Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ షష్ట్యుత్తర శతతమోధ్యాయః

అథ వానప్రస్థధర్మ నిరూపణమ్‌.

పుష్కర ఉవాచ :

వానప్రస్థయతీనాం చ ధర్మం వక్ష్యేధునా శృణు | జటిత్వమగ్నిహోత్రిత్వం భూశయ్యాజినధారణమ్‌. 1

వనే వాసః పయోమూలనీవారఫలవృత్తితా | ప్రతిగ్రహనివృత్తిశ్చ త్రిస్నానం బ్రహ్మచారితా. 2

దేవాతిథీనాం పూజా చ ధర్మోయం వనవాసినః |

గృహీ హ్యపత్యాపత్యంచ దృష్ట్యారణ్యం సమాశ్రయేత్‌. 3

తృతీయమాయుషో భాగమేకాకీ వా సభార్యకః |

గ్రీష్మే పఞ్చతపా నిత్యం వర్షాస్వభ్రావకాశికః. 4

ఆర్ద్రవాసాశ్చ హేమన్తే తపశ్చోగ్రం చరేద్బలీ | అపరావృత్తిమాశ్రిత్య వ్రజేద్దిశమజిహ్మగః. 5

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వానప్రస్థధర్మ వర్ణనం నామ షష్ట్యధికశతమోధ్యాయః.

పుష్కరుడు చెప్పెను : ఇపుడు వానప్రస్థాశ్రమ ధర్మములు చెప్పెదను; వినుము. జటలు ధరించుట, అగ్నిహోత్రము చేయుట నేలపై పండుకొనుట మృగాజినమును ధరించుట, వనములో నివసించుచు, పాలు, దుంపలు, అడవిధాన్యము, ఫలములు ఆహారముగా గొనుట, ప్రతిగ్రహము నుండి విరమించుట త్రిషవణస్నానము, బ్రహ్మచర్యము దేవాతిథిపూజ - ఇది వానప్రస్థుని ధర్మము, పౌత్రుడు జనించిన వెంటనే గృహస్థుడు ఆరణ్యమునకు పోవలెను. అచట ఒంటరిగా గాని, భార్యాసమేతుడుగా గాని, ఆయుర్దాయమునందలి మూడవ వంతు గడపవలెను. శరీరబలమున్నంతవరకును గ్రీష్మము నందు పంచాగ్ని మధ్య తపస్సు చేయవలెను. వర్షాకాలమునందు ఆరుబైటను, హేమంతమునందు తడిబట్టలు దరంచియు ఉగ్రమైన తపస్సు చేయవలెను. వెనుకకు మరలక, అవక్రగతియై ముందుకే పోవలెను. అనగా మరల గృహస్థాశ్రమమునకు రాకుండ సన్యాసాశ్రమమునే గ్రహించుటకై ప్రయత్నించవలెను.

అగ్ని మహాపురాణమునందు వానప్రస్థధర్మవర్ణన మను నూట అరువదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters