Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకోనపఞ్చాశత్తమో7ధ్యాయః

అథ మత్స్యాది లక్షణ వర్ణనమ్‌

శ్రీ భగవానువాచ:

దశావతారం మత్స్యాది లక్షణం ప్రవదామితే | మత్స్యాకారస్తు మత్స్యః స్యాత్కూర్మః కూర్మాకృతిర్భవేత్‌.

నరాఙ్గో వాథ కర్తవ్యో భూవరాహో గదాదిభృత్‌ | దక్షిణవామకే శఙ్ఖో లక్ష్మీర్వాపద్మమేవవా. 2

శ్రీర్వామ కూర్పరస్థాతుక్ష్మానన్తౌ చరణానుగౌ | వరాహస్థాపనాద్రాజ్యం భవాబ్ది తరణం భ##వేత్‌. 3

నరసిం హోవివృత్తాస్యోవామోరుక్షతదానవః | తద్వక్షో దారయ న్మాలీ స్ఫురచ్చక్రగదాధరః. 4

ఛత్రీదణ్డీవామనః స్యాదథవాస్యాచ్చతుర్భుజః | రామశ్చా షేషుహస్తః స్యాత్ఖడ్గీపరశునాన్వితః. 5

రామశ్చాపీ శరీఖడ్గీ శఙ్ఖీవాద్విభుజఃస్మృతః | గదాలాఙ్గలధారీచ రామోవాథ చతుర్భుజః. 6

వామార్దే లాఙ్గలం దద్యాదధః శఙ్ఖం సుశోభనమ్‌ | ముసలం దక్షిణార్దేతు చక్రంచాధః సుశోభనమ్‌. 7

శాన్తాత్మాలమ్బ కర్ణశ్చగౌరాఙ్గ శ్చామ్బరావృతః | ఊర్ధ్వం పద్మస్థితో బుద్దోవరదాభయదాయకః. 8

ధనుస్తూణాన్వితః కల్కీ వ్లుెచ్ఛోత్సాదకరోద్విజః | అథవాశ్వస్థితః ఖడ్గీ శఙ్ఖచక్రశరాన్వితః. 9

హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు మత్స్యాది దశావతారములు విగ్రహములను గూర్చి చెప్పెదను. మత్స్యావతార విగ్రహము మత్స్యాకారమునను, కూర్మావతార విగ్రహము కూర్మాకారమునను ఉండవలెను. భూమిని పైకి లేవనెత్తుచున్న వరాహావతార విగ్రహముము మనుష్యాకారమున నిర్మికపవలెను. కుడిచేతిలో గదా-చక్రములు, ఎడమచేతిలో శంఖపద్మములు ఉండవలెను. లేదా పద్మమునకు బదులు ఎడమ ప్రక్క లక్ష్మీదేవి ఉండవలెను. లక్ష్మి అతని ఎడమమోచేయి అనుకొని ఉండును. పృథివి, అదిశేషుడు చరణములను అనుసరించి ఉండవలెను. వరాహమూర్తి స్థాపించిన వారికి రాజ్యము లభించును; అంతమును వారు, భవసాగరము దాని మోక్షము పొందుదురు. నృసింహమూర్తి ముఖము తెరచి ఉండును. తన ఎడమ తొడపై హిరణ్యకశిపుని అణచి ఉంచి వాని వక్షమును చీల్చుచుండును. ఆతని కంఠమున మాలయుహస్తములందు చక్ర-గదలును ఉండెను. వామనుని విగ్రహము ఛత్రముతోడను, దండముతోడను ప్రకాశింపవలెచు. నాలుగు భుజములుండవలెను. పరశురాముని చేతిలో ధనుర్బాణములు, ఖడ్గము, గండ్రగొడ్డలి ఉండవలెను. శ్రీరాముని విగ్రహము ధనుర్భాణఖడ్గశంఖములతో ఒప్పారు చుండును. లేదా ఆతనికి రెండు భుజములు మాత్రమే ఉండవచ్చును. బలరాముడు గదను, నాగలిని ధరింపవలెను. లేదా అతనికి నాలుగు భజములుండవచ్చును. అతనిపై ఎడమచేతిలో నాగలి, క్రింది చేతిలో అందమైన శంఖము, పై కుడిచేతిలో ముసలము, క్రిందచేతిలో సుదర్శన చక్రము ఉండవలెను. బుద్ధుడు శాంత స్వరూపముతో, వరద-అభయముద్రలు ధరించి, ఉన్నతమైన పద్మాసనముపై కూర్చుండవలెను. తెల్లని శరీరవర్ణముతో, పొడవైన చెవులతో, అందమైన పీతవస్త్రముచే కప్పబడి యుండవలెను. కల్కి ధనుస్తూణీరములను ధరించి, వ్లుెచ్ఛులను సంహరించు బ్రాహ్మణుడు.లేదా అతని విగ్రహమును గుఱ్ఱముపై ఎక్కి నాలుగు చేతులలో ఖడ్గ-శంఖ-చక్ర-గదలను ధరించి ఉండవలెను.

లక్షణం వాసుదేవాది నవకస్య వదామితే | దక్షిణార్ధే గదా వామే వామార్దేచక్రముత్తమమ్‌. 10

బ్రహ్మేశౌ పార్శ్వగౌ నిత్యం వాసుదేవో7స్తి పూర్వవత్‌ | శఙ్ఖీ సవరదో వాథ ద్విభుజో వా చతుర్భుజఃః

లాఙ్గలీమునలీరామో గదాపద్మధరః స్మృతః | ప్రద్యుమ్నోదక్షిణ వజ్రం శజ్ఖం వామేధనుఃకరే. 12

గదాచాపావృతః ప్రీత్యా ప్రద్యుమ్నోవాధనుః శరీ | చతురృజో7నిరుద్దః స్యాత్తథా నారాయణోవిభుః. 13

చతుర్ముఖశ్చ తుర్బాహుర్బృహజ్జఠర మణ్డలః | లమ్బకూర్చో జటాయుక్తో బ్రహ్మహం సాగ్ర్యవాహనః . 14

దక్షిణ వాక్ష సూత్రంచ స్రువోవామేతు కుణ్డికా | అజ్యస్థాలీ సరస్వతీ సావిత్రీ వామదక్షిణ. 15

విష్ణురష్ట భుజస్తార్ష కరేఖడ్గసుదక్షిణ | గదాధరశ్చవరదో వామే కార్ముక ఖేబకే. 16

శఙ్ఖచక్రే చతుర్పాహుర్నరసింహశ్చతుర్భుజః | శఙ్ఖచక్రధరో వాపి విదారిత మహాసురః. 17

ఇపుడు వాసుదేవాదులగు తొమ్మండుగురి మూర్తుల లక్షణము చెప్పెదను. వాసుదేవునకు పై కుడిచేతిలో చక్రముండుచట ప్రధాన చిహ్నము ఒక పార్శ్వమున బ్రహ్మ, మరొక పార్శ్వము శివుడు సర్వదా ఉందురు. ఇతర విషయములన్నియు వెనుక చెప్పినట్లే, శంఖమునుగాని, వరదముద్రను గాని ధరించి యుండును. ద్విభూజుడు కావచ్చును. చతర్భుజుడు కావచ్చును. బలరామునకు నాలుగు భుజములుండను. కుడిచేతులలో హల-ముసలములను, ఎడమచేతులలో గదా- పద్మములను ధరించి ఉండును. ప్రద్యుమ్నుడు కుడిచేతులలో చక్ర-శంఖములను, ఎడమ చేతులలో ధనుర్బాణములను ధరించి యుండును. లేదా రెండు భుజములుండి ఒకచేతిలో గధను, రెండవ దానిలో ధనస్సును ధరించి యుండును. ఈ ఆయుధములను ప్రసన్నతా పూర్వకముగ ధరించి యుండును. లేదా ఒక హస్తమున ధనస్సు, రెండవ హస్తమున బాణము ఉండును. అనిరుద్ధ-నారాయణుల విగ్రహములు చతుర్భుజములు బ్రహ్మహంసారూఢుడు. నాలుగుముఖములు, ఎనిమిది భుజములు, విశాలమైన ఉదరమండలము, పొడవైన గడ్డము, శిరస్సుపై జటలు ఉండును కుడిచేతులలో అక్షసూత్రమును-స్రువమును, ఎడమచేతులలో కుండికను, అజ్యస్థాలిని ధరించి యుండును. ఎడమ ప్రక్క సరస్వతి, కుడిప్రక్క సావిత్రి ఉండును. విష్ణువు గరుడారుఢుడై ఎనిమిది భుజములతో, కుడిచేతులలో ఖడ్గ-గాద-బాణ-వరదముద్రములను, ఎడమ చేతులలో ధనుస్‌-ఖేటక-చక్ర-శంఖములను ధరించి యుండును. లేదా ఆతని విగ్రహము చతుర్భుజము కూడ కావచ్చును. చతుర్భుజుడైన నృసింహుడు రెండు చేతులలో శంఖచక్రములను ధరించి, రెండు చేతులలో హరిణ్యకశివుని వక్షము చీల్చు చుండును.

చతుర్బాహుర్వరాహస్తు శేషః పాణితలేధృతః | ధారయన్బాహునా పృథ్వీం వామేన కమలాధరః . 18

పాదలగ్నాధరాకార్యా పదా లక్ష్మీర్వ్యవస్థితా | త్రైలోక్య మోహనస్తారే హ్యష్టబాహుస్తుదక్షణ. 19

చక్రం ఖడ్గంచ ముసలమఙ్కుశం వామకేకరే | శఙ్‌ఖ్ఘశార్జగదాపాశాన్పద్మవీణాసమన్వితే. 20

లక్ష్మీ సరస్వతీకార్యే విశ్వరూపో7థదక్షిణ | ముద్గరంచ తథా పాశం శక్తిశూలం శరంకరే. 21

వామేశఙ్జంచ శార్గంచ గదాం పాశం చ తోమరమ్‌ | లాఙ్గలం పరశుం దణ్డం భూరికాం చర్మ క్షేపణమ్‌. 22

వింశద్బాహుశ్చతుర్వక్త్రో దక్షిణస్థా7థవామకే | త్రినేత్రో వామపార్శ్వేన శయితో జలశాయ్యపి. 23

శ్రియాధృతై కచరణో విమలాద్యాభిరీడితః | నాభిపద్మచతుర్వక్త్రో హరిశఙ్కరకోహరిః. 24

శూలర్షిధారీ దక్షేచ గదాచక్రధరో7పరే | రుద్రకేశవ లక్ష్మాఙ్గో గౌరీ లక్ష్మీ సమన్వితః. 25

శఙ్ఖచగ్రదావేదపాణిశ్చాశ్వశిరాహరః | వామపాదోధృతః శేషే దక్షిణః కూర్మపృష్ఠగః. 26

దత్తాత్రేయో ద్విబాహుః స్యాద్వామోత్సఙ్గేశ్రియాసహ | విష్వక్సేన శ్చక్రగదీ హలీశఙ్ఖీ హరేర్గణః. 27

ఇత్యాగ్నేయే మహాపురాణ మత్స్యాది ప్రతిమాలక్షణం నామోన పఞ్చాశత్తమోధ్యాయః.

వరాహమూర్తికి నాలుగు బాహువులుండును. ఆదిశేషుని చేతితోపట్టుకొనును. ఎడమచేతితో భూదేవిని ధరించును. ఎడమపార్శ్వమున లక్ష్మి ఉండును. లక్ష్మియున్నపుడు భూమి అతని పాదములందు లగ్నయైనట్లు చేయవలెను. త్త్రెలోక్య మోహనమూర్తియైన శ్రీహరి గరుడారూఢడు; ఎనిమిది భుజములు కుడిచేతులలో చక్ర-శంఖ-ముసల అంకుశములను, ఎడమచేతిలలో శంఖ-శార్జ-గదా-పాశములును ఉండును. వామభాగమున పద్మహస్తమైన లక్ష్మిప్రతిమను, దక్షిణ పార్శ్వమున సరస్వతి ప్రతిమను నిర్మింపవలెను. విశ్వరూపుని విగ్రహము ఇరువది చేతులతో ప్రకాశించుచుండును. కుడిచేతులలో చక్ర-ఖడ్గ-ముసల-అంకశ-పట్టిశ-ముద్గర-పాశ-శక్తి-శూల-బాణములను, ఎడమచేతులలో శంఖ-శార్జ-గదా-పాశ-తోమర-హల-పరశు-దండ- ఛురికా (చాకు)- చర్మలను ధరించి యుండును. కుడి వైపున చతుర్భుజుడగు బ్రహ్మ, ఎడమవైపున త్రినేత్రుడును ఉందురు. జలశాయి జలములో శయనించి ఉండును. ఈ మూర్తిని శేషశయ్యపై శయనించి యున్నట్లు చేయవలెను. లక్ష్మీదేవి ఒక పాదము ఒత్తు చుండును. విమల మొదలగు శక్తులు స్తుతించుచుండును. ఈ శ్రీహరి నాభికమలమున చతుర్భుజుడగు బ్రహ్మ ప్రకాశించుచుండును. హరిహరమూర్తి కుడిచేతులలో శూల-ఋష్టులను, ఎడమచేతులలో గదా చక్రములను ధరించియుండును. శరీరము కుడిభాగమున రుద్రచిహ్నములు, ఎడమభాగమున కేశవచిహ్నములు ఉండును. దక్షిణపార్శ్వవమున పార్వతి, వామపార్శ్వమున లక్ష్మి ఉందురు. హయగ్రీవుని నాలుగుచేతులలో శంఖ-చక్ర-గదా-వేదములుండును. ఎడమపాదము అదిశేషునిమీదను, కుడిపాదము కచ్ఛపము వీపుపైనను ఉంచియుండును. దత్తాత్రేయునకు రెండు బాహువులుండును. వామాంకమున లక్ష్మి ఉండును. భగవంతుని పార్షదుడైన విష్వక్సేనుడు నాలుగుచేతులలో చక్ర-గదా-హల-శంఖములను ధరించియుండును.

శ్రీ అగ్ని మహాపురాణమునందు మత్స్యాదిప్రతిమాలక్షణమను నలుబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters