Maa Swami    Chapters   

12. స్వామిబోధలు

స్వాములవారి ఉపన్యాసములు ఆంగ్టములో- Call of Jagadguru, Acharya's Call అని ప్రకటింపబడింది.

తమిళమున కామకోటికోశస్థానము వారునూ, కలైమగళ్‌ కార్యాలయమున్నూ ప్రచురించినవి. ఈ మధ్య దైవత్తిన్‌ కురల్‌ (దైవవాణి) యని శ్రీ రాగణపతిచేత సంకలనము చేయబడి 5 భాగములు వానది వదిప్పగం వారు ప్రచురించారు.

తెలుగులో తమిళ ఉపన్యాసములు విశాఖచే అనువదింపబడి ధారావాహికగా ఆంధ్రప్రభలో తత్కాల సంపాదకులు, శ్రీచరణుల విశేషభక్తులూ అయిన శ్రీయుతులు నీలంరాజు వెంకటశేషయ్యగారిచే ప్రచురింపబడినవి. వీనిని వేలాది జనము చదివి ప్రభావితులయ్యారు. ఈ ఉపన్యాసములన్నీ జగద్గురు బోధలన్న శీర్షికతో పదిసంపుటములుగా సాధనగ్రంధమండలి తెనాలి ముద్రించినవి. ఇవన్నియు మహనీయులు, విద్యానిధులు, శతావధానులు కీ.శే. వేలూరి శివరామశాస్త్రిగారి చేత పరిష్కృతములు.

సాధన గ్రంధమండలి వ్యవస్థాపకులు శ్రీ బులుసు సూర్యప్రకాశశాస్త్రి. వీరు శంకరగ్రంధ రత్నావళి పేరిట శంకర భగవత్పాదుల గ్రంధములనెన్నో- దాదాపు పదమూడు సంపుటములుగా వెలికి తెచ్చారు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధములు- శ్రీ విద్యావదములు, ఇతరములు ఈ మండలి ప్రచురించినది. సారస్వతసేవ చేయుచున్న శ్రీ బులుసు సూర్యప్రకాశశాస్త్రి ఆచార్యుల అనుగ్రహ పాత్రులు, జగద్గురు బోధలవిషయమున వీరుచేసిన కృషి ప్రశంసనీయము. చిరస్మరణీయము.

Maa Swami    Chapters