Maa Swami    Chapters   

2. శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు

జగద్గురు అవతారము

-బాలకృష్ణ.

త్రయీ తనువని సూర్యునికి పేరున్నది. అత్యున్నత తారాపథంలో కోటానికోట్ల

మైళ్ళదూరంలో ప్రకాశిస్తున్నా తన కిరణాలను ఎంతదూరమైనా క్రిందికి ప్రసరింపజేసి చేతన పదార్ధల కెల్ల ఉత్తమశక్తిని ప్రాసాదించే లోకరక్షకుడై, కర్మసాక్షియైన సూర్యుడు పరంజ్యోతిస్వరూపుని కభిన్నుడు, కాన అతనిని వేదస్వరూపునిగా విజ్ఞులు ఉపాసించడం యుక్తమేకదా! అదేవిధంగా సనాతన బ్రహ్మస్వరూపమే యైన ఆత్మను జ్ఞానాగ్ని దగ్ధకర్ములై, కఠోర తపశ్చర్యానిరస్త సమస్తవాసనా సందోహులై సచ్చిదానంద స్వరూపంగా ప్రజ్వరిల్లజేసికొని- తమ హృదయాన్ని లోకులను రక్షించుచున్న సనాతన ధర్మమనే మాతృరూపంగా వాత్యల్య పరిపూర్ణం గావించుకొని- లోకోజ్జీవనమే తమ కర్తవ్యంగా చేపట్టిన మహనీయులకు వేదస్వరూపులని యారాధించడం మన కర్తవ్యం.

అవిచ్ఛిన్నంగా అట్టి మహనీయులను గాంచి, పుణ్యసంతతిని పండించుకొనుచున్న భారతావనిలో దక్షిణభాగంలోని విళ్ళుపురంలో నిప్పటికి డెబ్బదిరెండేళ్ళకు మునుపు- అనగా జయనామసంవత్సర సౌరమాన వైశాఖమాసమున 8వ తేదీన అనురాధా నక్షత్రంతోకూడిన 1894 మే 20వ తేదీన సనాతన ధర్మ పరాయణులైన పుణ్యదంపతుల పునీత గర్భంలో విజ్ఞానభాస్కరు డుదయించెను. కాదు-- ఆద్యంతరహితమై ప్రకాశించు బ్రహ్మము కరచరణ్యావయవములతో నొక దివ్య సౌందర్యరూపము దాల్చి తన్ను ధన్యునింజేయదోచిన వింతను మానవుడానాడు కన్నులార గాంచెను. ఆ బ్రహ్మకిశోరమునకు తల్లిదండ్రులు ''స్వామినాథు'' డని పేరిడిరి. లోకమర్యాద ననుసరించి స్వామినాథుడు పాఠశాలలో జేరి తన అనితర సాధారణ మేధావిలాసముచేత ఉపాధ్యాయులను ముగ్ధులంగావించెను. అన్ని మతములు, అన్ని భాషలు ఒక బ్రహ్మమునే ఉపాసించ విభిన్న మార్గములన్న సత్యమును లోకులకు జాటుటకు కాబోలు స్వామినాథుని విద్యాభ్యాసము క్రైస్తవులచే నడుపబడుచున్న ఆంగ్లపాఠశాలలో ప్రారంభ##మైనది. ఆ కాలంలో కింగ్‌జాన్‌ నాటకమున వీరు ''ప్రిన్సుఆర్ధర్‌'' పాత్రను నిర్వహించిన విశిష్టతచే ఆ పాత్ర ప్రశంశనీయత గాంచినదన్నది అతిశయోక్తి కాదు.

వీరి పవిత్ర జీవితంలో 1907 ఫిబ్రవరి 13వ తేదీ యత్యంత ముఖ్యమైనది. ఆనాడే వీరు తమ యవతార ప్రయోజనమును క్రియారూపమున నిర్వహింప దీక్ష వహించిరి. ఆ కాలములో శ్రీకాంచికామకోటి పీఠాధీశ్వరులై వెలసియుండిన స్వాములవారు ఉత్తరార్కాటుజిల్లాలోని కలవైకి విజయము చేసియుండిరి. వారు తమ సన్నిధికి తండ్రివెంట నరుదెంచిన స్వామినాధుని వీక్షించి తనయనంతరము పీఠము నధిరోహింప శ్రీకామాక్షీదేవియే పుంభావమున కిశోరరూపమున దోచినదని యూహించి యుప్పొంగిరి. ఆసందర్భంలో నొకనాడు స్వాములవారు తాము సిద్ధిపొందవలసిన కాల మత్యంత సన్నిహితమైనదని తెలిసికొని వెంటనే తన్ను జూడరమ్మని స్వామినాథునకు వార్తనంపిరి. కాని, ఆహ్వానము స్వాములవారి కందులోపల కార్యముమించి, మరోకబాలుని పీఠమున నిలుపవలసి వచ్చినది. దైవచిత్రమేమొకాని ఆ బాలుడును ఎనిమిది దినములు మాత్రమే పీఠాధిపతిగా నుండి ముక్తుడయ్యెను. ఆ సందర్భమున 1907 ఫిబ్రవరి 13వ తేదీన పరాభవనామ సంవత్సర మార్చినెల 2వ తేదీన స్వామినాథుడు తనపదమూడవయేట పీఠము నధిరోహించి, 'చంద్రశేఖర సరస్వతి' యను దివ్యనామముతో విరాజిల్లుచు, నదిమొదలు నిర్విరామముగ లోకుల ధర్మవర్తుల గావించి, కృతకృత్యుం గావించుచు వెలయుచున్న తీరు జగద్విఖ్యాతము. వీరు అసేతుహిమశైలము దిగ్విజయయాత్ర గావించి యవాజ్యప్రేమచే లోకుల చిత్తములను జూరగొనుచు అసంఖ్యాకులగు భారతీయుల కర్తవ్యపరాయణుల గావించిరి.

మత సిద్ధాంతముల తర్కశాస్త్రరీతిని విపులీకరించి శ్రోతల మనిశ్కముల జటిల సమస్యలతో నింపుటగానీ తనకు నచ్చిన దొక్కటే తరుణోపాయామని సిద్ధాంతీకరించుటగానీ, శ్రీవారి విధానముకాదు. తన్నుజేరిన వారి యార్తి యెట్టిదో గుర్తించి తదనుగుణముగ చికిత్స గావించు ఉత్తమ భిషగర్వునివలె సంశ్రితుల సంస్కారబలమును గుర్తించి తదనుగుణముగ కర్తవ్య పథమును నిర్దేశించి వారల చరితార్ధుల గావించుట శ్రీవారి విశిష్టత. శ్రీవారి యుపన్యాసములు ఆలకించువారి మేధాశక్తిని పరీక్షించు నవికాక, వారి హృదయముల బలకింపజేసి ధర్మభరితుల గావింపగల ప్రభావముతో గూడినవై యుండును. ఆలకించు ప్రతివ్యక్తియు తన్నుగురించియే యా యుపదేశములు గావింపబడుచున్నవను విశ్వాసము గలిగి, క్రియాశూరుడు కాగలుగునట్లు చేయ సమర్ధములై యుండును. ఆశ్రయించిన వారెవరైనను ఆత్మబంధువను నమ్మకము బుట్టించి వారు తమ కష్టసుఖములను చెప్పుకొనగా చెవియొగ్గి విని, యుపశమనోక్తులతో హితము నుపదేశించి, పరమాప్తులై వెలయు కరుణామూర్తి శ్రీవారు. ఏమూల ఏ ధర్మ మభివ్యక్తమైనను దానిని తన ప్రభావముచే నుద్దీప్తము గావించు ఉత్తమశీలము శ్రీవారిది. ఇటీవల చెన్నపురివీథిలో విపన్నులై పడియున్న వారలను చికిత్సా లయమునకు చేర్చి కాపాడి మానవధర్మమును పాటించిన వనిత లక్ష్మికి శ్రీవారు విశ్వప్రేమతో పరిపూర్ణమైన బిందెను ప్రసాదించుటను జూడగ- ఎక్కడ ఏ పైరున కెంత నీరు కావలెనో యంత వరకు తానై ప్రవహించి యాపైరు రక్షింపబూను మందాకినీ ప్రవాహమువలె శ్రీవారి కరుణయును వెల్లువయు తనంత తాను విశ్వమందన్నియెడల వ్యాప్తించుచు ధర్మమను పంటను పండించుచున్నదనుట యతిశయోక్తి కాదు. ఒక భారతీయుడేమి? ఏ విదేశీయుడైన, ఏ మతావలంబకుడైన శ్రీవారిని దర్శించు భాగ్యమబ్బినపుడు స్వమతసిద్ధాంతఫలమును వీక్షింపగలిగితి నన్న విశ్వాసముతో హృదయపూర్వకముగా నభివాదన మొనర్చుననుటకు ఆయాసందర్భములలో విదేశీయులగు ప్రముఖులు శ్రీవారిని సందర్శించి ముగ్ధులై గావించిన ప్రకచనే ప్బల నిదర్శనములు. ''పోపు'' మనదేశానికి విజయము చేసినపుడు అన్యమతాధిపతికి భారతీయులవసతి గల్గింపవలదనుచు శ్రీవారు మనదేశీయుల కందించిన సందేశము శ్రీవారి విశాల హృదయమునకు, విశ్వమానవ సౌహార్దమునకు, సర్వమత సమానపరాకాష్ఠకు నిదర్శనము కాక మరేమి?

శ్రీవారు అపుడపుడు లోకులకు గావించిన యుపదేశముల సారాంశ మిదియే- ''ఒక బ్రహ్మమే మూడుగను, ముప్పదిమూడుగను, ముప్పదిమూడు కోట్లుగను, అసంఖ్యాకముగను భాసించుచున్నది. విశ్వములో అత్యున్నతము, శ్రేష్ఠతమము మగునది సత్యం-శివం-సుందరము నగు పరతత్త్వమే. ఆ సత్యస్వరూపాన్ని గుర్తించి యందుకోగలుగుటకే ఈ లోకములో ఇన్ని సంప్రదాయములు, ఇన్ని మతములు ఏర్పడియున్నవి. పరతత్త్వమునెడ విశ్వాసము నుద్భోధింపని మతము లేదు. అఖిల విశ్వములకు దివ్యచైతన్యము నొసంగు పరాత్పరు డొక్కడే యుండగా అన్నిమతముల లక్ష్యము నొక్కటి యేయని తెలియవచ్చునుగదా! తమ సమకాలీనుల సంస్కృతి, మనఃపరిపక్వత, వాసనాబలములను గుర్తించి మతాచార్యులు కాలానుగుణముగ మత సిద్ధాంతములను, అనుష్ఠానములను రూపొందించిరి. సూక్ష్మముగా బరిశీలించు విజ్ఞులకు వారి 5 సిద్ధాంతములు పరస్పర విరోధములు కావని తెలియవచ్చును. ఆ సిద్ధాంతములలోని సామరస్యమును గుర్తింపజాలని మితప్రజ్ఞులగు ఆయా మతావలంబకుల దృష్టి విమర్శలోపముల వలననే తమమతమే గొప్పదను సంకుచిత మనస్తత్వము వ్యాపించినది. ఏ మతమువారైనను పరుల విమర్శింపక తమ మత ధర్మనిష్ఠాభిరతులై ప్రవర్తించుటొక్కటే తరుణోపాయము. అట్టివారు స్వధర్మమున నెంత విశ్వాసము శ్రద్ధ కలిగియుందురో పరమతము నెడ నంత సహనభావమునను గలిగియుందురు. ''దైవమును గుర్తింపుమని'' బోధించు మత మేదైనను దానిని వదలి నామతము నవలంబింపుమని నితరునకు ఉపదేశించినచో దైవమును విస్మరింపుమని నిర్బంధించుటయే యగునుగదా. కాన తమపూర్వుల అడుగుజాడలలో నడచుటే ప్రతివానికి స్వధర్మము. పరమాత్ముడు సత్యస్వరూపుడు కాన సత్యమును బాటింపనివాడు దైవ స్వరూపమును గుర్తింపజాలడు. తితిక్ష, ఐహిక సుఖములలో సంయమనము, నిర్మలచిత్తము, ధర్మాభిరతి, జీవితలక్ష్య సాధనమున పరమోత్సుకత, స్వధర్మానుష్ఠానమువలన కలుగు మనోవికాసము, పరులు తనకు గావించు అపకారముల మన్నింప సమర్ధమగు క్షమాశీలము, మనోవాక్కాయములను-- తన సంపదలను ధర్మసంవర్ధనముననే వినియోగింపవలెన్నన జాగరూకత అనునవి మానవు నభ్యుదయ పథగామి గావించు నుత్తమ గుణములు. బాహ్యజీవితమునకు వలసిన పరికరముల 6 సేకరించుటలోనే కాలమెల్ల గడవక ప్రతివ్యక్తియు ఆత్మ శ్రేయమును బడయుటకు కొంత యవకాశమును కల్పించు కొని సాధనపరుడు కావలెను. వ్యాధికి తగిన ఔషధమన్నట్లు వారివారి వాసనా సంస్కృతుల కనుగుణముగ అనుష్ఠానము లేర్పడియున్నవి. వానిలో హెచ్చుతక్కువలు లేవు. తమకేది యుపయుక్తమో ఆ యనుష్ఠానమున పరిపూర్ణ శ్రద్ధ వహించుటయే ఉత్తమోత్తమమైనది. అనాదిగా వెలుగు భాస్కరునిలో ప్రాత కొత్తలు లేవు. అట్టిదే ఆర్యధర్మము. బాహ్య జీవనోపయుక్త సాధనములలో మార్పుదెచ్చు నేటి విజ్ఞానశాస్త్రము ఎంత యభివృద్ధి పొందినను నిత్యమై, సత్యమై, నాదియై పరిపూర్ణమునై యున్న ఆత్మతత్వమును వివరించు సిద్ధాంతములుగాని, ఆత్మసముద్ధరణోపాయములు గాని, ఎన్నటికిని కుంఠీభూతములు కాజాలవు. అందలి యధార్ధతను గుర్తింపజాలని బలహీన మనస్సుల కందలి ప్రభావ మందరాకుండుట వస్తులోపముకాదు--దృష్టిలోపము. కాన ధార్మికప్రవర్తన మొక్కటే మానవాభ్యుదయమును జేకూర్చుననుట ఆమోఘ సత్యవచనము''.

విశ్వమానవ కళ్యాణమున కనవరతము నిట్టి సదుపదేశముల మూలమున ధర్మానుష్ఠానముల పరివృద్ధి నందిపజేయుచు నుద్దీపించు శ్రీవారి దివ్యమంగళవిగ్రహము భారత ధర్మ పరమేశ్వర మకుటాలంకార మగు ఆవక్రచంద్రరేఖ- శ్రీవారి యవ్యాజ కరుణాపరి పూర్ణ హృదయము సర్వ మంగళయగు జగన్మాతృ స్వరూపము. శ్రీవారి సంకల్పము ఆర్ష ధర్మమునకు శ్రీరామరక్ష. శ్రీవారి ముఖమున దోచు మందహాసము అంతర్గప్త బ్రహ్మతేజో విలాసరేఖ. శ్రీవారి పలుకులు ఉపనిషత్సారామృతమున దోచి ధర్మదేవత తనవత్సలుల కందించు నన్నంపు ముద్ద. శ్రీవారి కటాక్షము పురాకృత పుణ్యఫలము. శ్రీవారి శ్రీచరణములు ధర్మమార్గప్రవర్తకుల కాదర్శము.

Maa Swami    Chapters