Maa Swami    Chapters   

6.పీఠారోహణ

1906లో 66వ పీఠాధిపులు శ్రీ చంద్రశాఖరేంద్రసరస్వతి శ్రీచరణులు దిండివనానికి సమిపమున ఉన్న పెరుముక్కార్‌ అనే గ్రామానికి విజయంచేశారు. అచటనే చాతుర్మాస్యవ్రతం. సకుటుంబముగా సుబ్రహ్మణ్యశాస్త్రి స్వాములవారి దర్శనార్ధం వెళ్ళారు. ఒక దేవాలయంలో విశ్వరూప యాత్రా సందర్భంలో శ్రీవారిని స్వామినాథన్‌ దర్శించాడు.

నవరాత్రి పూజోత్సవములు మరక్కనం అనే గ్రామంలో జరిగినవి. అటుపై తిండివనం మధురాంతకం రైలుమార్గంలో ఉన్న సాదం అనే గ్రామానికి వారు విజయంచేశారు. ఒక స్నేహితునితో కలసి స్వామినాథన్‌ తలితండ్రులతో చెప్పకుండా ఆయన దర్శనార్ధం వెళ్ళారు. శ్రీవారు మఠంలో స్వామినాథన్‌ను ఉండమన్నారు. మఠంలోని ఇద్దరు పండితులుకూడ స్వామినాథనుడిని ఉండవలసినదిగా కోరినారు. తాను తలితండ్రులతో చెప్పలేదనీ, పాఠశాలకు తిరిగి వెళ్ళవలెననీ స్వామినాథన్‌ తప్పుకొన్నారు. స్వాములు ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. స్వామినాథన్‌ వెళ్ళిన తర్వాత పండితులతో తమ అనంతరం స్వామినాథుని పీఠానికి నియామకము చేయవలెనన్న తమ సంకల్పం కూడా చెప్పారు.

ఇదివరకే స్వామినాథను సన్యాసకథనం వారిమాటలలో చెప్పాము.

పరాభవ సంవత్సరము ఫాల్గుణశుద్ధ విదియ బుధవారము శ్రీవారు ఉపదేశమొందిరి. సన్యాసదీక్షకూ, పీఠారోహణకూ టెలిగ్రాము ద్వారా శ్రీవారి తండ్రిగారి అనుమతి మఠాధికారులు కోరిరి. 13వ తేది ఫిబ్రవరి 1907 చంద్రశేఖరేంద్రసరస్వతి అన్న పరివ్రాజక నామముతో శ్రీచరణులు 68వ ఆచార్యులుగా కామకోటి పీఠారోహణ కావించిరి.

మఠమునకు రాగానే శ్రీవారు తమ పరమగురువులైన 66వ ఆచార్యులు సిద్ధిపొందిన స్థానమునకు అనుచరులు వెంబడింపగా వెళ్ళి మహాపూజాకార్యక్రమమును భక్తి శ్రద్ధలతో నిర్వర్తించినారు.

కొన్ని రాజకీయ కారణములవల్ల కంచినుంచి కామకోటిపీఠం కుంభకోణమునకు తరలింపబడినది. అపుడు పీఠముననున్న వారు 62వ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వాములవారు. మఠం కార్యక్రమములూ బాధ్యతలూ క్రమేణా వృద్ధిపొందినవి.మఠం చిన్నదికాదు. పైగా ఆధ్యాత్మికంగానూ, ధార్మికంగానూ పీఠము ఖర్చు చేయుటకొరకు దానముచేయబడిన ఆస్తుపాస్తులు ఎన్నోవున్నవి. దాని ఆధిపత్యం వహించడం అంత సులభ##మైన విషయముకాదు. ఆధ్యాత్మిక పరిపాటవంతోబాటు యాజమాన్యకుశలత, ధీసంపదా మఠాధిపతికి అత్యవసరం.

శ్రీ స్వామినాథను పితామహులు శ్రీ గణపతిశాస్త్రి 1835 నుండి సుమారు యాభై సంవత్సరములు సర్వాధికారిగా మఠంలో ఉన్నారు. వీరికాలంలో మఠవ్యాప్తి అతివేలంగా జరిగినది. మఠానికి స్థిరాదాయ ప్రపత్తులు వీరికాలంలో ఏర్పడినవి. వీటినన్నిటినీ అవగాహన చేసుకోవడానికి శ్రీచరణులు మఠానికి ప్రధానస్థలమైన కుంభకోణం వెళ్ళవలసి వచ్చినది.

1907లో తిండివనములో మూడురోజులు ఆగి శ్రీచరణులు కుంభకోణం వెళ్ళారు.

తిండివన గ్రామస్థులకు స్వామి రాక ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. స్వామినాథనుతో కలసి చదువుకొన్న విద్యార్ధులు, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీవారి దర్శనార్ధం వచ్చారు. వారితో సంభాషించారు. మొన్న మొన్నటివరకు తమ సహాధ్యాయుడుగా ఉండిన బాలుడు ఈరోజు సన్యాసిగా మఠాధిపతిగా రావటము, వారికి ఆనందమూ ఆశ్చర్యమూ కలిగించింది.

తిండివనం నుంచీ బయలుదేరి కుంభకోణము 9-5-1907న చేరుకున్నారు. ప్లవంగ చైత్రమాసములో గురువారం. మఠాధిపత్యం వహించిన సన్యాసులను, సార్వభౌములుగా పరిగణించడం మనదేశంలో పరిపాటి. వారికి రాజలాంఛనములు ఉంటవి. ఏనుగు అంబారీలు, ముత్యాలపల్లకి, శ్వేతచ్ఛత్రము, చామరములు- పరిచారకులు- భక్తులైన శిష్యకోటులు మఠానికి పరికన్పిస్తారు.

మఠానికి క్రొత్తగావచ్చిన శ్రీవారికి తగిన మర్యాద, ఉత్సవం- ఉత్సాహంగా జరపడానికి అందరూ పూనుకొన్నారు. పట్టాభిషేకోత్సవానికి, శివాజీరాణులు- మహారాణి జీజాంబాబా సాహెబా. మహారాణి రామకుమారాంబాబా సాహెబా వివిధ వస్తుసామాగ్రి చయమునూ,సంభారాలనూ పంపారు. అన్ని దేవాలయాలలోనూ విశేషపూజలు కావింపబడినవి. వాసనలు గుబాళించే మల్లెలతోబాటు అభిషేకం జరిగింది. మొదట బంగారు కామాక్షి, కామాక్షి, అఖిలాండేశ్వరీ ఆలయముల పక్షములో వచ్చిన తత్తవృతినిధులు ఈ అభిషేకాన్ని నిర్వర్తించారు. తర్వాత తంజావూరి రాజకుటుంబం, ఎందరో జమీందారులు, సంపన్న గృహస్థులు- వారి ప్రతినిధులు, ఈ ఉత్సవ కోలాహలంలో పాల్గొన్నారు.

పీఠాన్ని అధిరోహించి, ఆచార్యులు అందరినీ ఆశీర్వదించారు. ఆరాత్రి తంజావూరి రాజవంశము వారు పంపిన ఏనుగుపై బంగారు అంబారీతో శ్రీవారికి ఊరేగింపుటుత్సవం అతివైభవంగా జరిగింది. ఆనాటినుండి శ్రీవారి ధర్మపాలన, లోకోద్ధరణ, సనాతన ధర్మప్రబోధనం ప్రారంభ##మైనది.

Maa Swami    Chapters