Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథషట్సప్తతితమో7ధ్యాయః

అథ చణ్డపూజావిధిః

ఈశ్వర ఉవాచ:

తతః శివాన్తికం గత్వా పూజాహోమాదికం మమ | గృహాణ భగవన్‌ పుణ్యఫలమిత్యభిధాయ చ. 1

అర్ఘ్యోదకేన దేవాయ ముద్రయోద్భవ సంజ్ఞయా | హృద్బీజపూర్వమూలేన స్థిరచిత్తో నివేదయేత్‌ 2

తతః పూర్వవదభ్యర్చ్యస్తుత్వా స్తోత్త్రెః పుణమ్య చ అర్ఘ్యం పరాజ్ముఖం దత్వా క్షమస్యేత్యభిధాయ చ. 3

నారాచముద్రయా స్త్రేణ ఫడన్తేనాత్మసఞ్చయమ్‌ | సంహృత్య దివ్యాయా లిఙ్గం మూర్తిన్త్రేణ యోజయేత్‌. 4

స్థణ్డిలే త్వర్చితే దేవీ మన్త్రసంఘాతమాత్మని | నియోజ్య విధినోక్తేన విదధ్యాచ్చణ్డపూజనమ్‌. 5

ఈశ్వరుడు పలికెను: స్కందా! పిమ్మట శివవిగ్రహము దగ్గరకు వెళ్ళి "పరమేశ్వారా! నేను చేసిన హోమపూజాదులవలన కలిగిన పుణ్యమును గ్రహింపుము" అని ప్రార్థించి, స్థిరచిత్తుడై 'ఉద్భవ' ముద్రచూపి, అర్ఘ్యజలముతో, 'నమః' చేర్చిన పూర్వోక్తమూలమంత్రము చదువుచు ఇష్టదేవతకు అర్ఘ్యము సమర్పింపవలెను. పిమ్మట వెనుకటివలనే పూజించి, స్త్రోత్రములతో, స్తుతించి, నమస్కరించి, పరాజ్ముఖుడై అర్ఘ్యమిచ్చి, "ప్రభో! నా అపరాధములను క్షమించుము" అని పలుకుచు ననారాచముద్ర చూపి, "అస్త్రాయ ఫట్‌" అని ఉచ్చరించుచు సమస్త సంగ్రహములను తనలో ఉపసంహారము చేసికొని, శివలింగమును మూర్తి మంత్రములతో అభిమంత్రించవలెను. వేదికపై ఇష్టదేవతాపూజ చేసి, మంత్రమును తనలో విలీనము చేసికొని పూర్వోక్తవిధమున చండుని పూజ చేయవలెను.

ఓం చణ్డశానాయ నమో మధ్యతశ్చణ్డమూర్తయే |

ఓం ధూలిచణ్డశ్వరాయ హూం ఫత్‌ స్వాహా తమాహ్యయేత్‌. 6

చణ్డం హృదయాయ హుం ఫట్‌ ఓం చణ్డశిరశే తధా | ఓం చణ్డీశిభాయై హూం ఫట్‌ చణ్డాయుఃకవచా య.

చణ్డాస్త్రాయ తథా హూం ఫట్‌ చణ్డం రుద్రాగ్నిజం స్మరేత్‌ |

శూలటఙ్కధరం కృష్ణం సాక్షసూత్రకమణ్డలమ్‌. 8

టఙ్కకారే7ర్థచన్ద్రే వా చతుర్వక్త్రం ప్రపూజయేత్‌ | యథాశాక్తి జపం కుర్యాదఙ్గానాం తు దశాంశతః. 9

గోభూహిరణ్యవస్త్రాది మణి హేమాది భూషణమ్‌| విహాయ శేషనిర్మాల్యం చణ్డశాయ సమప్రయేత్‌. 10

లేహ్య చోష్యాద్యన్నవరం తామూ%ృలం స్రగ్విలేపనమ్‌.

నిర్మాల్యం భోజనం తుభ్యం ప్రదత్తం తు శివాజ్ఞయా . 11

సర్వమేతత్క్రి యకాణ్డం మయా చణ్డ తవాజ్ఞయా | న్యూనాధికం కృతం మోహాత్పరిపూర్ణం సదాస్తు తే. 12

ఇతి విజ్ఞాప్య దేవేశం దత్త్వార్ఘ్యం తస్య సంస్మరన్‌ | సంహారమూర్తిమన్త్రేణ శ##నైః సంహారముద్రయా. 13

పూరకాన్వితమూలేన మన్త్రానాత్మని యోజయేత్‌ | నిర్మాల్యాపనయస్థానం లిమ్పేర్గోమయ వారిణా. 14

ప్రోక్ష్యార్ఘ్యాది విసృజ్యాథ స్యాచాన్తో7న్యత్సమాచరేత్‌ |

ఇత్యాది మహాపురాణ అగ్నేయే చణ్డపూజావిధానం నామ షట్సప్తతితమో7ధ్యాయః

ఓం చణ్డశాయ నమఃఅని పూజ చేయవలెను. ఓం ధూలిచణ్డశ్వరాయ హూం ఫట్‌ స్వాహా" అనుచు ఆ విగ్రహముపై చండేశ్వరుని ఆవాహనము చేయవలెను. పిమ్మట అంగపూజ_"ఓం చణ్డశిరసే హూం ఫట్‌ అని శిరస్సును, "ఓం చణ్డశిఖాయై హూం ఫట్‌" అని శిఖను "ఓం చణ్డాయుష్కవచాయ హూం ఫట్‌" అని కవచమును, "ఓం చణాస్త్రాయ హూం ఫట్‌" అని అస్త్రమును పూజించవలెను. పిదప రుద్రాగ్నినుండి జనించిన చండదేవతను_"చండదేవుడు హస్తముతో శూలమును, టంకమును ధరించి యుండును నీల వర్ణము కలవాడు మూడవ హస్తమున అక్షసూత్రమును, నాల్గవ హస్తమున కమండలమును ధరించి యుండును. అతడు టంకాకారము గలది, లేదా అర్ధచంద్రాకారము గలది యగా మండలమున ఉండును. నాలుగు ముఖములు కలవాడు" అని ధ్యానించి, పూజించి, యథాశక్తి జపము చేయవలెను. హోమసామాగ్రి సమకూర్చుకొని జపములు దశాంశము హోమము చేయవలెను. భగవంతునకు సమర్పించిన గో-భూ-సువర్ణ-వస్త్ర-రత్నాదులు తప్ప మిగిలిన నిర్మాల్యము నంతను చండేశ్వరునకు సమర్పించవలెను.

సమయమున ఇట్లు చెప్పవలెను._''ఓం చండేశ్వరా! శివుని ఆజ్ఞచే ఈ లేహ్యచోషార్వుత్తమాన్నము తాంబూలము, పుష్పములు, అనులేపనము మొదలగు నిర్మాల్యరూప భోజనమును నీకు సమర్పించుచున్నాను చండా! పూజకు సంబంధించిన ఈ కర్మకాండయు నంతను నేను నీ ఆజ్ఞచే నిర్వర్తించితిని, ఆజ్ఞానముచే కలిగిన న్యూనత్వాధికత్వాది దోషములు తొలగి ఈ పూజాదికము పరిపూర్ణ మగుగాక" ఈ విధముగ నవేదించి, ఆ దేవతలను స్మరించుచు, అర్ఘ్యమిచ్చి, సంహారమూర్తిమంత్రమును చదివి, సంహారముద్ర భూముల నన్నింటిని తనలో ఉపసంహరించు కొనవలెను. నిర్మాల్యమును తోసివేసిన ప్రదేశమును గోమయజలముతో అలికి, అర్ఘ్యాదుల ప్రోక్షణము చేసి దేవతావిసర్జనము చేసి పిమ్మట అచమనము చేసి మిగిలిన అవశ్యకకావ్యములను ముగించుకొనవలెను.

అగ్ని మహాపురాణమునందు చండపూజావర్ణన మను డెబ్బదియారవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters