Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకోనషష్టితమో7ధ్యాయః

అథాధివాసకథనమ్‌.

శ్రీ భగవానువాచ:

హరేః సాన్నిధ్యకరణ మధివాసన ముచ్యతే | సర్వజ్ఞం సర్వగంధ్యాత్వా ఆత్మానం పురుషోత్తమమ్‌. 1

ఓంకారేణ సమైయోజ్య చిచ్ఛక్తిమభిమానినమ్‌ | నిఃసార్యైత్త్మెకతాం కృత్వా స్వస్మిన్‌ సర్వగతే విభౌ. 2

యోజయేన్మరుతా పృథ్వీం వహ్నిబీజేన దీపయేత్‌ | సంహరేద్వాయునా చాగ్నిం వాయుమాకాశతోనయేత్‌. 3

అధిభూతాదైవెస్తు సాధ్యాఖ్యైర్విభ##వైః సహ | తన్మాత్రపాతకాన్‌ కృత్వా సంహరేత్తత్క్రమాద్బుధః 4

ఆకాశం మనసాహృత్య మనో7హఙ్కరణకురు | అహఙ్కారం చమహతి తం చాప్యవ్యాకృతేనయేత్‌ . 5

హయగ్రీవుడు చెప్పెను: శ్రీహరి సాన్నిధ్యము సంపాదించుటకు అధివాసనమని పేరు. "నేను సర్వజ్ఞుడు సర్వవ్యాపియు అయిన పురుషోత్తముడను" అని భావన చేయుచు సాధకుడు ఓంకారవాచ్యుడగు పరమాత్మతో ఏకత్వమును చేయవలెను. పిమ్మట చైతన్యాభిమానియైన జీవుని వేరుచేసి ఆత్మకును, ఆ జీవునకును ఏకత్వమును చేయవలెను. ఈ విధముగా చేసి స్వత్మరూపుడును, సర్మవ్యాపియు అగు పరమేశ్వరునితో దానిని కలిపివేయవలెను. పిమ్మట ప్రాణ వాయువు ద్వారా (లం బీజరూపయగు) పృథివిని అగ్ని బీజ (రం) చింతనముచే ఆవిర్భవించిన అగ్నియందు కాల్చివేయవలెను. అనగా పృథివి అగ్నిలో లీనమైనదని భావన చేయవలెను. పిమ్మట అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశమునందు లీనము చేయవలెను అధిభూత-అథ్యాత్మ-అధిదైవ విభవములతో కూడిన సమస్త భూతములను తన్మాత్రలలో విలీనము చేసి వీటినన్నింటిని క్రమముగా ఆకాశమునందు విలీనము చేయవలెను. ఆకశమును మనస్సునందు మనస్సును అహంకారమునందు అహంకారము మహత్తత్త్వమునందు, మహత్తత్త్వమును అవ్యాకృతప్రకృతియందును లీనము చేయవలెను.

అవ్యాకృతం జ్ఞానరూపే వాసుదేవఃస ఈరితః | సతామవ్యాకృతాం మాయామవష్టభ్య సిసృక్షయా. 6

సఙ్కర్షణం స శబ్దాత్మా స్పర్శాఖ్యమ సృజత్ప్రభుః | క్షోభ్యమాయాం సప్రద్యుమ్నం తేజోరూపచాసృజత్‌. 7

అనిరుద్దం రసమాత్రం బ్రహ్మణం గన్దరూపకమ్‌ | అని రుద్ధః సచ బ్రహ్మా అప అదౌ సనర్జహా. 8

తస్మిన్‌ హిరణ్యయం చాణ్డం సో7సృజత్పఞ్చభూతవత్‌ |

తస్మిన్‌ సంక్రామితే జీవే శక్తి రాత్మోపసంహృతా. 9

ప్రాణో జీవేన సంయుక్తో వృత్తిమానితి శబ్ద్యతే | జీవోవ్యాహృతి సంజ్ఞస్తు ప్రాణష్వాధ్యాత్మికః స్మృత. 10

ప్రాణౖర్యుక్తాతతో బుద్ధిః సంజాతా చాష్టమూర్తికా | అహఙ్కారస్తతో జజ్ఞే మనస్తస్మారదజాయత. 11

అర్థాః ప్రజజ్ఞిరే పఞ్చ సంకల్పాదియుతాస్తతః | శబ్దః స్పర్శశ్చ రూపంచ రసోగన్ధ ఇతిస్మృతా. 12

అవ్యాకృతమును (ప్రకృతిని లేదామాయను) జ్ఞాన స్వరూపుడగు పరమాత్మయందు వినీనము చేయవలెను. ఈ పరమాత్మమే వాసుదేవుడు. శబ్ద స్వరూపుడైన ఆవాసుదేవుడు నృష్టిచేయవలెనని సంకల్పించి, అవ్యాకృతమాయాశ్రయముచే స్పర్శమను పేరు గల సంకర్షణుని ఆవిర్భవింపచేసెను. సంకర్షణుడు మాయను క్షుబ్ధముచేసి తేజోరూప ప్రద్యుమ్నుని సృజించెను. ప్రద్యుమ్నుడు రసరూపుడగు అనిరుద్ధుని, అనిరుద్ధుడు గంధస్వరూపుడగు బ్రహ్మను సృజించెను. బ్రహ్మ మొట్టమదట జలమును సృజించి, దానిలో పంచభూతములతో కూడిన బంగారు గ్రుడ్డును సృజించెను. ఆ అండమునందు జీవశక్తి సంచారమేర్పడెను. ఆత్మయందు లీనము చేయబడినట్లు మొదట చెప్పబడినది ఈ జీవశక్తియే. జీవశక్తితో ప్రాణమునకు సంయోగమేర్పడినప్పుడు అది 'వృత్తిమతి' అని చెప్పబడును. వ్యాహృతిసమేతుడగు జీవుడు ప్రాణములలో నుండి అధ్యాత్మిక పురుషుడని చెప్పబడుచున్నాడు. వానినుండి ప్రాణయుక్తమగు బుద్ధి పుట్టినది. దీనికి ఎనిమిది వృత్తులుండును. బుద్ధి నుండి అహంకారము, అహంకారమునుండి మనస్సు జనించినది. మనస్సు నుండి శబ్ద-స్పర్శ-రూప-రస- గంధములనెడు సంకల్పాదియుక్తములగు ఐదు విషయములు ఉత్పన్నమైనవి.

జ్ఞానశక్తి క్తియుతాన్యేత్తె రారబ్ధానీన్ద్రియాణితు | త్వక్‌ఛ్రోత్ర ఘ్రాణ చక్షూంషి జిహ్వాబుద్ధీన్ధ్రియాణితు. 13

పాదౌ పాయుస్తథాపాణీ వాగుపస్థశ్చ పఞ్చమః | కర్మేన్ద్రియాణి చైతానిపఞ్చ భూతాన్యతః శృణు 14

అకాశవుయు తేజాంసి సలిలం పృథివీ తథా | స్థూలమేభిః శరీరంతు సర్వాధారం ప్రజాయతే. 15

ఏతేషాం వాచకా మన్త్రా న్యాసాయోచ్యన్త ఉత్తమాః | జీవభూతం మకారంతు దేవస్య వ్యపకం న్యసేత్‌. 16

ప్రాణతత్త్వం భకారంతు జీవోపాధిగతం న్యసేల్‌ | హృదయస్థం బకారంతు బుద్ధితత్త్వం న్యసేద్భుధః. 17

ఫకారమపి తత్త్రెవ అహఙ్కారమయం న్యసేత్‌ | మనస్తత్త్వ పకారంతు స్యసేత్స ఙ్కల్ప సంభవమ్‌. 18

వీటినుండి జ్ఞానశక్తి గల త్వక్‌-శ్రోత్ర-ఘ్రాణ-నేత్ర-జిహ్వలను ఐదు ఇంద్రియములావిర్భవించినవి. వీటికి జ్ఞానేంద్రియములని పేరు. పాద - పాయుపాణి - వాక్‌ - ఉపస్థలు పంచకర్మేంద్రియములు. ఇప్పుడు పంచభూతముల పేర్లు వినుము, ఆకాస వాయు తేజో - జల - పృథివులు పంచమహాభూతములు. అన్నింటికిని అధారమగు స్థూలశరీరము ఈ భూతముల నుండియే పుట్టుచున్నది. ఈతత్త్వములకు వాచకములగు ఉత్తమ బీజాక్షరములను న్యాసమునిమిత్తమైన చెప్పుచున్నాను. 'మం' అను బీజము జీవస్వరూపము (జీవతత్త్వవాచకము) ఇది శరీరమంతయు వ్యాపించయున్నదని భావనచేసి దీనిని సకల దేహవ్యాపకన్యాసము చేయవలెను 'భం' అనునది ప్రాణతత్త్వబీజము, ఇది జీవోపాధియందున్నది. అందుచే దీనిని దానియందే న్యాసము చేయవలెను. బుద్ధితత్త్వవాచకమగు 'బం' అను బీజమును, విద్వాంసుడు హృదయముపై వ్యాసము చేయవలెను. అహంకారరూపమగు 'ఫం' అను బీజమును కూడ హృదయమునందే న్యాసము చేయవలెను. సంకల్ప కరణ భూతమనస్తత్త్వ రూపమగు 'పం' అను బీజమును గూడ హృదయమునందే న్యాసము చేయవలెను.

శబ్దతన్మాత్ర తత్త్వంతు నకారంమస్తకే న్యసేత్‌ | స్పర్మాత్మకంధకారంతు వక్త్రదేశేతు విన్యసేత్‌. 19

దకారం రూపతత్త్వంతు హృద్దేశే వినివేశ##యేత్‌ | థకారం వస్తి దేశుతు రసతన్మాత్రకం న్యసేత్‌. 20

ద్వితకారంగన్ధ తన్మాత్రం జఙ్ఘయోర్వినివేశ##యేత్‌ | ణకారం శ్రోత్రయోర్న్య స్యఢకారం విన్యసేత్త్వచి. 21

డకారం నేత్రయుగ్మేతు రసనాయాం ఠకారకమ్‌ | టకారం నాసికాయంతు ఞకారంవాచి విన్యసేత్‌. 22

ఝకారం కరయేర్న్యస్య పాణితత్త్వం విచక్షణః | జకారం పదయోర్న్యస్య చంపా¸° చముపస్థకే. 23

విన్యసేత్పృ థివీతత్త్వం ఙకారం పాదయుగ్మ కే | వస్తౌ ఘకారం గంతత్త్వం తై జసంహృది విన్యసేత్‌. 24

ఖకారం వాయుతత్త్వం చ నాసికాయాం నివేశ##యేత్‌ | కకారం విన్న్యసేన్నిత్యం ఖతత్త్వం మస్తకే బుధః. 25

శబ్దతన్మాత్ర తత్త్వవాచకమగు నకారమును (నం) శిరస్సుపైనను, స్పర్శరూప ధకారమును (ధం) ముఖప్రదేశమునందును, రూపతత్త్వవాచకమగు దకారమును (దం) నేత్రప్రాంతము నందును, రసతన్మాత్రబోధక థకారమును (థం) వస్తి ప్రదేశ (మూత్రాశయ) మునందును, గంధతన్మాత్ర స్వరూపమగు తకారమును (తం) పిక్కలయందును, ణకారమును (ణం) శ్రోత్రములందును, ఢకారమును (ఢం) త్వక్కుపైనను, డకారమును (డం) నేత్రములందును, ఠకారమును (ఠం) జిహ్వయందును. టకారమును (టం) నాసికయందును ఞకారమును (ఇం) వాగింద్రియమునందును, పాణితత్త్వరూపమగు ఝకారమును (ఝం) హస్తములందును. జకారమును (జం) పాదములందును, ఛకారమును (ఛం) పాయువునందును చకారము (చం) ఉపస్ధయందును, పృధ్వీతత్త్వ రూపమగు జకారమును (జం) పాదములందును, ఘకారము (ఘం) వస్తి యందును, తేజస్తత్త్వరూపమగు (గం) ను హృదయమునందును, వాయుతత్త్వరూపమగు ఖకారమును (ఖం) నాసికయందును న్యాసము చేయవలెను. కకారము (కం) ఆకాశతత్త్వరూపమైనది. విద్వాంసుడు దాని నెల్లప్పుడును శిరస్సుపై న్యాసము చేయవలెను.

హృత్ఫుణ్డరీ కే విన్యస్య యకారం సూర్యదైవతమ్‌ | ద్వాసపత్తి సహస్రాణి హృదయా దభినిఃసృతాః 26

కలషోడశసంయుక్తం సకారం తత్ర విన్యసేత్‌ | తన్మధ్యేచిన్తయేన్మన్త్రీ బిన్దు వహ్నేస్తు మణ్డలమ్‌ . 27

హకారం విన్యసేత్తత్ర ప్రణవేన సురోత్తమ | ఓంఆం పరమేష్ఠ్యాత్మనే అం నమః పురుషాత్మనే. 28

ఓంవాం నమో నివృత్త్యాత్మనే నాం చవిశ్వాత్మనేనమః |

ఓంవాంనమః సర్వాత్మనే ఇత్యుక్తాః పఞ్చశక్తయః. 29

స్థానే తు ప్రథమా యోజ్యా ద్వితీయా అసనే మతా | తృతీయా శయనే తద్వచ్చతుర్థీ యానకర్మణి. 30

ప్రత్యర్చాయాం పఞ్చమీ స్యాత్పఞ్చోపనిషదః స్మృతాః |

హుంకారం విన్యసేన్మధ్యే ధ్యాత్వా మన్త్రమయం హరిమ్‌. 31

హృదయ కమలమునందు సూర్యదేవతకు సంబంధించిన 'యం' బీజము న్యాసము చేసి, హృదయమును నుండి బయల్వెడలిన డెబ్బది రెండువేలనాడులలో షోడశలాయుక్తసకార (సం) న్యాసము చేయవలెను. దాని మధ్యభాగమునందు బిందుస్వరూపవహ్నిమండలమును భావించవలెను. ఓ సురశ్రేష్ఠా! దానిపై ప్రణవసహితకార (హం) న్యాసము చేయవలెను. "ఓం ఆం నమ! పరమేష్ఠ్యాత్మనే" ఓం ఆం నమః పురుషాత్మనే, ఓం వాం నమో నిత్యాత్మనే, ఓం నాం నమో విశ్వాత్మనే ఓం వం నమః సర్వాత్మనే" అనునవి ఐదు శక్తులు. ప్రథమ శక్తిని స్నానమునందును-ఆసకర్మయందు, ద్వితీయశక్తిని, శయనమునందు తృతీయ శక్తిని, యానకర్మయందు చతుర్థశక్తిని, అర్చనాకాలమునందు పంచమశక్తిని వినియోగించవలెను. ఈ ఐదును ఉపనిషత్తులు. వీటి మధ్యయందు మంత్రమయు డగు శ్రీహరిని ధ్యానించి క్షకారము (క్షం)ను న్యాసము చేయవలెను.

యాం మూర్తిం స్థాపయేత్తస్యా మూలమన్త్రం న్యసేత్తతః | ఓం నమో భగవతే వాసుదేవాయ మూలకమ్‌ . 32

శిరోఘ్రాణలలాటేషు ముఖే కణ్ఠ హృది క్రమాత్‌ | భుజయేర్జఙ్ఘయోరజ్ఘ్య్రోః కేశవం శిరసి న్యసేత్‌. 33

నారాయణం న్యసేద్వక్త్రే గ్రీవాయం మాధవం న్యసేత్‌ |

గోవిన్దం భుజయోర్న్యస్య విష్ణుం చ హృదయే న్యసేత్‌. 34

మధుసూదనకం పృష్ఠే వామనం జఠరే న్యసేత్‌ | కట్యాం త్రివిక్రమం న్యస్య జఙ్ఘాయాం శ్రీధరం న్యనేత్‌. 35

హృషీకేశం దక్షిణాయాం పద్మనాభం తు గుల్ఫకే | దామోదరం పాదయోశ్చ హృదయాది షడఙ్గకమ్‌. 36

ఏ మూర్తి స్థాపింపబడుచున్నదో ఆ మూర్తికి సంబంధించిన మూలమంత్రము న్యాసము చేయవలెను. "విష్ణు స్థాపన చేసినపుడు) "ఓం నమో బగవతే వాసుదేవాయ" అనునది మూలమంత్రము. ఈ మూలమంత్రముయొక్క ఒక్కొక్క అక్షరమును శిరస్సు, నాసిక, లలాటము, ముఖము, కంఠము, హృదయము, భుజములు, పిక్కలు, పాదములు-వీటియందు క్రమముగ న్యాసము చేయవలెను. పిమ్మట శిరస్సుపై కేశవుని, ముఖముపై నారాయణుని, కంఠముపై మాధవుని, భుజములపై గోవిందుని, హృదయముపై విష్ణువును, పృష్ఠభాగమున మధుసూదనుని, జఠరమున వామనుని, కటిపై త్రివిక్రముని, పిక్కలపై శ్రీధరుని, దక్షిణభాగమున హృషీకేశుని, చీలమండలపై పద్మనాభుని, పాదములపై దామోదరుని న్యాసము చేసి, పిమ్మట హృదయాదిషడంగన్యాసములు చేయవలెను. సత్ఫురుషులలో శ్రేష్ఠుడ వైన బ్రహ్మదేవా! ఇది ఆదిమూర్తి విషయమున చెప్పిన సాధారణన్యాసము.

ఏతత్సాధారణం ప్రోక్తమాదిమూర్తేస్తు సత్తమ | అథవా యస్య దేవస్య ప్రారబ్దం స్థాపనం భ##వేత్‌. 37

తస్త్యెవ మూలమన్త్రేణ సజీవకరణం భ##వేత్‌ | యస్యా మూర్తేస్తు యన్నామ తస్యాద్యం చాక్షరం చయత్‌. 38

తత్స్వరైర్ధ్వాదశై ర్భేద్య హ్యఙ్గాని పరికల్పయేత్‌ | హృదయాదీన దేవేశ మూలం చ దశమాక్షరమ్‌. 39

యథా దేవే తథా దేహే తత్త్వాని వినియోజయేత్‌ | చక్రాబ్జమణ్డలే విష్ణుం యజేద్గన్దాదినా తథా. 40

పూర్వవచ్చాసనం ధ్యాయేత్సగాత్రం సపరిచ్ఛదమ్‌ | శుభం చక్రం ద్వాదశారం హ్యుపరిష్టాద్విచన్యయేత్‌. 41

త్రినాభిచక్రం ద్వినేమి స్వరైస్తచ్చ సమన్వితమ్‌ | పృష్ఠదేశే తతః ప్రాజ్ఞః ప్రకృత్యాదీన్ని వేశ##యేత్‌. 42

పూజయేదారగ్రేషు సూర్యం ద్వాదశధా పునః | కలాషోడశసంయుక్తం సోమం తత్రవిచిన్తయేత్‌. 43

సబలం త్రితయే నాభౌ చిన్తయోద్దేశికోత్తమః | పద్మం చ ద్వాదశదలం పద్మమధ్యే విచిన్తయేత్‌. 44

లేదా ఏదేవత ప్రతిష్ఠింపిబడుచున్నదో దాని మూలమంత్రముచేతనే మూర్తి సజీవకరణ ప్రకియ జరుపవలెను. ఆ మూర్తి యొక్క పేరులోని మొదటి అక్షరము గ్రహించి, దానికి పండ్రెండు స్వరములను చేర్చి అంగకల్పన చేయవలెను. దేవేశ్వరా! విగ్రహముపై హృదయాద్యంగన్యాసము, ద్వాదశాక్షరమూలమంత్రన్యాసము, తత్త్వన్యాసము ఏ విధముగ చేయబడునో ఆ విధముగనే తన శరీరముమీద కూడ చేయవలెను. పిమ్మట చక్రాకార మగు పద్మమండలముపై మహావిష్ణువును గంధాదులచే పూజించవలెను. వెనుకటి వలెనే మహావిష్ణు శరీరమును, వస్త్రాలంకారాదులను, ఆసనమును ధ్యానించవలెను. పై భాగమున పండ్రెండు ఆకుల సుదర్శన చక్రమును ధ్యానించవలెను. ఆ చక్రమునకు మూడు నాభులు, రెండు నేములు (చక్రాంతములు) పండ్రెండు స్వరములు ఉండును. పిమ్మట విద్వాంసుడు పృష్ఠదేశమున ప్రకృత్యాదులను స్థాపింపవలెను. ఆకులు చివర పండ్రెండు గురు సూర్యులను పూజింపవలెను. పిమ్మట అచట పదునారు కళలతో కూడిన చంద్రుని ధ్యానించవలెను. చక్రనాభియందు మూడు వస్త్రములను ధ్యానించవలెను. పిమ్మట శ్రేష్ఠుడైన ఆచార్యుడు పద్మములోపల ద్వాదశదల పద్మమును ద్యానించవలెను.

తన్మధ్యే పౌరుషీం శక్తిం ధ్యాత్వా7భ్యర్చ్య చ దేశికః |

ప్రతిమాయాం హరిం న్యస్య తత్ర తం పూజయేత్సురాన్‌. 45

గన్ధపుష్పాదిభిః సమ్యక్‌ సాఙ్గం సావరణం క్రమాత్‌ | ద్వాదశాక్షరబీజైస్తు కేశవాదీన్‌ సమర్చయేత్‌. 46

ద్వాదశారే మణ్డపే తు లోకపాలాదికం క్రమాత్‌ | ప్రతిమా మర్చయోత్పశ్చాద్గన్ధ పుష్పాదిభిర్ద్విజః. 47

పౌరుషేణ తు సూక్తేన శ్రియాః సూక్తేన పిణ్డికామ్‌ | జననాది క్రమాత్పశ్చాజ్జనయే ద్త్వెష్ణ వాలయమ్‌. 48

హుత్వాగ్నిం వైష్ణవైర్మన్త్రైః కుర్యాచ్ఛాన్త్యుదకం బుధః |

తత్సిక్త్వా ప్రతిమామూర్ద్ని వహ్ని ప్రణయనం చరేత్‌. 49

దక్షిణగ్నిం హుతమితి గుణ్డ7గ్నిం ప్రణమేద్బుధః | అగ్నిమగ్నీతి పూర్వేతు కుణ్డ7గ్నిం ప్రణయేద్భుధః 50

ఉత్తరే ప్రణయేదగ్నిమగ్ని మగ్నీ హవామహే | అగ్నిప్రణయనే మన్త్రస్త్వమగ్నే హ్యగ్నిరుచ్యతే. 51

ఆ పద్మముపైన పురుషశక్తిని ధ్యానించి, దానిన పూజించవలెను. పిమ్మట, దేశికుడు, ప్రతిమపై శ్రీహరి న్యాసము చేసి, ఆ శ్రీహరిని, ఇతర దేవతలను పూజింపవలెను. గంధపుష్పాద్యుపచారములు సమర్పించి అంగావరణ సహితముగా ఇష్ట దేవతను బాగుగా పూజింపవలెను. ద్వాదశాక్షర మంత్రములోని ఒక్కొక్క అక్షరమును బీజాక్షరముగ చేసి దానితో కేశవాది భగవద్విగ్రహములను క్రమముగ పూజించవలెను. పండ్రెండు ఆకులుగల మండలము మీద ఆ క్రమముగ లోక పాలాదులను పూజింపవెలను. పిమ్మట, ద్విజుడు, గంధపుష్పాద్యుపచారములతో పురుషసూక్తమును పఠించుచు పురుషప్రతిమలను. శ్రీ సూక్తము పఠించుచు పిండికలను పూజింపవలెను పిమ్మట జననాదిక్రమమున వైష్ణవాగ్నిని ఆవిర్భవింపిచేయవలెను. విష్ణుదేవతకు సంబంధిచిన మంత్రములతో అగ్నిలో హోమము చేసి, విద్వాంసుడు, శాంతిజలమును సిద్ధముచేసి దానిని ప్రతిమ శిరస్సుపై చల్లి, అగ్ని ప్రణయనము చేయవలెను. 'అగ్నిం దూతం' ఇత్యాది మంత్రముతో దక్షిణ కుండమునందును, "అగ్నిమగ్నిమ్‌" ఇత్యాది మంత్రముతో పూర్వ కుండనముందును 'అగ్ని మగ్నిం హవీముఖిః' ఇత్యాది మంత్రముతో ఉత్తర కుండమునందును అగ్ని ప్రణయనము చేయవలెను. అగ్ని ప్రణయనసమయమునందు 'త్వమగ్నేద్యుభిః" ఇత్యాది మంత్రము పఠింపవలెను.

పలాశసమిధాం తత్ర అష్టోత్తర సహస్రకమ్‌ | కుణ్డ కుణ్డ హోమయేచ్ఛ వ్రీహీన్వేదాదికైస్తథా. 52

ప్రాజ్యాం స్తిలాన్వ్యాహృతిభిర్మూల మన్త్రేణ వై ఘృతమ్‌. |

కుర్యాత్తతః శాన్తిహోమం మధురత్రితయేన చ. 53

ద్వాదశార్ణైః స్పృశేత్పాదౌ నాభిం హృన్మస్తకం తతః |

ఘృతం దధిపయో హుత్వా స్పృశేన్మూర్ధన్యథో బుధః. 54

స్పృష్ట్వా శిరోనాభి పాదాశ్చతస్రః స్థాపయేన్నదీః | గఙ్గా యమునా గోదా క్రమాన్నామ్నా సరస్వతీ. 55

దుహేత్తు విష్ణుగాయత్ర్యా గాయత్ర్యా శ్రపయోచ్చరుమ్‌ | హోమయేచ్చ బలిం దద్యాదుత్తరే భోజయేద్ద్వియజాన్‌.

సామాధిపానాం తుష్ట్యర్థం హేమగాం గురవే దదేత్‌ | దిక్పతిభ్యోబలిం దత్త్వా రత్రౌ కుర్యాచ్చ జాగరమ్‌.

బ్రహ్మగీతాది శ##భ్దేన సర్వభాగధివాసనాత్‌.

ఇత్యాదిమహాపురాణ అగ్నేయే7ధివాసనం నామైకోనషష్టితమో7ధ్యాయఃé

ఒక్కొక కుండములో ఓంకారోచ్చారణ పూర్వకముగ ఒక వెయ్యి ఎనిమిది చొప్పున పలాశసమిధలను యవలు మొదలగు వాటిని హోమము చేయవలెను. వ్యాహృతి మంత్రముతో ఘృతమిశ్రతిలలను, మూలమంత్రముతో ఘృతమును హోమము చేయవలెను. పిమ్మట మధురత్రయము (నెయ్యి, తెనె, పంచదార)తో శాంతిహోమము చేయవలెను. ద్వాద శాక్షర మంత్రముతో పాదనాభి-హృదయ-శిరస్సులను స్పృశింపవలెను. నెయ్యి, పెరుగు, పాలు హోమము చేసి శిరస్సు స్పృశింపవలెను. పిమ్మట శిరో-నాభి-పాదములు స్పృశించి గంగా-యమునా-గోదావరి-సరస్వతీ నదులను ఆవాహనము చేయవలెను. విష్ణుగాయత్రితో అగ్నిని రగిల్చి, గాయత్రితో ఆ అగ్నిపై చరువును వండవలెను. గాయత్రీ మంత్రముతో హోమము చేసి, బలు లిచ్చి, పిమ్మట బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. మాసాధీపతులైన ద్వదశాది దిత్యుల తుష్టికై ఆచార్యునకు బంగారము, గోవు దక్షిణగా ఈయవలెను. దిక్పాలకులను బలి ఇచ్చి. వేదపాఠ - గీత కీర్త నాదులతో రాత్రి జాగరణము చేయవలెను. ఈ విధముగ ఆధివాసనము పూర్తి చేసినవానికి అన్ని ఫలములును లభించును.

అగ్ని మహాపురాణమునందు అధివాసన మను ఏబది తొమ్మిదవ అద్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters