Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ష్టట్పఞ్చాశత్తమో7ధ్యాయః

అథ దిక్పాలయాగ కథనమ్‌:

శ్రీ బగవానువాచ:

ప్రతిష్ఠా పఞ్చకం వక్ష్యే ప్రతిమాత్మాతు పూరుషః | ప్రకృతిః పిండికాలక్ష్మీః ప్రతిష్ఠా యోగకస్తయోః. 1

ఇచ్ఛా ఫలార్థిభిస్తస్మాత్ప్రతిష్ఠా క్రియతే నరైః | గర్భసూత్రంతునిస్సార్య ప్రాసాదస్యాగ్రతో గురుః . 2

అష్టషోడశవిం శాన్తం మణ్డపం చాధ మాధికమ్‌ | స్నానార్థం కలశార్థంచ యాగద్రవ్యార్థ మర్ధతః . 3

త్రిభాగేణార్థ భాగేన వేదింకుర్యాత్తు శోభనమ్‌ | కలశైర్ఘటికాభిశ్చ వితానాద్యైశ్చ భూషయేత్‌. 4

పఞ్చగవ్యేన సంప్రోక్ష్య సర్వద్రవ్యాణి ధారయేత్‌ | అలఙ్కృతో గురుర్విష్ణుం ధ్యాత్వాత్మానం ప్రపూజయేత్‌. 5

హయగ్రీవుడుచెప్పెను: బ్రహ్మదేవా, ఇపుడు ఐదు ప్రదిష్ఠాంగములను చెప్పెదను. ప్రతిమ పురుషునికి ప్రతీకయైనచో పిండిక ప్రకృతికి ప్రతీకము. లేదా ప్రితమానా%ాయణస్వరూపము, పిండిక లక్ష్మీస్వరూపము. ఈ రెండింటి యోగమునే ప్రతిష్ఠ అందురు. అందుచే ఆయా ఫలములు కోరువారు ఆయాదేవతల ప్రతిష్ఠ చేయుదురు. ఆచార్యుడుదేవాలయము ఎదుట గర్భసూత్రము తొలగించి ఎనిమిది, లేదా పదునారు లేదా ఇరువది హస్తముల మండపము నిర్మింపవలెను. ఎనిమిదిహస్తముల మండపము 'నిమ్నము', పదునారు హస్తములది 'మధ్యమము', ఇరువదిహస్తములది 'ఉత్తమము' మండపములో సగము భాగమును దేవతాస్నానమునకు, కలశస్థాపనకొరకు, యాగమునకు సంబంధించిన ద్రవ్యములను ఉంచుటకును కేటాయించవలెను. మిగిలిన సగముమండపములో, లేదా మూడవవంతు మండపములో సుందరమైన వేది ఏర్పరుపవలెను. దానిని పెద్ద పెద్ద కలశలతోడను, చిన్న చిన్న కలశతోడను, చాందనీలు మొదలైన వాటితోడను అలంకరింపవలెను. మండపములోపల పంచగవ్యములుచల్లి, శుద్ధిచేసి, అచట సామగ్రియంతయు ఉంచవలెను. పిమ్మట ఆచార్యుడు వస్త్రమాలాద్యంలంకృతుడై, విష్ణువును ధ్యానించి పూజింపవలెను.

అఙ్గళీయ ప్రభృతిభిర్మూర్తి పాన్వలయాదిభిః | కుణ్డకుణ్ణ స్థాపయేచ్చ మూర్తి పాంస్తస్త్ర పారగాన్‌ . 6

చతుష్కోణ చార్దకోణ వర్తులే పద్మసన్నిభే | పూర్వాదౌ తోరణార్థంతు పిప్పలో దుమ్బరౌ వటః. 7

ప్లక్షః సుశోభనం పూర్వం సుభద్రం దక్షతోరణమ్‌ | సుకర్మాణం సుహోత్రంచ అప్యేసౌమ్యే సముచ్ఛ్రయమ్‌. 8

పఞ్చహస్తంతు సంస్థాప్య స్యోనాపృథివీతి పూజయేత్‌ | తోరణస్తమ్భమూలేతు కలశాన్మంగలాజ్కు రాన్‌. 9

ప్రదద్యాదు పరిష్టాచ్చ కుర్యాచ్చక్రం సుద్రర్శనమ్‌ | పఞ్చహస్త ప్రమాణంతు ధ్వజం కుర్యాద్విచక్షణః. 10

వైపుల్యం చాస్య కుర్వీత షోడశాజ్గుల సంమితమ్‌ | సప్తహస్తోచ్ఛ్రితం చాస్య కుర్యాద్దణ్డం సురోత్తమ. 11

అరుణో7గ్ని నిభ##శ్త్చెవ కృష్ణః శుక్లోథపీతకః | రక్తవర్ణస్తథా శ్వేతశ్త్చెవం వర్ణాదికం క్రమాత్‌. 12

ఉంగరములు మొదలగు ఆభరణములిచ్చి, ప్రార్థించి మూర్తిపాలకులగు విద్వాంసులను సత్కరించి వారిని చతురస్రములు, అర్ధచంద్రాకారములు, గోలాకారములు, లేదా పద్మసదృశములు అగు కుండములపై కూర్చుండపెట్టవలెను. పూర్వాది దుక్కులతోరణములకు అశ్వత్థ-ఉదుంబర-వట-ప్లక్షదారువులను ఉపయోగింపవలెను. తూర్పుద్వారమునకు 'సుశోభన' మని పేరు. దక్షిణద్వారము 'సుభద్రము' , పశ్చిమద్వారము 'సుకర్మ' ఉత్తరద్వారము' సుహోత్రము'. ఆ తోరణస్తంభములన్నియు ఐదుహస్తుముల ఎత్తు ఉండవలెను. వీటిని స్థాపించి "స్యోనా పృథివీనో" అనే మంత్రముచే పూజించవలెను. తోరణస్తంభముల మూల భాగములందు మంగళకరమైన చూత పల్లవ - యవాంకురాద్యంకురములున్న కలశలు స్థాపింపవలెను. తోరణస్తంభముపై సుదర్శన చక్రము స్థాపింపవలెను. నేర్పుగల విద్వాంసుడు ఐదు అడుగుల ఐదు హస్తముల ధ్వజముకూడ స్థాపింపవలెను. దీన వెడల్పు పదునారు అంగుళములుండవలెను. ఓ సురశ్రేష్ఠా! ఆ ధ్వజదండము ఏడుహస్తముల ఎత్తు ఉండవలెను. పూర్వాది దిశలందు ధ్వజములపై అరుణవర్ణము, అగ్ని (ధూమ్రవర్ణము), కృష్ణ-శుక్ల-పీత-రక్త-శ్వేత వర్ణములు ఉండవెలను.

కుముదః కుముదాక్షశ్చ పుణ్డరీ కో7థ వామనః | శజ్కు కర్ణః సర్వనేత్రః సుముఖః సుప్రతిష్ఠతః. 13

పూజ్యాః కోటిగుణౖర్యుక్తాః పూర్వాద్యా ధ్వజదేవతాః | జలాఢక సుపూరాస్తు పక్వబిమ్బోపమా ఘటాః 14

అష్టావింశాధిక శతం కాలమణ్డన వర్జితా ః | సహిరణ్యా వస్త్రకణ్ఠాః సోదకాస్తోరణాద్బహిః . 15

ఘటాఃస్థాప్యాశ్చ పూర్వాదౌ వేదికాయాశ్చ కోణగాః | చతురః స్థాపయేత్కుమ్బానాజిఘ్రేతిచ మన్త్రతః. 16

కుమ్భేష్వావాహ్య శక్రాదీన్‌ పూర్వాదౌ పూజయేత్క్రమాత్‌ | ఇన్ద్రాగచ్ఛ దేవరాజ వజ్రహస్త గజస్థిత. 17

పూర్వద్వారం చ మేరక్ష దేవైఃసహనమోస్తుతే | త్రాతారమిన్ద్రమన్త్రేణ అర్చ యిత్వాయజేద్భుధః 18

ఆగచ్ఛాగ్నే శక్తియుక్త భాగస్థ బలసంయుత | రక్షాగ్నేయీందిశం దేవైః పూజాంగృహ్ణ నమోస్తుతే. 19

అగ్మిర్మూర్దేతి మన్త్రేణ యజేద్వా అగ్న యేనమః | మహిషస్థ యమాగచ్ఛ దణ్డ హస్తమహాబల. 20

రక్షత్వం దక్షిణద్వారం వైవస్వత నమో7స్తుతే | వైవస్వతం సంగమన మిత్యనేన యజేద్యమమ్‌. 21

నైరృతాగచ్ఛ ఖడ్గాఢ్య జలవాహనసం యుత | ఇదుమర్ఘ్య మిదం పాద్యం రక్షత్వం నైరృతీం దిశమ్‌. 22

ఏషతే నైరృతమన్త్రేణ యజేదర్ఘ్యాది భిర్నరః | మకరారూఢ వరుణ

పాశహస్తమహాబల. 23

అగచ్ఛ పశ్చిమద్వారం రక్ష రక్ష నమో7స్తుతే | ఉరుంహి రాజావరుణ యజేదర్ఘ్యాది భిర్గురః. 24

పూర్వాది దిక్కులలోనున్న ధ్వజములపై కుముద-కుముదాక్ష-పుండరీక-వామన-శంకుకర్ణ-సర్వనేత్ర-సుముఖ-సుప్రతిష్ఠితులను దేవతలను పూజింపవలెను. వీరందరును కోట్లకొలది సద్గుణములు కలవారు. ఎఱ్ఱని దొండపండువలె ఎఱ్ఱగాకాలిన నూడ ఇరువది ఎనిమిది కలశలను నాలుగు శేర్ల నీళ్లతోనింపి 'కాలదండ' మను యోగములేని సమయమున స్థాపింపవలెను. వీటి అన్నింటికి కంఠభాగమునందు వస్త్రములుకట్టి, వాటిలో సువర్ణము ఉంచి, తోరణముల వెలుపల ఉంచవలెను. వేదికి తూర్పుమొదలైన నాలుగు దిక్కులందును, కోణములందును గూడ కలశములు స్థాపింపవెలను. మొదట నాలుగు కలశములను పూర్వాది దిక్కులు నాల్గింటియందు "అజిఘ్ర కలశమ్‌" ఇత్యాది మంత్రము చదువుచు స్థాపింపవలెను. ఆ కలశలపై, పూర్వాది దిక్కులందు దిక్పాలకులను అవాహనచేసి పూజింపవెలను. "ఐరావతముపై ఎక్కి, హస్తమున వజ్రము ధరించిన దేవరాజువైన ఇంద్రా! ఇతరదేవతలతో కూడ ఇచటికి రమ్ము; ఈ తూర్పు ద్వారమును రక్షింపిము; దేవతాసమేతుడవైన నీకు నమస్కారము'' అని ప్రార్థించుచు ఇంద్రుని ఆవహనచేసి, "త్రాతారమిన్ద్రమ్‌" ఇత్యాదిమంత్రము పఠించుచు పూజింపవలెను. "మేషమునెక్కి, శక్తని ధరించియున్న బలిశాలివైన ఓ అగ్నిదేవా! దేవతలతో కూడవచ్చి, ఈ అగ్నేయదిక్కును రక్షింపుము. నా పూజ గ్రహింపుము; నీకు నమస్కారము; అని ప్రార్థించుచు అగ్నిని ఆవాహనముచేసి "అగ్నిర్మూర్ధా" లేదా అ"గ్నియే నమః" అను మంత్రముచే పూజింపవలెను. "మహిషారూఢుడవై దండము ధరించియున్న, మహాబలిశాలియైన సూర్యపుత్రా! యమదేవా! నీవు వచ్చి దక్షిణద్వారమును రక్షింపుము; నీకు నమస్కారము" అని ప్రార్థించి యముని ఆవాహనముచేసి, "వైవస్వతం సంగమనమ్‌ " ఇత్యాది మంత్రముచే పూజింపవలెను. "బలవాహన సంపన్నుడవైన, ఖడ్గధారియైన ఓ నిరృతీ! రమ్ము. ఈ అర్ఘ్యపాద్యములను గ్రహింపుము; నైరృతిదిక్కును రక్షించుము" అని ప్రార్థించుచనిరృతిని అవాహనముచేసి "ఏషతే నిరృతే" ఇత్యాది మంత్రముచే అర్ఘ్యాద్యుపచారములనిచ్చి పూజింపవలెను. "మకరమును ఎక్కినవాకడా! పాశధారీ! మహాబలశాలియైన ఓ వరుణదేవా! రమ్ము! పశ్చిమద్వారమును రక్షింపుము; నీకు నమస్కారము" అని ప్రార్థించుచు వరుణుని అవాహనముచేసి "ఉరుంహి రాజావరుణః" ఇత్యాది మంత్రములతో ఆచార్యుడు వరుణదేవతకు అర్ఘ్యము సమర్పించి పూజింపవలెను.

ఆగచ్ఛ వాయోసబల ధ్వజహస్త సవాహన | వాయవ్యం రక్షదేవైస్త్వం సమరుద్భిర్నమో7స్తుతే. 25

వాతఇత్యాదిభిశ్చార్చేదోన్నమోవా యవేపివా | ఆగచ్ఛ సోమ సబల గదాహస్త సవాహన. 26

రక్షత్వముత్తరం ద్వారం సకుబేరనమో7స్తుతే | సోమం యజే రాజానమితివా యజేత్సోమాయవైనమః. 27

ఆగచ్ఛే శాన సబల శూలహస్త వృషస్థిత | యజ్ఞమణ్డ పసై#్యశానీం దిశం రక్ష నమో7స్త. 28

ఈశానమస్యేతి యజే దీశానాయ నమో7పివా | బ్రహ్మన్నా గచ్ఛ హంసస్థ స్రుక్స్రవ వ్యగ్రహస్తక. 29

సలోకార్ధ్వాం దిశం రక్ష యజ్ఞస్యాజ నమో7స్తుతే | హిర్యణ్యగర్భేతి యజేన్నమస్తే బ్రహ్మణ7పిచ. 30

అనన్తాగచ్ఛ చక్రాఢ్య కూర్మస్థాహి గణశ్వర | అధోదిశం రక్షరక్ష అనన్తేశ

నమో7స్తుతే. 31

నమో7స్తు సర్పేతి యజేదనన్తా యనమో7పివా|

ఇత్యాది పురాణ అగ్నేయేదశదిక్పతి యాగోనామ షట్పఞ్చాశత్తమోధ్యాయః

ధ్వజము ధరించిన, మహాబలశాలివైన వాయుదేవా, నీ వాహనమునెక్కి, దేవతలతోను మరుత్తులతోడనువచ్చి వాయువ్యదిక్కును రక్షించుము; నీకు నమస్కారము" అ%ి ప్రార్థించుచు వాయువును ఆవాహనచేసి "వాత ఆవాతు" ఇత్యాది మంత్రముచేతగాని, "ఓం నమో వాయవే" అను మంత్రముచేతగాని వాయుదేవుని పూజింపవలెను. "బలవాహనంపన్నుడవు గదాధారివి అగు సోమా! నీవు వచ్చి ఉత్తరద్వారమును రక్షింపును. కుబేరసహితుడవగు నీకు నమస్కారము" అని ప్రార్థించుచు సోముని అవాహనముచేసి, "సోమం రాజానమ్‌" ఇత్యాది మంత్రముచేతగాని,"సోమాయనమః" ఇత్యాది మంత్రముచేతగాని పూజింపవలెను,"వృషభారూఢుడవును, మహాబలశాలివి, శూలధారివి అగు ఈశానా! నీవు వచ్చి యజ్ఞమండపముయొక్క ఈశాన్యదిక్కును రక్షింపుము; నీకు నమస్కారము" అని ప్రార్థించి ఈశానుని ఆవాహనముచేసి "ఈశానమస్య" ఇత్యాదిమంత్రముచేతగాని, "ఈశానాయ నమః" అను మంత్రముచేతగాని, పూజింపవలెను. "హస్తాగ్రములందు స్రుక్‌స్రువములను ధరించినవాడువును, హంసారూపుఢుడవును, జన్మరహితుడవును అగు ఓ బ్రహ్మదేవా! ఊర్ధ్వదిక్కను రక్షించుము: నీకు నమస్కారము" అని ప్రార్థించి, బ్రహ్మదేవుని ఆవాహనముచేసి, "హిరణ్యగర్భః" ఇత్యాది మంత్రము చేతగాని "నమస్తే బ్రహ్మణ" ఇత్యాది మంత్రముచేతగాని పూజింపవలెను." "తాబేలు వీపుపై కూర్చున్నవాడా! నాగ గణముల అధిపతీ! చక్రధారీ! అనంతా! రమ్ము; అధర దిశను రక్షింపుము; అనంతేశ్వరా! నీకు నమస్కారము" అని ప్రార్థించుచు అనంతుని ఆవాహనముచేసి "నమో7స్తు సర్పేభ్యః" అను మంత్రముచేగాని, "అనన్తాయనమః" అను మంత్రముచేతగాని పూజింపవలెను.

అగ్నిమాహాపురాణమునందు దశదిక్పతియాగ మను ఏబదియారవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters