Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ అష్టసప్తతితమో7ధ్యాయః

అథ పవిత్రాధివాసనమ్‌.

ఈశ్వర ఉవాచ:

పవిత్రారోహణం వక్ష్యే క్రియార్చాదిషు పూరణమ్‌ | నిత్యం తన్నిత్యముదిష్టం నైమిత్తిక మథాపరమ్‌. 1

ఆషాడాదిచతుర్దశ్యామథ శ్రావణభాద్రయోః | సితాసితాసు కర్తవ్యం చతుర్ధశ్యష్టమీ షుతత్‌. 2

కుర్యాద్వా కార్తికీం యావత్తిధౌ ప్రతిపదాదికే | వహ్నిబ్రహ్మామ్బికౌభాస్యనాగస్కన్దార్కశూలినామ్‌. 3

దుర్గాయమేన్ద్రగోవిన్దస్మరశమ్భుసుధాభుజామ్‌ | సౌవర్ణం రాజతం తామ్రం కృతాలిషు యధాక్రమమ్‌. 4

కలౌ కార్పాసజం వాపి పట్టపద్మాదిసూత్రకమ్‌ | ప్రణవశ్చన్ద్రయా వహ్నిర్భ్రహ్మా నాగో గ్రహూ హరిః. 5

సర్వేశః సర్వదేవాః స్యుః క్రమేణ నవతన్తుషు | అష్టోత్తర శతాన్యర్థం తదర్థం చోత్తమాదికమ్‌. 6

ఏకాశీత్యాథవా సూత్రైస్త్రింశతాప్యష్టయుక్తయా | వఞ్చాశతా వా కర్తవ్యంతుల్యగ్రన్ధ్యన్తరాల కమ్‌. 7

ద్వాదశాజ్గులమానాని వ్యాసాదశష్టాజ్గులాని చ | లిఙ్గవిస్తారమానాని చతురజ్గులకాని వా. 8

ఈశ్వరుడిట్లు చెప్పెను:- ఇపుడు, క్రియా-యోగ-పూజాదులలోని లోపములను తొలగించు పవిత్రారోహణమును గూర్చి చెప్పెదను. నిత్యమను చేయు 'పవిత్రారోహణమున'కు నిత్య మనియు, ఏదైన ఒక నిమిత్తమును పురస్కరించుకొని చేయు దానికి నైమిత్తిక మనియు పేర్లు. అషాఢమాసములోని మొదటి చతుర్దశియందు, శ్రావణభాద్రపదమాసములలో రెండు పక్షముల చతుర్దశులందును. అష్టమీ తిథులందును పవిత్రారోహణకర్మ చేయవలెను. లేదా అషాఢపూర్ణిమనుండి కార్తికపూర్ణిమ వరకును, ప్రతిపత్తు మొదలగు తిధులందు విభిన్న దేవతలకొరకై పవిత్రారోహణము చేయవలెను. ప్రతిపత్తునందు అగ్నికిని, ద్వితీయయందు బ్రహ్మకును, తృతీయయందు పార్వతికిని, చతుర్ధియందు గణశునకును, పంచమినాడు నాగరా జైన అనంతునతు, షష్ఠినాడు స్కందునకు, సప్తమినాడు సూర్యునకును, అష్టమినాడు శివునకు, నవమినాడు దుర్గకుమ, దశమి నాడు యమునకును, ఏకాదశినాడు ఇంద్రునకును, ద్వాదశినాడు గోవిందునకును, త్రయోదశియందు కామదేవునకును, చతుర్ధశి నాడు శివునకును, పూర్ణిమనాడు అమృతాశీను లగు దేవతలకును పవిత్రారోపణము చేయవలెను. కృత-త్రేతా-ద్వాపర యుగములందు క్రమముగ బంగారము- వెండి-రాగి పవిత్రకములు అర్పింపబడును కాని కలియుగమునందు పత్తి, పట్టు కమలనాఫలములు మొదలగువాటి దారములతో నిర్మించిన పవిత్రకములు అర్పింపండును పవిత్రకమునందలి తొమ్మిది దారములకును వరుసగ ఓంకార-చంద్ర-అగ్ని-నాగగణ-స్కంద-శ్రీహరి-సర్వేశ్వరసకలదేవతలు అదిష్ఠానదేవతలు.నూట ఎనిమిది దారములతో నిర్మించిన పవిత్రకము ఉత్తమశ్రేణికి చెందినది. ఏబదినాల్గు సూత్రములున్నది మధ్యమము; ఇరువదియేడు సూత్రము లున్నది అధమము. లేదా ఎనుబదియొక్క సూత్రములు, ఏబది సూత్రములు, ముప్పది ఎనిమిద సూత్రములు ఉన్న పవిత్రకమును నిర్మించవలెను. గ్రంధుల మధ్యనున్న వ్యవధానము సమముగా నుండవలెను. పవిత్రముల విస్తారభా పండ్రెండు అంగుళములుగాని, ఎనిమిది అంగుళములుగాని, నాలుగు అంగుళములుగాని ఉండవలెను. శివలింగమునకై నిర్మించు పవిత్రకము ఆ లింగ మంత ప్రమాణముకలదై ఉండవలెను.

తథైవ పిణ్డికాస్పర్శం చతుర్థం సర్వదైవతమ్‌ | గజ్గావతారకం కార్యం సూజాతేన సుధౌతకమ్‌. 9

గ్రన్దిం కుర్యాచ్చ వామేన అఘోరేణాథ శోధయేత్‌ | రజ్జయేత్పురుషేణౖవ రక్తచన్ధనకుజ్కుమైః. 10

కస్తూరీరోచన్ధ్రెర్హరిద్రాగైరికాదిభిః | గ్రన్ధయో దశ కర్తవ్యా అథవా తన్తుసంఖ్యయా. 11

అన్తరం వా యథాశోభ##మేకద్విచతురజ్గులమ్‌ | ప్రకృతిః పౌరుషే వీరా చతుర్థీ త్వపరాజితా. 12

జయాన్యా విజయా షష్ఠీ అజితా చ సదాశివా | మనోన్మనీ సర్వముఖీ గ్రన్ధయో7భ్యధికాఃశుభాః. 13

కార్యావా చన్ద్రవహ్న్యర్కపవిత్రం శివవద్ధృది | ఏకైకం నిజమూర్తౌ వా పుస్తకే గురుకే గణ. 14

అన్ని దేవతామార్తులకును ఉపయోగించు నాల్గవ విధమగు పవిత్రకము ఆ దేవతామూర్తితో కాని, దాని పిండితోగాని సమముగా నుండును. దీనికి"గంగావతారకము" అని పేరు. దీనిని సద్యోజాతమంత్రముతో బాగుగా శుభ్రము చేసి, వామదేవమంత్రముతో గ్రంథి వేసి, అఘోరమంత్రముతో శుద్ధి చేసి, తత్పురుష మంత్రముతో రక్తచందనము, కుంకుమము పూయవలెను. లేద కస్తూరి, గోరోచనము, కర్పూరము, పసుపు గైరికము మొదలగునవి కలిపి చేసిన రంగుపూయవలెను. పది గ్రంథులు కాని, ఎన్ని తంతువులు లున్నవో అన్ని గ్రంథులు కాని వేయవలెను. ఒక గ్రంధినుండి మరొక గ్రంథి దగ్గరకు ఒక అంగుళము గాని, రెండు అంగళము గాని, నాలుగు అంగుళములు గాని దూర ముండవలెను. అందముగా ఉండు విధమున దూర ముంచవలెను. ప్రకృతి, పౌరుషి, వీర, అపరాజిత, జయ, విజయ, సదాశివ, మనోన్మని, సర్వతోముఖి అనువారు పది గ్రంధుల అదిష్ఠానదేవతలు, పది కంటె ఎక్కువ గ్రంధులు కూడ అందముగా వేయవలెను. పవిత్రకము చంద్రమండల- అగ్నిమండల-సూర్యమండలములతో కూడి యున్నట్లు భావనచేయుచు, అది సాక్షాత్తు శివునితోతుల్యమైన దని భావించుచు హృదయమునందు ధరించవలెను. శివరూపునిగా భావించిన తనకును, పుస్తకమునకును, గురుగణమునకును ఒక్కొక్క పవిత్రకమును సమర్పించవలెను.

సాద్యేకైకం తథా ద్వారదిక్పాలకాలశారిషు | హస్తాది నవహస్తాన్తం లిఙ్గానాం స్యాత్పవిత్రకమ్‌. 15

అష్టవింశతితో వృద్ధం దశభిర్దశభిః క్రమాత్‌ |

ద్వ్యజ్గులాభ్యన్తరాస్తత్రక్రమాదీకాజ్గులాన్తరాః. 16

గ్రన్దయో మానమష్యేషాం లిఙ్గవిస్తారసంమితమ్‌ | సప్తమ్యాం వా త్రయోదశ్యాం కృతనిత్యక్రియః శుచిః.

భూషయేత్పుష్పవస్త్రాద్యైః సాయాహ్నే యాగమన్దిరమ్‌. |

కృత్వా నైమిత్తికీం సన్ధ్యాం విశేషేణ చ తర్పణమ్‌. 18

పరిగృహేతే భూభాగే పవిత్రే సూర్యమర్చయేత్‌ | ఆచమ్య సకలీకృత్య ప్రణవార్ఘ్యకరో గురుః. 19

ద్వారాణస్త్రేణ సంప్రోక్ష్య పూర్వాదిక్రమతో ర్చయేత్‌ | హాం శాన్తికలాద్వారాయ తథా విద్యాకలాత్మన్‌. 20

నివృత్తికలాద్వారాయ ప్రతిష్ఠాఖ్యకలాత్మనే | తచ్ఛాఖయోః ప్రతిద్వారాం ద్వౌ ద్వౌ ద్వారాధిపౌ యజేత్‌. 21

నన్దినే మహాకాలాయ భృఙ్గిణ7థ గణాయ చ | వృషభాయ చ స్కన్దాయ దేవ్యై చణ్డాయ చ క్రమాత్‌. 22

ద్వారపాల - దిక్పాల - కలశాదులపై గూడ ఒక్కొక్క పవిత్రకము ఉంచవలెను. శివలింగములకు అర్పించు పవిత్రకము పొటవు ఒక హస్తము మొదలు తొమ్మిది హస్తముల వరకును ఉండును. ఒ హస్తము పొడవైన పవిత్రకము నందు ఇరువది ఎనిమది గ్రంథు లుండును. పిమ్మట క్రమముగ పదేసి గ్రంథులు పెంచవలెను. ఈ విధముగ తొమ్మిది హస్తముల పవిత్రకము నందు నూట ఎనిమిది గ్రంథ లుండును. ఈ గ్రంథుల మధ్య వ్యవధానము ఒకటి రెండేసి అంగుళము లుండును. వీటి మానము కూడ లింగ విస్తారమును బట్టి యుండును. ఉపాసకుడు సప్తమీదివసమున గాని, త్రయోదశీ దివసమున గాని, నిత్యకర్మాదులు ముగించుకొని సాయంకాలమున పుష్ప వస్త్రాదులతో యాగ గృహమును అలంకరించవలెను. నైమిత్తిక సంధ్యోపాసన చేసి, విశేషతర్పణములు చేసి, పిమ్మట పూజార్థమై నిశ్చితమైన పవిత్రభూమి భాగమునందు సూర్యుని పూజింపవలెను. ఆచార్యుడు, అచమనము, సకలీకరణము పూర్తిచేసి ప్రణవోచ్ఛారణ పూర్వకముగ అర్ఘ్యపాత్రమును హస్తమున గ్రహించి, అస్త్రమంత్రము (ఫట్‌) ఉచ్చరించుచు క్రమముగ పూర్వాదిదిక్కులందున్న ద్వారములను ప్రోక్షించి పూజించవలెను. "హాం శాన్తికలాద్వారాయనమః, హాం విద్యాకలాద్వారాయ నమః హాం నివృత్తికలాద్వారాయ నమః హాం ప్రతిష్ఠాకలాద్వారాయ నమః " అను మంత్రములతో పూర్వాది దిగ్ద్వారములు పూజా చేయవలెను. ప్రతిద్వారమునకును కుడి - ఎమడ ప్రక్కలనున్న ఇద్దరిద్దరు ద్వారాపలకులను పూజించవలెను, తూర్పున "నన్దినే నమః" "మహాకాలాయ నమః" అను మంత్రములతో నంది - మహాకాలులను, దక్షిణమున - "భృఙ్గిణ నమః" ''గణాయ నమః" అను మంత్రములతో భృంగి - గణములను, పశ్చిమమున "వృషభాయ నమః" " స్కన్దాయ నమః" అను మంత్రములతో వృషభ - స్కందులను, ఉత్తరమున "దేవ్యై నమః" "చణ్డాయ నమః" అను మంత్రములతో దేవీ - చండులను పూజించవలెను.

నిత్యం చ ద్వారపాలాదీన్‌ ప్రవిశ్య ద్వారపశ్చిమే | ఇష్ట్వా వాస్తుం భూతశుద్ధిం విశేషార్ఘ్యకరః శివః. 23

ప్రోక్షణాద్య విధాయాథ యజ్ఞసంభారకృన్నరః | మన్త్రయేద్దర్భదూర్వాద్యైః పుష్పాద్యైశ్చ హృదాదిభిః 24

శివహస్తం విధాయేత్థం స్వశిరస్యధిరోపయేత్‌ | శిరోహమాది ః సర్వోజ్ఞో మమ యజ్ఞప్రధానతా. 25

అత్యర్థం భావయేద్దేవం జ్ఞానఖడ్గకరో గురుః | నైరృతీం దిశమాస్థాయ ప్రక్షిపేదుదగాననః. 26

అర్ఘ్యమ్బు పఞ్చగవ్యం చ సమన్తాన్మఖమణ్డపే వ| చతుష్పథాన్త సంస్కారైర్వీక్షణాద్యైఃసు సంస్కృతైః. 27

విక్షిప్య వికిరాంస్తత్ర కుశకూర్చ్యోపసంహరేత్‌ | తానాశదిశివర్థన్యా మాసనాయోప కల్పయేత్‌. 28

ద్వారపాలాదినిత్య పూజానంతరము పశ్చిమద్వారము నుండి యాగగృహము ప్రవేశించి, వాస్తుదేవతాపూజ చేసి, భూతశుద్ధి చేయవలెను. విశేషార్ఘ్యము చేత గ్రహించి, తనను శివస్వరూపునిగ భావించుచు, పూజసామగ్రిని ప్రోక్షణాదికము చేసి యజ్ఞభూమిసంస్కారము చేయవలెను. పిమ్మట కుశలు, దూర్వలు, పుష్పములు మొదలగు వాటిని హస్తమునందు గ్రహించి 'నమః' మొదలగునవి ఉచ్చరించుచు వాటిని అభిమంత్రించవలెను. ఈ విధముగ శివహస్తవిధానము చేసి, దానిని తన శిరస్సుపై ఉంచుకొని "నేనేఅన్నింటికిని మూలకారణమైన, సర్వజ్ఞుడైన శివుడను యజ్ఞమునందు నాకే ప్రాధాన్యము" అని భావన చేయుచు, శివధ్యానము చేయుచు, ఆచార్యుడు జ్ఞాన మనెడు ఖడ్గమును హస్తమునందు గ్రహించి, నైరృతిదిక్కు వైపు వెళ్ళి, ఉత్తరాభిముకుడై, అర్ఘ్యజలమును ఇచ్చి, యజ్ఞమండపము నలు వైపులందును పంచగవ్యములు చల్లవలెను. చతుష్పదాంత సంస్కారము ఉత్తమ సంస్కారయుక్త దీక్షణము మొదలగునవి చేసి, అచట తెల్ల ఆవాలు మొదలగునవి చల్లి, కుశనిర్మిత మగు కూర్బతో వాటిని ఉపసంహరించవలెను. పిమ్మట వాటితో, ఈశాన్యమునందు వర్ధనీ-కలశములను స్థాపించుటకు ఉపయోగించు అసనము కల్పింపలెను.

నైరృతే వాస్తుగీర్వాణాన్‌ ద్వారే లక్ష్మీం ప్రపూజయేత్‌ | పశ్చిమాభిముఖం కుమ్భం సర్వధాన్యోపరి స్థితమ్‌. 29

ప్రణవేన వృషారూఢం సింహస్థానం వర్ధనీం తతః | కుమ్భే సాఙ్గం శివం దేవం వర్థన్యామస్త్రమర్చయేత్‌. 30

దిక్షు శక్రాది దిక్పాలాన్‌ విష్ణుబ్రహ్మశివాదికాన్‌ | వర్థనీం సమ్యగాదాయ ఘటపృష్ఠానుగామనీమ్‌. 31

శివాజ్ఞాం శ్రావయేన్మన్త్రీ పూర్వాదీశాన గోచరామ్‌ | అవిచ్ఛిన్నపయోధారాం మూలమన్త్రముదారయేత్‌. 32

సమాన్తాద్భ్రమయేదేనాం రక్షార్థం శస్త్రరూపిణీమ్‌ | పూర్వం కలశమారోక్ష్య శస్త్రార్థం తస్య వామతః. 33

సమగ్రాసనకే కుమ్భే యజేద్దేవం స్తిరాసనే | వర్ధన్యాం ప్రణస్థాయా మాయుధం తదనుద్వయోః. 34

భగలిఙ్గసమాయోగం నిదధ్యాల్లిఙ్గ ముద్రయా | కుమ్భే నివేద్య బోధాసిం మూలమన్త్రజపం తథా. 35

తద్దశాం శీన వర్థన్యాం రక్షాం విజ్ఞాపయేదపి | గణశం వాయవే7భ్యర్చ్య హరం పఞ్చామృతాదిభిః. 36

స్నాపయేత్పూర్వవత్ప్రార్చ్య కుణ్డ చ శివపావకమ్‌ | విధివచ్చ చరుం దత్వా సంపాతాహుతి శోధితమ్‌. 37

దేవాగ్న్నాత్మవిభేదేన దర్వ్యా తం విభ##జేత్రిధా | దత్త్వా భాగౌ శివాగ్నిభ్యాం సంరక్షేధ్బాగమాత్మని. 38

పిదప నైరృతి దిక్కున వాస్తుదేవతలను, ద్వారమునందు లక్ష్మిని పూజించి, పశ్చిమాభిముక మగు కలశమును సప్తధాన్యములపై నుంచి - "శివస్వరూప మగు ఈ కలశము నందికేశ్వరుని పృష్టముపై ఎక్కినది" అని భావించవలెను. "వర్దని సింహముపై ఎక్కినది" అని భావన చేయవలెను. కలశముపైన సాంగశివుని పూజించి, వర్దనిపై అస్త్రమును పూజించి, పూర్వాదిదిక్కులందు ఇంద్రాదిదిక్పాలకులను, మండపమధ్యభాగమున బ్రహ్మను విష్ణుశివాదులను పూజించవలెను. కలశపృష్ఠభాగమును అనుసరించి యున్న వర్ధనిని చక్కగ హస్తమునందు గ్రహించి, మంత్రజ్ఞు డగు గురువు, శివుని ఆజ్ఞను వినిపించవలెను. ప్రదక్షిణక్రమమున తూర్పునుండి ఈశాన్యము వరకును అవిచ్ఛిన్నజలధార విడచుచు మూలమంత్రము నుచ్చరించవలెను. యజ్ఞమండపరక్షకొరకై శస్త్రరూప మగు వర్ధనిని నాల్గుప్రక్కల త్రిప్పవలెను. ముందుగకలశను స్థాపించి, దాని వామభాగమున, వస్త్రము కొరకై వర్ధని స్థాపించవలెను. ఉత్తమము, స్థిరముఅగు ఆసనముపై నున్న కలశముపై శివుని, ప్రణవముపై ఉన్న వర్ధనిపై శివుని ఆయుధములను పూజించవలెను. లింగముద్రచే ఆ రెండింటిని కలిపి భగలింగసంయోగమును కల్పింపవలెను. కలశముపై జ్ఞానరూప మగు ఖడ్గమును సమర్పించి మూలంమంత్రజపము చేయవలెను. ఆ జపములో దశాంశహోమము చేసి వర్ధనిలో రక్షను ఘోషించవలెను. వాయవ్యమున గణశపూజ చేసి, పంచామృతాదులతో శివునకు స్నానము చేయించి, పూర్వము చెప్పిన విధమున పూజ చేసి కుండమునందు అగ్నిరూపుడగు శివుని పూజించవలెను. యధావిధిగ చరువు వంచి, సంపాతాహుతివిధానముచే దానిన శోధించి, పిమ్మట శివుడు, అగ్ని, ఆత్మ (తాను) అను ముగ్గురు అధికారులకై చిన్న గరిటెతో ఆ చరువును మడు భాగములు చేసి శివ-అగ్నికుండమునందు సమర్పించి, తన భాగమున సురక్షితముగ ఉంచుకొనవలెను.

శ##రేణ వర్మణాం దేయం పూర్వతో దన్తధావనమ్‌ | తస్మాద్ఘోరశిఖభ్యాం దక్షిణ పశ్చిమాం మృదమ్‌.

సద్యోజాతేన చ హృదా చోత్తరే వామనీకృతమ్‌ | జలంవామేన శిరసా ఈశేగన్ధాన్వితం జలమ్‌. 40

పఞ్చగవ్యం పలాశాదిపుటకం వై సమన్తతః | ఈశాన్యం కుసుమం దద్యా దాగ్నేయ్యాం దిశి రోచనామ్‌. 41

అగురుం నైరృతాశాయాం వాయవ్యాం చ చతుఃసమమ్‌ |

హోమద్రవ్యాణి సర్వాణి సద్యోజాతైః కుశైః సహ. 42

దణ్డాక్షసూత్రకౌపీన భిక్షాపాత్రాణి రూపిణ | కజ్జలం కుజ్కుమం తైలం శలాకాం కేశశోధినమ్‌. 43

తామ్బూలం దర్పణం దద్యాదుత్తరే రోచనామపి | ఆసనం పాదుకే పాత్రం యోగపట్టాతపత్రకమ్‌. 44

ఈశాన్యామీశమన్త్రేణ దద్యాదీశాన తుష్టయే | పూర్వస్యాం చరుకం సాజ్యం దద్యాద్గన్ధాదికం నవే. 45

పవిత్రాణి సమాదాయ ప్రోక్షితాన్యర్ఘ్యవారిణా | సంహితమన్త్ర పూతాని నీత్వా పావకసన్నిధిమ్‌. 46

కృష్ణాజినాదినాచ్ఛాద్య సృరన్సంవత్సరాత్మకమ్‌ | సాక్షిణం సర్వకృతానాం గోప్తారం శివమవ్యయమ్‌. 47

స్వేతి హేతిప్రయోగేణ మన్త్రసంహితయా పునః శోధమేచ్చ పవిత్రాణి వారాణామేకవింశతిమ్‌. 48

గృహాది వేష్టయేత్సూత్రైర్గన్ధాద్యం రవయే దదేత్‌ | పూజితాయా సమాచమ్య కృతన్యాసః కృతార్ఘ్యకః. 49

నన్ద్యాదిభ్యో7థ గన్దఖ్యం వాస్తోశ్చాథ ప్రవిశ్య చ | శ##స్త్రేభ్యో లేకపాలేభ్యః స్వనామ్నా శివకుమ్భకే. 50

తత్పురుషమంత్రమునకు 'హుం' చేర్చి ఉచ్చరించుచు తూర్పున ఇష్టదేవతకు దంతధావనమును సమర్పింపవలెను. అఘోరమంత్రమునకు "పషట్‌" చేర్చి ఉచ్చరించుచు ఉత్తరమున ఉసిరికాయ సమర్పించవలెను. వామదేవమంత్రమునకు "స్వాహా" చేర్చి ఉచ్చరించుచు జలము నివేదించవలెను. ఈశానమంత్రముతో, ఈశాన్యమునందు సుగంధితజలమును సమర్పింపవలెను. పంచగవ్యములు, పలాశములు మొదలగువాటి దొన్నెలు అన్ని దిక్కులందును ఉంచవలెను. ఈశాన్యమున పుష్పములు, అగ్నేయమున గోరోచనము, నైరృతియందు అగురు, వాయవ్యమున చతుఃసమమును (రెండు పాళ్లు కస్తూరి, నాల్గు పాళ్లు చందనము, మూడు పాళ్లు కుంకుమము, మూడు పాళ్లు "కర్పూరము కలిపి చేసిన గంధద్రవ్యము చతుః సమము) సమర్పించవలెను. లేతాకులతో కూడ సమస్తహోమద్రవ్యములను సమర్పింపవలెను. దకము, అక్షసూత్రము, కౌపీనము, భిక్షాపాత్రము కూడ దేవతావిగ్రహమునకు సమర్పించవలెను. కాటుక, కుంకుమము, సుగంధతైలము, కేశములను శుద్ధములను చేయు దువ్వెన, తాంబూలము, అద్దము, గోరోచనము కూడ ఉత్తరమునందు సమర్పింపవలెను. ఆసనము పాదుకలు, పాత్రములు, యోగపట్టము, ఛత్రము కూడ ఈశాన్యము నందు ఈశానమంత్రము పఠించు శివుని అనుగ్రహము సంపాదించుటకై సమర్పింపవలెను. తూర్పునందు అజ్యసహిత మగు చదువును గంధాదులును సమర్పించవలెను. అర్ఘ్యజలముచే ప్రక్షాళితములై, సంహితామంత్రముచే శోధింపబడిన పవిత్రకములను తీసికొని అగ్ని సమీపమునకు వెళ్లవలెను. కృష్ణమృగచర్మాదులచే వాటిని కప్పి ఉంచవలెను. సమస్తకర్మ సాక్షియు, సంరక్షకుడును, సంవత్సరస్వరూపుడు అగుభగవంతు డగు శివుడు దానిలో నున్నట్లు భావన చేయవలెను. 'స్వా' 'హా' అను అక్షరములను ప్రయోగించుచు, మంత్రసంహితలు పఠించుచు, ఇరువదియొక్క పర్యాయములు ఆ పవిత్రకములను శోధించవలెను. పిమ్మట గృహాదులను సూత్రముతలతో చుట్టి, సూర్యునకు గంధపుష్పాదులు సమర్పించి, అచమనపూర్వకముగ అర్ఘ్యప్రదానము చేయవలెను. న్యాసము చేసి నంది మొదలగు ద్వారపాలకులకును, వాస్తుదేవతకును గంధాదులను సమర్పించవలెను. పిమ్మట యజ్ఞమండపము ప్రవేశించి శివకలశము మీద నాల్గు ప్రక్కలను ఇంద్రాదిలోకపాలులను, వారి శస్త్రములను నామమంత్రములతో పూజించవలెను.

వర్ధన్యై విఘ్నరాజాయ గోరవే హ్యాత్మనే యజేత్‌ | అథన్త్య్రసర్వౌషధిలిప్తం ధూపితం పుష్పదూర్యయా.

అమన్త్రచ పవిత్రం తద్విధాయాఞ్జవిమధ్యగమ్‌ | ఓం సమన్తవిధిచ్ఛద్రపూరణ చ విధిం ప్రతి. 52

ప్రభవాన్మన్త్రయామి త్వాం త్వదిచ్ఛావాప్తికారికామ్‌ | తత్సిద్ధిమనుజానీహి యజితశ్చిదచితృతే. 53

సర్వాధా సర్వదా శమ్భో నమస్తే7స్తు ప్రసీద మే | అమన్త్రితో7సి దేవేశ సహ దేవ్యా గణశ్వరైః. 54

మన్త్రేశైర్లోకపాలైశ్చ సహితః పరిచారకైః | నిమన్త్రయామ్యహం తుభ్యం ప్రభాతే తు పవిత్రకమ్‌. 55

నియమం చ కరిష్యామి పరమేశ తదాజ్ఞయా | ఇత్వేవం దేవమామన్త్య్రరేచ కేనామృతీ కృతమ్‌. 56

శివాన్తం మూలముటచ్చార్య తచ్ఛివాయ నివేదయేత్‌ |

జపం స్తోత్రం ప్రణామం చ కృత్వా శమ్భుం క్షమాపయేత్‌. 57

హుత్వా చరోన్త్రతీయాంశం తద్దదీత శివాగ్నయే | దిగ్వాసిభ్యో దిగీశేభ్యో భూతమాతృగణభ్య ఉ. 58

రుద్రేభ్యః క్షేత్రపాదిభ్యో నమః స్వాహా బలిస్త్వయమ్‌ |

దిఙ్నాగాద్యైశ్చ పూర్వాదౌ క్షేత్రాయ చాగ్నయే బలిః. 59

సమాచమ్య విధిచ్ఛిద్రపూరకం హోమమాచరేత్‌ | పూర్ణం వ్యాహృతిహోమం చ కృత్వా రున్దీత పావకమ్‌. 60

పిమ్మట వర్ధనిని, విఘ్నేశ్వరుని, గురువును, తనను పూజించవలెను. నర్వౌషధిలిప్తము. ధూపదూషితము. పుష్పదూర్వాది పూజితము అగు పవిత్రకమును అంజలిలో ధరించి, శివుని ఈ విధముగ ప్రార్థించవలెను." సర్వకారణభూతుడవును (చేతనాచేతన ప్రభువును అగు పరమేశ్వరా: పూజలో జరిగిన లోపములను తొలగించుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. సకల మనోరథములను సఫలము చేయు సిద్ధి నిమ్మని కోరుచున్నాను. నిన్ను ఆరాంధించుచున్న నాకు అట్టి సిద్ధిని ఇమ్ము. శంభో నీకు సర్వదా నమస్కరింతును. ప్రసన్నడవుకమ్ము. దేవేశ్వరా! పార్వతీదేవి తోడను, గణశ్వరులతోడను నిన్నాహ్వానించుచున్నాను. మంత్రాధిపతులతోడను, లోకపాలకులతోడను, సేవకులతోడను కలసి ఇచటకి దయచేయుము. నీ ఆజ్ఞానుసారము రేపు ప్రాతఃకాలమునందు, పవిత్రరోపణమును, చేసి దానికి సంబంధించిన నియమములను అనుసరింతును." ఈ విధముగ శివుని ఆవాహన చేసి, లేచక ప్రాణాయామముతో అమృతీకరణక్రియ పూర్తి చేసి, మూలమంత్రము జపించి దానిని శిశువునకు సమర్పించవలెను. జప-స్తోత్ర-ప్రణామాదులు చేసి నా లోపముల నన్నింటిని క్షమింపుమని శువుని ప్రార్థించవలెను. పిమ్మట చదువులోని మూడవభాగమును హోమముచేయవలెను. దానిని శివ స్వరూపుడగు అగ్నికిని, దిక్కులలో నివసించువారికిని దిక్పాలకులకును, భూతగణములకును మాతృగణములకును, ఏకాదశరుద్రులకును, క్షేత్రపాలాదులకును, వారి నామమంత్రములకు "నను - స్వాహా" చేర్చి ఆహుతి రూపమున సమర్పించవలెకు. పిమ్మట ఈ దేవతల చతుర్థ్వంతనామములకు "అయం బలిః" అను పదములు చేర్చి బలి సమర్పింపవలెను. పూర్వాది దిక్కలందు దిగ్గజాదులకును, దిక్పాలకులకును, క్షేత్రపాలునకును, అగ్నికిని బలి సమర్పించవలెను. పిమ్మట పూర్ణాహుతి-వ్యాహృతి హోమములు చేసి అగ్నిదేవుని అవరుద్ధుని చేయవలెను.

తత ఓమగ్నయే స్వాహా సోమాయ చైవహి | ఓ మగ్నేషోమాభ్యాం స్వాహా7గ్నయే స్విష్టకృతే తథా. 61

ఇత్యాహుతిచతుష్కం తు దత్వా కుర్వాత్తు యోజనామ్‌ | వహ్నికుణ్డార్చితం దేవం మణ్డలాభ్యర్చితే శివే. 62

నాడీసన్ధానరూపేణ విధినా యోజయేత్తతః | వంశాదిపాత్రే విన్యస్య అస్త్రం చ హృదయం తతః. 63

అధిరోప్య పవిత్రాణి కలాభిర్వాథ మన్త్రయేత్‌ |

షడఙ్గం బ్రహ్మమూలైర్వా హృద్వార్మాస్త్రం తు యోజయేత్‌. 64

విధాయ సూత్రైః సంవేష్ట్య పూజయిత్వాఙ్గసంభ##వైః | రక్షార్థం జగదీశాయ భక్తినమ్రః సమర్పయేత్‌. 65

పూజతే పుష్పధూపాద్యై ర్థత్త్వాసిద్దాన్తపుస్తకే | గురోః పాదాన్తికం భక్త్యా దద్యాత్పవిత్రకమ్‌. 66

నిర్గత్వ బహిరాచమ్య గోమయే మణ్డలత్రయే | పఞ్చగవ్య చరుం దన్తధావనం చ క్రమాద్యజేత్‌. 67

ఆచాన్తో మన్త్రసంబద్ధః కృతసజ్గేతజాగరః | స్వపేదన్తఃస్మరన్నీశం

బుభక్షుర్దర్భసంస్తరే. 68

అనేనైవ ప్రకారేణ ముముక్షారపి సంవిశేత్‌ | కేవలం భస్మశయ్యాయాం సోపవాసః సమాహితః. 69

ఇత్యాదిమహాపురాణ అగ్నేయే పవిత్రారోహణవిధిర్నా మాష్టషష్టితమో7ధ్యాయ.

పిమ్మట "ఓం అగ్యయే స్వాహా" "ఓం సోమాయ స్వాహా" అగ్నేషోమాభ్యాం స్వాహా" "ఓం అగ్నయే స్విష్డకృతే స్వాహా" అను నాలుగు మంత్రములతో నాలుగు ఆహుతు లిచ్చి, తరువాతి పనులను ఏర్పాటుచేసికొనవలెను. అగ్ని కుండములో పూజింపబడిన ఆరాధ్యదేవత యగు శివుని పూజామండలమునందు పూజింపబడిన కలశస్థశివునితో నాడీసంధానవిధిచే కలిపివేయవలెను. 'ఫట్‌' 'నమః' అని ఉచ్చరించుచు అస్త్రన్యాసహృదయన్యాసములు చేసి పవిత్రముల నన్నింటి వెదురుబుట్ట వంటి పాత్రలో ఉంచవలెను."శాన్తికలాత్మనే నమః","విద్యాకలాత్మనే నమః", "నివృత్తికలాత్మనే నమః"."ప్రతిష్ఠాకలాత్మనే నమః", "శాన్త్యతీతకలాత్మనే నమః" అను కలామంత్రములతో వాటిని అభిమంత్రించవలెను. పిదప ప్రణవమంత్రముతోగాని, మూలమంత్రముతో గాని షడంగన్యాసము చేసి "నమః" "హుం" "ఫట్‌" ఉచ్చరించుచు వాటిపై క్రమముగ హృదయ-కవచ-అస్త్రములను సంబంధింపచేసి, వాటినన్నింటిని సూత్రములతో చుట్టబెట్టవలెను. పిదప "నమః" "స్వాహా" "వషట్‌" 'హుం' 'వేషట్‌' 'ఫట్‌' అను అంగమంత్రములతో వాటినన్నింటిని పూజించి, భక్తినమ్రుడై, వాటి రక్షకొరకై, శివునను సమర్పించవలెను. పుష్ప-ధూప-దీపాదలతో పూజించబడిన సిద్ధాంతగ్రంథముపై పవిత్రకము సమర్పించి, గరుచరణసమీపము చేరి ఆయనకు భక్తిపూర్వకముగ పవిత్రకము సమర్పింపవలెను. అచటినుండి బైటకు వచ్చి, ఆచమనము చేసి, గోమయముతో అలికిన మండలత్రయముపై, వరుసగ పంచగవ్యమను, చదువును, దంతధావనమును పూజించవలెను. పిమ్మట అచమనము చేసి మంత్రముచే అమృతుడై రక్షణము కల్పించుకొన్న సాధకుడు రాత్రి యంతయు సంగీతముతో జాగరము చేయవలెను. భోగములు కోరువాడు, అర్థరాత్రి దాటిన పిమ్మట శివుని స్మరించుచు, కుశాసనముపై నిద్రించవలెను. మోక్షేచ్ఛకలవాడు, ఈ విధముగనే జాగారము చేసి, ఉపవాసపూర్వకముగ ఏకాగ్రచిత్తుడై భస్మశయ్యపై నిద్రించవలెను.

అగ్నిమహాపురాణమునందు పవిత్రారోహణవిధి యను డెబ్బది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters