Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ సప్తత్యుత్తర శతతమోధ్యాయః.

అథ పునః ప్రాయశ్చిత్తాని.

పుష్కర ఉవాచ :

మహాపాపానుయుక్తానాం ప్రాయశ్చిత్తాని వచ్మి తే | సంవత్సరేణ పతతి పతితేన సహాచరన్‌. 1

యాజానాధ్యాపనాద్యౌనాన్న తు యానాశనాసనాత్‌ | యో యేన పతితేనైషాం సంసర్గం యాతి మానవః. 2

స తసై#్యవ వ్రతం కుర్యాత్తత్సంసర్గస్య శుద్ధయే | పతితస్యోదకం శౌర్యం సపిణ్డౖర్బాన్దవైః సహ. 3

నిన్దితేహని సాయాహ్నే జ్ఞాత్యృత్విగ్గురు సన్నిధౌ | దాసీఘటమపాం పూర్ణం పర్యస్యేత్ర్పేతవత్త. 4

అహోరాత్రముపాసీరన్న శౌచం బాన్ధవైః సహ | నివర్తయేరంస్తస్మాత్తు జ్యేష్ఠాంశం భాషణాదికే. 5

జ్యేష్ఠాంశం ప్రాప్నుయాత్తస్య యవీయాన్‌ గుణతోధికః |

ప్రాయశ్చిత్తే తు చరితే పూర్ణం కుమ్భమపాం నవమ్‌. 6

తేనైవ సార్థం ప్రాస్యేయుః స్నాత్వా పుణ్య జలాశ##యే | ఏవమేవ విధిం కుర్యద్యోషిత్సు పతితాస్వపి. 7

వస్త్రాన్నపానం దేయం తు వసేయుశ్చ గృహాన్తికే | తేషా ద్విజానాం సావిత్రీ నానూద్యేత యథావిధి. 8

తాం శ్చారయిత్వా త్రీన్‌ కృచ్ర్ఛాన్యథావిద్యుపనాయయేత్‌ | వికర్మస్థాః పరిత్యక్తాస్తేషామప్యేతదాది శేత్‌.9

జపిత్వాత్రీణి సావిత్ర్యాః సహస్రాణి సమాహితః | మాసం గోష్ఠే పయః పీత్వా ముచ్యతేసత్ర్పతిగ్రహాత్‌.

పుష్కరుడు చెప్పెను : మహాపాపులతో సంబంధము కలవారికి ప్రాయశ్చిత్తములను చెప్పెదను. పతితునితో కూడి తిరుగువాడు సంవత్సరకాలములో పతితు డగును. ఈ పతితత్వము, పతితునిచే యజ్ఞము చేయించుటచేతను, అధ్యయనము చేయించుటచేతను వైవాహిక సంబంధము ఏర్పరచుకొనుటచేతను మాత్రమే కలుగును గాని వానితో ప్రయాణముచేయుటచేతను భుజించుటచేతను, కలిసి కూర్చుండుటచేతను కలుగదు. ఈ పతితులలో ఎవనితో ఒక వ్యక్తి సంసర్గమును పొందునో అతడు ఆ పతితుడు చేయవలసిన ప్రాయశ్చిత్తమును చేసినకొనవలెను. పతితుని సపిండులు బంధువులతో కలసి నిందితదినమునందు, సంధ్యాసమయమున వంశానికి సంబంధించినవారు, బుత్విక్కులు, గురువులు మొదలగువారి సమక్షమున ఆ పతితునకై (జీవించియుండగనే ) ఉదకక్రియ చేయవలెను. పిదప ప్రేతకు చేసినవిధముగ, ఒక జలము నింపిన కుండను దాసిచే తన్నించవలెను. సపిండులు బంధువులతో కూడ ఒక రోజు ఆశౌచము పాటించవలెను. అతనితో సంభాషణము చేయకుండవలెను. అతని జ్యేష్ఠభాగమును ఉపసంహరించవలెను. గుణములచే అధికు డగు చిన్నవానికి జ్యేష్ఠభాగము చెందునట్లు చేయవలెను. అతడు ప్రాయశ్చిత్తము చేసికొనిన పిదప బంధువులు ఆతనితో కలిసి పుణ్యనదిలో స్నానము చేసి, జలము నింపిన క్రోత్త కుండను నీటిలో విసరివేయవలెను. పతితస్త్రీలకు కూడ ప్రాయశ్చిత్తము ఈ విధముగనే చేయవలెను. వారికి వస్త్రములు, అన్నపానాదికముమాత్ర మివ్వవలెను. గృహసమీపమున నివాస మేర్పరుపవలెను. యథాకాలముగ గాయత్రీఉపదేశము పొందని ద్విజులచేత మూడు కృచ్ర్ఛములు చేయించి పిదప యథావిధిగా ఉపనయనము చేయవలెను. నిషిద్ధకర్మలు చేయుచు పరిత్యక్తు లైనవారి విషయమునగూడ ఇట్లే చేయవలెను. చెడ్డ దానములు పట్టినవాడు మూడు వేల గాయత్రీమంత్రజపము చేసి, సమాహిత చిత్తుడై ఒక మాసము గోష్టమునందు నివసించుచు పాలుమాత్రము త్రాగినచో పరిశుద్ధు డగును.

వ్రాత్యానాం యాజనం కృత్వా పరేషామన్త్యకర్మచ | అభిచారమహీనానాం త్రిభిః కృచ్ర్ఛైర్వ్యపోహతి. 11

శరణాగతం పరిత్యజ్య వేదం విప్లావ్య చ ద్విజః | సంవత్సరం మితాహార స్తత్పాపమవసేధతి. 12

శ్వశృగాలఖరైర్దష్టో గ్రామ్యైః క్రవ్యాద్భిరేవ చ | నరోష్ట్రాశ్వైర్వరాహైశ్చ ప్రాణాయామేన శుధ్యతి. 13

స్నాతకవ్రతలోపే చ కర్మత్యాగే హ్యభోజనమ్‌ | హుంకారం బ్రాహ్మణస్యోక్త్వా తుంకారం చ గరీయసః.

స్నాత్వానశ్నన్నహః శేషమభివాద్య ప్రసాదయత్‌ | అవగూర్య చరేత్కృచ్ర్ఛమతి కృచ్ర్ఛం నిపాతనే. 15

కృచ్ర్ఛాతికృచ్ర్ఛం కుర్వీత విప్రస్యోత్పాద్య శోణితమ్‌ | చణ్డాలాదిరవిజ్ఞాతో యస్య తిష్ఠేత్తు వేశ్మని. 16

సమ్యగ్‌ జ్ఞాతస్తు కాలేన తస్య కుర్వీత శోధనమ్‌ | చాన్ద్రాయణం పరాకం వా ద్విజానాం తు విశోధనమ్‌. 17

ప్రాజాపత్యం తు శూద్రాణాం శేషం తదనుసారతః | గుడం కుసుమ్భం లవణం తథాధాన్యాని యాని చ .

కృత్వా గృహే తతో ద్వారి తేషాం దద్యా ద్ధుతాశనమ్‌ |

మృన్మయానాం తు భాణ్డానాం త్యాగ ఏవ విధీయతే. 19

ద్రవ్యాణాం పరిశేషాణాం ద్రవ్యశుద్ధిర్విధీయతే | కూపైకపానసక్తాయే స్పర్శాత్సఙ్కల్ప దూషితాః. 20

శుధ్యేయురుపవాసేన పఞ్చగవ్యేన వాప్యథ | యస్తు సంస్పృశ్య చణ్డాలమశ్నీయాచ్చ స్వకామతః. 21

ద్విజశ్చాన్ద్రాయణం కుర్యాత్తప్తకృచ్ర్ఛమథాపి వా | భాణ్డసంకుల సంకీర్ణశ్చాణ్డాలాదిజుగుప్సితైః. 22

భుక్త్వా పీత్వా తథా తేషాం షడ్రాత్రేణ విశుధ్యతి | అన్త్యానాం భుక్తశేషం తు భక్షయిత్వా ద్విజాతయః. 23

వ్రతం చాన్ద్రాయణం కుర్యుస్త్రిరాత్రం శూద్ర ఏవ తు | చణ్డాలకూపభాణ్డషు అజ్ఞానాత్పిబతే జలమ్‌. 24

ద్విజః సన్తపనం కుర్యాచ్ఛూద్రశ్చొపవసేద్దినమ్‌ | చాణ్డాలేన తు సంస్పృష్టో యస్త్వపః పిబతే ద్విజః. 25

త్రిరాత్రం తేన కర్తవ్యం శూద్రశ్చోపవసేద్దినమ్‌ |

సంస్కారహీనులచే యజ్ఞము చేయించినను, ఇతరులకు అంత్యేష్టి కర్మ చేసినను, మంచివారి విషయమున అభిచార ప్రయోగము చేసినను బ్రాహ్మణుడు మూడు ప్రాజాపత్యములు చేయవలెను. ద్విజుడు శరణాగతుని పరిత్యజించినను, అనధికారికి వేదోపదేశము చేసినను, ఒక సంత్సరము నియమితాహారము భుజించుటచే పాపవిముక్తుడగును. కుక్క, నక్క, గాడిద, పిల్లి, ముంగిస, మనుష్యుడు, గుఱ్ఱము, ఒంటె, పంది - ఇవి కరచినచో ప్రాణాయామముచే శుద్ధు డగును. వ్రతలోపము చేసినను, నిత్యకర్మలను ఉల్లంఘించినను, స్నాతకుడు ఉపవాసము చేయవలెను. బ్రాహ్మణుని విషయమును హుంకరించినవాడును, పెద్దలకు తుంకరించినవాడును (నువ్వు అని అన్న వాడును) స్నానము చేసి, ఆదినమున మిగిలిన కాలము ఉపవాసముండి, వారికి నమస్కరించి ప్రసన్నులను చేసికొనవలెను. బ్రాహ్మణునిపై కఱ్ఱఎత్తినవాడు ప్రాజాపత్య వ్రతము చేసికొనవలెను. కర్రతో కొట్టినచో అతికృచ్ర్ఛమును, రక్తము వచ్చు నట్లు చేసినచో కృచ్ర్ఛమును, అతికృచ్ర్ఛమును చేయవలెను. తెలియకుండ ఒక చండాలుడు వచ్చి ఇంటిలో కాపుర మున్నచో, తెలిసినపిమ్మట ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. చాంద్రాయణము గాని పరాకవ్రతమును గాని చేసినచో ద్విజులకు శుద్ధి యగును. శూద్రులకు ప్రాజాపత్య వ్రతముచే శుద్ధి యగును. మిగిలిన దంతయు అతడు కూడ ద్విజుల వలెనే చేయవలెను. ఇంటిలో నున్న బెల్లము కుసుంభము, లవణము, ధాన్యము మొదలగు పదార్థములను ద్వారమువద్ద కుప్పగా చేసి తగులబెట్టవలెను. మట్టి పాత్రలను పారవేయవలెను. ఇతర ద్రవ్యములకు శాస్త్రోక్తశుద్ధి చేయవలెను. చండాలస్పర్శదూషిత మగు నూతినుండి నీరు త్రాగిన బ్రాహ్మణుడు ఉపవాసము గాని పంచదివ్యశుద్ధి గాని చేయవలెను. ఇష్టపడి చండాలుని స్పర్శ చేసి భోజనము చేసిన బ్రాహ్మణుడు చాంద్రాయణము గాని, తప్తకృచ్ర్ఛము గాని చేయవలెను. చండాలాదినీచజాతుల స్పర్శచే భోజనాది పాత్రలు అపవిత్ర మైనచో బ్రాహ్మణుడు షడ్రాత్రవ్రతము చేయవలెను. అంత్యజాతివాని ఉచ్ఛిష్టము తిన్న ద్విజుడు చాంద్రాయణవ్రతము చేయవలెను; శూద్రుడు త్రిరాత్రవ్రతము చేయవలెను. చండాలుని కూపమునుండి గాని, పాత్ర నుండి గాని తెలియక త్రాగిన ద్విజుడు సంతపనకృచ్ర్ఛమును, శూద్రుడు ఏకదినోపవాస మును చేయవలెను. చండాలస్పర్శ చేసి జలము త్రాగిన ద్విజుడు త్రిరాత్రవ్రతమును చేయవలెను. శూద్రుడు ఒకదినము ఉపవాసము చేయవలెను.

ఉచ్ఛిష్టేన యది స్పృష్టః శునా శూద్రేణ వా ద్విజః. 26

ఉపోష్య రజనీమేకాం పఞ్చగవ్యేన శుధ్యతి | వైశ్యేన క్షత్రియేణౖవ స్నానం నక్తం సమాచరేత్‌. 27

అధ్వానం ప్రస్థితో విప్రః కాన్తారే యద్యనూదకే | పక్వాన్నేన గృహీతేన మూత్రోచ్చారం కరోతి వై. 28

అనిధాయైవ తద్ద్రవ్యం అఙ్గేకృత్వా తు సంస్థితమ్‌ |

శౌచం కృత్వాన్న మభ్యుక్ష్య అర్కస్యాగ్నేశ్చ దర్శయేత్‌. 29

వ్లుెచ్ఛైర్గతానాం చౌరైర్వా కాన్తారే వా ప్రవాసినామ్‌ | భక్ష్యాభక్ష్యవిశుద్ద్యర్థం తేషాం వక్ష్యామి నిష్కృతిమ్‌.

పునః ప్రాప్య స్వదేశం చ వర్ణానామానుపూర్వశః | కృచ్ర్ఛస్యాన్తే బ్రాహ్మణస్తు పునః సంస్కారమర్హతి.

పాదోనాన్తే క్షత్రియశ్చ అర్ధాన్తే వైశ్య ఏవ చ | పాదం కృత్వా తథా శూద్రో దానం దత్త్వా విశుధ్యతి. 32

ఉదక్యా తు సవర్ణా యా స్పృష్టా చేత్స్యాదుదక్యయా | తస్మిన్నే వాహని స్నాత్వా శుద్ధిమాప్నోత్యసంశయమ్‌.

రజస్వలా తు నాశ్నీయాత్సంస్పృష్టా హీనవర్ణయా | యావన్న శుద్ధిమాప్నోతి శుద్ధస్నానేన శుధ్యతి. 34

మూత్రం కృత్వా వ్రజన్వర్త్మ స్మృతిభ్రంశాజ్జలం పిబేత్‌ |

అహోరాత్రోషితో భూత్వా పఞ్చగవ్యేన శుధ్యతి. 35

మూత్రోచ్చారం ద్విజః కృత్వా అకృత్వా శౌచమాత్మనః |

మోహాద్భుక్త్వా త్రిరాత్రం తు యవాన్పీత్వతా విశుధ్యతి. 36

ఉచ్ఛిష్ట మైన కుక్క చేతగాని, శూద్రునిచేత గాని స్పృశింపబడిన ద్విజుడు ఒక రాత్రి ఉపవాస ముండి పంచగవ్యముచే శుద్ధిపొందును. అట్టి వైశ్యడు గాని, క్షత్రియుడు గాని స్పృశించినచో రాత్రి స్నానము చేయవలెను. మార్గ మధ్యమునందున్న బ్రాహ్మణుడు ఉదకములేని అరణ్యమునందు, పక్వాన్నము చేతిలో నుండగా మూత్రవిసర్జము చేసినచో, ఆ ఆహారమును క్రింద పెట్టకుండగ, తన శరీరముపైననే ఉంచుకొని, శౌచము చేసికొని ఆ అన్నమును ప్రోక్షించి సూర్యునకును అగ్నికిని చూపవలెను. అరణ్యమునందు వ్లుెచ్చులతో గాని చోరులతోగాని సంబంధ మేర్పడినవారికి, లేదా ప్రవాసములో నున్నవారికి భక్ష్యాభక్ష్యశుద్ధినిమత్తము ఉపాయమును చెప్పెదను. వర్ణక్రమానుసారముగా బ్రాహ్మణుడు డైనచో అతడు మరల స్వదేశమునకు తిరిగి వచ్చి కృచ్ర్ఛవ్రతము చేసిన పిమ్మట మరల సంస్కారము చేసి కొనవలెను. క్షత్రియుడు మూడు వంతుల ప్రాయశ్చిత్తము, వైశ్యుడు సగము ప్రాయశ్చిత్తము చేసికొని శుద్ధులగుదురు. శూద్రుడు పాదము ప్రాయశ్చిత్తము చేత గాని దానము చేత గాని, శుద్ధు డగును. సవర్ణ యగు రజస్వలచే స్పృశింపబడిన రజస్వలాస్త్రీ ఆ దినము నందే స్నానము చేసినచో శుద్ధురాలగును. తక్కువవర్ణము గల రజస్వల స్త్రీచే స్పృశింపబడిన రజస్వల శుద్ధస్నానముచేత శుద్ధురాలగును; స్నానము చేయునంతవరకును భుజించగూడదు. మూత్రోత్సర్గానంతరము ప్రయాణము చేయుచు, మరచి నీళ్లుత్రాగినచో ఒక రాత్రి ఒక పగలు ఉపవాస ముండి పంచగవ్యముచే శుద్ధు డగును. మూత్రోత్సర్గము చేసిన ద్విజుడు శౌచము చేసికొనకుండ, అజ్ఞానముచే భోజనము చేసినచో మూడు రాత్రులు యవలు త్రాగి శుద్ధి చెందును.

యే ప్రత్యవసితా విప్రాః ప్రవ్రజ్యాదిబలాత్తథా | అనాశకనివృత్తాశ్చ తేషాం శుద్ధి వ్రచక్ష్యతే. 37

చరయే త్త్రీణి కృచ్ర్ఛాణి చాన్ద్రాయణమథాపి వా | జాతకర్మాదిసంస్కారైః సంస్కుర్యాత్తం తథా పునః. 38

ఉపానహమమేధ్యం చ యస్య సంస్పృశ##తే ముఖమ్‌ | మృత్తికాగోమ¸° తత్ర పఞ్చగవ్యం చ శోధనమ్‌.

వపనం విక్రయం చైవ నీలవస్త్రాదిధారణమ్‌ | తపనీయం హి విప్రస్య త్రిభిః కృచ్ర్ఛైర్విశుధ్యతి. 40

అన్త్యజాతిశ్వపాకేన సంస్పృష్టా స్త్రీ రజస్వలా | చతుర్థేహని శుద్ధా సా త్రిరాత్రం తత్ర చాచరేత్‌. 41

చాణ్డాలశ్వపచౌ స్పృష్ట్వా తథా పూయం చ సూతికామ్‌ |

శవం తత్స్పర్శినం స్పృష్ట్వా సద్యః స్నానేన శుద్ధ్యతి. 42

నారం స్పృష్ట్వాస్థి సస్నేహం స్నాత్వా విప్రో విశుధ్యతి | రథ్యాకర్దమతోయేన హ్యధో నాభేర్మృదోదకైః. 43

వాన్తో విరిక్తః స్నాత్వా తు ఘ్నతం ప్రాశ్య విశుధ్యతి |

స్నానాతురకర్మ కర్తా కృచ్ర్ఛకృద్గ్రహణ న్నభుక్‌. 44

అపాఙ్త్కేయాశీ గవ్యాశీ శునా దష్టస్తథా శుచిః | కృమిదష్టశ్చాత్మఘాతీ కృచ్ర్ఛజ్జాప్యాచ్చ హోమతః. 45

హోమాద్యైశ్చానుతాపేన పూయన్తే పాపినోఖిలాః

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే ప్రాయశ్చితత్తనిరూపణం నామ సప్తత్యధిక శతతమోధ్యాయః.

బలాత్కారాది కారణములచేత సంన్యసించిన విప్రులు అందుండ అసమర్థులై మరల గృహస్థాశ్రమమునకు రావలె నన్నచో వారికి శుద్దిని చెప్పుచున్నాము. మూడు కృచ్ర్ఛములుగాని వారిచే చాంద్రాయణము కాని చేయించవలెను. మరల జాతకర్మాదిసంస్కారములచే సంస్కరించవలెను. పాదుకగాని, అమేధ్యము గాని ముఖమునకు తగిలినచో మృత్తిక, గోమయము, పంచగవ్యము వీటిచే శుద్ధిచేసికొనవలెను. నీలిమందు పండించుట, విక్రయము, నీలవస్త్రాదిధారణము చేసిన బ్రాహ్మణుడు పతితుడగును. మూడు కృచ్ర్ఛములచే శుద్ధు డగును. అంత్యజాతివానిచేతను, శ్వపాకునిచేతను స్పృశింపబడిన రజస్వల త్రిరాత్రము చేసినచో నాల్గవరోజున శుద్ధురాల గును. చండాలశ్వపచులను, పాసివవస్తువును, సూతికాస్త్రీని శవమును వీటిని స్పృశించినవానిని స్పృశించినవాడు సద్యఃస్నానముచే శుద్ధు డగును. పచ్చిగానున్న మనిషి ఎముకను స్పృశించిన విప్రుడు స్నానముచే శుద్దుడగును. మార్గమునందలి బురదనీళ్ళు పడి నపుడు నాభి క్రింద మట్టితోను, ఉదకము తోను శుద్ధి చేసికొనవలెను. వాంతిచేసుకొన్నవాడు, విరేచనములు వెళ్ళినవాడును స్నానము చేసి ఘృతప్రాశనము చేసినచో శుద్ధు డగును. క్షౌరము చేయించుకొన్నవాడు స్నానము చేతను, గ్రహణసమయమున అన్నము తిన్నవాడు కృచ్ర్ఛము చేతను శుద్ధుడగును. పంక్తిబాహ్యులతో కలిసి భోజనము చేసినవాడును, కుక్క గాని, కృములు గానికరచినవాడును, అశుచి యైనవాడును పంచగవ్యములచే శుద్ధిపొందును. ఆత్మహత్యాప్రయత్నము చేసినవాడు కృచ్ర్ఛముచేతను జపము చేతను శుద్ధుడగును. పాపాత్ములందరును హోమాదులచేతను, పశ్చాత్తాపముచేతను ళుద్ధులగుదురు.

అగ్నిమహాపురాణమునందు ప్రాయశ్చిత్తనిరూపణమను నూటడెబ్బదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters