Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకోనసప్తత్యధిక శతతమోధ్యాయః.

అథ పునః ప్రాయశ్చిత్తాని.

పుష్కర ఉవాచ :-

ఏతత్ప్రభృతి పాపానాం ప్రాయశ్చిత్తం వదామితే | బ్రహ్మహా ద్వాదశాబ్దాని కుటీం కృత్వా వనే వసేత్‌. 1

భిక్షేతాత్మ విశుద్ధ్యర్థం కృత్వా శవశిరో ధ్వజమ్‌ | స్రాస్యేదాత్మానమగ్నౌ వా సమిద్ధే త్రిరవాక్ఛిరాః. 2

యజేత వాశ్వమేధేన స్వర్జితా గోసవేన వా | జపన్వాన్యతమం వేదం యోజనానాం శతం వ్రజేత్‌. 3

సర్వస్వం వా వేదవిదే బ్రాహ్మణా యోపపాదయేత్‌ | వ్రతైరేతైర్వ్యపోహన్తి మహాపాతకినో మలమ్‌. 4

ఉపపాతకసంయుక్తో గోఘ్నో మాసం యవాన్‌ పిబేత్‌ | కృతవాసో వసేద్గోష్టే చర్మణా తేనసంవృతః. 5

చతుర్థకాలమశ్నీయా దక్షారలవణం మితమ్‌ | గోమూత్రేణ చరేత్స్నానం ద్వౌ మాసౌ నియతేన్ద్రియః. 6

దివానుగచ్ఛేద్గావశ్చ తిష్ఠ న్నూర్ధ్వంరజఃపిబేత్‌ | వృషభైకాదశా గాస్తు దద్యాద్ధి చిరితవ్రతః. 7

ఆవిద్యమానే సర్వస్వం వేదవిద్భ్యో నివేదయేత్‌ | పాదమేకం చరేద్రోధే ద్వౌ పాదౌ బన్ధనే చరేత్‌. 8

యోజనే పాదహీనం స్యాచ్చరేత్సర్వం నిపాతనే | కాన్తారేష్వథ దుర్గేషు విషమేషు భ##యేషు చ. 9

యది తత్ర విపత్తిః స్యాదేకపాదో విధీయతే | ఘణ్టాభరణదోషేణ తథైవార్దం వినిర్దిశేత్‌. 10

దమనే దామనే రోధే శకటస్య నియోజనే | స్తమ్భశృజ్ఖలపాశేషు మృతే పాదోనమాచరేత్‌. 11

శృఙ్గభ##ఙ్గేస్థిభ##ఙ్గే చ లాఙ్లు లచ్ఛేదనే తథా | యావకం తు పిబేత్తావద్యావత్సుస్థా తు గౌర్భవేత్‌. 12

గోమతీం చ జపేద్విద్యాం గోస్తుతిం గోమతీం స్మరేత్‌ | ఏకా చేద్బహుభిర్దైవాద్యత్ర వ్యాపారితా భ##వేత్‌. 13

పాదం పాదం తు హత్యాయాశ్చ రేయుస్తే పృథక్‌ పృథక్‌ | ఉపకారే క్రియమాణ విపత్తౌ నాస్తిపాతకమ్‌.

ఏతదేవ వ్రతం కుర్యురుపపాతకినస్తథా | అవకీర్ణివర్జం శుద్ధ్యర్థం చాన్ద్రాయణమథాపి వా. 15

పుష్కరుడు చెప్పెను : ఇటుపైపాపములకు ప్రాయశ్చిత్తములను చెప్పెదను. బ్రహ్మహత్య చేసినవాడు కుటి నిర్మించుకొని పండ్రెండు సంవత్సరములు వనములో నివసించవలెనను. శిరస్సు గుర్తును తన దేహముపై ఏర్పరచుకుని ఆత్మశుద్ధికై భిక్షాన్నము తినవలెను. లేదా ప్రజ్వలించుచున్న అగ్నిలో తల క్రిందులుగా తన శరీరమును పడవేయవలెను. లేదా అశ్వమేధయాగము గాని. స్వర్గలోకము నిచ్చు గోసవము కాని చేయవలెను. లేదా ఏదైన ఒక వేదమును జపించుచు నూరు యోజనములు నడచి వెళ్లవలెను, లేదా వేదవేత్తయగు బ్రాహ్మణునికి తన సర్వస్వమును ఇచ్చివేయవలెను. మహాపాతకము చేసినవారు ఈ వ్రతములచే తమ పాపములను తొలగించుకొందురు. ఉపపాతకములు చేసినవాడును, గోహత్యచేసిన వాడును, ఒక మాసము యవలు త్రాగ వలెను. ముండనము చేయించుకొని, ఆ గోచర్మమును కప్పుకొని గోష్ఠమనందు నివసించవలెను. ఉప్పు, పులుపు లేని ఆహారమును మితముగా దినమునందలి నాల్గవ భాగమున తినవలెను. నియంతేంద్రియు డై రెండు మాసములు గోమూత్రముతో స్నానము చేయవలెను. పగలు గోవుల వెంట వెళ్లుచు నిలబడి గోపరాగమును త్రాగవలెను. వ్రతము పూర్తి చేసికొని పది గోవులను, ఒక వృషభమును దానము చేయవలెను. అందుకు శక్తి లేనిచో వేదవేత్తలకు సర్వస్వమును దానము చేయవలెను. గోవును నిరోధించగా అవి చనిపోయినచో ఒక పాదము ప్రాయశ్చిత్తమును కట్టి వేయుటచే చనిపోయినచో రెండు పాదముల ప్రాయశ్చిత్తమును నాగలికి కట్టి నపుడు చనిపోయినచో మూడు వంతులును, కొట్టగా చనిపోయినచో పూర్తిగను ప్రాయశ్చిత్తము చేయవలెను. అడవులందును, దుర్గములందును, విషమప్రదేశములందును, భయములందును గోవుకు ఆపద కలిగినచో ఒక పాదము ప్రాయశ్చిత్తము విహితము. ఆలంకారర్థామై ఘంటాదులు కట్టుటచే మరణించినచో రెండు పాదముల ప్రాయశ్చిత్తము. గోవును దమనము చేయు నపుడు గాని, చేయించునపుడు గాని కట్టినపుడు గాని, గుదికఱ్ఱ, గొలుసు, పాశము కట్టుటచే గాని మరణించినచో మూడు వంతులు ప్రాయశ్చిత్తము ఆచరించవలెను. గోవుకు కొమ్మువిరిగినను, ఎముక విరిగినను, తోక తెగినను దానికి పూర్తి ఆరోగ్యము చేకూరువరకును, గంజి త్రాగవలెను. గోమతీవిద్యను జపించుచు, గోస్తుతి - గోమతులను స్మరించుచుండవలెను. దైవవశమున ఒక గోవును అనేకులు చంపినచో వారు ఒక్కొక్కరు పాదము చొప్పున ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. గోవుకు సహాయముచేయబోగా ఆది మరణించినచో పాపము లేదు. ఉపపాతకములు చేసినవారందరును, అవకీర్ణి తప్ప ఇతరులను, శుద్ధినిమిత్తమై, ఈ వ్రతమునే చేయవలెను. లేదా చాంద్రాయణము చేయవలెను.

అవకీర్ణీ తు కాలేన గర్దభేన చతుష్పథే | పాకయజ్ఞవిధానేన యజేత నిరృతిం నిశి. 16

కృత్వాగ్నిం విధివద్ధీమా నన్తతస్తు సమిత్యృచా | చన్ద్రేంద్రగురువహ్నీనాం జుహుయాత్సఘృతాహుతిమ్‌. 17

ఆథవా గార్దభం చర్మ వసిత్వాబ్దం చరేన్మహీమ్‌ . |

హత్వా గర్బమవిజ్ఞాయ బ్రహ్మహత్యావ్రతంచరేత్‌. 18

సురాం పీత్వా ద్విజో మోహాదగ్నివర్ణాం సురాం పిబేత్‌ | గోమూత్రమగ్నివర్ణం వా పిబేదుదకమేవ వా. 19

సువర్ణస్తేయకృద్విప్రో రాజానమభిగమ్య తు |

స్వకర్మఖ్యాపయన్‌ బ్రూయాన్మాం భవాననుశాస్త్వితి. 20

గృహీత్వా ముసలం రాజా సకృద్ధన్యాత్స్వయం గతమ్‌ | వధేన శుద్ధ్యతే స్తేయో బ్రాహ్మణస్తపసైన వా.21

గురుతల్పో నికృత్త్యైవ శిశ్నం చ వృషణం స్వయమ్‌ | నిధాయ చాఞ్జలౌ గచ్ఛేదానిపాతాచ్చనైరృతిమ్‌. 22

చాన్ద్రాయణాన్వా త్రీన్‌ మాసానభ్యసేన్నియతేన్ద్రియః | జాతిభ్రంశకరం కర్మ కృత్వాన్యత మమిచ్ఛయా. 23

చరేత్సాన్తపనం కృచ్ర్ఛం ప్రాజాపత్యమనిచ్ఛతా | సఙ్కరీ పాత్రకృత్యాసు మాసం శోధనమైన్దవమ్‌. 24

మలినీకరణీయేషు తప్తం స్యాద్యావకం త్ర్యహమ్‌ |

తురీయో బ్రహ్మహత్యాయా క్షత్రియస్య వధే స్మృతః. 25

వైశ్యేష్టమాంశో వృత్తస్థే శూద్రే జ్ఞేయస్తు షోడశః | మార్జారనకులౌ హత్వా చాషం మణ్డూకమేవ చ. 26

శ్వగోధోలూకకాకాంశ్చ శూద్రహత్యావ్రతం చరేత్‌ | చతుర్ణామపి వర్ణానాం నారీం హత్వా నవస్థితామ్‌. 27

అమత్యైవ ప్రమాప్య స్త్రీం శూద్రహత్యావ్రతం చరేత్‌ | సర్పాదీనాం వధేనక్త మనస్థ్నాం వాయుసంయమః.

అవకీర్ణిమాత్రము (వ్రతమధ్యమునందు స్త్రీ సంగము చేసినవాడు) రాత్రియందు చతుష్పథమున, నిరృతి నుద్దేశించి నల్లని గాడిదను పాకయజ్ఞవిధానమున పూజించవలెను. పిమ్మట ఆ ధీమంతుడు ''సమాసిఞ్చన్తు మరుతః'' ఇత్యాది బుక్కుతో చంద్ర-ఇంద్ర-గురువుల నద్దేశించి ఘృతాహుతి ఇవ్వవలెను. లేదా గార్దభచర్మము కప్పికొని ఒక సంవత్సరము భూమిపై సంచరించవలెను. తెలియక భ్రూణహత్య చేసినవాడు బ్రహ్మహత్యాప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తెలియక సురాపానము చేసిన బ్రాహ్మణుడు అగ్ని వలె కాలుతూన్న సురగాని, గోమూత్రము గాని, జలము కాని త్రాగవలెను. సువర్ణమునపహరించిన బ్రాహ్మణుడు రాజువద్దకు వెళ్ళి నేను ఈ అపరాధము చేసితిని, నాకు దండము నిమ్ము'' అని చెప్పవలెను. ఈ విధముగ తనంతట తాను వచ్చి చెప్పిన వానిని రాజు ముసలముతో ఒక్క దెబ్బ కొట్టవలెను. ఈ విధముగ చచ్చుటచే గాని, తపస్సు చేయుటచే గాని సువర్ణస్తేయము చేసిన బ్రాహ్మణుని పాపము తొలగును. గురుపత్నీగమనము చేసినవాడు స్వయముగ శిశ్నమును, వృషణములను ఖండించుకొని, వాటిని దోసిటిలో నుంచుకొని చనిపోవువరకును, నైరృతిదిక్కువైపు వెళ్ళవలెను. లేదా నియతేంద్రియుడై చాంద్రాయణవ్రతము చేయవలెను. జాతిభ్రంశకర మగు పాప మేదైన తెలిసి చేసినవాడు ''సాంతపనకృచ్ర్ఛమును'', తెలియక చేసినవాడు ''ప్రాజాపత్యకృచ్ర్ఛమును'' చేయవలెను. 'సంకరీకరణ' ''అపాత్రీకరణ'' పాపములు చేసినవాడు చాంద్రాయణవ్రతము చేయవలెను. 'మలినీకరణ' పాపము చేసినవాడు మూడు దినములు తప్తయావకమును త్రాగవలెను. క్షత్రియవధ చేసినవాడు బ్రహ్మహత్యాప్రాయశ్చిత్తములో నాల్గవ వంతు చేసి కొనవలెను. వైశ్యుని వధించినచో ఎనిమిదవవంతు, సదాచారవంతుడైన శూద్రుని వధించినచో పదునారవ వంతు ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. పిల్లి, ముంగిస, నెమలి, కప్ప, కుక్క, ఉడుము, గుడ్లగూబ, కాకి-వీటిని గాని, నాలుగు వర్ణములకు చెందిన ఏ స్త్రీ నైన గాని చంపినచో శూద్రహత్యాప్రాయశ్చిత్తము చేసికొనవలెను. సర్పాదులను చంపి నపుడు నక్తవ్రతమును, ఎముకలు లేని జీవులను చంపినపుడు ప్రాణాయామము చేయవలెను.

ద్రవ్యాణామల్పసారాణాం స్తేయం కృత్వాన్యవేశ్మతః | చరేత్సాన్తపనం కృచ్ర్ఛం వ్రతం నిర్వాప్య శుధ్యతి.

భక్ష్యభోజ్యాపహారణ యానశయ్యాసనస్య చ | పుష్పమూలఫలానాం చ పఞ్చగవ్యం విశోధనమ్‌. 30

తృణకాష్ఠద్రుమాణాం తు శుష్కాన్నస్య గుడస్య చ | చైలచర్మామిషాణాం తు త్రిరాత్రం స్యాదభోజనమ్‌.

మణిముక్తాప్రవాలానాం తామ్రస్య రజతస్య చ | అయఃకాంస్యోపలానాం చ ద్వాదశాహం కణాన్నభుక్‌. 32

కార్పాసకీటజీర్ణానాం ద్విశ##ఫైకశఫస్య చ | పక్షిగన్దౌషధీనాం తు రజ్జ్వాశ్చైవ త్ర్యహం పయః. 33

గురుతల్పవ్రతం కుర్యాద్రేతః సిఞ్చన్‌ స్వయోనిషు | సఖ్యుః పుత్రస్య చ స్త్రీషు కుమారీష్వన్త్యజాసు చ. 34

పైతృష్వ స్రేయిం భగినీం స్వస్రియాం మాతురేవ చ |

మాతుశ్చ భ్రాతురాప్తస్య గత్వా చాన్ద్రాయణం చరేత్‌. 35

అమానుషీషు పురుష ఉదక్యాయామయోనిషు | రేతః సిక్త్వా జలేచైవ కృచ్ర్ఛం సాన్తపనం చరేత్‌. 36

మైథునం తు సమాసేవ్య పుంసి యోషితి వా ద్విజః | గోయానేప్సు దివా చైవ సవాసాః స్నానమాచరేత్‌.

చాణ్డాలాన్త్యస్త్రియో గత్వా భుక్త్వా చ ప్రతిగృహ్య చ | పతత్యజ్ఞానతోవిప్రోజ్ఞానాత్సామ్యం తు గచ్ఛతి. 38

విప్రదుష్టాం స్త్రియం భర్తా నిరున్ధ్యాదేకవేశ్మని | యత్పుంసః పరదారేషు తదేనాం చారయేద్ర్వతమ్‌. 39

సాచేత్పునః ప్రదుష్యేత సదృశేనోపమన్త్రితా | కృచ్ర్ఛం చాన్ద్రాయణం చైవ తదస్యాః పావనం స్మృతమ్‌.

యత్కరోత్యేకరాత్రేణ వృషలీసేవనం ద్విజః | తద్భైక్ష్యభుగ్జపన్నిత్యం త్రిభర్వర్షైర్వ్యపోహతి. 41

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ప్రాయశ్చిత్తనిరూపణం నామైకోన సప్తత్యధిక శతతమోధ్యాయః.

ఇతరులగృహమునుండి అల్ప మైన సారము గల వస్తువుల చౌర్యము చేసినవాడు కృచ్ర్ఛసంతపనము చేయుటచే శుద్ధు డగును. భక్ష్యభోజ్యములను, యాన-శయ్యా-ఆసనములను, పుష్ప-ఫల-మూలములను అపహరించినవానికి పంచగవ్యప్రాశనము ప్రాయశ్చిత్తము. తృణ-కాష్ఠ-వృక్షములను, బెల్లమును, వస్త్రమును, చర్మమును, మాంసమును అపహరించినవాడు మూడు రోజులు భోజనము చేయరాదు. మణులు, ముత్యములు, ప్రవాళములు, రాగి, వెండి, ఇనుము,కంచు, రాళ్లు అపహరించినవాడు పండ్రెండు రోజులు కొంచెము అన్నము మెతుకులు మాత్రము తినవలెను. నూలు, పట్టు-ఉన్ని బట్టలను, రెండు డెక్కలు గల పశువులను, ఒక డెక్క గల పశువులను, పక్షులను, గంధములను, ఓషధులను, త్రాడును అపహరించినవాడు మూడు దినములు పాలుమాత్రమే త్రాగవలెను. సమానోదరు లగు స్త్రీలతోను, మిత్ర-పుత్రాదిస్త్రీలతోను, బాలికలతోను, అంత్యజాతిస్త్రీలతోన, మేనత్తకుమార్తెతోను, సోదరితోను, తల్లి సోదరి కుమార్తెతోను, తల్లి సోదరుని కుమార్తెతోను, అప్తుని స్త్రీతోను, సంగమము చేసినవాడు చాంద్రాయణవ్రతము చేయవలెను. మనుష్యభిన్నపశ్వాదులందును, రజస్వల యందును, యోనిభిన్న ప్రదేశములందును, జలమునందును రేతః సేకము చేసినవాడు కృచ్ర్ఛసంతపనము చేయవలెను. ఎద్దుల బండియందును, నీటియందు, పగటిభాగమునందు స్త్రీతో గాని పురుష్యునితో గాని మైథునము చేసిన ద్విజుడు సచేల స్నానము చేయవలెను. విప్రుడు తెలియక చండాలస్త్రీతో గాని, అంత్యజాతి స్త్రీలతో గాని సమాగమము చేయుట, భుజించుట, దానము పట్టుట అను పనులు చేసినచో పతితు డగును, తెలిసి చేసినచో వారితో సముడైపోవును. చెడిపోయిన స్త్రీని భర్త ఒక యింటిలో నిరోధించి ఉంచి, పరదార సంబంధము గల పురుషుడు ఏ వ్రతము చేయవలెనో ఆ వ్రతమును ఈమెచే చేయించవలెను. సమానజాతీయునిచే పిలవబడి ఆమె మరల చెడిపోయినచో కృచ్ర్ఛమును, చాంద్రాయణమును చేయవలెను. దానితో ఆమె పవిత్రు రాలగును. ద్విజుడు ఒక రాత్రి శూద్రస్త్రీ సమాగమము చేసిన పాపమును, నిత్యము భిక్షాన్నము తినుటద్వారా మూడు సంవత్సరములలో పోగొట్టుకొనును.

అగ్ని మహాపురాణమునందు ప్రాయశ్చిత్తనిరూపణ మను నూట అరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters