Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అతషష్టితమో7ధ్యాయః.

అథ వాసుదేవప్రతిష్ఠావిధిః

శ్రీ భగవానువాచ:

పిణ్డికాస్థాపనార్థం తు గర్భాగారం తు సప్తధా | విభ##జేద్బ్రహ్మభాగే తు ప్రతిమాం స్థాపయేద్భుధః . 1

దేవమానుష పైశాచ భాగేషు న కదాచన | బ్రహ్మభాగం పరిత్యజ్య కిఞ్చిదాశ్రిత్య చాణ్డజ. 2

దేవమానుషభాగాభ్యాం స్థాప్యా యత్నాత్తు పిణ్డికా | నపుంసక శిలాయాం తు రత్నన్యాసం సమాచరేల్‌. 3

నారసింహేన హుత్వాథ రత్నన్యాసం చ తేన వై | వ్రీహీన్రత్నాని ధాతూంశ్చ లోహాదీంశ్చన్దనాదికాన్‌. 4

పూర్వాది నవగర్తేషు న్యసేన్మధ్యే యథారుచి | అథ చేన్ద్రాది మన్త్రైశ్చ గర్తో గుగ్గులావృతః. 5

రత్నన్యాసవిధిం కృత్వా ప్రతిమామాలభేద్గురుః | సశలాకైర్దర్భ పుఞ్ఞైః సహదేవైః సమన్వితైః. 6

సబాహ్యాన్తైశ్చ సంస్కృత్య పఞ్చగవ్యేన శోధయేత్‌ | ప్రోక్షయేద్దర్భతోయేన నదీతీర్థదకేన చ. 7

హయగ్రీవుడు చెప్పెను - బ్రహ్మదేవా! పిండికాస్థాపనము కొరకై, విద్వాంసుడు దేవాలయములోని గర్భగృహమును ఏడు భాగములుగా విభజింపవలెను. ప్రతిమను బ్రహ్మభాగము నందు స్థాపింపవలెను. దేవ-మనుష్య-పిశాచ భాగములయందెన్నుడు స్థాపింపగూడదు. బ్రహ్మభాగములో కొంతభాగము విడచి, దేవభాగమనుష్య భాగములలో కొన్ని భాగములు గ్రహించి, ఆ భూమిపై ప్రయత్న పూర్వకముగ పిండికను స్థాపింపవలెను. నపుంసక శిలపై రత్నన్యాసము చేయవలెను. నృసింహమంత్రముతో హోమము చేసి ఆ మంత్రముతోనే రత్నన్యాసము కూడ చేయవలెను. వ్రీహులు, రత్నములు లోహము మొదలగు ధాతువులు, చందనము మొదలగు పదార్థములను పూర్వాది దిశలందును. మద్యభాగమునందును ఉంచిన కుండములలో, తన అభిరుచి ననుసరించి ఉంచవలెను. పిమ్మట ఇంద్రాది మంత్రములతో పూర్వాది దిశలలో నున్న గుంటలను గుగ్గులముచే కప్పి, రత్నన్యాస విధి పూర్తియైన పిదప గురుశలాకలతో కూడిన కుశసమూహముల చేతను, సహదేవమను ఓషధి చేతను ప్రతిమను బాగుగా రాయవలెను. బైటను, లోపలను తగు సంస్కారములు చేసి పంచగవ్యములతో శుద్ధి చేయవలెను. పిమ్మట కుశోదకము, నదీజలము, తీర్థజలము ఆ ప్రతిమపై ప్రోక్షించవలెను.

హోమార్ధే స్థణ్డిలం కుర్యాత్సికతాభిః సమన్తతః | సార్ధహస్తప్రమాణం తు చతురస్రం సుశోభనమ్‌. 8

అష్టదిక్షు యథాన్యాసం కలశానపి విన్యసేత్‌ | పూర్వాద్యానష్టవర్ణేన అగ్నిమాపీయ సంస్కృతమ్‌. 9

త్వమగ్నేద్యుభిరితి చ గాయత్ర్యా సమిధా హుతమ్‌ | అష్టార్ణేనాష్టశతకమాజ్యం పూర్ణం ప్రదాపయేల్‌. 10

శాన్త్యుదకమామ్రవత్త్రెర్మూలేన శతమన్త్రితమ్‌ | సిఞ్చేద్దేవస్య తన్మూర్ధ్ని శ్రీశ్చ తే హ్యనయా ఋచా. 11

బ్రహ్మయానేన చోద్దృత్య ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే | తద్విష్ణోరితి మన్త్రేణ ప్రాసాదాభిముఖం నయేత్‌. 12

శిబికాయాం హరిం స్థాప్య భ్రామయీత పురాదికమ్‌ | గీతవేదాదిశ##బ్దైశ్చ ప్రాసాదాభిముఖం నయేత్‌. 13

హోమము కొరకు ఇసుకతో ఒకటన్నర హస్తము విస్తారము గల, చతురస్రము, సుందరము అగు వేదిని ఏర్పరుపవలెను. ఎనిమిది దిక్కులందును. యథాస్థానమున కలశము లుంచవలెను. ఆ పూర్వాది కలశలకు ఎనిమిది రంగులు వేయవలెను. పిమ్మట అగ్నిని వేదిపై స్థాపించి, కుశలతో సంస్కారము చేసి 'త్వమగ్నేద్యుభిః" అను మంత్రముతోను, గాయత్రీ మంత్రముతోను సమిధులను హోమము చేయవలెను. అష్టాక్షరమంత్రముతో నూట ఎనిమిది అజ్యాహుతులుచేసి, పూర్ణహుతి ఇవ్వవలెను. పిమ్మట నూరు పర్యాయములు మూలమత్రము జపించి అభిమంత్రించిన శాంత్యుదకమును మామిడి చిగుళ్ళతో ఇష్టదేవత శిరస్సుపై చల్లవలెను. ఆ సమయమున "శ్రీచ్చ లక్ష్మీశ్చ" ఇత్యాది మంత్రము పఠింపవలెను. "ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే" అను మంత్రముతో ప్రతిమనుపైకి ఎత్తి, బ్రహ్మ రథముపై నుంచి, "తద్విష్ణో" ఇత్యాదిమంత్రము పఠించుచు దేవాలయము వైపు తీసికొని వెళ్ళవలెను. అక్కడ శ్రీహరి ప్రతిమను పల్లకీపై ఎక్కించి నగరమునందు, గీత-వాద్య వేదమంత్రాది ధ్వనులతో ఊరేగించి, తిరిగి దేవాలయద్వారమువద్దకు తీసికొనిరావలెను.

స్త్రీభిర్విపై#్రర్మఙ్గలాష్టఘటైః సంస్నాపయేద్ధరిమ్‌ | తతో గన్దాదినాభ్యర్చ్యమూలమన్త్రేణ దేశికః. 14

అతోదేవేతి వస్త్రాద్యమష్టాంగార్ఘ్యం నివేద్య చ | స్థిరేలగ్నే పిణ్డికాయాం దేవస్యత్వేతి ధారయేత్‌. 15

ఓం త్త్రెలోక్యవిక్రాన్తాయ నమస్తే7స్తు త్రివిక్రమ | సంస్థాప్య పిణ్డికాయాం తు స్థిరం కుర్వాద్విచక్షణః. 16

ధ్రువా ద్యౌరితి మన్త్రేణ విశ్వతశ్చక్షురిత్యపి | పఞ్చగవ్యేన సంస్నాప్య క్షాల్య గన్ధోదకేన చ. 17

పూజయేత్సకలీకృత్య సాఙ్గం సావరణం హరిమ్‌ |

పిమ్మట గురువు సువాసినీస్త్రీల చేతను, బ్రహ్మణుల చేతను, ఎనిమిది మంగళకలశముల ఉదకముతో శ్రీహరికి స్నానము చేయించి మూలమంత్రోచ్చారణ, పూర్వకముగ గంధాద్యుపచారములు సమర్పించి పూజచేసి "అతో దేవాః" ఇత్యాది ఋక్కు చదువుచు వస్త్రాక్యష్టాంగార్ఘ్యము ఇవ్వవలెను. పిమ్మట స్థిరలగ్నమున " దేవస్యత్వా" ఇత్యాదిమంత్రము చదువుచు ఆ అర్చావిగ్రహమును ప్రతిష్ఠ చేయవలెను. "సచ్చిదానంద స్వరూపా! త్రివక్రమా! నీవు మూడు పాదములతో ముల్లోకములను ఆక్రమించితివి. నీకు నమస్కారము" అని ప్రార్థింపవలెను. ఈ విధముగ పండితుడు ప్రతిమను పిండిక మీద స్థాపించి, "ద్రువాద్యౌః" "విశ్వతశ్చక్షుః" ఇత్యాదిమంత్రములు చదువుచు స్థిరము చేయవలెను. పంచగవ్యములతో స్నానము చేయించి, గంధోదకముదో ప్రతిమా ప్రక్షాళనము చేసి, సకలీకరణానంతరము, శ్రీహరికి సాంగోపాంగసాధారణపూజ చేయవలెను.

ధ్యాయేత్ఖం తస్య మూర్తిం తు పృథివీ తస్య పీఠికా | 18

కల్పయేద్విగ్రహం తస్య తైజసైః పరమాణుభిః | జీవమావాహయిష్యామి పఞ్చవింశతితత్త్వగమ్‌. 19

చైతన్యం పరమానన్దం జాగ్రత్స్వప్న విపర్జితమ్‌ | దేహేన్ద్రియమనోబుద్ధిప్రాణాఙ్కారవర్జితమ్‌. 20

బ్రహ్మాదిస్తమ్బపర్యన్తం హృదయేషు వ్యవస్థితమ్‌ | హృదయాత్ప్రతిమాబిమ్బే స్థిరో భవ పరేశ్వర. 21

సజీవం కురు బిమ్బం త్వం సబాహ్యాభన్త రస్థితః | అజ్గుష్ఠమాత్రః పురుషో దేహోపాధిషు సంస్థితః. 22

జ్యోతిర్‌జ్ఞానం పరం బ్రహ్మ ఏకమేవాద్వితీయకమ్‌ | సజీవీకరణం కృత్వా ప్రణవేన నిబోధయేత్‌. 23

సాన్నిధ్యకరణం నామ హృదయం స్పృశ్యవై జపేత్‌. |

సూక్తంతు పౌరుషం ధ్యాయన్నిదం గుహ్యమనుం జపేత్‌. 24

ఈ విధముగ ధ్యానించవలెను - "ఆకాశము శ్రీ మహావిష్ణువుయొక్క విగ్రహము; పృథివి అతని పీఠము (సింహాసనము)." పిమ్మట పరమాత్ముని శరీరము తైజసపరమాణువులతో ఏర్పడి నట్లు భావన చేయుచు ఇట్లు చెప్పవలెను. - ఇరువదియైదు తత్త్వములలో వ్యాపించి యున్న జీవుని అవాహన చేయుచున్నాను. ఆ జీవుడు చైతన్య స్వరూపుడు పరమానందరూపుడు; జాగ్రత్స్వప్న సుషుప్త్వవస్థాశూన్యుడు. దేహేంద్రియ - మనో - బుద్ధి - ప్రాణ - అహంకారరహితుడు. బ్రహ్మ మొదలు కీటకము వరకును ఉన్న సకలజగత్తునందును వ్యాపించి, అదరి హృదయములలో ఉన్నవాడు. పరమేశ్వరా! నీవే ఆ జీవచైతన్యము. నీవు హృదయమునుండి ప్రతిమలో ప్రవేశించి స్థిరముగా నుండుము. ఈ ప్రతిమను సజీవము చేయుము. అన్ని దేహములందును అంగుష్ఠమాత్రపురుషుడున్నాడు. అతడు జ్యోతిఃస్వరూపుడు. జ్ఞానస్వరూపుడు; ఏకమాత్ర అద్వితీయపరబ్రహ్మ" ఈవిధముగ ప్రతిమను సజీవము చేసి ప్రణపముతో భగవంతుని మేల్కొల్పవలెను. పిదప భగవంతుని హృదయము స్పృశించి పురుషసూక్తమును జపించవలెను. దీనికి సానిధ్యకరణకర్మ" యని పేరు భగవద్ధ్యానము చేయుచు ఈ రహస్యమంత్రమును పఠింపవలెను.

నమస్తే7స్తు సురేశాయ సన్తోషవిభవాత్మనే | జ్ఞానవిజ్ఞానరూపాయ బ్రహ్మతేజోనుయాయినే. 25

గుణాతిక్రాన్తదేశాయ పురాణాయ మహాత్మనే | అక్షయాయ పురాణాయ విష్ణో సన్నిహితో భవ. 26

యచ్చ తే పరమం తత్త్వం యచ్చజ్ఞానమయం వపుః | తత్సర్వమేకతో లీనమస్మిన్దేహే విబుధ్యతామ్‌. 27

అత్మానం సన్నిధీకృత్య బ్రహ్మాదిపరివారకాన్‌ | స్వనామ్నా స్థాపయేదన్యానాయుధాన్స ముద్రయా. 28

యత్రావర్షాదికం దృష్ట్వా జ్ఞేయః సన్నిహితో హరిః |

నత్వా స్తుత్వా స్తవాద్యైశ్ఛ జప్త్వా చాష్టాక్షరాదికమ్‌. 29

"ప్రభూ! నీవు సకలదేవాధీసుడవు. సంతోషవైభవస్వరూపుడవు. నీకు నమస్కారము. జ్ఞానవిజ్ఞానములు నీ స్వరూపము. త్రిగాణాతీతము. నీవు అంతర్యామివి; పరమాత్మవు. నాశరహితు డగు పురాణపురుషుడవు. నీకు నమస్కారము. మహావిష్ణూ! నీ విచట సంనిహితుడవు కమ్ము. నీ పరమతత్త్వము, జ్ఞానమయశరీరము ఒక సంఘాతముగ ఏర్పడీ ఈ అర్చావిగ్రహమునందు అవిర్భూతమగు గాక". ఈ విధముగ శ్రీహరి సాంనిధ్యకరణము చేసి అతని ఎదుట బ్రహ్మదిపరివారదేవతలను స్థాపింపవలెను. వారి ఆయుధములను ముద్రలను కూడ స్థాపింపవలెను. శ్రీహరిదరశనార్థమై వచ్చువారియాత్రలను బట్టియు. వర్షాదులను బట్టియు శ్రీహరి అచట సన్నిహితుడై యున్నాడను విషయమును గ్రహింపవలెను. నమస్కరించి, స్తుతించి, స్తోత్రాదులు పఠించి, అష్టాక్షర్యాదిమంత్రములు జపించుచు భగవంతు డచట సన్నిహితుడై యున్నాడని గ్రహింపవలెను.

చణ్డప్రచణ్డౌ ద్వారస్థౌ నిర్గత్యాభ్యర్చయేద్గురుః| అథ మణ్డపమాసాద్య గరుడం స్థాప్య పూజయేత్‌. 30

దిగీశాన్‌ దిశి దేవాంశ్చ స్థాప్య సంపూజ్య దేశికః | విష్వక్సేనం తు సంస్థాప్వ శఙ్ఖచక్రాది పూజయేత్‌. 31

సర్వపార్షదకేభ్యశ్చ బలిం భూతేభ్య అర్పయేత్‌ | గ్రామవస్త్ర సువార్ణాది గురవే దక్షిణాం దదేత్‌ . 32

యాగోపయోగిద్రవ్యాద్యమాచార్వాయ నరో7ఠ్సయేత్‌ | ఆచార్యదక్షిణార్థం తు బుత్విగ్భ్యో దక్షిణాం దదేత్‌. 33

అన్యేభ్యో దక్షిణాం దద్యాది జయేద్ప్రహ్మాణాస్తతః | అవారితాన్‌ ఫలాన్‌ దద్యాద్యజమానాయవై గురుః . 34

విష్ణుం నమేత్ప్రతిష్ఠాతా చాత్మనా నకలం కులమ్‌ | సర్వేషామేవ టేవానామేష సాధారణో విధిః. 35

మూలమన్త్రాః పృథక్‌ తేషాం శేషం కార్యం సమానకమ్‌.

ఇత్యాది మహాపురాణ అగ్నేయే వాసుదేవ ప్రతిష్ఠాదివిధిర్నామ షష్టితమోధ్యాయః.

పిమ్మట ఆచార్యుడు దేవాలయమునుండి బైటకు వచ్చి ద్వారమువద్ద నున్న చండ -ప్రచండులను ద్వారపాలకులకు పూజ చేయవలెను. మరల మండపములోనికి వెళ్ళి గరుత్మంతుని స్థాపింపవలెను. అన్ని దిక్కులందును ఆ యా దిక్పాలకులను, ఇతరదేవతలను స్థాపించి, శంఖచక్రాదులకు గూడ పూజ చేయవలెను. అందరు పార్షదులకును, భూతములకును బలి సమర్పింపవలెను. (యజమానుడు) ఆచార్యునకు గ్రామ-వస్త్ర-సువార్ణదులను దక్షిణగా ఈయవలెను. యజ్ఞమునకు ఉపయోగించు ద్రవ్యములు కూడ ఆచార్యున కీయవలెను. ఋత్విక్కులను ఆచార్యదిక్షిణలో సగ మీయవలెను. పిమ్మట బ్రాహ్మణులకు గూడ దక్షిణ ఇచ్చి భోజనము పెట్టవలెను. అచచటకు వచ్చు బ్రహ్మణు నెవ్వనిని అడ్డుపెట్టరాదు. అందరిని సత్కరించవలెను. పిమ్మట గురువు యజమానునకు ఫల మీయవలెను. భగద్విగ్రహప్రతిష్ఠ చేసిన పుణ్యాత్ముడు తన వంశీయు లందరిని తనతో పాటు శ్రీమహావిష్ణువు సమీపమునకు తీసికొని పోవును. ఇది అందరు దేవతలకును సాధారణమైన విధానము కాని ఆ యా దేవతల మూలమంత్రములు మాత్రము వేరు వేరుగ నుండను. మిగిలిన కార్యము లన్నియు సమానమే.

అగ్నిమహాపురాణమునందు వాసుదేవప్రతిష్ఠాదివిధి యను ఆరువదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters