Maa Swami    Chapters   

18. నమోవాకము

శ్రీమద్‌ భారత కాంచీ

దామాయిత కాంచినగరధామునకు నవి

ద్యామయ హరణ సుధా కల

శీ మంజుల దర్శనునకు సిద్ధపదునకున్‌.

స్మయదూరుకున్‌ నత సం

శయ దళనున కనుపమాన శాంతినిధికి వి

స్మయకారి బోధమతి క

వ్యయ పద వితరణ సమర్థ పాదాబ్జునకున్‌.

దూరీకృత నత చింతా

భారునకు ముముక్ష సేవ్య భవ్య మహో వి

స్తారున కద్వయ పద సం

చారణ శిక్షాపదాన సంవిన్మతికిన్‌.

నత మస్తక తల సంయో

జిత కరతల మాత్రధూత చిరతాపునకున్‌

ప్రతివాది ముఖపిధానా

ప్రతిమాద్వయ వాద వికచ వాగ్వల్లరికిన్‌.

పరమ శమ నిరతునకు శం

కర దేశిక కామకోటి కల్పిత పీఠ

స్థిర మంగళ దీపశ్రీ

చరణునకున్‌ మాదృశ ప్రసన్న శివునకున్‌.

రచయిత

(శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు)

Maa Swami    Chapters