Maa Swami    Chapters   

5.శ్రుతి బోధించిన అద్వైతం

అద్వైత సిద్ధాంతమును బోధించే గ్రంథములలో ముఖ్యమైనది. 'ప్రస్థానత్రయం'- అనగా గీతా భాష్యం, ఉపనిషద్భాష్యం, సూత్రభాష్యం. ఈ మూడూ అద్వైత సిద్ధాంతానికి ఆధారం.

ఈ మూటిని శంకరభగవత్పాదులవారు వ్రాశారు. వీనితోపాటు అనేక ప్రకరణగ్రంథాలు కూడ వారు వ్రాశారు. ప్రకరణగ్రంథాలలో 'వివేకచూడామణి' ఒక ప్రత్యేకస్థానం సంతరించుకొన్నది. ఇవేకాక ఆచార్యపాదులు శివస్తోత్రములు, విష్ణుస్తోత్రములు, దేవీపరములయిన స్తోత్రములు 'ప్రపంచసారము'- అనే మంత్రశాస్త్రము వ్రాశారు.

ఆచార్యుల గ్రంథములలో ముఖ్యమైనది బ్రహ్మసూత్ర భాష్యము. ఇది వ్యాసభగవానులు దశోపనిషత్తులను సూత్రబద్ధము చేసిన బ్రహ్మసూత్రములకు వ్యాఖ్య. ఆచార్యుల సూత్రభాష్యమునకు కూడ అనేక వ్యాఖ్యలు ఉన్నాయి. ఆచార్యుల ముఖ్యశిష్యులలో ఒకరయిన పద్మపాదులు 'పంచపాదిక' వ్రాయగా దానికి వివరణాచార్యులు 'తత్త్వదీపనము' అనే మరొక వ్యాఖ్య వ్రాశారు. వాచస్పతిమిశ్ర 'భామతి' వ్రాయగా భామతికి అమలానందులు 'కల్పతరువు' అనే వ్యాఖ్య వ్రాశారు. ఈ కల్పతరువుకు అప్పయదీక్షితులు 'పరిమళము' అనే వ్యాఖ్య వ్రాసినారు. కల్పతురువునకే 'అభోగము' అని లక్ష్మీనరసింహవాజపేయుల వ్యాఖ్య ఒకటి ఉన్నది. ఇదొక పరంపర.

భగవత్పాదుల సూత్రభాష్యమునకు రామానందులు వ్రాసిన 'రత్నప్రభ' అనే వ్యాఖ్య కూడ ఒకటి ఉన్నది. ఆచార్యుల శిష్యులైన ఆనందగిరి వ్రాసిన 'ఆనందగిరీయము' అనే వ్యాఖ్య, త్ర్యంబక భట్టాచార్యులు వ్రాసిన భాష్యభానుప్రభ, మహారాష్ట్రీయుడైన రఘునాథసూరి భాష్యములోని ఒక పాదమునకు వ్రాసిన 'శంకరపాదభూషణము'- అనే వ్యాఖ్య-ఇట్లు వ్యాఖ్యలు అనేకములు వెలసినవి.

ఉపనిషత్తులలో బృహదారణ్యక తైత్తిరీయములకు- సురేశ్వరాచార్యులు వార్తికములను వ్రాసి వార్తిక కారులన్న బిరుదు నందుకొన్నారు. ఆచార్యుల గీతాభాష్యమున కయితే పది వ్యాఖ్యానాలున్నాయి. ఇవన్నీ అద్వైతసిద్ధాంతమును తెలిపే గ్రంథాలు.

ద్వైతమతానుసారం మధ్వాచార్యులవారు బ్రహ్మసూత్రములకు ఒక భాష్యము వ్రాశారు. దానికిన్ని అనేక వ్యాఖ్యలున్నాయి. ఇవన్నీ అద్వైతసిద్ధాంతాన్ని ప్రతిఘటించే వ్యాఖ్యలు. వానిలో 'న్యాయామృతం' ఒకటి. న్యాయామృతాన్ని ఎదురుకొంటూ మధుసూదన సరస్వతులు 'అద్వైతసిద్ధి' అనే గ్రంథం వ్రాయగా దానిని ప్రతిఘటిస్తూ ద్వైతమతానుసారియైన 'తరంగిణి' అనే పుస్తకం మరియొకటి వెలిసింది. తరంగిణికి వ్యతిరేకంగా గౌడదేశీయులైన బ్రహ్మానందులు 'చంద్రిక'-అనే పుస్తకం వ్రాశారు. దీనినే 'గౌడబ్రహ్మానందీయము' అని కూడ వ్యవహరిస్తున్నారు. ఈ గ్రంథమును ఆక్షేపిస్తూ వనమాలమిశ్రులు 'వనమాల మిశ్రీయం' అని ద్వైతమత ప్రతిపాదన చేస్తూ ఒక ఖండన వ్రాయగా- దానికి వ్యతిరేకంగా 'భాష్యభానుప్రభ' వ్రాసిన త్ర్యంబకభట్టాచార్యులే 'సిద్ధాంత వైజయన్తి' అనే మరొక ఖండనగ్రంథం వ్రాశారు.

దాదాపు తొంభైఏళ్ళక్రితం విశిష్టాద్వైతం పాటించే అనంతాళ్వార్లు అనే ఆయన పైనచెప్పిన గౌడబ్రహ్మానందీయాన్ని ఆక్షేపిస్తూ 'న్యాయభాస్కరం' అన్న పుస్తకం వ్రాయగా దానిని ఖండిస్తూ అప్పయదీక్షితుల వంశమునకు చెందిన రాజశాస్త్రులు అనే ఆయన 'న్యాయేందు శేఖరము' అనే పుస్తకమొకటి వెలికి తెచ్చారు. ఇట్లు ద్వైతమత ఖండనంలో 'సిద్దాంత వైజయన్తి' విశిష్టాద్వైత ఖండనంలో 'న్యాయేందు శేఖరము' కట్టకడపట వెలసిన గ్రంధాలు. మతంలో ప్రవేశమున్నవారు తమ మత గ్రంధములను చదువుటయే కాక తమ మతమును ఖండిస్తూ ఇతరులు వ్రాసిన ఖండన గ్రంథములను కూడ చదువుట మనదేశంలో పరిపాటి. అభిప్రాయభేదాలను అర్ధం చేసుకొంటేకాని మన లోటుపాట్లు తెలియవుకదా! అందుచేత ఈ సాంప్రదాయము సునిశిత విమర్శకు దోహదకారి కనుక ఆచరణీయమైనది.

ఇట్లు మనకు అద్వైతమత ప్రతిపాదనచేసే పుస్తకాలు ఇన్ని వున్నాయి. కాని మనలో చాలమందికి ఇవి ఉన్నవన్న విషయం కూడ తెలియదు. ఏ పుస్తకము దేనికి ఆధారము? అన్న విషయమూ తెలియదు. కనీసం పేర్లైనా గుర్తుపెట్టుకుంటే, వానిని చదవాలన్న కోరిక ఎప్పుడైనా కలుగవచ్చు. శాస్త్రములు చదివిన పండితులెవరైనా మనకు చెప్పవస్తే వారిమాటలు చెవియొగ్గి వినే అలవాటు మనకులేదు. అశ్రద్ధ ఎక్కువ. మనదేశం ప్రపంచంలో ఒక గౌరవస్థానం గడించుకొన్నదంటే ఎంతమంది మహనీయులో ఈ దేశంలో పుట్టి తత్త్వాన్వేషణపరులై అనుభూతిని తాము సాధించుటయేకాక ఇతరులకు సైతము అభ్యుదయపథమును చూపించుటయే కారణం. అట్టి గౌరవకారణమైన ఆత్మవిద్యాబోధకమైన శాస్త్రపరిశీలన మనం విస్మరించుట ఎంతో గర్హింపదగిన విషయము.

సరి! అద్వైతం అద్వైతం- అని అంటున్నాము కదా! అద్వైతం అంటే ఏమి? అద్వైతం అంటే రెండవవస్తువు లేదు అని అర్ధం. రెండవవస్తువు లేకపోతే ఈ కనపడేదంతా ఏమిటి? ఇవన్నీ ఉండగా ఇవన్నీ లేవు అనుకొనుటలో మనకు కలిగే లాభం ఏమిటి? లోకంలో మనం దేనిని అర్ధించి పాటుపడతామో దానినే మనం సాధిస్తాం కదా! ప్రస్తుతం మనం దేనికోసం పాటుపడుతున్నాం?

జీవితంలో మనలను ఎదురుకునే కష్టపరంపరకు అంతులేకుండా ఉంది. అనుక్షణము అగచాట్లే. ఆకలి, అవమానం, వ్యాధి, వ్యవహారం, కష్టం, కన్నీరు- ఇట్లు 'లోకం శోకహతం చ సమస్తం'- అయి వున్నది. ఈ కష్ట నివారణకు ఉపాయాలు వెదుకుతూనే ఉన్నాం. లౌకికప్రయత్నాలచేత తాత్కాలికోపశమనమే కలుగుతూ ఉన్నది. వ్యాధి వచ్చినదని మందు పుచ్చుకుంటే దానిస్థానే మరియొక వ్యాధి వచ్చి కూర్చుంటూ ఉన్నది. మరి ఈ మందువల్ల లాభం ఏమిటి? దుఃఖాన్ని దూరంచేసే మందు ఏదైనా ఉన్నదా?

'దేహధారులము కాబట్టి ఈ కష్టాలన్నీ వస్తున్నాయి-' అని అంటే దేహధారణకు కారణం మనం చేసుకునే పాపపుణ్యాలు. ఆత్మకు అనుభవం లేదు. అది ఒక దేహం ధరిస్తేకాని ఈ పాపపుణ్యాలను అనుభవింపలేదు. పాపపుణ్యాల ఫలితంగా దేవుడు ఒకదేహం మనకు ఇచ్చి, ఆ శరీరముపై తగని వ్యామోహము కలుగజేసి దానినే 'నేను' అని మనచేత భ్రమింపచేసేటట్టు ఉన్నది. మనం చేసే పాపాలకు ఈశ్వరుడు శరీరం ఇస్తున్నాడు. శరీరాన్ని ఇచ్చి శిక్షిస్తున్నాడు. ఇక పాపం చేయకుంటే శరీరం మళ్ళారాదు. పాపం చేయరాదనే స్మృతి మనకు ఎప్పుడూ ఉంటేకాని పాపాచరణనుండి మనం తప్పించుకోలేము.

పాపం చేయకుండ ఉండాలని ఇచ్ఛ ఉన్నా పాపాచరణకే ఎందుకు పూనుకొంటున్నాం? ఇష్టములేకున్నా చేతకావటంలేదే! ఎందుచేత? చెడ్డపనులను చేయుటయే పాపం. చెడ్డపనులను మనం విధిగా చేస్తున్నాం. ఎందుచేత? ఒక వస్తువుపై ప్రీతిగొని తత్ప్రాప్తికై మనం దేనికైనా తెగిస్తున్నాం. ఇట్లు ఆశ పాపకారణం అవుతూ ఉన్నది. ఒక వస్తువు అందంగా ఉన్నది. అందుచే దానిమీద ఇచ్ఛ. మనోహరములైన వస్తుతతులు మనలోని తృష్ణాజ్వాలను రగిలిస్తున్నది. ఒక వస్తువు అందంగా ఉన్నది అని అనుకోవటంచేత ఆశ పుట్టుతూ ఉన్నది. ఈ ఇచ్ఛను ప్రభవింప జేయనూవచ్చు. పరివర్తితమూ చేయవచ్చు. కాని జ్ఞానం అట్లు రాదు. మనం చేసే పాపాలకు ఈ శరీరం ఒక శిక్షగా ఉన్నది. గనుక ఆశానివృత్తికి దుఃఖనివృత్తి జరుగుతుంది. ఆ ఆశానివృత్తికి దుఃఖనివృత్తికి మార్గం ఏమిటి? ఇతరశాస్త్రాలు ఈ ప్రశ్నకు జవాబు చెప్పక వదిలివేశాయి. వేదాంతం అట్లా వదలక దుఃఖనివృత్తికి మార్గం చూపుతూ ఉన్నది.

ద్వేషం కాని, ఆసక్తికాని మనకు అన్యమైన విషయాలపైననే కలుగుతూ ఉన్నది. మనపై మనకే ద్వేషముకాని ప్రీతికాని కలుగుటలేదు.

ఇతరవస్తువుల యందే ఆశ కలుగుతూ ఉన్నది గనుక ఆ ఇతరములనే 'మనము' గా చేసివేస్తే ఆ ఆశ కలుగదు కదా! మనకంటే ఇతరము లేకపోతే అంతా మనమే అయిపోతే ఆశ##లేదు. ఆశ##లేని కారణంగా యత్నమూ లేదు. ప్రయత్న పూర్వకమైన పాపమూ లేదు. పాపము లేనందున దేహము, దేహము లేనందున దుఃఖము లేవు. మనంచేసే ప్రయత్నాలన్నీ దుఃఖం లేకుండా ఉండాలనే కదా! #9;

'రెండవది'- అని ఒకటి ఉంటే అది మనకంటే శక్తివంతమైతే దానిని చూచి మనకు భీతి కలుగుతూ ఉన్నది. అది అందంగా ఉంటే మనం దానికొరకు అర్రులు చాస్తున్నాం. రెండవవస్తువు అనేదే లేకుంటే ఆశ##లేదు, ద్వేషమూలేదు, భయమూలేదు. రెండవవస్తువు ఉంటేనే భయము. అందుచేత రెండవవస్తువు లేకుండా చేస్తుంది అద్వైతం. రెండవది అని లేకపోతే భయం పోతూ ఉన్నదని ఉపనిషత్తులు అంటున్నాయి.

'ప్రపంచంలో ఇన్నివస్తువులను ఇంతమంది జనులను ఒకటిగా చూచుట ఎట్లు?' అంటే ఇన్ని వస్తువులను చూస్తున్నావు. కదా! ఇదంతా కల్ల. 'నీవు చూచేదంతా ఈశ్వరస్వరూపం'- అని వేదాంతం చెపుతూ ఉన్నది. కాని మనకు అట్లు తోచుటలేదు. అంతా ఈశ్వరస్వరూపం అనుటయే నిజమైతే మనకు తోచినది కల్ల. మనకు తోచునదే నిజమైతే మనకు కష్టం రారాదు. కాని కష్టాలు, సుఖాలు, దుఃఖము, సంతోషము కలుగుతూనే ఉన్నాయికదా! అందువలన వేదాంతం చెప్పేదే నిజం. అదే నిజమైతే చూచేదంతా ఈశ్వరస్వరూపమే అన్న జ్ఞానం మనలో రూఢం కావాలి.

సత్యమైన వస్తువు ఒకటి ఉన్నది. కల్ల వస్తువులను మన కన్నులు చూస్తూ ఉన్నాయి. 'లోకమంతా సత్యమైన వస్తువు'- అని అద్వైతం చెప్పుతూ ఉన్నది. మనకు నానావస్తువులుగా కనబడేది అంతా కల్ల. సత్యమైన వస్తువు ఒక్కటే సత్యం. ఆ సత్యమే ఈశ్వరుడు. అంతా ఈశ్వరుడే అయితే మనము మాత్రము వేరా? మనలను కూడ ఆ ఈశ్వరునిలో కలుపుకొనాలి. అప్పుడు రెండవవస్తువు లేదు. మనదృష్టి ఎప్పుడూ వేర్వేరుగా ఉంటూ ఉన్నది.అంతా ఈశ్వరమయంగా చిన్మయంగా చూచుటయే సత్యదృష్టి. ఆ అద్వైతదృష్టి అలవరచుకొన్ననాడు మన కందరకు ఆనందమే కలుగుతుంది.

జాగ్రత్‌-స్వప్న- సుషుప్తులను అవస్థాత్రయం అని అంటారు.జాగృతిలో అనేక కార్యాలను చేస్తున్నాం. ఈ కార్యాలు శ్రమను కలిగిస్తున్నాయి. శ్రమ నివారణకు నిదురపోతూ ఉన్నాం. అదే సుషుప్తి. ఈ రెంటికీ మధ్య స్వప్నావస్థ ఒకటి ఉన్నది. ఈ స్వప్నావస్థ ఎందుకు? ఈశ్వరుడు అద్వైతబ్రహ్మగా ఉంటున్నాడు. అంతా ఆత్మస్వరూపమే అని నిరూపించుటకే ఈశ్వరుడు స్వప్నమును కల్పించినట్లు తోస్తుంది. స్వప్నంలో ఎన్నో కష్టాలు సుఖాలు అనుభవిస్తూ ఉంటాము. ఆ స్వప్నం చెదిరిపోతే ఏదీ మిగులుటలేదు. కడకు స్వాప్నిక శరీరము కూడ మిగులుట లేదు. 'కల కన్నాను'- అని చెప్పుటకు తగిన ఒక ఎరుకమాత్రము మిగులుతూ ఉన్నది. ఈ ప్రపంచస్వప్నం నుండి మనం మేలుకొన్ననాడు మనకు మిగిలేదు ఆ ఎరుక ఒక్కటే. అదే అద్వైతం. నూర్లకొలది, వేలకొలది అసంఖ్యాకంగా చూచే దృష్టి ద్వైతం. 'చూస్తున్నాము' అని చెప్పుట కూడ ద్వైతమే. మన మందరము ద్వైతులమే. ద్వైతానుభవం మనకు అనుదిన అనుభవముగా ఉన్నది. అద్వైతంలో మనకు నమ్మకమే కాని అనుభవములో ద్వైతస్వప్నాలను కంటున్నాం. ద్వైతం కంటితో చూచేది. శాస్త్రమూలంగా తెలుసుకొనేది అద్వైతం.

'ద్వైతము- అద్వైతము' అనే శబ్దాలు రెండూ ఉపనిషత్తులలో వస్తూ ఉన్నాయి. ప్రణవమును వర్ణిస్తూ మాండుక్యము- 'శాంతం శివమద్వైతం చతుర్ధం మన్యన్తేస ఆత్మా విజ్ఞేయః' అని చెపుతూ ఉన్నది. బృహదారణ్యకములో- 'యత్రహిద్వైత మివ భవతి తదితర ఇతరం పశ్యతి యత్ర త్వస్య సర్వ మాత్మైవా భూత్‌ తత్‌ కేన కం పశ్యేత్‌?' అని ఉన్నది.

ఎప్పుడైతే సర్వము ఆత్మయే అయినదో అప్పుడు అద్వైతమనియు, వేర్వేరుగా కనపడినప్పుడు 'ద్వైతమివ' ద్వైతమువలె ఉన్నదనియు ఉపనిషత్తు చెప్పుచున్నది. 'వాడు రామునివలె ఉన్నాడు'- అంటే వాడు రాముడు కాడని అర్ధం. 'ద్వైతమివ'- అని అనుటలో అంతరార్ధము ఇదే. ద్వైతం సత్యం కాదు. ఇవన్నీ ద్వైతమువలె కనపడుతూ ఉన్నాయి కాని నిజమునకు అద్వైతమే సత్యం. అదే సిద్ధాంతం. సర్వమూ ఆత్మ అనుటయే యదార్ధం.

ఇక్కడ 'ఆత్మ' అని కదా ఉన్నది. పరమాత్మ అని ఉండవలదా? అని ప్రశ్న వేయవచ్చును. పరమాత్మ అని ఒకటి ఉంటే అల్పాత్మ అని మరియొకటి ఉండాలి. అవేమీ లేవు. ఉండేది ఒక్కటే ఆత్మ. జీవాత్మ పరమాత్మలయొక్క ఉనికి ద్వైతములో. అద్వైతములో ఉండేది ఆత్మ ఒక్కటే. 'ద్వితీయాద్‌ వై భయం భవతి'- ద్వైతం వల్ల భయం ఏర్పడుతుంది. కాని అభయదాయకమైనది అద్వైతం.

మనకు సన్నిహితులు, సహచరులు, ప్రియమైనవారు, రక్తం పంచుకొన్నవారు కాలగతి చెందితే ఎక్కడలేని దుఃఖము కలుగుతూ ఉన్నది. ఎదుటివారు చనిపోతే దుఃఖం కాని మనమే పోతే దుఃఖం ఉండదని అనుకొంటాం. ఈ దృశ్యమైన దంతా మనమే అనుకొంటే దుఃఖ మెక్కడ? భేదబుద్ధి ఉన్నంతవరకు దుఃఖం ఉంటున్నది. రెండవవస్తువు ఉన్నదని అనుకొనుటలో ప్రీతి, వస్తుప్రాప్తిలో సుఖము, వస్తు వియోగములో దుఃఖము కలుగుతూ ఉన్నాయి. అన్నీ మనమే అయితే గ్రహించుట దేనిని? విడచుట దేనిని? 'కిం గృహ్ణామి, కిం విసృజామి?' అన్నిటిని ఆత్మగా చూచుటయే అద్వైతము. అదే జ్ఞానము.

ఆచార్యులవారు ఆ పరంజ్యోతివంటి అద్వైతజ్యోతిని వెలిగించి, ద్వైతాంధకారములో చిక్కుకొన్న మనకు వెలుగు చూపుతూ ఉన్నారు. వారు వ్రాసిన భాష్యమునకు 'భాష్యదీపము'- అని ఒక పేరు ఉన్నది. ఏదో 'ద్వైతం' అన్న పదం శ్రుతిలో ఉన్నది కనుక ద్వైతమే నిజమనుట 'న సురాంపిబేత్‌' అన్న నిషేధవాక్యము శ్రుతిలో ఉన్నది కనుక- 'శ్రుతి సురాపానమును విధిస్తూ ఉన్నది-' అనుట వంటిది. మనం ప్రస్తుతం స్వప్నంలో ఉన్నాం. ఈ స్వప్నం నుండి బయటపడితే అది అద్వైతం.

అద్వైతస్థితి- 'యతో వాంచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ' వాక్కుకు మనస్సుకుకూడ అప్రాప్యమైనస్థితి. పరమాత్మను తెలుసుకొనుట అంటే- తెలుసుకొనేవారు ఒకరు, తెలియబడే పరమాత్మ వేరొకటి- ఇలా రెండు ఏర్పడుతున్నాయి. అందులకే కేనోపనిషత్తు. 'యన్మనసా మనుతే యేవాహుర్మనే మతమ్‌'- నాకు తెలియును అనేవానికి అది తెలియుటలేదు. 'తెలియదు'- అనేవానిచే అది తెలియబడుతూ ఉన్నది- అని చెప్పుచున్నది. 'తెలియుటలేదు'- అని అంటే అది తెలియబడే వస్తువుకాదు అని అర్ధం. ఒక దీపమును చూపుటకై మరియొక దీపము నర్ధించుటలో అర్ధములేదు. జ్ఞానం స్వప్రకాశకమైనది. ఆ జ్ఞానము రూపొందితే అదే ఈశ్వరస్వరూపము.

మనస్సుయొక్క సాయంతో దానిని చూడలేము, దాని సాయంతోనే మనస్సు చూస్తూ ఉన్నది. కనుక- 'మనస్సు ఆలోచిస్తూ ఉన్నది' అనుటవలన- దేనిసాయముతో మనస్సు ఆలోచిస్తూ ఉన్నదో అదే సత్యం.

యస్యామతం తస్య మతం మతం యస్యన వేద సః.

-కేనోపనిషత్తు.

స్వప్నంలో చూచేదంతా కల్ల. కలకంటూ ఉన్నాము- అన్న ఎరుక ఉన్నదే! అదే సత్యం. కల మరుగైపోతే అన్నీ మరుగైపోయి ఎరుకమాత్రము మిగులుతూ ఉన్నది. చూడబడువస్తువు, తెలిసికొన్నవస్తువు అని ఉంటే అది ద్వైతమేకాని అద్వైతం కాదు. ఈ విషయమునే ఉపనిషత్తులు నేను ముందు ఏకరువు పెట్టిన గ్రంధావళి చెపుతున్నాయి.

ఉపనిషత్తులు వేదవృక్షము నందు కుసుమించిన సుమములు. ఈ ఉపనిషత్సుమములను వ్యాసభగవానులు 'బ్రహ్మసూత్రములు' అని సూత్రబద్ధం చేశారు. ఈ విషయమై ఆచార్యులవారు ప్రశంసాపూర్వకముగా- 'వేదాంత వాక్యకుసుమ గ్రథనార్ధత్వాత్‌ సూత్రాణాం'- అని ఒకచోట వ్రాశారు. ఈ పుష్పమాలకు తమ భాష్యసౌరభమును జోడుచేసి ఆచార్యులవారు మనకు అందిస్తున్నారు గనుక, ఆ మాల వాడిపోకుండా మన కంఠసీమలో అనవరతము మనం అలంకరించుకొనాలి.

మనము ఇంతసేపూ చర్చించి తెలిసికొన్నదేమంటే 'సత్యమొక్కటే ఉన్నదని' అది ఈశ్వరస్వరూపము. వాసనా బలముచేత దానిని వేర్వేరుగా చూస్తున్నాము అందుచేత అన్నిటిని ఏకముచేసి ఈ 'నేను' అనేదానిని కూడ ఆ ఏకము నందే ఐక్యం చెయ్యాలి. దానికి సాధనములైన శాస్త్ర పరిచయము, మనన నిధిధ్యాసనములు అలవరచుకొనాలి. శ్రుతి-స్మృతి- పురాణపఠనములు, ఆలయదర్శనము, ఉపాసన- ఇవన్నీ దానికి తోడుపడే సాధనాంగాలు. లోకంలో మనము ఎన్నో వస్తువులను త్యాగము చేస్తున్నాము. స్థిరమైన ఆనందము కలుగవలెనంటే త్యాగము అత్యవసరము. జనకుడు-

'విదేహం దదామి మాం చాపి సహదాస్యాయ'

'విదేహ రాజ్యమే కాదు, దానితోబాటు నన్నుకూడ ఇచ్చుకొన్నాను.' అని చెప్పుట ఇదే. అట్టి అద్వైతసిద్ధిని సులభముగా సాధించుట ఎట్లు?

అప్పయదీక్షితులు శివతత్వ విలాసములో ఇలా వ్రాశారు.

ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైత వాసనా,

మహాభయకృత త్రాణాత్‌ ద్విత్రాణా ముపజాయతే.

CaRP*LSƒ«sVúgRix¤¦¦¦ª«sVV DLiÛÉÁ[®ƒs[ NS¬s @\®µ…Q*»R½ªyxqsƒ«s LSµR…V. @LiµR…V¿Á[»R½ A CaRP*LRiV®ƒs[c A ¿RÁLiúµR…ª«s°×dÁaRP*LRiV¬s Fyµy‡êÁª«sVVÌÁ®ƒs[ ª«sVƒ«sª«sVV @\®µ…Q*»R½zqsµôðj… N]LRiNRPV

నమ్ముకొనాలి.

'చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం.'

Maa Swami    Chapters