Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకోన చత్వారింశో7ధ్యాయః

అథ భూపరిగ్రహ వర్ణనమ్‌

హయగ్రీవ ఉవాచ :

విష్ణ్వాదీనాం ప్రతిష్ఠాది వక్ష్యే బ్రహ్మన్‌ శృణుష్య మే| ప్రోక్తాని పఞ్చరాత్రాణి సప్తరాత్రాణి వై మయా. 1

వ్యస్తాని మునిభిర్లోకే పఞ్చవింశతిసంఖ్యయా| హయశీర్షం తన్త్రమాద్యం తన్త్రం త్త్రెలోక్యమోహనమ్‌. 2

వైభవం పౌష్కరం తన్త్రం పహ్లాదం గార్గ్యగాలవమ్‌|నారాదీయం చ శ్రీప్రశ్నం శాణ్డిల్యం చేశ్వరం తథా. 3

సత్యోక్తం శౌనకం తన్త్రం వాసిష్ఠం జ్ఞానసాగరమ్‌ |

స్వాయమ్భువం కాపిలం చ తారక్ష్యం నారాయణీయకమ్‌. 4

ఆత్రేయం నారసింహాఖ్యమానన్డాఖ్యం తథారుణమ్‌| బౌధాయనం తథాష్జాఙ్కం విశ్వోక్తం తస్య సారతః. 5

హయగ్రీవుడు చెప్పెను : బ్రహ్మ! ఇపుడు నేను విష్ణ్వాదిదేవతా ప్రతిష్ఠను గూర్చి చెప్పెదను; సావధానముగ వినుము. ఈ విషయము నేను చెప్పిన పంచరాత్రసప్తరాత్రములను ఋషులు మానవలోకమునందు ప్రచారము చేసిరి. అవి మొత్తము ఆదిహయశీర్షతంత్రము, త్రైలోక్యమోహనతంత్రము, వైభవతంత్రము, పుష్కరతంత్రము, ప్రహ్లాద తంత్రము, గార్గ్యతంత్రము, గాలవతంత్రము, నారదీయతంత్రము, శ్రీ ప్రశ్నతంత్రము, శాండిల్యతంత్రము, ఈశ్వర తంత్రము, సత్యతంత్రము, శౌనకతంత్రము, వసిష్ఠోక్త జ్ఞానసాగరతంత్రము, స్వాయంభువతంత్రము, కాపిలతంత్రము. తారక్ష్య (గారుడ) తంత్రము, నారాయణీయతంత్రము, ఆత్రేయతంత్రము, నారసింహా తంత్రము, ఆనంద తంత్రము, బౌధాయన తంత్రము, అష్టాంగ తంత్రము, విశ్వతంత్రము అని ఇరువది యైదు తంత్రములు.

ప్రతిష్ఠాం హి ద్విజః కుర్యాన్మధ్యదేశాదిసంభవః| న కచ్ఛదేశసంభూతః కావేరీకోఙ్కణోద్గతః. 6

కామరూపః కలిఙ్గోత్థః కాఞ్చీకాశ్మీరనోసలః| ఆకాశవాయుతేజో7మ్బుభూరేతాఃపఞ్చరాత్రయుః. 7

అచైతన్యాస్త మోద్రిక్తాః పఞ్చరాత్రవివర్జితాః| బ్రహ్మాహం విష్ణురమల ఇతి విద్యాత్స దేశికః. 8

ఈ తంత్రముల ప్రకారము - మధ్యదేశాదులలో జనించిన ద్విజుడు దేవతాగ్రహముల ప్రతిష్ఠ చేయవలెను. కచ్ఛదేశము, కావేరీతటవర్తిదేశము, కోంకణదేశము, కామరూప-కలింగ-కాంచీ-కాశ్మీరదేశములు-వీటియందుపుట్టిన బ్రాహ్మనుడు దేవ ప్రతిష్ఠాదికము చేయరాదు. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథివి అను మహాభూతములే పంచరాత్రములు, చేతనాశూన్యములై, అజ్ఞానంధకారముచే కప్పబడినవి పంచరాత్రరహితములు, ''నేను పాపవిముక్తుడనైన పరబ్రహ్మను, విష్ణువును'' అను భావన కలవాడే దేశికుడు అగును. అతడు బాహ్యలక్షణములు వేషాదికము ఏవియు లేకున్నను తంత్రవేత్త యైన ఆచార్యుడుగా చెప్పబడినాడు.

సర్వలక్షణహీనో7పి గ గరుస్తన్త్రపారగః |

నగరాభిముఖాః స్థాప్యా దేవా న చ పరాఙ్ముఖాః. 9

కురుక్షేత్రే గయాదౌ చ నదీనాం తు సమీపతః| బ్రహ్మా మధ్యే తు నగరే పూర్వే శక్రస్య శోభనమ్‌. 10

అగ్నావగ్నేశ్చ మాతౄణాం భూతానాం చ యమస్య చ | దక్షిణ చణ్డికాయశ్చ పితృదైత్యాదికస్య చ. 11

నైరృతే మన్దిరం కుర్యాద్వరుణాదేశ్చ వారుణ| వాయోర్నాగస్య వాయవ్యే సౌమ్యే యక్షగుహస్య చ. 12

చణ్డీశస్య మహేశస్య ఐశే విష్ణోశ్చ సర్వశః | పూర్వదేవకులం పీడ్య ప్రాసాదం స్వల్పకం త్వథ. 13

సమం వా ప్యధికం వాపి న కర్తవ్యం విజానతా| ఉభయోర్ద్విగుణాం సీమాం త్యక్త్వా చోచ్ఛ్రాయసంమితామ్‌.

ప్రాసాదం కారయేదన్యం నోభయం పీడయేద్బుధః |

దేవతావిగ్రహమును నగరాభిముఖముగ స్థాపింపవలెను; దేవతల పృష్ఠభాగము నగరము వైపు ఉండగూడదు. దేవాలయనిర్మాణమును కురుక్షేత్రగయాదితీర్థస్థానములందు గాని, నదీసమీపమునందు గాని చేయవలెను. బ్రహ్మాలయమును నగర మధ్యమునందు, ఇంద్రాలయమును నగరమునకు తూర్పునను నిర్మించిన ఉత్తమ మని చెప్పబడినది. అగ్నిదేవునకు, మాతృకలకునుఆగ్నేయదిక్కునందును, భూతగణములకు యుమధర్మరాజునకును దక్షిణమునను, చండికా - పితృగణ-దైత్యాదులకు నైరృతిదిక్కునందును, వరణునకు పశ్చిమమునందును, వాయుదేవునకు, నాగులకు వాయవ్యదిక్కునందును, యక్షులకులేదాకుబేరునకు ఉత్తరమునందును చండీశమహేశునకు ఈశాన్యమునందును, ఆలయమును నిర్మింపవలెను. విష్ణ్వాలయము అన్ని దిక్కులందును నిర్మింపవచ్చును. బుద్ధిమంతుడెన్నడును, పూర్వమునుంచియు ఉన్న దేవాలయమున చిన్నది చేసి చిన్న దేవాలయమును గాని, సమానమైనదానిని గాని, విశాలమైనదానిని గాని నిర్మింపరాదు, ఏదైన ఒక దేవాలయమునకు సమీపమున దేవాలయమును నిర్మించునపుడు రెండు దేవాలయముల మొత్తము ఎత్తుకు రెట్టింపు సీమాప్రదేశము విడచి నూతనదేవాలయమును నిర్మింపవలెను. విద్వాంసుడు రెండు దేవాలయములకును పీడ కలుగకుండు నట్లు చూడవలెను.

భూమౌ తు శోధితాయాం తు కార్యాద్భూమిపరిగ్రహమ్‌. 15

ప్రాకారసీమాపర్యన్తం తతో భూతబలిం హరేత్‌ | మాషం హరిద్రాచూర్ణం తు సలాజం దధిసక్తుభిః. 16

అష్టాక్షరేణ సక్తూంశ్చ పాతయిత్వాష్టదిక్షు చ | రాక్షసాశ్చ పిశాచాశ్చ యే7స్మిసంస్తిష్ఠన్తి భూతలే. 17

సర్వే తే వ్యపగచ్ఛన్తు స్థానం కుర్యామహం హరేః| హలేన దారయిత్వా గాం గోభిశ్త్చెవావదారయేత్‌. 18

పరమాణ్వష్టకేనైవ రథరేణుః ప్రకీర్తితః| రథరేణ్వష్టకేనైవ త్రసరేణుః ప్రకీర్త్యతే. 19

తైరష్టభిస్తు వాలాగ్రం లిక్షా తైరష్టభిర్మతా| తాభిర్యూకాష్టభిః ఖ్యాతా తాశ్చాష్టౌ యవమధ్యమః. 20

యవాష్టకైరఙ్గులం స్యాచ్చతుర్వింశాఙ్గులః కరః| చతురఙ్గుల సంయుక్తః స హస్తః పద్మసంజ్ఞకః. 22

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే విష్ణ్వాదిదేవతాప్రతిష్ఠార్థం భూపరిగ్రహోనామ ఏకోనచత్వారింశో7ధ్యాయః.

భూమిశోధనానంతరము భూపరిగ్రహము చేయవలెను. పిమ్మట ప్రాకారము సరిహద్దువరకు మినుములు, పసుపు, పేలాలు, పెరుగు, సక్తువులు-వీటితో భూతబలి ఇవ్వవలెను. అష్టాక్షరమంత్రము చదువుచు, ''ఈ ప్రదేశమునందు నివసించు రాక్షసపిశాచాదులు ఇచటినుండి తొలగిపోవుగాక. నే నిచట మహావిష్ణ్వాలయమును నిర్మింపనున్నాను'' అని చెప్పుచు, ఎనిమిది దిక్కులందును సక్తువులు చల్లవలెను. భూమిని నాగలిచే దున్నించి ఆవులను దానిపై నడిపింపవలెను. ఎనిమిది పరమాణువులు ఒక రథరేణువు. ఎనిమిది రథరేణువులు ఒక త్రసరేణువు. ఎనిమిది త్రసరేణువులు ఒక వాలాగ్రము. ఎనిమిది వాలాగ్రముటు ఒక లిక్ష. ఎనిమిది లిక్షలు ఒక మూర. ఎనిమిది మూరలు ఒక యవమధ్యము, ఎనిమిది యవలు ఒక అంగుళము. ఇరువదినాలుగు అంగుళములు ఒక కరము. ఇరువది యెనిమిది అంగుళములు ఒక పద్మహస్తము.

శ్రీ అగ్నిమహాపురాణమునందు విష్ణ్వాదిదేవతాప్రతిష్ఠకై భూపరిగ్రహము అను ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters