Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ద్వినవతితమో7ధ్యాయః

అథ వాస్తుప్రతిష్ఠావిధిః

ఈశ్వర ఉవాచ :

ప్రతిష్ఠాం సంప్రవక్ష్యామి క్రమాత్‌ సంక్షేపతో గుహ | పీఠం శక్తిం శివో లిఙ్గం తద్యోగః సా శివాణుఛిః . 1

ప్రతిష్ఠాయాః పఞ్చభేదాస్తేషాం రూపం వదామి తే | యత్ర బ్రహ్మశిలాయోగః సా ప్రతిష్ఠా విశేషతః. 2

స్థాపనం తు యథాయోగం పీఠఏవ నివేశనమ్‌ | ప్రతిష్ఠాభిన్నపీఠస్య స్థిత స్థాపనముచ్యతే. 2

ఉత్థాపనం చ సా ప్రోక్తా లిజ్గోద్దారపురస్స రా | యస్యాంతు లిఙ్గమారోప్య సంస్కారః క్రియతే బుధైః . 4

ఆస్థాపనం తదుద్దిష్టం ద్విధా విష్ణ్వాదికస్య చ | ఆసు సర్వాసు చైతన్యం నియుఞ్జీత పరం శివమ్‌. 5

యదాధారాదిభేదేన ప్రాసాదేష్వపి పిఞ్చధా | పరీక్షామథ మేదిన్యాః కుర్యాత్ప్రాసాదకామ్యయా. 6

శుక్లాజ్యగన్దా రక్తా చ రక్తగన్ధా సుగన్దినీ | పీతా కృష్ణా సురాగన్దా విప్రాదీనాం మహీక్రమాత్‌. 7

పూర్వేశోత్తరే సర్వత్ర పూర్వాచైషాం విశిష్యతే | ఆఖాతే హాస్తికే యస్యాః పూర్ణే మృదధికే భ##వేత్‌. 8

ఉత్తమాం తాం మహీం విద్యాత్తోయద్యైర్వా సముక్షితామ్‌ | అస్థ్యజ్గారాదిభిర్దుష్టా మత్యన్తం శోధయైద్గురుః. 9

నగరగ్రామదుర్గార్థం గృహప్రసాదకారణమ్‌ | ఖననైర్గోకులావాసైః కర్షణౖర్వా ముహుర్మహుః. 10

మణ్డపే ద్వారపూజాది మన్త్రతృప్త్యవసానకమ్‌ | కర్మ నిర్వర్త్య ఘోరాస్త్రం సహస్రం విధినా యజేత్‌. 11

సమీకృత్యోసలిప్తాయం భూమౌ సంశోధయేద్దిశః | స్వర్ణదద్ధ్యక్షతై రేఖాః ప్రకుర్వీత ప్రదక్షిణమ్‌. 12

మధ్యాదీశానకోష్ఠస్ఠే పూర్ణకుమ్బే శివం యజేత్‌ | వాస్తుమభ్యర్భ్య తత్తోయైః సిఞ్చేత్కుద్దాలకాదికమ్‌. 13

బాహ్యే రక్షోగణానిష్ట్వా విధినాదిగ్భలిం క్షిపేత్‌ | భూమిం సంసిచ్య సంస్నాప్యకుద్దాలాద్యం ప్రపూజయేత్‌.

పరమేశ్వరుడు చెప్పెను. స్కందా! నేనిపుడు సంక్షేపముగ క్రమముగ ప్రతిష్ఠను గూర్చి చెప్పెదను పీఠము శక్తి, లింగము శివుడు, ఈ రెండింటి యోగము వలన శివసంబంధి మంత్రములచే ప్రతిష్ఠ చేయబడును. ప్రతిష్ఠలో ''ప్రతిష్ఠ'' మొదలగు ఐదు భేదములున్నది. వాటిని గూర్చి చెప్పెదను. బ్రహ్మశిలా యోగమున్నప్పుడు విశేషరూపమున చేసిన స్థాపనము 'ప్రతిష్ఠ'. పీఠముపైననే వీలును బట్టి అర్చా విగ్రహమును స్థాపించినచో అది స్థాపనము, ప్రతిష్ఠాభిన్నమగు స్థాపనమునకు ''స్థిరస్థాపన మని పేరు. ఆధార పూర్వకముగ చేయు లింగ స్థాపనము. ఉత్థాపనము. లింగమును స్థాపించి విద్వాంసులు దానికి సంస్కారము చేసినచో ఆది స్థాపనము. ఇవి శివ ప్రతిష్ఠకు సంబంధించిన ఐదు భేదములు. విష్ణ్వాది ప్రతిష్ఠ ''ఆస్థానము'' ''ఉత్థానము'' అని రెండు విధములు. ఈ అన్ని ప్రతిష్ఠలందును. చైతన్య రూపుడగు పరమశివుని నియోజనము చేయవలెను. పదాధ్వాది భేదములచే ప్రాసాదములలో కూడ ఐదు విధములగు ప్రతిష్ఠ చెప్పబడినది. ప్రాసాదము కొరకై భూపరీక్ష చేయవలెను. మట్టి రంగు తెల్లగా ఉండి ఘృతసుగంధము గల భూమి బ్రాహ్మణులకు శ్రేష్ఠము. ఇట్లే వరుసగ క్షత్రియులకు ఎఱ్ఱగా, రక్త గంధము కల మట్టి, వైశ్యులకు పచ్చని, సుగంధము గల మట్టి,శూద్రులకు నల్లని సురాగంధము గల మట్టి గల భూములు శ్రేష్ఠమైనవి. తూర్పునందును, ఈశాన్యమునందును, లేదా అన్ని దిక్కులందును పల్లముగా నుండి, మధ్య ఎత్తుగానున్న భూమి ప్రశస్తమైనది. ఒక చేతిలోతు త్రవ్వి తీసిన మట్టిలో ఆగోతిని పూడ్చివేయగా మట్టి మిగిలి పోయినచో ఆ భూమి ఉత్తమమైనది. లేదా జలాదులతో దానిని పరీక్షించవలెను. ఎముకలు బొగ్గులు మొదలగు వాటిచే దూషితమగు భుమిని త్రవ్వుట, ఆవులు మొదలగు వాటిని అచట కట్టుట, చాలసార్లు దున్నుటమొదలగు వాటిచే బాగుగా శోధనము చేయవలెను. నగర - గ్రామ - దుర్గ - గృహ - ప్రాసాదాదుం నిర్మాణము కొరకు భూమిని పై విధముగ శోధన చేయవలెను. ద్వారపూజ మొదలు మంత్రతర్పణ పర్యంతమగు సంపూర్ణ కర్మను మండపమునందు చేసి, విధి పూర్వకముగ ఘోరాస్త్రసహస్రయాగము చేయవలెను. సమముచేసి, అలికిన నేలపై దిక్సాధనము చేయవలెను. సువర్ణ-అక్షత-దధులతో ప్రదక్షిణక్రమమున రేఖలు గీయవలెను. మధ్య భాగమునుండి ఈశానకోష్ఠమునందున్న, జల పూర్ణకలశమునందు శివుని పూజించవలెను. పిదప వాస్తుపూజ చేసి ఆ కలశలోని జలముతో గునపము మొదలగు వాటిని తడపవలెను. మండపము వెలుపల విధి పూర్వకముగ రాక్షసగ్రహాది పూజచేసి దిక్కులందు బలు లివ్వవలెను.

పూజాం కుమ్భే సమాహృత్య ప్రాప్తే లగ్నే7గ్ని కోష్ఠకే | కుద్దాలేనాభిషిక్తేన మధ్వక్తేన తు ఖానయేత్‌. 15

నైరృత్యాం క్షిపయేన్మృత్స్నాం ఖాతే కుమ్భజలం క్షిపేత్‌|

అన్యం వస్త్రయుగచ్ఛన్నం కుమ్భం స్కన్దే ద్విజన్మనః. 16

నిధాయ గీతవాద్యాది బ్రహ్మ ఘోషసమాకులమ్‌ | పురస్య పూర్వసీమాన్తం నయేధ్యావదదభీప్సితమ్‌. 17

అథ తత్ర క్షణం స్థిత్వా భ్రామయేత్పరితః పురమ్‌ | సిఞ్చన్సీమాన్తచిహ్నాని యావదీశానగోచరమ్‌. 18

అర్ఘ్యాదానమిదం ప్రోక్తం తత్ర కుమ్భపరిభ్రమాత్‌ | ఇత్థం పరిగ్రహం భూమేః కుర్వీత త దనన్తరమ్‌. 19

కర్కరాన్తం జలాన్తం వా శల్యదోషజిఘాంసయా | ఖానయేద్భూకుమారీం చేద్విధినా శల్యముద్దరేత్‌. 20

అకచ టతప యశహాన్మనవత్ప్రశ్నాక్షరాణి తు | అగ్నేర్ధ్వజాదిపతితాః స్వస్థానే శల్య మాఖ్యాన్తి 21

కర్తుశ్చాఙ్గవికారేణ జానీయ త్తత్ప్రమాణతః | పశ్వాదీనాం ప్రవేశేన కీర్తనైర్విరుత్తైర్దిశః. 22

మాతృకామష్టవర్గాఢ్యాం ఫలకే భువి వా లిఖేత్‌ | శల్యజ్ఞానం వర్గవర్ణా పూర్వాదీశాన్తతః క్రమాత్‌. 23

అవర్గేచైవ లోహంతు కవర్గే7ఙ్గారమగ్నితః | చవర్గే భస్మ దక్షే స్యాట్ట వర్గే7స్థి చ నైరృతే. 24

తవర్గే చేష్టకాచాప్యే కపాలం చ పవర్గకే | యవర్గే శవకీటాది శవర్గే లోహమాది శేత్‌. 23

హవర్గే రజతం తద్వతక్షవర్గాచ్చానర్థకానపి.

కలశ##పై పూజచేసి లగ్నము వచ్చిన పిమ్మట అగ్నికోణమునందలి కోష్ఠమునందు మొదట తడిపిన మధులిప్తమగు గునపముతో భూమి త్రవ్వి మట్టి నైరృతి దిక్కునందు వేయవలెను. తవ్విన గోతిలో కలశములోని ఉదకము పోయవలెను. పిదప భూమితడిపి గుమపము మొదలైన వాటిని తడిపి, వాటి పూజ చేయవలెను. పిదప ఈ మరొక కలశమును రెండు వస్త్రములతో ఆచ్ఛాదించి బ్రాహ్మణుని కంఠముపై నుంచి, వాద్య-వేదఘోషలతో నగరము తూర్పు సరిహద్దువరకు ఎఁత వరకు ఇష్టమో అంతదూరము వెళ్ళి, అచట క్షణకాలము పాటు ఆగి, అచటినుండి నగరము నాల్గు దిక్కలందును ప్రదక్షిణక్రమమున తిరుగుచు ఈశాన్యము వరకును ఆ కలశమును త్రిప్పవలెను. ఆ పనితో పాటు సీమాంత చిహ్నములను తడుపుచుండవలెను. ఈ విధముగ రుద్రకలశమును నగరము నాల్గువైపుల త్రిప్పి భూపరిగ్రహము చేయవలెను. దీనికి అర్ఘ్యదాన క్రియయని పేరు. పిదప శల్యదోషనివారణార్థమై రాళ్ళు లేదా నీరు వచ్చే వరకును భూమి త్రవ్వవలెను. ఎముకలు మొదలైనవి కనబడినచో వాటిని త్రవ్వించి తొలగించవలెను. లగ్నసమయమున ఎవ్వడైన ప్రశ్నవేయగా ఆతని ముఖము నుండి అ క చ ట త ప స హ అను వర్గములకు చెందిన అక్షరములు బయల్వెడలినచో, ఆ దిక్కలందు శల్యము లుండునని సూచింపబడుచున్నది. పక్షులు మొదలగువని వాలినచో అచట శల్యములున్నవని సూచింపబడుచున్నది. కర్తకు ఏ అంగమునందు వికారముండునో తత్సదృశ మగు శల్యమున్నదని నిశ్చయించవలెను. పశ్వాది ప్రవేశము వాటి అరపు, పక్షిరవము మొదలగు వాటిచే శల్యములున్న దిక్కు సూచింపబడును. ఒక పట్టికపై గాని, భూమి మీద గాని అకారాద్యష్టవర్గయుక్తమగు మాతృకావర్ణములను వ్రాయవలెను. వర్గాను సారము క్రమముగ తూర్పునుండి ఈశాన్యము వరకు నున్న దిక్కులందు శల్యమున్నట్లు తెలియవలెను. అవర్గమైనచో తూర్పున ఇనుము ఉండును. కవర్గమైనచో ఆగ్నేయమున బొగ్గు ఉండును. చవర్గమైనచో దక్షిణమునందు భస్మము ట వర్గమైనచో నైరృతియందు ఎముకలును ఉండును. తవర్గమైనచో పశ్చిమమున ఇటుకలు, పవర్గమైనచో వాయవ్యమును పెంకులు, యవర్గమైనచో ఉత్తరమున శవములు కీటకము మొదలగునవి సవర్గమైనచో ఈశాన్యమునందు ఇనుము ఉండును. హవర్గమైనచో వెండి, క్షవర్గయుక్తదిగ్భాగము ఆ దిక్కునందే అనర్థకరము లగు వస్తువు లుండును.

ప్రోక్షాత్మభిః కరాపూరై రష్టాజ్గుల మృదన్తరైః | 26

పాదోనం ఖాతమాపూర్య సజలైర్మద్గ రాహతైః | లిపాతం సమప్లవాం తత్ర కారయిత్వా భువం గురుః 27

సామాన్యార్ఘ్యకరో యాయాన్మణ్డపం వక్ష్యమాణమకమ్‌ | తోరణద్వాః పతీనిష్ట్వా ప్రత్యగ్ద్వారేణ సంవిశేత్‌. 28

కుర్యాత్తత్రాత్మ శుద్ద్వాది కుణ్డమణ్డపసంస్కృతమ్‌ | కలశం వర్దనీసక్తం లోకపాలశివార్చనమ్‌. 29

అగ్నేర్జనన పూజాది సర్వం పూర్వవదాచరేత్‌ | యజమానాన్వితో యాయాచ్ఛిలానాం స్నానమణ్డపమ్‌. 30

శిలాః ప్రాసాదలిఙ్గస్య పాదా ధర్మాది సంజ్ఞకాః | అష్టజ్గులోచ్ఛ్రితాః శస్తాశ్చతురస్రాః కరాయతాః. 31

పాషాణానం శిలాః కార్యా ఇష్టకానాం తదర్దతః | ప్రసాదేస్మ శిలాః శైల ఇష్టకా ఇష్టకామయే. 32

అఙ్కితా నవవక్త్రాద్యైః పఙ్కజైః పఙ్కజాఙ్కితా ః | నన్దాభద్రాజయారిక్తా పూర్ణాఖ్యా పఞ్చమీ మతా. 33

ఆసాం పద్మో మహాపద్మః శంఖో7థ మకరస్తథా| సముద్రశ్చేతి పఞ్చామీ నిధికుమ్భాః క్రమాదధః. 34

నన్దా భద్రా జయా పూర్ణా అజితా చాపరాజితా | విజయా మఙ్గలాఖ్యా చ ధరణీ నవమీ శిలా. 35

సుభద్రశ్చ విభద్రశ్చ సున్దః పుష్పనన్దకః | జయోథ విజయశ్చైవ కుమ్భః పూర్ణస్తథో త్తరః. 36

నవానాం తు యథా సంఖ్యం నిధికుమ్భా అమీ నవ.

&#ఒక్కొక్క హస్తము పొడవు గల తొమ్మిది శిలాఖండములను ప్రోక్షించి, వాటిని ఎనిమిదేసి అంగుళముల లోపల మట్టిలోపల పాతవలెను. పైన నారుపోసి ముద్గరముతో కొట్టవలెను. ఆ రాళ్ళు మూడు వంతుల పొడవు నేలలో దిగిన పిమ్మట, గొయ్యి పూడ్చి, అలికి, అచటి భూమిని చదునుచేయవలెను. గురువు సామాన్యార్ఘ్యమును చేత ధరించి, చెప్పబోవుమండపము వైపు వెళ్ళవలెను. మండపద్వారమున ద్వారపాలకపూజ చేసి పశ్చిమద్వారమునుండి లోనికి ప్రవేశించవలెను. అచట ఆత్మశుద్ది కుండమండపాది సంస్కారముచేయవలెను. కలశవర్ధన్యాదిస్థాపనచేసి లోకపాలులను, శివుని పూజించవలెను. అగ్నిజననపూజనాదు లన్నియు వెనుకటి వలెనే చేయవలెను. పిమ్మట గురువు యజమానునితో కలిసి శిలల స్నానమండపమునకు వెళ్ళవలెను. ధర్మాదిసంజ్ఞితము లగు నాలుగు ప్రాసాదలింగ శిల లున్నవి. వాటి ఎత్తు ఎనిమిది అంగుళములున్నచో మంచిది. చతురస్రములుగను ఒక హస్తముపొడ వుండు నట్లును ప్రస్తరశిలలు నిర్మించవలెను. ఇటుకల ప్రమాణము శిలాప్రమాణములో సగ ముండవలెను. ప్రాసాదమునందు శిలలను, ఇటుకలతో కట్టు ఆలయములలో ఇటుకలు ఉపయోగించవలెను. వాటి తొమ్మిది శిలలను లేదా ఇటుకలను వజ్రాదిచిహ్నములతో చిహ్నితములు చేయవలెను. లేదా ఐదు శిలలను కమలచిహ్నముతో చిహ్నితము చేయవలెను. ఆలయ నిర్మాణము ఈ అంకిత శిలతోడనే ప్రారంభించవలెను. నంద, భద్ర, జయ,రిక్త, పూర్ణ అనునవి ఐదు శిలల పేర్లు. పద్మము, మహాపద్మము, శంఖము, మకరము,సముద్రము అనునవి ఐదు నిధి కుంభములు. నంద, భద్ర, జయ, పూర్ణ, అజిత, అపరాజిత, విజయ, మంగళ, ధరణీ అనునవి తొమ్మిది శిలల పేర్లు. సుభద్ర, విభద్ర, సునంద, పుష్పదంత, జయ, విజయ, కుంభ, పూర్వ, ఉత్తరములు ఈ తొమ్మిదింటి నిధికలశములు.

ఆసనం ప్రథమం దత్వా తాడ్యోల్లిఖ్య శరాణునా. 37

సర్వసామవిశేషణ తనుత్రేణావగుణ్ఠనమ్‌ | మృద్భిర్గోమయగోమూత్రకషాయైర్గన్దవారిణా. 38

అస్త్రేణ హూంఫడన్తేన మలస్నానం సమాచరేత్‌ | విధినా పఞ్చగవ్యేన స్నానం పఞ్చామృతేన చ. 39

గన్దతోయాన్తరం కుర్యాన్ని వజనామాఙ్కితాణునా | ఫలరత్న సువర్ణానాం గోశృంగసలిలైస్తతః. 40

చన్దనేన సమాలభ్య వసై#్త్రరాచ్ఛదయేచ్ఛిలామ్‌ | స్వర్ణోత్తమాసనం దత్వా నీత్వా యాగం ప్రదక్షిణామ్‌. 41

శయ్యాయాం కుశతల్పే వా హృదయేన నివేశ##యేత్‌ | సంపూజ్య న్యస్య బుద్ధ్యాది ధరాన్తం త త్త్వసంచయమ్‌.

త్రిఖణ్డవ్యాపకం తత్త్వత్రయం చానుక్రమాన్న్యసేత్‌ | బుద్ధ్యాదౌ చిత్తపర్యేన్తే చిన్తా తన్మాత్రకావధౌ. 43

తన్మాత్రాదౌ ధరాన్తే చ శివవిద్యాత్మనాం స్థితిః | తత్త్వాని నిజమన్త్రేణ తత్త్వేశాంశ్చ హృదార్చయేత్‌. 44

స్థానేషు పుష్పమాలాది చిహ్నితేషు యథాక్రమమ్‌|

ఓం హూం శివతత్త్వాయ నమః ఓం హూం శివతత్త్వాధిపతయే నమః.

ఓం హాం విద్యాతత్త్వాయ నమః ఓం హాం విద్యాతత్త్వాధిపాయ నమః.

విష్ణవే నమః. ఓం హాం ఆత్మతత్త్వాయ నమః ఓం హాం ఆత్మతత్త్వాధిపతయే బ్రహ్మణ నమః.

క్షమాగ్నియజమానార్కజలవాతేన్దుఖాని చ.

ప్రతితత్త్వం న్యసేదష్ఠౌ మూర్తీః ప్రతిశిలాం శిలామ్‌ | శర్వం పశుపతిం చోగ్రం రుద్రం భవమథేశ్వరమ్‌. 46

మహాదేవం చ భీమం చ మూర్తీశాంశ్చ యథాక్రమాత్‌. ఓం ధరామూర్తయే నమః.

ఓం ధరాధిపతయేనమః. ఇత్యాదిమన్త్రాన్లోక పాలాన్యథాసంఖ్యం నిజాణుభిః. 47

విన్యస్య పూజయేత్కుమ్భాంస్తన్మన్రైర్వా నిజాణుభిః | ఇన్ద్రాధీనాం తు బీజాని వక్ష్యమాణక్రమేణ తు.

లూం రూం శూం షూం వూం యూం సూం హూం క్షూం ఇతి ఉక్తో నవశిలాపక్షః శిలా పఞ్చపదా తథా.

ప్రతినిత్యం న్యసేన్మూర్తీః సృష్ట్యా పఞ్చధరాదికాః. 49

బ్రహ్మా విష్ణుస్తథారుద్ర ఈశ్వరశ్చ సదాశివః | ఏతే చ పఞ్చమూర్తీశా యష్టవ్యాస్తాసు పూర్వవత్‌. 50

ఓం పృథివీమూర్తయే నమః ఓం పృథివీమూర్త్యధిపతయే బ్రహ్మణనమః ఇత్యాదిమన్త్రాః.

ప్రణవమయాసనము నిచ్చి అస్త్రమంత్రముచే తాడనోల్లేఖనాదులు చేసిన పిదప ఈ శిలల నన్నింటిని సామాన్య రూపమున కవచమంత్రముచే అచ్ఛాదించవలెను. అస్త్రమంత్రము చివర 'హూం ఫట్‌' చేర్చి దానిని ఉచ్చరించుచు మట్టి, గోమయము, గోమూత్రము, కషాయములు, గంధయుక్తజలము- వీటితో మలస్నానము చేయించవలెను. పిమ్మట పంచగవ్య పంచామృతములతో యథావిధిగ స్నానము చేయించవలెను. గంధోదకముతో స్నానము చేయించిన పిదప స్వీయనామాంకిత మంత్రముతో శిలను ఫల-రత్న-సువర్ణ-గోశృంగజల-చందనములతో పూసి, వస్త్రములతో ఆచ్ఛాదించవలెను. స్వర్ణోత్థ మగు ఆసన మిచ్చి, యాగమండప పరిక్రమణము చేసి ఆ శిలను తీసికొని పోయి హృదయ మంత్రముతో శయ్యపై గాని, కుశాస్త రణముపై గాని పరుండబెట్టవలెను. అచట పూజించి, బుద్ధినుండి పృథివివరకును ఉన్న తత్త్వముల న్యాసము చేసి త్రిఖండ వ్యాపక తత్త్వత్రయమును ఆ శిలలపై క్రమమున న్యాసము చేయవలెను. బుద్దినుండి చిత్తమువరకును, చిత్తములోపల మాతృ కల వరకు, తన్మాత్రలు మొదలు పృథివి వరకును శివతత్త్వ-విద్యాతత్త్వ-ఆత్మతత్త్వము లున్నవి. పుష్పమాలాది చిహ్నిత స్థానములపై క్రమముగా మూడు తత్త్వములను, తదీయమంత్రములతో తత్త్వేశులను హృదయమంత్రముతోను పూజించవలెను. ''ఓం హూం శివతత్త్వాయ నమః, ఓం హాం శివతత్త్వాధిపాయ రుద్రాయ నమః ఓం విద్యాదతత్త్వాయ నమః, ఓం హాం విద్యాతత్త్వాధిపాయ విష్ణవే నమః, ఓం హాం ఆత్మతత్త్వాయ నమః, ఓం హాం ఆత్మతత్త్వాధిపతయే బ్రహ్మణ నమః'' అనునవి పూజోపయుక్తమంత్రములు. ప్రతితత్త్వమునందును, ప్రతిశిల యందును భూ-అగ్ని-యజమాన-సూర్య-జల-వాయు-చంద్ర-ఆకాశములను ఎనిమిది మూర్తుల న్యాసము చేయవలెను. పిదప క్రమముగ శర్వ-పశుపతి-ఉగ్ర-రుద్ర-భవ- ఈశాన-మహాదేవ-భీమమూర్తుల న్యాసము చేయవలెను. ''ఓం ధరామూర్తయే నమః, ఓం ధరాధిపతయే శర్వాయ నమః'' ఇత్యాదులు మూర్తి-మూర్తీశ్వర మంత్రములు. పిదప అనంతాది లోకపాలులను వారి వారి మంత్రముతో న్యాసము చేయవలెను. ల్రూం, రూం, య్రూం,వ్రూం, శ్రూం, ష్రూం, స్రూం, హ్రూం, క్ష్రూం అనునవి ఇంద్రాదిలోకపాలబీజములు. ఇది నవశిలాపక్షమున చెప్పబడినది. పంపశిలాపక్షమున ప్రత్యేక తత్త్వమయ శిలను స్పృశించి వాటిపై క్రమముగా పృథివ్యాదిమూర్తి న్యాసము చేయవలెను. బ్రహ్మ-విష్ణు-రుద్ర-ఈశ్వర-సదాశివులు ఐదురుగు మూర్తీశులు. ఈ ఐదింటిని పైన చెప్పిన ఐదు మూర్తులందును వెనుకటి వలె పూజించవలెను. ''ఓం పృథివీమూర్తయే నమః, ఓం పృథివీ మూర్త్యధిపతయే నమః'' ఇత్యాదులు పూజోపయుక్తమంత్రములు.

సంపూజ్య కలశాన్‌ పఞ్చ క్రమేణ నిజనామభిః | నిరున్దీత విధానేన న్యాసో మధ్యశిలాక్రమాత్‌. 51

కుర్యాత్ప్రాకారమన్త్రేణ భూతిదర్భైస్తిలైస్తతః | కుణ్డషు ధారికాం శక్తిం విన్యస్యాభ్యర్చ్య తర్పయేత్‌. 52

తత్త్వతత్త్వాధిపాన్మూర్తీర్మూర్తీశాంశ్చ ఘృతాదిభిః |

తతో బ్రహ్మాంశశుద్ధ్యర్థం మూలాఙ్గం బ్రహ్మభిః క్రమాత్‌. 53

కృత్వా శతాది పూర్ణాన్తం ప్రోక్ష్యాః శాన్తిజలైః శిలాః | పూజయేచ్చ కుశైః స్పృష్ట్వా ప్రతితత్త్వమనుక్రమాత్‌.

సాన్నిధ్యమథ సన్ధానం కృత్వా శుధ్ధం పునర్న్యసేత్‌ | ఏవం భాగత్రయే కర్మ గత్వా సమాచరేత్‌. 55

ఆం ఈం ఆత్మతత్త్వ విద్యాతత్త్వాభ్యాం నమః ఇతి

సంస్పృశేద్దర్భమూలాద్యైర్బ్రహ్మాఙ్గాదిత్రయం క్రమాత్‌ | కుర్యాత్తత్వాను సన్ధానం హ్రస్వదీర్ఘప్రయోగతః.

ఓం హాం ఉం విద్యాతత్త్వ శివతత్త్వాభ్యాం నమః.

ఘృతేన మధునా పూర్ణాం స్తామ్రకుమ్భాన్సరత్నకాన్‌ | పఞ్చగవ్యార్ఘ్యసంసిక్తాన్లోకపాలాధిదైవతాన్‌. 57

పూజయిత్వా నిజైర్మన్త్రైః సన్నిధౌ హోమమాచరేత్‌ | శిలానామథ సర్వాసాం సంస్మరేదధిదేవతాః . 58

విద్యారూపాః కృతస్నానాః హేమవర్ణాః శిలామ్బరాః | న్యూనాదిదోషమోషార్థం వాస్తుభూమేశ్చ శుద్దయే. 59

యజేదస్త్రేణ మూర్దాన్తమాహుతీనాం శతం శతమ్‌|

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వాస్తుప్రతిష్ఠాఙ్గశిలాన్యాసవిధిర్నామ ధ్వినవతితమో7ధ్యాయః.

ఐదు కలశలను వాటి నామమంత్రములతో పూజించి స్థాపించవలెను. మధ్య శిలాక్రమమున యథావిధిగా న్యాసము చేసి, విభూతి-కుశ-తిలలతో అస్త్రమంత్రమాటతో ప్రాకారము ఏర్పరుపవలెను. కుండములందు ఆధారశక్తి న్యాస పూజనములు, చేసి తత్త్వ-తత్త్వాధిప-మూర్తి-మూర్తీశ్వరులకు ఘృతాదులతో తర్పణము చేయవలెను. పిదప బ్రహ్మాత్మ శుద్ధి కొరకై మూలాంగము లైన బ్రహ్మమంత్రముతో క్రమముగ నూరు నూరు హోమముచేసి, పూర్ణాహుతి వరకును హోమము చేసిన పిదప శాంతి జలముతో శిలలను ప్రోక్షించి పూజించవలెను. కుశలతో స్పృశించి ప్రతేక్య తత్త్వమునందు సాంనిధ్య సంధానములు చేసి పిదప శుద్ధన్యాసము చేయవలెను. ఈ విధముగ క్రమముగా మూడు భాగములందు కర్మల చేయవలెను. ''ఓం ఆం ఈం ఆత్మతత్త్వ విద్యాతత్త్వాభ్యాం నమః'' అనునది మంత్రము. కుశ మూలాదులతో క్రమముగ ముగ్గురు తత్త్వేశాదులను స్పృశించి హ్రస్వదీర్ఘ ప్రయోగ పూర్వకముగ తత్త్వానుసంధానము చేయవలెను. అందును మంత్రము - ఓం హాం ఉం విద్యాతత్త్వ శివతత్త్వాభ్యాం నమః'' పిదప ఘృతమధు పూర్ణములును, అగ్రమున పంచగవ్యాభిషిక్తములును పంచ లోకపాలకులు దేవతలుగా కలదియు అగు పంచకలశలను, వాటి మంత్రములచే పూజించి వాటి సమీపమున హోమము చేయవలెను. పిదప సకల శిలాధి దేవతల ధ్యానము చేయవలెను. ఆ శిలాధిదేవతలు విద్యా స్వరూపులు స్నానము పూర్తి చేసికొనినారు. వాటి శరీర కాంతి బంగారము వలె దేదీప్యమానముగ నున్నది. ఉజ్జ్వలములగు వస్త్రములు ధరించి అలంకృతులైయున్నారు న్యూనతాదిదోష పరిహారార్థమును వాస్తు భూమిశుద్ధి కొరకును అస్త్రమంత్రముతో పూర్ణాహుతివరకును నూరు నూరు హోమములు చేయవలెను.

శ్రీ అగ్ని మహాపురాణమునందు ప్రతిష్ఠాంగభూతశిలాన్యాసవిధి వర్ణనమను తొంబదిరెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters