Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ అష్గాశీత్యధికశతతమోధ్యాయః

అథ ద్వాదశీవ్రతాని

అగ్ని రువాచ :

ద్వాదశీవ్రతకం వక్ష్యే భుక్తిముక్తి ప్రదాయకమ్‌ | ఏకభ##క్తేన నక్తేన తథైవాయాచితేన చ. 1

ఉపవాసేన భైక్ష్యేణ చైవ ద్వాదశికవ్రతీ | చైత్రేమాసి పక్షే ద్వాదశ్యాం మదనం హరిమ్‌. 2

పూజయేద్భుక్తిముక్త్యర్థీ మదనద్వాదశీవ్రతీ | మాఘశుక్లే తు ద్వాదశ్యాం భీమద్వాదశికవ్రతీ. 3

నమోనారాయణాయేతి యజేద్విష్ణుం స సర్వభాక్‌ | ఫాల్గునే చ సితే పక్షే గోవిన్దద్వాదశీవ్రతీ. 4

విశోకద్వాదశీకారీ యజేదాశ్వయుజే హరిమ్‌ | లవణం మార్గశీర్షే తు కృష్ణమభ్యర్చ్య యో నరః. 5

దదాతి శుక్లద్వాదశ్యాం స సర్వరసదాయకః | గోవత్సం పూజయేద్భాద్రే గోవత్సద్వాదశీవ్రతీ. 6

మాఘ్యాం తు సమతీతాయాం శ్రవణన తు సంయుతా | ద్వాదశీ యా భ##వేత్కృష్టా ప్రోక్తా సా తిలద్వాదశీ.

తిలైః స్నానం తిలైర్హోమో నైవేద్యం తిలమోదకమ్‌ | దీపశ్చ తిలతైలేన యథా దేయం తిలోదకమ్‌. 8

తిలాశ్చ దేయా విప్రేభ్యః ఫలం హోమోపవాసతః | ఓం నమో భవతేథో వాసుదేవాయ వై యజేత్‌. 9

సకులః స్వర్గమాప్నోతి షట్తిలద్వాదశీవ్రతీ | మనోరథద్వాదశీ కృత్పాల్గునే తు సితేర్చయేత్‌.10

నామద్వాదశీవ్రతకృత్కేశవాద్యైశ్చ నామభిః | వర్షం యజేద్ధరిం స్వర్గీ న భ##వేన్నారకే నరః. 11

ఫాల్గునస్య సితేభ్యర్చ్య సుమతిద్వాదశీవ్రతీ | మాసి భాద్రపదే శుక్లే హ్యనన్తద్వాదశీవ్రతీ. 12

ఆశ్లేషర్షే తు మూలే వా మాఘే కృష్ణాయ నమః | యజేత్తిలాంశ్చ జుహుయాత్తిలాద్వాదశీకృన్నరః. 13

సుగతిద్వాదశీకారీ ఫాల్గునే తు సితే యజేత్‌|

జయ కృష్ణ నమస్తుభ్యం వర్షం స్యాద్భుక్తిముక్తిదః | పౌషశుక్లే తు ద్వాదశ్యాంసంప్రాప్తిద్వాదశీవ్రతీ. 14

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నానాద్వాదశీవ్రతాని నామాష్టాశీత్యధి శతతమోధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను ; ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు ద్వాదశీవ్రతములను గూర్చి చెప్పెదను. ద్వాదశీనాడు రాత్రిమాత్రమే భోజనము చేయవలెను. ఎవనినుండియు, ఏమియు గ్రహింపరాదు. ఉపవాసము చేసి కూడ భిక్షాగ్రహణము చేయువానికి ద్వాదశీవ్రతఫలము సిద్ధించదు. చైత్రశుక్లద్వాదశినాడు మదనద్వాదశీవ్రతము చేయువాడు భోగమోక్షములను కోరుచు కామదేవరూపుడగు మహావిష్ణువు పూకించవలెను. మాఘశుక్లద్వాదశినాడు 'భీమద్వాదశీ' వ్రతము చేసి ''నమో నారాయణాయ'' అను మంత్రముతో శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఇట్లు చేసినవాడు సర్వమును పొందగలుగును. ఫాల్గున శుక్లద్వాదశినావడు 'గోవిందద్వాదశీమంత్రము చేయవలెను. ఆశ్వయుజమునందు ''విశోకాద్వాదశీ'' వ్రతము చేయువాడు శ్రీమహావిష్ణువును పూజించవలెను. మార్షశీర్షశుక్లద్వాదశీనాడు శ్రీకృష్ణుని పూజించి లవణదానము చేయువాడు సకలరసదానములు చేసిన ఫలము పొందును. భాద్రపదమున 'గోవత్సద్వాదశీ' వ్రతము చేయువాడు గోవత్సమును పూజించవలెను. మాఘమాసము తరువాత వచ్చు ఫాల్గునకృష్ణద్వాదశి శ్రవణనక్షత్రయుక్తమైనచో దానికి ''తిలద్వాదశి'' అని పేరు. ఆ దినమున తిలలతో స్నానముచేసి, తిలలతో హోమము చేసి, చిమ్మిలి నైవేద్యము పెట్టవలెను., దేవాలయమునందు తైలదీపము వెలిగించి, పితరులకు తిలతర్పణములు చేయవలెను. బ్రాహ్మణులకు తిలదానము చేయవలెను. హోమోపవాసముల వలననే తిలద్వాదశీ వ్రత ఫలము లభించును. ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అను మంత్రముతో శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఈ విధముగ ఆరు పర్యాయములు తిలద్వాదశీ వ్రతము చేసినవాడు తన కులముతో కూడ స్వర్గమునకు పోవును. ఫాల్గునశుక్లపక్షమునందు 'మనోరథద్వాదశీ' వ్రతము చేసినవాడు శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఈ దివసమునందే 'నామద్వాదశీ' వ్రతము చేయువాడు ఒక సంవత్సరము, కేశవాదినామములతో శ్రీమహావిష్ణువును పూజించవలెను. అతడు మరణానంతరము స్వర్గమునకే వెళ్ళును. నరకమున కెన్నడును వెళ్ళడు. ఫాల్గునశుక్లపక్షమున ''సుమతిద్వాదశీ'' వ్రతము చేసి విష్ణువును పూజించవలెను. భాద్రపదశుక్లపక్షమున ''అనంతద్వాదశీ'' వ్రతము చేయవలెను. మాఘశుక్లపక్షమునందు ఆశ్లేషతో గాని, మూలతో గాని కూడిన తింద్వాదశి చేయువాడు ''కృష్ణాయనమః'' అను మంత్రముతో శ్రీకృష్ణుని పూజించి, తిలహోమము చేయవలెను. ఫాల్గున శుక్లపక్షమున సుగతిద్వాదశీ వ్రతము చేయువాడు ఒక సంవత్సరము - ''జయ కృష్ణ నమస్తుభ్యమ్‌'' అను మంత్రముతో శ్రీకృష్ణుని పూజించవలెను. ఇట్లు చేయుటచే భుక్తి - ముక్తులను రెండింటిని పొందును. పుష్యశుక్లద్వాదశినాడు ''సంప్రాప్తిద్వాదశీ'' వ్రతము చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు ద్వాదశీవ్రతవర్ణన మను నూట ఎనుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters