Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

''సత్యపథాన్ని తప్పవద్దు''

''జనకమహారాజు పుత్రిక జానకి, ఆమెకు సీతాదేవి అని పేరు. వారిది మిథిలారాజ్యం. జనకుని రాజరి అంటారు. జ్ఞాని అయి శిక్ష, రణక్ష చేస్తూనే యోగిలాగా ఉండవచ్చు. కాని, అందరియందు సమబుద్ధి కల్గియుండాలి. ఇదే మహాయోగం. తామరాకుమీద నీటివలె ప్రపంచంలో మనమేది చేసినా అంటకుండా ఉండాలి.

ఇంతవరకు మీలోని పెద్దలు నన్ను బ్రహ్మజ్ఞాని, అని పొగిడారు. పరదేవత బిడ్డలైన మనమందరం సోదరులమే కావున అందరూ పరస్పర ద్వేషాలు లేకుండా అబద్ధ మాడక భయం లేకుండా ధైర్యంగాను, ధర్మంగాను ఉంటే నాకదే గౌరవం. ఎవరికే కష్టాలువచ్చినా, సత్యపథాన్ని తప్పవద్దు. దైవోత్సవాల్లో దేవతాభక్తి ఉంటుంది. నిత్యము త్రికాలములయందును భగవంతుని ధ్యానిస్తేచాలు.

మనుష్యునకు భోజనం, నిద్ర అనివార్యాలు, అట్లే నిద్రలేవగానే విభూతిగానీ, లేదా, ఎదురుగావున్న మట్టిగానీ బొట్టుపెట్టుకొని ''శ్రీ వెంకటేశాయ నమః'' అని 12 పర్యాయములు జపించాలి. భోజనం చేయునప్పుడు ''గోవింద'' స్మరణతో కబళం మ్రింగాలి. పరుండనప్పుడు ''శ్రీ వెంకటేశాయ మంగళం'' అని 12 సార్లు స్మరణచేసి పరుండాలి. మనం చేసే ప్రతికర్మా, స్మరించే ప్రతినామమూ భగవత్‌ స్వరూపమై మనకు శుభాంతంగా పరిణమిస్తవి. శివమతస్థులు గానీ, విష్ణుమతస్థులగానీ, శ్రీ వెంకటేశ్వర స్మరణచేయవచ్చు. మనం ఏపని ప్రారంభించినా ముందుగా దైవస్మరణ చేయాలి. ఇదే మీరు మాకు చేసే ఉపకారం.

8-6ొ


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page