Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

త్రిపురారహస్యసారమున - జ్ఞానఖండము

ప్రథమాధ్యాయము - విచారోదయము

శ్రీ గణశునకు నమస్కారము

హారితాయనుఁడు నారదునితో నిట్లు చెప్పుచున్నాడు. ఓమ్‌. సర్వమునకు కారణమైనయానందమే రూపముగా గలిగి జగత్తు అను చిత్రముయొక్క ప్రతిబింబమునకు అద్భుతమైన దర్పణమువలె నున్న చిన్మయియైన పరదేవతకు నమస్కారము.

నారదా! పరమార్థసాధనమైన త్రిపురాదేవియొక్క మాహాత్మ్యమును శ్రద్ధతో వింటివి కదా! ఇంక నీకు మహాద్భుతమైన జ్ఞానఖండమును చెప్పెదను. దానిని విన్నచో మనుష్యుఁడు శోకమును పొందఁడు. వైదికము వైష్ణవము శైవము శాక్తము పాశుపతము అని యనేకవిధములుగా నున్న విజ్ఞానము నంతను చక్కఁగా పరిశీలించినతరువాత, ఈజ్ఞానమువలె మనస్సునకు ఎక్కునట్టిది మఱియొకటి లేదని నిశ్చయింపబఁడినది. దానిని భగవంతుఁడైన దత్తాత్రేయుఁడు భార్గవునకు హేతువులతో అనుభవముతో నిరూపించెను. ఇది విన్న తరువాత కూడ ఎవని కైనను జ్ఞానము కలుగకున్నచో వానికి శివుఁడే సాక్షాత్కరించి బోధించినను కలుగదు.

సత్పురుషుల చరిత్రము అద్భుతము. నావలనకూడ దేవర్షియైన నారదుఁడు ఏదో కొంచెము వినఁగోరుచున్నాఁ డన్నచో, ఇది నన్ను అనుగ్రహించుటయే. కస్తూరికి సువాసననలె సజ్జనులకు అనుగ్రహము సహజము.

దత్తాత్రేయునివలన భార్గవరాముఁడు త్రిపురామహాత్మ్యమును విని భక్తిచేత కొంతసేపు తన్మయుఁడై యుండి కనులు తెఱచి ఆనందాశ్రువులతో గగుర్పాటుతో గురువునకు సాష్టాంగముగ ప్రణమిల్లి లేచి గద్గదస్వరముతో ఇట్లనెను. ''కరుణాసింధువులైన శ్రీగురుదేవుల యనుగ్రహముచే నేను ధన్యుఁడనైతిని. కృతకృత్యుఁడ నైతిని. తమ దయవలన త్రిపురామహాత్మ్యము నంతయు వింటిని. ఆపరమేశ్వరిని ఉపాసింపఁగోరు చున్నాను. ఆపద్థతిని నాకు బోధింపుఁడు.''

భార్గవునియొక్క భక్తిని శ్రద్ధను అర్హతను చూచి దత్తాత్రేయుఁడు త్రిపురాదేవియుపాసనకై అతనికి దీక్ష నొసంగెను. శ్రేష్ఠమైన యాదీక్షను మంత్రయంత్రాదులతో సక్రమముగా సమగ్రమముగా పొంది ఆనందమయుఁడై ఆపరమేశ్వరిని ఉపాసించుటకు గురువుయొక్క ఆజ్ఞను పొంది భార్గవుఁడు ఆయనకు ప్రదక్షిణ మాచరించి ప్రణమిల్లి మహేంద్రగిరికి పోయెను. అచ్చట నిత్యనై మిత్తకములైన కర్మలను నిర్వహించుకొనుచు పండ్రెండు సంవత్సరములు దీక్షతో త్రిపురాదేవిని ఉపాసించెను. అంతకాలము ఱప్పపాటులో గడచినట్లుండెను.

ఒకనాఁ డాయన సుఖముగా కూర్చుండి ఇట్లనుకొనెను. ''పూర్వము మార్గమున నేను ప్రార్థింపఁగా సంవర్తుఁడు ఏదోచెప్పెను. అప్పు డది నాకు కొంచెము కూడ తెలియలేదు. నేను దేనిని కోరి మొదట గురువును ప్రార్థించితినో అది కూడ మఱచితిని. ఆయన వలన త్రిపురామహాత్మ్యమును వింటిని కాని సంవర్తుఁడు చెప్పినదేదో తెలిసికొనలేదు. అది కాక సృష్టప్రసంగమునందు నేనే దత్తగురువును కొన్ని సందేహములు అడిగితిని. ఆయన కువలుని కథను చెప్పి అవి ఇప్పుడు ఆవశ్యకము కాదని సమాధానము చెప్పలేదు.

ఈలోకముయొక్క పద్ధతి నాకు కొంచెము కూడ తెలియుట లేదు. ఇంత యాడంబరముతో ఈజగత్తు దేనినుండి పుట్టినది? ఎక్కడికి పోవుచున్నది? ఎచ్చట నిలుకడను పొందుచున్నది? అన్నియెడల అంతయును అస్థిరముగనే కన్పించుచున్నది. అస్థిరములైన విషయములతో వ్యవహారములు స్థిరము లైనట్లే జనులు వర్తించుచున్నారు. విమర్శనము లేని యీ లోకుల వ్యవహారము చిత్రముగా నున్నది. ఒక గ్రుడ్డివాని వెనుక మఱియొక గ్రుడ్డివాఁడు పోవుచున్నట్లుగా జనులు వర్తించుచున్నారు. నావర్తనము కూడ ఇందులకు అన్నివిధముల నిదర్శనముగా నున్నది. నా శైశవమునందు ఏమి జరిగినదో గుర్తులేదు. కౌమారమునందు ఒకవిధముగా ¸°వనమునందు వేఱొక విధముగా ఇప్పుడు మఱియొకవిధముగా వ్యవహారము జరుగుచున్నది. ఈవ్యవహారములకు ఏమి ఫలమో తెలియుట లేదు. ఫలమును కోరి ఎప్పడు ఏపని చేయుచున్నను, అది చక్కగా నున్న దనియే ఆపని చేయుచున్నారు. అచ్చట ఏమి ఫలము కలుగుచున్నది? దేనిచేత ఆత్మకు సుఖము కలుగుచున్నది? దేనిని లోకులు ఫలమనుకొనుచున్నారో, విమర్శించినచో, అది నిజముగా ఫలము కాదు. ఒకఁడు ఒకఫలమును పొంది మరల దాని కొరకు యత్నించుచున్నచో అది ఫలమని నేను తలంపను. ఫలమును నిజముగా పొందియున్నచో వానికి దానియందు మరల ఎట్లు కోరిక కలుగును? మఱి జను లందఱును పొందిన ఫలమునే మరల పొందుటకై యత్నించుచున్నారు. కావున దుఃఖము పోవుటయో లేక సుఖము కలుగుటయో ఫల మని చెప్పవలె. చేయవలసినపని మిగిలియుండఁగా దుఃఖనాశము గాని సుఖము గాని కలుగదు. కాఁబట్టి కర్తవ్యమును కలిగియుండుటయే దుఃఖము లన్నింటిలో పరమ దుఃఖము.

శరీర మంతయు దగ్ధమగుచుండఁగా పాదములయందు మాత్రము గంధము పూయుటవలన గుండెలో బాణము గ్రుచ్చుకొని యుండ అప్సరసలు కౌఁగిలించుకొనుటవలన, క్షయరోగికి సంగీతము వినిపించుటవలన కలుగు సుఖము ఎట్టిదో కర్తవ్యము మిగిలియున్న వానికి కలుగు సుఖము కూడ అట్టిదియే. కర్తవ్యము ఎవరికి లేదో వారే ఈలోకములో సుఖము కలవారు. కర్తవ్యము మిగిలియున్న వానికి కూడ సుఖము కలుగు నన్నచో కొఱతవేయఁబడివానికి కూడ గంధము పూసి పుష్పమాలికలు వేసినచో సుఖము కలుగునని చెప్పవలసియుండును. ఆహా! ఇది ఎంత విచిత్రము! వందలకొలఁది కర్తవ్యములు వచ్చి పైఁబడుచున్నను ఇచ్చట నేదో సుఖము కల దని దానికొఱకు జనులు ఎల్లప్పుడు యత్నించుచునే యున్నారు. మనుష్యులయొక్క ఈయవిచారమహాత్మ్యమును ఏమని చెప్పుదును! కర్తవ్యములు అనంతములుగా కొండలవలె పైనఁబడుచున్నను సౌఖ్యమును పొందుచున్నారు. సౌఖ్యముకొఱకు సార్వభౌముఁడు ఎట్లు ఎల్లప్పుడు యత్నించుచున్నాఁడో అట్లే బిచ్చమెత్తుకొనువాఁడు కూడ యత్నించుచున్నాఁడు. రాజుసుఖము వేఱు. బిచ్చగానిసుఖము వేఱు. ఇరువురును తాము కృతకృత్యులైనట్లే తలంచుచున్నారు. ఫలమును గూర్చి ఆలోచనయే లేక అందఱును ఏమార్గమున పోవుచున్నారో నేనును ఆమార్గముననే పోవుచున్నాను. విమర్శలేని యీలౌకికవ్యవహారప్రజ్ఞ ఇంక చాలును. ఈవిమర్శతోనే దయానిధియైన గురువు నొద్దకు పోవలె. వెనుక నేను తెలిసికొనఁగోరినవి. ఇప్పుడు తెలిసికొనవలసినవి యైనవిషయములు సందేహములు సముద్రమువలె నున్నవి. ఆయన గావించుబోధ అనునౌకచేత ఈసముద్రమును దాటెదను.''

ఇట్లు నిశ్చయించుకొని భార్గవరాముఁడు గంధమాదన శైలమునకు పోయి దత్తాత్రేయునకు సాష్టాంగముగ ప్రణమిల్లెను. ఆయన భార్గవు నాశీర్వదించి ఆదరముతో నిట్లనెను. ''వత్స! లెమ్ము. నిన్ను చూచి చాలకాల మైనది. నీకు కుశలమే కదా!'' భార్గవుఁడు కూర్చుండి అంజలించి యిట్లు పలికెను. ''కరుణాసింధువులైన తమయొక్క అనుగ్రహమునకు పాత్రుఁడనైన నాకు కుశలమునకు లోప మెట్లు కలుగును? ఇంతకాలము తమపాదముల సన్నిధినుండి దూరముగా నుంటి ననుచింత తప్ప నాకు ఏకొఱఁతయును లేదు. ఇప్పుడు తమదర్శనము చేత ఆనందపూర్ణుఁడనై యున్నాను. కాని నాహృదయమునందు చాలకాలముగా ఒక సందేహము మెదలుచున్నది. తమరు అనుమతించినచో అడుగుదును.''

అది విని దయానిధియైన దత్తగురువు ప్రీతుఁడై ''భార్గవా! నీసంశయ మేమో అడుగుము. నీవు కోరిన విషయమును చెప్పుదును'' అని పలికెను.

ఇది జ్ఞానఖండమున విచారోదయమన్నది ప్రథమాధ్యాయము.

బాలప్రియ

xmsLRiaRPVLSª«sVV†²R…V ¬s»R½ù \®ƒs„sV¼½ò NRPNRPLRiøÌÁƒ«sV úxms¼½µj…ƒ«sª«sVV @ƒ«sVztîsQLiÀÁƒ«s »R½LRiVªy»R½®ƒs[ ú¼½xmsoLS®µ…[„s¬s DFyzqsLi¿RÁV¿RÁVLi®²…ƒ«sV. Fsª«sLRiV FsLi»R½ g]xmsö DFyxqsƒ«s ¿Á[¸R…VV¿RÁVƒ«sõƒ«sV xqsLiµ³yùª«sLiµR…ƒyµj… ¬s»R½ùNRPLRiøÌÁƒ«sV D}msOTPQLixmsLSµR…V. ÍÜ[NRPª«sVVÍÜ[ Fsª«s†²R…V Gxms¬s ¿Á[¸R…VV¿RÁVƒ«sõƒ«sV ®ªsVVµR…ÈÁ ryõƒyµR…V¿Á[»R½ ®µ…[x¤¦¦¦FyLjiaRPVµôðR…ùª«sVVƒ«sV FsÈýÁV F~LiµR…V¿RÁVƒyõ†²][ @ÛÉýÁ[ xqsLiµ³yùª«sLiµR…ƒ«sª«sVV ÇÁxmsª«sVV ®ªsVVµR…ÌÁgRiVªy¬s¿Á[»R½ ª«sVƒ«sxqsV=¹¸…VVNRPä xmsLjiaRPVµôðR…»R½ƒ«sV ª«sVVLiµR…V F~LiµR…ª«sÌÁ¸R…VVƒ«sV. ®µ…[x¤¦¦¦FyLjiaRPVµôðR…ùª«sVV ÛÍÁ[NRPVƒ«sõ¿][ FsLi»R½ª«sVLiÀÁ ˳Ü[ÇÁƒ«sª«sVV ¿Á[¸R…VV¿RÁVƒ«sõƒ«sV AL][gRiùª«sVV FsÈýÁV ¬sÌÁVª«sµ][, @ÛÉýÁ[ ª«sVƒ«sxqsV=ƒ«sNRPV xmsLjiaRPVµôðR…»R½ ÛÍÁ[NRPVƒ«sõ¿][ FsLi»R½ g]xmsöDFyxqsƒ«s ¿Á[¸R…VV¿RÁVƒ«sõƒ«sV FsLi»R½ »R½»R½òQ*„s¿yLRiª«sVV ¿Á[¸R…VV¿RÁVƒ«sõƒ«sV ª«sVƒ«sxqsV=ƒ«sNRPV GNSúgRi»R½ ¬sÌÁVª«sµR…V. NSª«soƒ«s DFyxqsƒyxmsLRiVÌÁV »R½»R½òQ*„s¿yLRixmsLS¸R…VßáVÌÁV ryõƒ«sª«sVV xqsLiµ³yùª«sLiµR…ƒ«sª«sVV ®ªsVVµR…ÌÁgRiV ¬s»R½ùNRPLRiøÌÁƒ«sV ª«sµR…ÌÁLSµR…V.

భార్గవుఁ డిదివఱకు గొప్ప తపస్సును చేసెను. కాని ఆతపస్సునకు ఈయుపాసనకును భేద మున్నది. పూర్వము తపస్సు చేయునప్పుడు డాయన దివ్యలోకసుఖములను కోరుచుండెను. ఇప్పుడాయన చేసిన త్రిపురోపాసన నిష్కామ మైనది. అందువలననే చిత్తము శుద్ధమై, ఆయనకు తన్నుగూర్చి విచారణము ఆరంభ##మైనది.

ఉపాసనకు పూర్వమున్న పరిస్థితి వేఱు. ఇప్పటి పరిస్థితివేఱు. శ్రీరామునిచేత ఓడింపఁబడినంతనే ఆయనకు కలిగినది దుఃఖము తరువాత కలిగినది నిర్వేదము. విషయములతోనున్న యానుకూల్యము భంగపడినపుడుగాని, ప్రతికూలవిషయములతో సంబంధము కలిగినపుడు గాని కలుగువ్యధ దుఃఖము. దేవవిప్లవము సంభవించినపుడు ఇల్లు భార్య పుత్రులు మొదలగువారితో సంబంధము పోయి ప్రతికూలములైన అడవులు మృగములు మొదలగువానితో సంబంధము కలిగినపుడు ఏర్పడువ్యధ దుఃఖము. ''నేను మహావీరుఁడను'' అను భావముతో సుఖించుచున్న పరుశురామునకు ఆభావముతో సంబంధము పోయి పరాజయము అను ప్రతికూలవిషయముతో సంబంధము కలిగినపుడు దుఃఖము కలిగినది. తన క్షత్రియవృత్తికి, తుదిపరాజయమునకు తనక్రోధమే కారణ మని దానిని జయించుట సులభము కాదని తోచినప్పుడు ఆయనకు కలిగినది నిర్వేదము.

తరువాత పరుశురాముఁడు సంవర్తుని చూచినప్పుడు తానుపొందలేకున్న శాంతిని మహాసుఖమును పొందుచున్నాడని గ్రహించి ఎట్లయినను ఆశాంతిని సుఖమును పొందవలయు నని నిశ్చయించుకొనెను. సంవర్తునితో సమాగమము కలిగిన తరువాత, ''లోకవ్యవహారమంతయు హేయ మైనది; కామక్రోధములచేత కలుషిత మైనది. ఇందు అడుగడుగుననే భయమే గోచరించుచున్నది. దీనినుండి తప్పించుకొని అభయమును పొందవలె'' అను తలంపుతో ఆయన దత్తగురువునొద్దకు పోయెను. ఇది కూడ నిర్వేదమే. త్రిపురోపాసన చేసిన తరువాతనే దుఃఖమునకు నిర్వేదమునకు భిన్నమైన తత్త్వజిజ్ఞాస కలిగినది. అనఁగా లోకముయొక్క ఈశ్వరుని యొక్క తనయొక్క యథార్థమును తెలిసికోవలయు ననుతలంపు కలిగినది. అదియే విచారోదయము. ఆవిచారము కలిగిన తరువాతనే దత్తగురువు భార్గవుఁడడిగిన ప్రశ్నల కన్నింటికిని సమాధానములు చెప్పెను. అప్పటివఱకును చెప్పకుండుటకు విచారము కలుగకుండుటయే కారణము.

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters