Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ అష్టనవత్యుత్తర శతతమో7ధ్యాయః

అథ మాసవ్రతాని

అగ్నిరువాచ :

మాసవ్రతకమాఖ్యాస్యే భుక్తిముక్తిప్రదాయకమ్‌ | ఆషాఢాదిచతుర్మా సమభ్యజ్గం వర్జయేత్సుధీః. 1

వైశాఖే పుష్పలవణం త్యక్త్వా గోదో నృపో భ##వేత్‌ | గోదో మాసోపవాసీ చ భీమవ్రతకరో హరిః. 2

ఆషాఢాదిచతుర్మాసం ప్రాతః స్నాయీ చ విష్ణుగః | మాఘే మాస్యథ చైత్రే వా గుడధేనుప్రదో భ##వేత్‌. 3

గుడవ్రతస్తృతీయాయాం గౌరీశః స్యాన్మహావ్రతీ | మార్గశీర్షాదిమాసేషు నక్తకృద్విప్రలోకభాక్‌. 4

ఏకభక్తవ్రతీ తద్వద్ద్వాదశీవ్రతకం పృథక్‌ | ఫలవ్రతీ చతుర్మాసం ఫలం త్యక్త్వా ప్రదీపయేత్‌. 5

శ్రావణాది చతుర్మాసం వ్రతైః సర్వం లభేద్ర్వతీ | ఆషాఢస్య సితే పక్షే హ్యేకాదశ్యాముపోషితః. 6

చాతుర్మాస్యవ్రతానాం తు కుర్వీత పరికల్పనమ్‌ | ఆషాఢ్యాం చాథ సంక్రాన్తౌ కర్కటస్య హరిం యజేత్‌.

ఇదం వ్రతం మయాదేవ గృహీతం పురతస్తవ | నిర్విఘ్నాం సిద్దిమాయాతు ప్రసన్నే త్వయి కేశవ. 8

గృహీతే7స్మిన్‌ వ్రతే దేవ యద్యపూర్ణే మ్రియేహ్యహమ్‌ | తన్మే భవతు సంపూర్ణం త్యత్ప్రసాదాజ్జనార్దన. 9

అగ్నిదేవుడు పలికెను : నే నిపుడు భుక్తిముక్తి ప్రదము లగు మాసవ్రతములను గూర్చి చెప్పెదను. ఆషాఢాది మాసచతుష్టయమునందు అభ్యంగస్నానము చేయరాదు. దీనివలన ఉత్తమబుద్ధిమంతు డగును. వైశాఖమున పుష్పములను లవణమును త్యజించి గోదానము చేయువాడు రాజ్యమును పొందును. ఒక మాసము ఉపవాస ముండి గోదానము చేయువాడు ఈ భీమవ్రతప్రభావముచే విష్ణుసాయుజ్యము పొందును. ఆషాఢాదిమాసచతుష్టయమునందు నియమపూర్వకముగా ప్రాతః స్నానము చేయువాడు విష్ణులోకము చేరును. మాఘతృతీయయందు లేదా చైత్రతృతీయమందు గుడ ధేనుదానము చేయుటకు గుడ వ్రత మనిపేరు. ఈ మహావ్రతమాచరించువాడు శివస్వరూపు డగును. మార్గశీర్షాదిమాసములందు నక్తవ్రతమాచరించు వాడు విష్ణులోకమునకు అర్హుడగును. ఏకభుక్తవ్రత మాచరించువాడు ఆ విధముగనే వేరుగా ద్వాదశీవ్రతపాలనము కూడ చేయవలెను. ఫలవ్రతము చేయువాడు చాతుర్మాస్యమున ఫలములు పరిత్యజించి వాటిని దానము చేయవలెను. శ్రావణము మొదలు మాసచతుష్టయమునందు వ్రతముల నాచరించుటచే సర్వమును పొందును. చాతుర్మాస్యవ్రతము ఈ విధముగ ఆచరించ వలెను - ఆషాఢశుక్లైకాదశినాడు ఉపవాసముండవలెను. ఆషాఢమునవచ్చు కర్కటసంక్రాంతియందు శ్రీమహావిష్ణువును పూజించవలెను. ''దేవా! నేను నీ ఎదుట ఈ వ్రతము అవలంబించినాను. కేశవా! నీ యనుగ్రహముచే ఇది నిర్విఘ్నముగ సిద్ధించుగాక. దేవాధిదేవా! జనార్ధనా! ఈ వ్రతము ప్రారంభించిన తరువాత ఇదిపూర్తి కాకుండగనే నేను మరణించినచో, నీ కృపచే ఇది పరిపూర్ణ మగుగాక! '' అని ప్రార్థించవలెను.

మాంసాది త్యక్త్వా విప్రః స్యాత్తైలత్యాగీ హరిం యజేత్‌ | ఏకాన్తరోపవాసీ చ త్రిరాత్రం విష్ణులోకభాక్‌. 10

చాన్ద్రాయణీ విష్ణులోకే మౌనీ స్యాన్ముక్తి భాజనమ్‌ | ప్రాజాపత్యవ్రతీ స్వర్గీ సక్తుయావకభక్షకః. 11

దుగ్థాద్యాహారవాన్స్వర్గీ పఞ్చగవ్యామ్బుభుక్‌ తథా | శాకమూలఫలాహారీ నరో విష్ణుపురీం వ్రజేత్‌. 12

మాంసవర్జీ యవాహారో రసవర్జీ హరిం వ్రజేత్‌ | కౌముద్రవ్రతమాఖ్యాస్యే ఆశ్వినే సముపోషితః. 13

ద్వాదశ్యాం పూజయేద్విష్ణుం ప్రలిప్యాబ్జోత్పలాదిభిః | ఘృతేన తిలతైలేన దీపనైవేద్యమర్పయేత్‌. 14

ఓం నమో వాసుదేవాయ మాలత్యా మాలయా యజేత్‌ | ధర్మకామార్థమోక్షాంశ్చ ప్రాప్నుయాత్కౌముదవ్రతీ.

సర్వం లభేద్ధరిం ప్రార్చ్య మాసోపవాసకవ్రతీ |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మాసవ్రతాని నామ అష్టనవత్యధిక శతతమో7ధ్యాయః.

వ్రత మాచరించు ద్విజుడు మాంసాదులను, తైలమును వర్జించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. రోజు విడచి రోజు ఉపవాస ముండుచు త్రిరాత్రవ్రత మాచరించువాడు విష్ణులోకము పొందును. చాంద్రాయణము చేయువాడు విష్ణు లోకమును చేరును. మౌనవ్రతము పాటించువాడు మోక్షమునకు అధికారి యగును. ప్రాజాపత్యవ్రతమాచరించువాడు స్వర్గము పొందును. సక్తువులను, యవలను, తినుచు క్షీరాదులు సేవించుచు, లేదా పంచగవ్యములను, జలములను గ్రహించుచు కృచ్ఛ్రవ్రతము చేయువాడు స్వర్గము చేరును. శాక-మూల-ఫలాహారము మాత్రము భుజించుచు కృచ్ఛ్రవ్రతము చేయువాడు వైకుంఠము చేరును. మాంస-రసములను పరిత్యజించి యవలు మాత్రము భుజించువాడు శ్రీమహావిష్ణుసాంనిధ్యము పొందును. ఇపుడు కౌముదవ్రతమును గూర్చి చెప్పెదను. ఆశ్వయుజ శుక్లఏకాదశినాడు ఉపవాస ముండి, ద్వాదశినాడు శ్రీవిష్ణువు అవయవములకు చందనాదులు పూసి, ఉత్పలాదులతో పూజించవలెను. పిదప తైలదీపము సమర్పించి ఘృతపక్వాన్నము నైవేద్యము చేయవలెను. శ్రీమహావిష్ణువునకు మాలతీపుష్పముల కూడ సమర్పించవలెను. ''ఓం నమో వాసుదేవాయ'' అను మంత్ర ముచ్చరించుచు వ్రతసమాప్తి చేయవలెను. ఈ విధముగ కౌముదవ్రతము చేయువాడు ధర్మార్థ కామమోక్షములను స్వాధీనము చేసికొనును. మాసోపవాసవ్రతము చేయువాడు శ్రీమహావిష్ణువును పూజించి సర్వమును పొందగలడు.

అగ్ని మహాపురాణమునందు మాసవ్రతవర్ణనమసు నూటతొంబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters