Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చాశీత్యుత్తర శతతమోధ్యాయః.

అథ నవమీవ్రతాని.

అగ్ని రువాచ :

నవమీవ్రతకం వక్ష్యే భుక్తితముక్త్యాదిసిద్ధిదమ్‌ | దేవీ పూజ్యాశ్వినే శుక్లే గౌర్యాఖ్యా నవమీవ్రతమ్‌. 1

పిష్టకాఖ్యా తు నవమీ పిష్టాశీ దేవపూజనాత్‌ | అష్టమ్యామశ్వినే శుక్లే కన్యార్కే మూలభే యదా. 2

అఘార్దనా సర్వదా వై మహతీ నవమీ స్మృతా | దుర్గా తు నవగేహస్థా హ్యేకాగాస్థితాథవా. 3

పూజితాష్టాదవభుజా శేషాః షోడశసత్కరాః | శేషాః షోడశహస్తాః స్యురఞ్జనం డమరుం తథా. 4

రుద్రచణ్డా ప్రచణ్డా చ చణ్డోగ్రా చణ్డానాయకా | చణ్డా చణ్డవతీ పూజ్యా చణ్దరూపాతిచణ్డకీ. 5

క్రమాన్మధ్యే చోగ్రచణ్డా దుర్గా మహిషమర్దినీ | ఓం దుర్గే దుర్గరక్షణి స్వాహా దశాక్షరో మన్త్రః. 6

దీర్ఘాకారాది మన్త్రాదిర్నవనేత్రో నమోన్తకః | షడ్భిః పదైర్నమః స్వధా వషట్కారహృదాదికమ్‌. 7

అఙ్గుష్ఠాది కనిష్ఠాన్తం న్యస్యాఙ్గాని జపేచ్ఛివామ్‌ | ఏవం జపతి యో గుహ్యం నాసౌ కేనాపి బాధ్యతే. 8

కపాలం ఖేటకం ఘణ్డాం దర్పణం తర్జనీం ధనుః | ధ్వజం డమరుకం పాశం వామహస్తేషు బిభ్రతీమ్‌. 9

శక్తిమూద్గరశూలాని వజ్రం ఖడ్గం చ కున్తకమ్‌ | శఙ్ఖం చక్రం శలాకాం చ హ్యాయుధాని చ పూజయేత్‌. 10

పశుం చ కాలీ కాలీతి జప్త్వా ఖడ్గేన ఘాతయేత్‌ | కాలి కాలి వజ్రేశ్వరి లోహదణ్డాయై నమః. 11

తదుత్థం రుధిరం మాంసం పూతనాయై చ నైరృతే | వాయవ్యాం పాపరాక్షసై#్య చరక్యై నమ ఈశ్వరే. 12

విదారికాయై చాగ్నేయ్యాం మహాకాశికమగ్నయే | తస్యాగ్రతో నృపః స్నాయాచ్ఛత్రుం పిష్టమయం హరేత్‌.

దద్యాత్‌ స్కన్దవిశాఖాభ్యాం బ్రాహ్మ్యాద్యా నిశి తా యజేత్‌ | జయన్తీ మఙ్గలా కాలీ భద్రకాలీ కపాలినీ. 14

దుర్గా శివ క్షమా ధాత్రీ స్వాహాస్వధా నమోస్తుతే | దేవీం పఞ్చమృతైః స్నాప్య పూజయేచ్చార్హణాదినా.

ధ్వజాదిరథయాత్రాదిబలిదానవరాదికృత్‌.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే నవమీవ్రతనిరూపణం నామ పఞ్చశీత్యధిక శతతమోధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను ; ఇపుడు భుక్తిముక్తిప్రదములగు నవమీవ్రతములను గూర్చి చెప్పెదనున. ఆశ్వయుజ శుక్లనవమినాడు గౌరీనవమీవ్రతము నాచరించి దేవీపూజ చేయవలెను. ఈ నవమికి 'పిష్టకనవమి' అని పేరు. ఈ వ్రతము చేయువాడు దేవీపూజ చేసి పిష్టాన్నమును భుజించవలెను. ఆశ్వయుజశుక్లనవమినాడు మూలనక్షత్రముండి, సూర్యుడు కన్యారాశిగతు డైనచో 'మహానవమి' యని పేరు. అది సర్వపాపవినాశకము, ఆనాడు నవదుర్గలను తొమ్మిదిస్థానము లందు గాని, ఒక స్థానమునందు గాని స్థాపించి పూజించవలెను. మధ్యయందు అష్టాదశభుజమహాలక్ష్మిని, రెండు పార్శ్వము లందును మిగిలిన దుర్గలను పూజించవలెను. నవదుర్గలను క్రింద చెప్పిన క్రమమున. అంజన-డమరుసహితలుగా స్థాపించవలెను. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, పూజ్య, చండరూప, అతిచండిక-వీరందరి మధ్యయందు అష్టాదశభుజ యగు ఉగ్రచండా మహిషమర్దనీ దుర్గను పూజించవలెను. ''ఓం దుర్గే దుర్గ రక్షిణి స్వాహా'' అనునది దశాక్షరమంత్రము. ఈ విధానము ననుసరించి ఈ దశాక్షరమంత్రజపము చేయువానికి ఎవరినుండియు బాధలు కలుగవు. దుర్గాదేవి వామహస్తములందు కపాల-ఖేటక-ఘాంటా-దర్పణ-తర్జనీముద్ర-ధనుష్‌-ధ్వజ--డమురు-పాశములను, దక్షిణహస్తములందు శక్తి-ముద్గర-త్రిశూల-వజ్ర-ఖడ్గ-కుంతక-శంఖ చక్ర-శలాకలను ధరించి యుండును. ఈ ఆయుధములను కూడ పూజించవలెను. ''కాలి కాలి వజ్రేశ్వరి లోహదణ్డాయై నమః'' అను మంత్రము పఠించుచు ఖడ్గములో బలిపశువును చంపవలెను. ఆ బలిపశువు రక్తమాంసములను ''పూతనాయై నమః'' అని నైరృతిదిక్కునందును, ''పాపరాక్షసై#్యనమః'' అని వాయవ్యమునందును, ''చరక్యై నమః'' అని ఈశాన్యమునందును, ''విదారికాయై నమః'' అని ఆగ్నేయము నందును ఆ దేవతల నుద్దేశించి సమర్పించవలెను. రాజు దాని ఎదుట స్నానము చేసి స్కందవిశాఖుల నిమిత్తమై పిష్ట నిర్మితశత్రుబలి ఇవ్వవలెను. రాత్రియందు బ్రాహ్మి మొదలగు శక్తుల పూజ చేసి- ''జయంతి. మంగల, కలి, భద్రకాలి, కపాలిని, దుర్గ, శివ, క్షమ,ధాత్రి, స్వాహా, స్వధా అను పేర్లు గల ఓ దేవీ; నమస్కారము.'' ఇత్యాదిమంత్రములు పఠించుచు ప్రార్థించవలెను. దేవికి పంచామృతస్నానము చేయించి వివిధోపచారములతో అమెను పూజించవలెను. దేవిని ఉద్దేశించి చేసిన ధ్వజదానము, రథయాత్ర, బలిదానము సకలాభీష్టముల నొసగును.

అగ్ని మహాపురాణమునందు నమమీవ్రతవర్ణన మను నూట ఎనుబదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters