Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చ పఞ్చాశత్తమో7ధ్యాయః.

అథ పిణ్డికా లక్షణమ్‌:

శ్రీ భగవానువాచ:

అతఃపరంప్ర వక్ష్యామి ప్రతిమానాం తు పణ్డికామ్‌ | దైర్ఘ్యేణ ప్రతిమాతుల్యా తదర్దేనుతు విస్తృతా. 1

ఉచ్ఛ్రితాయామతో7ర్దేన సువిస్తారార్ద భాగతః | తృతీయేన తువాతుల్యాం తత్త్రి భాగేణ మేఖలామ్‌. 2

ఖాతంచ తత్ప్రమాణంతు కిజ్చిదుత్తరతో నతమ్‌ | విస్తారస్య చతుర్దేన ప్రణాలస్య వినిర్గమమ్‌. 3

(మమమూలస్య విస్తార మగ్రే కుర్యాత్త దర్దతః | విస్తారస్య తృతీయేన తోయమార్గంతు కారయేత్‌. 4

పిండికార్దేన వాతుల్యం దైర్ఘ్యమీశస్య కీర్తితమ్‌ | ఐశంవా తుల్య దీర్ఘం చజ్ఞాత్వా సూత్రం ప్రకల్పయేత్‌. 5

హయాగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! నే నిపుడు ప్రతిమల పిండికల లక్షణమును చెప్పెదను. పిండిక పొడవు ప్రతిమ పొడవుతో సమానముగా ఉండవలెను; వెడల్పు దానిలో సగముండవలెను. దాని ఎత్తు ప్రతిమ ఎత్తులో సగముండవలెను. లేదా దాని విస్తారము పొడవులో తృతీయాంశముండవలెను. దాని మూడ వంతుచే మేఖల నిర్మింపవెలను. నీరు ప్రవహించుటకై ఉన్న గర్తము కొలత, మేఖల కొలతతో తుల్యముగా నుండవలెను. ఆ గర్తము ఉత్తరమువైపు కొంచెము పల్లముగా నుండవలెను. పిండిక విస్తారములో నాల్గవవంతుతో జలము బైటకు పోవుటకై ప్రణాలము నిర్మించవలెను. మూలభాగమున దానివిస్తారము మూలముతో సమముగా నుండవలెను. పైకి పోయినకొలది సగముండవలెను. ఆ జలమార్గము పిండికా విస్తారములో మూడవవంతుగాని, సగముగాని ఉండవలెను. దాని పొడవు ప్రతిమాపొడవెంతయో అంతే ఉండవలెనని చెప్పబిడనది. లేదా ప్రతిమ పొడవు పిండిక పొడవులో సగముండవలెను. ఈ విషయము బాగుగా అర్ధముచేసికొని దానికి సూత్రపాతము చేయవలెను.

ఉచ్ఛ్రాయం పూర్వవత్కుర్యాద్భాగ షోడ శసంఖ్యయా |

అధఃషట్కం ద్విభాగంతు కణ్ఠ కుర్యాత్రి భాగకమ్‌. 6

శేషాస్త్వేకైకశః కార్యాఃప్రతిష్ఠా నిర్గమాస్తథా | పట్టికా పిండికా చేయం సామాన్య ప్రతిమాసు చ. 7

ప్రాసాదద్వార మానేన ప్రతిమాద్వారముచ్యతే | గజవ్యాలకసం యుక్తా ప్రభాస్యాత్ప్ర తిమాసు చ. 8

పిండికాపి యథా శోభం కర్తవ్యాస తతం హరేః | సర్వేషామేవ దేవానాం విష్ణూక్తమానముచ్యతే. 9

దేవీనామపి సర్వాసాం లక్ష్ముక్తం మానముచ్యతే.

ఇత్యాది మహాపురాణ అగ్నేయే పిండికాది లక్షణం నామ పఞ్చ పఞ్చాశత్తమో7ధ్యాయః.

వెనుక చెప్పినట్లు, ప్రతిమ ఎత్తు షోడశభాగసంఖ్యానుసారముగ చేయవలెను. ఎనిమిది భాగము క్రిందనున్న అర్ధాంగముగా చేయవలెను. దీనిపైననున్న మూడుభాగములు గ్రహించి కంఠమును నిర్మింపవలెను. మిగిలిన భాగములను ఒక్కొక్క దానిని ప్రతిష్ఠ, నిర్గమము, పట్టిక మొదలగువాటి రూపమున విభజింపవలెను. ఇది ప్రతిమాపిండికల సామాన్య లక్షణము. ప్రాసాదద్వార దైర్ఘ్యవిస్తారములనుపట్టి ప్రతిమాగృహద్వారముండవలెను. ప్రతిమల ప్రభలపై ఏనుగులు, సర్పములు మొదలగు వాటి మూర్తులను నిర్మింపవలెను. శ్రీహరియొక్క పిండికను గూడ యథోచిత శోభాసంపన్నముగ నుండునట్లు చేయవలెను. అన్ని దేవప్రతిమల ప్రమాణము విష్ణు ప్రతిమకు చెప్పిన ప్రమాణమువలె నుండవలెను. దేవీప్రతిమల ప్రమాణము లక్ష్మీప్రతిమకు చెప్పిన విధముననే ఉండవలెను.

శ్రీ అగ్నిమహాపురాణమునందు పిండికాది లక్షణమును ఏబదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters