Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ దశో త్తరద్విశతతమోధ్యాయః.

అథ షోడశమహాదానాది వర్ణనమ్‌

అగ్నిరువాచ :

సర్వదానాని వక్ష్యామి మహాదానాని షోడశ | తులాపురుష ఆద్యం తు హిరణ్యగర్భదానకమ్‌. 1

బ్రహ్మాణ్డం కల్పవృక్షశ్చ గోసహన్రం చ పఞ్చమమ్‌ | హిరణ్యకామధేనుశ్చ హిరణ్యాశ్వశ్చ సప్తమమ్‌ 2

హిరణ్యాశ్వరథస్తద్వద్ధేమహస్తిరథస్తథా | పఞ్చలాఙ్గలకం తద్వద్ధరాదానం తథైవ చ. 3

విశ్వచక్రం కల్పలతా సప్తసాగరకం పరమ్‌ | రత్నధేనుర్మహాభూతఘటః శుభదినేర్పయేత్‌. 4

మణ్డపే మణ్డలే దానం దేవాన్ర్పార్చ్యార్పయేద్ద్విజే | మేరుదానాని పుణ్యాని మేరవో దశ తాన్‌ శృణు. 5

ధాన్యద్రోణసహస్రేణ హ్యుత్తమోర్దార్దతః పరౌ | ఉత్తమః షోడశద్రోణః కర్తవ్యో లవణాచలః. 6

దశభారైర్గుడాద్రిః స్యాదుత్తమోర్ధార్ధతః పరౌ | ఉత్తమః పలసాహసై#్త్రః స్వర్ణమేరుస్తథా పరః. 7

దశద్రోణౖస్తిలాద్రిః స్యాత్పఞ్చభిశ్చ త్రిభిః క్రమాత్‌ | కార్పాసపర్వతోవింశభారైశ్చ దశఞ్చభిః. 8

వింశత్యా ఘృతకుమ్భానాముత్తమః స్యాద్వృషాచలః | దశభిః పలసాహసై#్రరుత్తమో రజతాచలః. 9

అష్టబారై ః శర్కరాద్రిర్మధ్యో మన్దోర్ధతోర్ధతః | దశ##ధేనూః ప్రవక్ష్యామి యాం దత్వా భుక్తిముక్తిభాక్‌.

ప్రథమా గుడధేనుః స్యాద్‌ ఘృతధేనుస్తథా వరా | తిలధేనుస్తృతీయ చతుర్థీశిజలధేనుకా. 11

క్షీరధేనుర్మధుధేనుః శర్కరాదధిధేనుకే | రసధేనుః స్వరూపేణ దశమీ విధిరుచ్యతే. 12

కుమ్భాః స్యుర్ద్రవ్యధేనూనామితరాసాం తు రాశయః |

అగ్నిదేవుడు చెప్పెను : ఇపుడు వివిధ దానములను గూర్చి చెప్పెదను. తులాపురుషదానము, హిరణ్యగర్భదానము, బ్రహ్మాండదానము, కల్పవృక్షదానము, సహస్రగోదానము, స్వర్ణమయకామధేను దానము, స్వర్ణనిర్మితాశ్వదానము స్వర్ణమయాశ్వయుక్తరథదానము, స్వర్ణరచిత హస్తిరథదానము, హలపంచకదానము, భూదానము, విశ్వచక్రదానము, కల్పలతాదానము, ఉత్తమసప్తసముద్రదానము, రత్నధేనుదానము, జలపూర్ణకుంభదానము-అనునవి పదునారు మహాదానములు. ఒక శుభదినమున మండలాకార మగు మండపమునందు దేవతాపూజ చేసి ఈ దానము బ్రాహ్మణుల కీయవలెను. మేరుదానము కూడ పుణ్యప్రదము. "మేరువులు "పది. ఒక వెయ్యి ద్రోణముల ధాన్యము "ధాన్యమేరువు". ఇది ఉత్తమము. ఐదు వందల ద్రోణముల ధాన్యము మధ్యమము. రెండు వందల ఏబది ద్రోణముల ధాన్యము అధమము. పదునారు ద్రోణములతో నిర్మించిన 'లవణాచలము' ఉత్తమము. పది భారముల 'గుడపర్వతము' ఉత్తమము; ఐదు భారములు మధ్యమము, రెండున్నర భారములు నికృష్ణము. వేయి పలముల 'స్వర్ణమేరువు' ఉత్తమము. ఐదు వందల పలములు మధ్యమము; రెండున్నర పలములు అధమము. ఇరువది భారముల 'కార్పాన (దూది) పర్వతము' ఉత్తమము. పది భారములు మధ్యమము, ఐదు భారములు నికృష్టము. ఇరువది ఘృతపూర్ణకుంభముల 'ఘృతాచలము' ఉత్తమము. పది వేల పలముల 'రజతపర్వతము' ఉత్తమము. ఎనిమిది భారముల 'శర్కరాచలము' ఉత్తమము. నాల్గు భారములు మధ్యమము - రెండు భారములు మందము. ఇపుడు 'దశ##ధేనువులను' గూర్చి చెప్పెదను. దీని దానముచే మనుష్యుడు భుక్తిముక్తులను పొందును. గుడధేనువు, ఘృతధేమవు, తిలధేనువు, జలధేనువు, క్షీరధేనువు, మధుధేనువు, శర్కరాధేనువు, దధిధేనువు, రసధేనువు, కృష్ణాజినధేనువు, అను ఈ దశ##ధేనువుల దానివిధానము చెప్పబడుచున్నది. ద్రవపదార్థరూపధేనువులకు ప్రతినిధిగ ఘటములందు ఆ పదార్థములను నింపి కుంభదానము చేయవలెను. ఇతరధాత్వాదిరూపములలో ఉన్న ధేనువులకు ఆ యా ద్రవ్యముల రాశులను చేసి దానము చేయవలెను.

కృష్ణాజినం చతుర్హస్తం ప్రాగ్గ్రీవం విన్యసేద్భువి. 13

గోమయేనానులిప్తాయాం దర్భానాస్తీర్య సర్వతః | లఘ్వైణకాజినం తద్వద్వత్సస్య పరికల్పయేత్‌. 14

ప్రాజ్ముఖీం కల్పయేద్ధేనుముదక్పాదాం సవత్సకామ్‌ | ఉత్తమా గుడధేనుః స్యాత్సదా భారచతుష్టయాత్‌. 15

వత్సం భారేణ కుర్వీత భారాభ్యాం మధ్యమా స్మృతా | అర్ధభారేణ వత్సఃస్యాత్కనిష్ఠా భారకేణ తు. 16

చతుర్థాంశేన వత్సః స్యాద్గుడవిత్తానుసారతః | పఞ్చ కృష్ణలకా మాషస్తే సువర్ణస్తు షోడశ. 17

వలం సువర్ణాశ్చత్వారస్తులా పలశతం స్మృతమ్‌ | స్యాద్భారో వింశతితులా ద్రోణస్తు చతురాఢకః. 18

గోమయముతో అలికిని భూమిపై దర్భలు పరచి వాటిపై నాలుగు హస్తముల ప్రమాణము గల కృష్ణాజినమును ఉంచవలెను. దాని కంఠము తూర్పువైపు ఉండవలెను. గోవత్సము నిమిత్తము చిన్న కృష్లాజినము నుంచవలెను. వత్ససహిత మగు ధేనువు ముఖము తూర్పువైపునకును, పాదములు ఉత్తరము వైపునకును ఉన్నట్లు భావింపవలెను. నాలుగు భారముల గుడధేనువు సర్వదా ఉత్తమ మని అంగీకరింపబడినది. ఒక భారము గుడముతో గోవత్సమును నిర్మింపవలెను. రెండు భారముల గోవు మధ్యమము. దానితో పాటు అర్ధభారము లేగదూడ ఉండవలెను. ఒక భారము గోవు కనిష్ఠము. దాని చతుర్థాంశముతో దూడను నిర్మించి దీనితో పాటు ఈయవలెను. గుడధేనువును తాను సంగ్రహించుకొనిన గుడమును బట్టి నిర్మించవలెను. ఐదు గులివెందలు ఒక మాషము. 16 మాషములు ఒక సువర్ణము. నాలుగు సువర్ణములు ఒక పలము 100 పలములు ఒక తుల. 20 తులలు ఒక భారము. నాలుగు ఆఢకములు ఒక ద్రోణము.

ధేనువత్సౌ గుడస్మోబౌ సిదసూక్ష్మామ్బరావృతౌ | శుక్తికర్ణావిక్షుపాదౌ శుచిముక్తాఫలేక్షణౌ. 19

సితసూత్రశిరాలౌ చ సితకమ్బలకమ్బరౌ | తామ్రగడ్డూకపృష్ఠౌ తౌ సితచామరరోమకౌ. 20

విద్రుమభ్రుయుగావేతో నవనీతస్తనాన్వితౌ | క్షౌమపుచ్ఛౌ కాంస్యదోహావిన్ద్రనీలకతారకౌ. 21

సువర్ణశృజ్గాభరణౌ రజతక్షుర సంయుతౌ | నానాఫలమయా దన్తా గన్థఘ్రాణప్రకల్పితౌ. 22

రచయిత్వా యజేద్దేనుమిమైర్మన్తైర్ద్విజోత్తమ | యా లక్ష్మీః సర్వభూతానాం యా చ దేవేష్వవస్థితా. 23

ధేనురూపేణ సా దేవీ మమ శాన్తిం ప్రయచ్ఛతు | దేహస్థా యా చ రుద్రాణీ శఙ్కరస్య సదా ప్రియా. 24

ధేనురూపేణ సా దేవీ మమ పాపం వ్యపోహతు | విష్ణువక్షసి యా లక్ష్మీః స్వాహా యా చ విభావసోః. 25

చన్ద్రార్కఋక్షశక్తిర్యా ధేనురూపాస్తు సా శ్రియే | చతుర్ముఖస్య యా లక్ష్మీర్యా లక్ష్మీర్ధనదస్య చ. 26

లక్ష్మీర్యా లోకపాలానాం సా ధేనుర్వరదాస్తు మె |

స్వధా త్వం పితృముఖ్యానాం స్వాహాయజ్ఞభుజాం యతః. 27

సర్వపాపహరా ధేనుస్తస్మాచ్ఛాన్తిం ప్రయచ్ఛ మే | ఏవమామన్త్రితాం ధేనుం బ్రాహ్మణాయ నివేదయేత్‌. 28

సమానం సర్వధేనూనాం విధానం చైతదేవ హి | సర్వయజ్ఞఫలం ప్రాప్య నిర్మలో భుక్తిముక్తిభాక్‌. 29

గుడనిర్మిత మగు ధేనువును, వత్సమును సూక్ష్మవస్త్రముతో కప్పవలెను. వాటి చెవుల వద్ద శుక్తులను, చరణ స్థానములందు చెరకు కఱ్ఱలను, నేత్రస్థానములందు పవిత్రము లగు ముత్యములను, అలకస్థానములందు శ్వేతసూత్రమును, గంగడోలు దగ్గర శ్వేతకంబలమును పృష్ఠభాగమున తామ్రమును, రోమస్థానమున శ్వేతచర్మమును, కనుబొమ్మల వద్ద విద్రుమములను, స్తనముల వద్ద నవనీతమును, పుచ్ఛస్థానమునందు పట్టువస్త్రమును, అక్షిగోలకస్థానములందు నీలమణులను శృంగ-శృంగాభరణ స్థానములందు సువర్ణమును, డెక్కల వద్దవెండిని ఉంచవలెను. దంతస్థానములందు వివిధఫలములను నాసికాస్థానమున సుగంధద్రవ్యమును ఉంచి కంచులోహపాత్రను కూడ ఉంచవలెను. ద్విజశ్రేష్ఠా! ఈ విధముగ ధేనువును నిర్మించి, ఈ విధముగ ప్రార్థించుచు పూజించవలెను -- "సకలప్రాణుల లక్ష్మియు, సకలదేవతలలో నుండునదియు, అగు ధేనురూపిణి యైన దేవి నాకు శాంతిని ప్రసాదించుగాక! తన శరీరమునం దుండి 'రుద్రాణి' యను పేరుతో ప్రసిద్ధురాలును, శంకరుని ప్రియతమపత్నియు, ధేనురూపధారిణియు అగు దేవి నా పాపములను నశింపచేయుగాక! విష్ణువక్షఃస్థలమున లక్ష్మీ రూపముతో నుండునదియు, అగ్ని యొక్క స్వాహారూపమునను, చంద్ర-సూర్య-నక్షత్రదేవతాశక్తిరూపమునను ఉన్నదియు ధేనురూపిణియు అగు దేవి నాకు లక్ష్మినిచ్చుగాక! చతుర్ముఖుని సావిత్రియు, ధనాధీశు డగు కుబేరుని నిధియు లోక పాలలక్ష్మియు నగు ధేనుదేవి నాకు అభీష్టవస్తువుల నిచ్చుగాక, దేవీ! నీవు పితృదేవతల స్వధవు. యజ్ఞభోక్తయగు అగ్నికి సంబంధించిన స్వాహాదేవివి నీవు. ధేనురూపమున నుండి సమస్తపాపములను తొలగించుచుందువు. అందుచే నాకు శాంతి నిమ్ము". ఈ విధముగ (శ్లోకములను చదివి) అభిమంత్రింపబడిన ధేనువును బ్రాహ్మణునకు దానము చేయవలెను. దీనిచే మనుష్యుడు సకలయజ్ఞఫలములను పొంది, పాపరహితుడై భుక్తిముక్తులను రెండింటిని పొందును.

స్వర్ణశృజ్గౌ శ##ఫైరౌపై#్యః సుశీలా రూప్యసంయుతా | కాంస్యోపదోహా దాతవ్యా క్షీరిణి గౌః సదక్షిణా. 30

అ (66)

దాతాస్యాః స్వర్గమాప్నోతి వత్సరాన్రోమసంమితాన్‌ | కపిలా చోత్తారయతి భూయశ్చాసప్తమం కులమ్‌. 31

స్వర్ణశృజ్గీం రూప్యఖురాం కాంస్యదోహనకాన్వితామ్‌ | శక్తితో దక్షిణాయుక్తాం దత్త్వా స్వాద్భుక్తిముక్తిభాక్‌.

సవత్సరోమతుల్యాని యుగాన్యుభయతోముఖీమ్‌ | దత్త్వా స్వర్గమవాప్నోతి పూర్వేణ విధినా దదేత్‌. 33

ఆసన్నమృత్యునా దేయా సవత్సా గౌస్తు పూర్వవత్‌ | యమద్వారే మహాఘోరే తప్తా వైతరిణీ నదీ.

తాం తర్తుం చ దదామ్యేనాం కృష్టాం వై తరిణీం చ గామ్‌. 34

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే మహాదానానినామ దశాధికద్విశతతమోధ్యాయః.

సువర్ణశృంగములతోను, రజత ఖురములతోను కూడిన పాలనిచ్చు ఆవును, కాంస్యదోహపాత్రను, వస్త్రదక్షిణలతో దానము చేయవలెను ఇట్టి గోవును దానము చేసినవాడు ఆ గోవుకు ఎన్నిరోమము లున్నవో అన్ని సంవత్సరములు స్వర్గములో నివసించును. కపిలగోవు దానము చేసినవాడు ఏడు తరములవారిని ఉద్ధరించును. సువర్ణశృంగములు, రజతమండిత ఖురములు గల కపిలగోవును, కాంస్యదోహపాత్రను, యథాశక్తి దక్షిణతో దానము చేసినవాడు భుక్తిముక్తులను పొందును. ఉభయతోముఖి యగు గోవును దానముచేసినవాడు ఆవునకును, దాని దూడకును ఎన్ని రోమము లుండునో అన్ని యుగములవరకును స్వర్గమున సుఖము లనుభవించును. ఉభయతోముఖగోదానము కూడ పైన చెప్పిన విధముననే చేయవలెను. మరణాసన్నుడగు మానవుడు వత్ససహిత మగు గోవును పూర్వోక్తవిధానముతో దానము చేయవలెను. "అత్యంతభయంకర మగు యమలోక ప్రవేశ ద్వారమునందు తప్తజలముతో నిండిన వైతరిణీనది ప్రవహించుచుండును. దానిని తరించుటకై నేను ఈ కృష్ణవర్ణ యగు వైతరిణిగోవును దానము చేయుచున్నాను".

అగ్నిమహాపురాణమునందు మహాదానవర్ణన మను రెండువందలపదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters