Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ద్వావింశోధ్యాయః 22

అథ స్నానవిధిశథనమ్‌

నారద ఉవాచ :

వక్ష్యే స్నానం క్రియాద్యర్థం నృసింహేన తు మృత్తికామ్‌ | గృహిత్వా తాం ద్విధా కృత్వా మలస్వాన మథైకయా. 1

నిమజ్జాచమ్య విన్యస్య సింహేన కృతరక్షకః | విధిస్నానం తతః కుర్యాత్ర్పాణాయామపురస్సరమ్‌. 2

నారదుడు పలికెను.

యాగవూజాది క్రియలు చేయుటకు ముందు చేయదగిన స్నానమును గూర్చి చెప్పెదను. నృసింహమంత్రము నుచ్చరించుచు మృత్తికను గ్రహించి, దానిని రెండు భాగములుచేసి ఒకదానిచే మలస్నానము చేయవలెను. మునిగి, ఆచమనము చేసి, నృసింహమంత్రముచే న్యాసము చేసి, రక్ష చేసికొని పిమ్మట ప్రాణాయామపూర్వకముగా విధిస్నానము చేయవలెను. 1,2

హృది ధ్యాయన్‌ హరిం దేవం మన్త్రేణాష్టాక్షరేణ హి |

త్రిధా ప్రాణితలే మృత్స్వాం దిగ్బన్దం సింహజప్తః 3

వాసుదేవ ప్రజప్తేన తీర్థం సఙ్కల్ప్య చాలభేత్‌ | గాత్రం వేదాదిమన్త్రైశ్చ సంమార్జ్యారాధ్య మూర్తిగమ్‌. 4

స్మృత్వాఘమర్షణం వస్త్రం పరిధాయ సమాచరేత్‌ | విన్యస్య మన్త్రైర్నిర్మార్జ్య పాణిస్థం జలమేవ చ 5

నారాయణన సంయమ్య వాయుమాఘ్రాయ చోత్సృజేత్‌ |

జలం ధ్యాయన్‌ హరిం పశ్చాద్దత్త్వార్ఘ్యం ద్వాదశాక్షరమ్‌. 6

జప్తాన్యాన్‌ భక్తితస్తర్ప్య యోగపీఠాధితః క్రమాత్‌ | మన్త్రాన్‌ దిక్పాలపర్యన్తానృషీన్పితృగణానపి 7

మనుష్యాన్సర్వభూతాని స్థావరాన్తాన్యధావసేత్‌ | న్యస్య చాఙ్గాని సంహృత్య మన్త్రాన్యాగగృహం వ్రజేత్‌

ఏవ మన్యాసు పూజాసు మూలాద్యైః స్నానమాచరేత్‌. 8

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే స్నానవిధికథనం నామ ధ్యావింశో7యః

అష్టాక్షరమంత్రమును జపించుచు, శ్రీ మహావిష్ణువును హృదయములో ధ్యానించుచు అరచేతిలో మట్టిని మూడు భాగములుగా చేసి ఉంచుకొని తరవాత నృసింహమంత్రము తము జంపిచుచు దిగ్బంధము చేయవలెను. వాసుదేవ మంత్రమును జపించుచు సంకల్పించి తీర్థమును స్పృశించసలెను. వేదాది మంత్రములచే గాత్రమును తుడిచికొని మూర్తిలో నున్న దేవుని ఆదాధించి. స్మరించుచు, వస్త్రము ధరించి అఘమర్షణము చేయవలెను (అఘమర్షణ మంత్రములను పఠించవలెను). మంత్రములచే విన్యాసము చేసి, చేతిలోనున్న జలము నిర్మార్జనము చేసి, నారాయణ మంత్రముతో ప్రాణాయూమము చేసి, జలమునను వాసనచూచి విడిచిపెట్టవలెను. హరిని ధ్యానించుచు అర్ఘ్యమునిచ్చి, ద్వాదశాక్షరిని జపించి, యోగపీఠము మొదట క్రమముగ ఇతర దేవతలకు కూడ తర్పణము చేయవలెను. మంత్రములకును దిక్పాలుర వరకు దేవతలకును, బుషులకును. సితృగణములకును, మనుష్యులకును స్థావరాంతములగు సమస్త భూతములకును తర్పణముచేసి, పిమ్మట ఉపవిష్ణుడై అంగన్యాసము చేసి, మత్రోపసంహారము చేసి, యాగ గృహమును ప్రవేశించవలెను, ఇతర పూజలలో ఇట్లే మూలమంత్రాదులచే స్నానము చేయవలెను. 3-8

అగ్ని మహాపురాణములో స్నానవిధి నిరూపించు ఇరువది రెండవ అధ్యాయము సమప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters