున వెడలిరి.

శ్లో || శేష తద్గతచి త్తత్వాత్‌ నిర్భరానన్దస న్తతిః|

తదేవ చిన్తయామ్యద్య యోగనిద్రాపరాఙ్ముఖః|| 74

శేష! దానియందే మనస్సుండుటవలన సంపూర్ణానందపరంపరగలిగి యోగనిద్రావిముఖుడనై ఇప్పుడు దానినే తలచుచుంటిని.

ఇతి స్కాన్దే మహాపురాణ సనత్కుమారసంహితాయాం

శ్రీమహేశ్వరనన్దిసంవాదే చిదమ్బరమాహాత్మ్యేమా

ధవశేషసంవాదేభిక్షాటన ప్రసజ్గోనామ త్రయోదశో ధ్యాయః

Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu    Chapters