Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రిసప్తతితమోధ్యాయః.

అథ సూర్యపూజావిధిః.

ఈశ్వర ఉవాచ :

వక్ష్యే సూర్యార్చనం స్కన్ధ కరాఙ్గన్యాసపూర్వకమ్‌ | అహంతేజోమయః సూర్య ఇతి ధ్యాత్వార్ఘ్యమర్పయేత్‌. 1

పూరయేద్రక్తవర్ణేన లలాటాకృష్ణబిన్దునా | తం సంపూజ్యా రవేరఙ్గైఃకృత్వా రక్షావగుణ్థనమ్‌. 2

సంప్రోక్ష్య తజ్జలైర్ద్రవ్యం పూర్వస్యాం భాసుమర్చయేత్‌ |

ఓం అం హృద్బీజాది సర్వత్ర పూజానం దణ్డిపిఙ్గలౌ. 3

ద్వారి దక్షే వామపార్శ్వ ఈశానే అం గణాయ చ |

అగ్నౌ గురుం పీఠమధ్యే ప్రభూతం చాసనం యజేత్‌. 4

అగ్నాదౌ విరలం సారమారాధ్యం పరమం సుఖమ్‌ | సితరక్తపీతనీలవర్ణాన్సింహనిభాన్యజేత్‌. 5

పద్మమధ్యే రాం చ దీప్తాం రీం సూక్ష్మాం రుం జయాం క్రమాత్‌ |

రూం భ్రదాం రేం విభూతీశ్చ విమలాం రైమమోఘయా. 6

రోం రౌం చ విద్యుతాం శక్తిం పూర్వాద్యాః సర్వతోముఖాః |

రం మధ్యే అర్కాసనం స్యాత్సూర్యమూర్తిం షదక్షరమ్‌. 7

ఓం హం ఖం ఖోలకాయేతి యజేదావాహ్య భాస్కరమ్‌ |

లలాటకృష్ణమఞ్జల్యాం ధ్యాత్వా రఙ్గం న్యసేద్రవిమ్‌. 8

హ్రాం హ్రీం సః సూర్యాయ సమో ముద్రయావానాదికమ్‌ |

విధాయ ప్రీతయే బిమ్బముద్రాం గన్ధాదికం దదేత్‌.

పద్మముద్రాం బిల్వముద్రాం ప్రదర్శ్యాగ్నౌ హృదీరితమ్‌ | 9

ఓం అం హృదయాయ నమః అర్కాయ శిరసే తథా. 10

భూర్భువః స్వః సురేశాయ శిఖాయై నైరృతే యజేత్‌ |

హుం కవచాయ వాయవ్యే హ్రాం నేత్రాయేతి మధ్యతః. 11

హః అస్త్రాయేతి పూర్వాదౌ తతో ముద్రాః ప్రదర్శయేత్‌ |

పరమేశ్వరుడు పలికెను. స్కందా! ఇపుడు అంగన్యాస కరన్యాసములతో సూర్య పూజావిధానమును చెప్పెదను. తేజోమయసూర్యుడను నేనే'' అని భావన చేసి అర్ఘ్యపూజనము చేయవలెను. ఎఱ్ఱటి చందనము కలిపిన జలమును లలాట సమీపమునకు తీసికొని వెళ్ళి దానితో అర్ఘ్యపాత్రమును నింపవలెను. దానిని గంధాదులతో పూజించి సూర్యాంగములచే రక్షావగుంఠనము చేయవలెను. పిమ్మట జలముతో పూజాసామగ్రిని ప్రోక్షించి, పూర్వాభిముఖుడై సూర్యుని పూజ చేయవలెను. ''ఓం ఆం హృదయాయ నమః'' ఇత్యాది విధమున స్వరబీజము మొదట చేర్చి శిరస్సు మొదలగు అన్ని అవయవముల న్యాసము చేయవలెను. పూజాగృహద్వారమునందు కుడి వైపున దండిని, ఎడమ వైపున పింగళుని పూజింపవలెను. ''గం గణపతయే నమః'' అను మంత్రముతో ఈశాన్యమున గణశుని పూజింపవలెను. ఆగ్నేయమున గురుపూజ చేయవలెను. పీఠమధ్యమునందు కమాలాకారాసనము భావన చేసి పూజించవలెను. పీఠముయొక్క ఆగ్నేయాది కోణములలో క్రమముగ విమల - సార - ఆరాధ్య - పరమసుఖములను, మధ్యభాగమున ప్రభూతాసనమును పూజింపవలెను. విమలాదుల నాల్గింటి రంగులు వరుసగ శ్వేత - రక్త - పీత - నీలములు ఉండును. వాటి ఆకారము సింహముతో సమానముగ నుండును. వీటి నన్నింటిని పూజించవలెను. పీఠముపై నున్న కమలములోపల ''రాం దీప్తాయై నమః'' అను మంత్రముచే దీప్తాశక్తిని, ''రీం సూక్ష్మాయై నమః'' అను మంత్రముతో సూక్ష్మాశక్తిని, ''రూం జయాయై నమః'' అను మంత్రముచే జయాశక్తిని, ''రేం భద్రాయై నమః'' అను మంత్రముచే భద్రాశక్తిని, ''రైం విభూతయే నమః'' అను మంత్రముచే విభూతి శక్తిని, ''రోం విమలాయై నమః'' అను మంత్రముచే విమలాశక్తిని, ''రౌం అమోఘాయై నమః'' అను మంత్రముచే అమోఘా శక్తిని, ''రం విద్యుతాయై నమః'' అను మంత్రముచే విద్యుతాశక్తిని పూర్వాది దిక్కులు ఎనిమిదింటి యందును పూజించి, ''రః సర్వతోముఖ్యై నమః'' అను మంత్రముచే మధ్యభాగమునందు, తొమ్మిదవ పీఠశక్తియైన సర్వతోముఖిని పూజించ వలెను. పిమ్మట ''ఓం బ్రహ్మవిష్ణుశివాత్మకాయ సౌరాయ యోగపీఠాత్మనే నమః'' అను మంత్రముచే సూర్యదేవుని పీఠమును పూజించవలెను. పిమ్మట ''ఖఖోల్కాయ నమః'' అను షడక్షర మంత్రమునకు ప్రారంభము 'ఓం హం ఖం' అను అక్షరములు చేర్చి తొమ్మిది అక్షరములు గల ''ఓం హం ఖం ఖఖోల్కాయ నమః'' అను మంత్రము ద్వారా సూర్య విగ్రహావామనము చేసి సూర్యుని పూజ చేయవలెను. దోసిటిలో నున్న ఉదకమును లలాటసమీపమునకు తీసికొనివెళ్ళి రక్త వర్ణుడైన సూర్యుని ధ్యానించి, ఆ సూర్యడు తన ఎదుట నున్నట్లు భావన చేయవలెను. పిదప ''హ్రాం హ్రీం సః సూర్యాయ నమః'' అని పలుకుచు సూర్యునకు అర్ఘ్య వీయవలెను. పిదప బింబముద్ర చూపుచు ఆవాహనాద్యుపచారములు సమర్పింప వలెను. పిదప సూర్యుని ప్రీతికొరకై గంధాదికము సమర్పింపవలెను. ఆగ్నేయమునందు ''ఓం అం హృదయాయ నమః'' అను మంత్రముచే హృదయమును, నైరృతిదిక్కునందు ''ఓం భూః అర్కాయ శిరసే స్వాహా'' అను మంత్రముచే శిరస్సును, వాయవ్యమున ''ఓం భువః సురేశాయ శిఖాయై వషట్‌'' అను మంత్రముచే శిఖన, ఈశాన్యమునందు ''ఓం స్వః కవచాయ హుం'' అను మంత్రముచే కవచమును, ఇష్టదేవతకును ఉపాసకునకును మధ్య ''ఓం హాం నేత్ర త్రయాయ వౌషట్‌'' అను మంత్రముచే నేత్రమును, దేవతకు పశ్చిమభాగమునందు'' వః అస్త్రాయ ఫట్‌'' అను మంత్రముచే అస్త్రమును పూజింపవలెను. పిమ్మట పూర్వాదిదిశలందు ముద్రలను ప్రదర్శింపవలెను.

ధేనుముద్రా హృదాదీనాం గోవిషాణా చ నేత్రయోః |

అస్త్రస్య త్రాసనీ యోజ్యా గ్రహాణాం చ నమస్క్రియా |

సోం సోమం బుం బుధం బృం చ జీవం భం భార్గవం యజేత్‌. 13

రవేపూర్వాదికేగ్న్యాదౌ అం భౌమం శం శ##నైశ్చరమ్‌ |

రం రాహుం కేం కేతవే చ గన్ధాద్యైశ్చ ఖఖోల్కయా. 14

మూలం జప్త్వార్ఘ్యపాత్రామ్బు దత్త్వా సూర్యాయ సంస్తుతిః |

నత్వా పరాఙ్ముఖం చార్కం క్షమస్వేతి తతో వదేత్‌. 15

శరాణునా ఫడన్తెన సమాహృత్యాణుసంహృతిమ్‌ | హృత్పద్మే శివసూర్యేతి సంహారిణ్యోపసంస్కృతిమ్‌.16

యోజయేత్తేజశ్చణ్డాయ రవినిర్మాల్యమర్పయేత్‌ | అభ్యర్చ్యేశజపాద్ధ్యానాద్ధోమాత్సర్వం రవేర్భవేత్‌. 17

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే సూర్యపూజావిధికథనం నామ త్రిసప్తతితమోధ్యాయః.

హృదయ-శిరః-శిఖా-కవచములకు పూర్వాది దిక్కులందు ధేనుముద్రను ప్రదర్శించవలెను. నేత్రములకు గోశృంగముద్ర చూపవలెను. అస్త్రమునకు త్రాసనీముద్ర చూపవలెను. పిమ్మట గ్రహములకు నమస్కారము, పూజ చేయవలెను. ''ఓం సోం సోమాయ నమః'' అను మంత్రముతో తూర్పునందు చంద్రుని, ''ఓం బుం బుధాయ నమః'' అను మంత్రముతో దక్షిణమున బుధుని, ''ఓం బృం బృహస్పతయే నమః'' అను మంత్రముతో పశ్చిమమున బృహస్పతిని, ''ఓం భం భార్గవాయ నమః'' అను మంత్రముతో శుక్రుని పూజింపవలెను. ఈ విధముగ పూర్వాదిదిశలందు చంద్రాదిగ్రహములను పూజించి ఆగ్నేయాది విదిక్కులందు మిగిలిన గ్రహములను పూజింపవలెను ఎట్లనగా - ''భౌం భౌమాయ నమః'' అను మంత్రముతో ఆగ్నేయమున కుజుని, ''ఓం శం శ##నైశ్చరాయ నమః'' అను మంత్రముతో నైరృతి దిక్కునందు శ##నైశ్చరుని, ''ఓం రాం రాహవే నమః'' అను మంత్రముతో వాయవ్యమునందు రామువును, ''ఓం కేం కేతవే నమః'' అను మంత్రముతో ఈశాన్యమునందు కేతువును గంధాద్యుపచారములతో పూజింపవలెను. ఖఖోల్కీ (సూర్యభగవానుని) తో పాటు ఈ అన్ని గ్రహములపూజ కూడ చేయవలెను. మూలమంత్రము జపించి, అర్ఘ్యపాత్రమునందు జలము గ్రహించి సూర్యునకు సమర్పించి, పిదప స్తుతించవలెను. ఈ విధముగ స్తుతి చేసిన పిదప అభిముఖముగ నిలబడి సూర్యునకు నమస్కరించి ఇట్లు ప్రార్థించవలెను. ''ప్రభో! నా అపరాధములను లోపములను క్షమింపుము''. పిమ్మట ''అస్త్రాయ ఫట్‌'' అను మంత్రముతో అను సంహార సమామరణము చేసి, ''శివసూర్య'' అని పలుకుచు సంహారిణీముద్ర ద్వారా సూర్యుని ఉపసంహృత మగు తేజస్సును తన హృదయకమలములో నుంచి సూర్యనిర్మాల్యమును ఆతని పార్షదుడైన చండునకు సమర్పింపవలెను. ఈ విధముగ జగదీశ్వరు డగు సూర్యుని పూజ చేసి, ధ్యానహోమములు చేయుటచే సాధకుని మనోరథములన్నియు సిద్ధించును.

అగ్ని మహాపురాణమునందు సూర్యపూజావిధివర్ణన మను డెబ్బదిమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters