Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అష్టషష్టితమో7ధ్యాయః

అథ యాత్రోత్సవ విధి కథనమ్‌

శ్రీ భగవానువాచ:

వక్ష్యే విధిం చోత్సవస్య స్థాపితే తు సురే చరేత్‌ | తస్మిన్నబ్దే చైకరాబ్దేత్రం త్రిరాత్రం చాష్టరాత్రకమ్‌. 1

ఉత్సవేన వినా యస్మాత్థ్సపనం నిష్ఫలం భ##వేత్‌ | ఆయనే విషువే చాపి శయనోపవనే గృహే. 2

కారకస్యానుకూలే వా యాత్రాం దేవస్య కారయేత్‌ | మఙ్గలజ్కురరోపైస్తు గీతనృత్యాదివాద్యకైః. 3

శరావవటికాపాలీస్త్వఙ్కరారోపణ హితాః | యవాఞ్ఛాలీం స్తిలాన్ముద్గాన్‌ గోధూమాన్సితసర్షపాన్‌. 4

కులుత్థమానిష్పావాన్‌ క్షాళయిత్వా తు వాపయేత్‌ | పూర్వాదౌ చ బలిం దద్యాద్ర్భమన్దీపైః పురం నిశి. 5

ఇన్ద్రాదేః కుముదాదేశ్చ సర్వభూతేభ్య యేవచ | అనుగ్ఛన్తి తే తత్ర ప్రతిరూపధరాః పునః. 6

పదే పదే7శ్వమేధస్య ఫలం తేషాం న సంశయః | ఆగత్య దేవతాగారం దేవం విజ్ఞాపయేద్గురుః. 7

తీర్థయాత్రా తు యా దేవ శ్వః కర్తవ్యా సురోత్తమ | తస్యారమ్భమనుజ్ఞాతు మర్హసే దేవ సర్వథా. 8

దేవమేవం తు విజ్ఞాప్య తతః క్రమ సమారభేత్‌ | ప్రరోహఘటికాభ్యాం తు వేదికాం భూషితాం వ్రజేత్‌. 9

చతుఃస్తమ్భాం తు తన్మధ్యే స్వస్తికే ప్రతిమాం న్యసేత్‌|

కామార్థాం లేఖ్య చిత్రేషు స్థాప్య తత్రాధివాసయేత్‌. 10

హయగ్రీవుడు పలికెను. ఇప్పుడు ఉత్సవ విధిని చెప్పెదను. ఉత్సవము లేని దేవతాప్రతిష్ఠ నిష్ఫలము, అందుచే దేవతాస్థాపనము చేసిన సంవత్సరమునందే ఏక రాత్రోత్సవము లేదా త్రిరాత్రోత్సవము లేదా అష్ఠరాత్రోత్సవము చేయవలెను. అయనసమయమునందు గాని, విషువసంక్రాంతి సమయమునందు గాని శయనోపవనమునందు లేదా దేవతా గృహమునందు లేదా కర్తకు అనుకూలముగా ఉన్న విధమున దేవుని నగరయాత్ర చేయించవలెను. ఆ సమయమున మంగలాంకురారోపణము, నృత్యగీతాదులు, వాద్యములు ఏర్పాటు చేయవలెను. అంకురారోపణమునకు మూకుళ్ళు ఉత్తమమైనవి. యవ - శాలిజ - తిల - ముద్గగోధూమ - శ్వేతసర్షప - కులత్థ - మాష - నిష్పావములు కడిగి చల్లవలెను. దీపములతో రాత్రి ఊరేగుచు ఇంద్రాదిదిక్పాలులకు, కుముదాది దిగ్గజములకు, సకల ప్రాణులకు పూర్వాదిదిక్కులందు బలి ప్రదానము చేయవలెను. దేవతా విగ్రహమును మోయుచు దేవయాత్రను అనుసరించు వారికి అడుగడుగునకు అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును, కొంచెమైనను సందేహము లేదు. ఆచార్యుడు తొలుచటి దివసమున దేవాలయమునకు వచ్చి దేవునితో - ''దేవశ్రేష్ఠా! రేపు నీ తీర్థ యాత్రజరుపవలసియున్నది. అందుకు అనుజ్ఞ ఇచ్చుటకై నీవు సర్వదా సమర్ధుడవు అని నివేదించి ఉత్సవకార్యము ప్రారంభింపవలెను. నాలుగు స్తంభములు గలదియు అంకురములున్న ఘటముతో కూడినదియు అలంకరింపబడినదియు అగు వేదిక దగ్గరకు వెళ్ళి దాని మధ్య భాగమున స్వస్తికము ప్రతిమనుంచి, తన కోరికను వ్రాసి చిత్రములపై స్థాపించి అధివాసము చేయవలెను.

వైష్ణవైః సహ కుర్వీత ఘృతాభ్యఙ్గం తు మూలతః | ఘృతధారాభిషేకం వా సకలాం శర్వరీం బుధః .11

దర్పణం దర్శ్య నీరాజం గీతవాద్యైశ్చ మఙ్గలమ్‌ | వ్యజనం పూజనం దీపం గన్దపుష్పాదిభిర్యజేత్‌. 12

హరిద్రా ముద్గకాశ్మీర శుక్లచూర్ణాది మూర్దని ప్రతిమాయశ్చ భక్తానాం సర్వతీర్థఫలం ధృతే. 13

స్నాపయిత్యా సమభ్యర్చ్య యాత్రాబిమ్బం రతే స్థితమ్‌ | 14

నయేద్గురున్నదీం నాదైశ్ఛత్రాధ్యై రాష్ట్రపాలికామ్‌

నిమ్న యోజనాదర్వాక్‌ తత్ర వేదీం తు కారయేత్‌ | వాహనాదవతార్యైనాం తస్యాం వేద్యాం నివేశయత్‌.

చరుం వై శ్రపయే త్తత్ర పాయసం హోమయేత్తతః | అబ్లింగైర్వైదికైర్మన్త్రైస్తీర్థానావాహయేత్తతః. |16

అపోహిష్ఠోపనిషదైః పూజయేదర్ఘ్యముఖ్యకైః | పునర్దేవం సమాదాయ తోయే కృత్వాఘమర్షణమ్‌. 17

స్నాయాన్మహాజనైర్విపై#్రర్వేద్యాముత్తార్యం తం న్యసేత్‌.

పూజయిత్వా తదహ్నా చ ప్రాసాదం తు నయేత్తతః . 18

పూజయేత్పావకస్థం తు గురుః స్యాద్భుక్తిముక్తికృత్‌.

ఇత్యాది మహాపురాణ అగ్నేయే దేవయాత్రోత్సవకథనం నామాష్టషష్టితమో7ధ్యాయః.

పిమ్మట విద్వాంసులై వైష్ణవులతో కలిసి మూలమంత్రముతో ప్రతిమ అవయవములకు నెయ్యి పూసి, రాత్రి అంతయు నేతిధారతో అభిషేకము చేయవలెను. దేవతకు అద్దము చూపించి, ఆరతి, గీతము, వాద్యములు మొదలగు వాటితో మంగళకృత్యములు నెరపి, వ్యజనము విసిరి, పూజించవలెను. పిదప దీప-గంధ-పుష్పాదులతో పూజించవలెను. పసుపు, కర్పూరము, కేసరములు, శ్వేతచందన చూర్ణము దేవతా ప్రతిమపైనను, భక్తుల శిరస్సులపైనను చల్లినచో సమస్త తీర్థముల ఫలము లభించును. ఆచార్యుడు యాత్రకొరకై ఏర్పరచిన దేవతామూర్తిని రథముపై ఉంచి, పూజించి, ఛత్ర-చారమ- శంఖనాదాదులతో రాష్ట్రమును పాలించునదితటమునకు తీసికొని వెళ్ళవలెను. నదిలోస్నానము చేయించుటకు ముందు అచట వేదికను నిర్మించి, ఆ మూర్తిని వాహనమునండి దింపి, దానిని ఆ వేదికపై ఉంచవలెను. అచట చరువు వండి దానిని హోమము చేసిన పిదప పాయసహోమము చేయవలెను. వరుణ దేవతామంత్రముతో సమస్తతీర్థముల అవాహనము చేసి ''అపోహిష్ఠామ'' ఇత్యాదిమంత్రములతో వాటికి అర్ఘ్యప్రదానము చేసి పూజించవలెను. దేవతామూర్తిని తీసికొని వెళ్ళి ఉదకమునందు ఆఘమర్షణ చేసి బ్రాహ్మణ - మహాజనులకు స్నానము చేయవలెను. స్నానానంతరము మూర్తిని తీసికొని వచ్చి వేదికపై ఉంచవలెను. ఆ దివసమునందు అచట దేవతాపూజ చేసి, దేవాలయామునకు తీసికొని వెళ్ళవలెను., ఆచార్యుడు అగ్నిలో నున్న దేవతకు పూజలు చేయవలెను. ఈ ఉత్సవము భోగ - మోక్షప్రదము.

అగ్ని మహాపురాణమునందు ఉత్సవవధి కధనమను ఆరువది ఎనిమిదవఅధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters