Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ షట్పఞ్చాశదుత్తర శతతమోధ్యాయః

అథ ద్రవ్యశుద్ధిః

పుష్కర ఉవాచ :

ద్రవ్యశుద్ధిం ప్రవక్ష్యామి పునః పాకేన మృన్మయమ్‌ |

శుద్ధ్యేన్మూత్రపురీషాద్యైః స్పృష్టం తామ్రం సువర్ణకమ్‌.

ఆవర్తితం చాన్యథా తు వారిణావ్లుెన తామ్రకమ్‌ | క్షారేణ కాంస్యలోహానాం ముక్తాదేః క్షాళ##నేన తు. 2

అబ్జానాం చైవ భాణ్డానాం సర్వస్యాశ్మమయస్య చ | శాకరజ్జుమూలఫల వైదలానాం తథైవ చ. 3

మార్జనాద్యజ్ఞపాత్రానాం పాణినా యజ్ఞకర్మని | ఉష్ణామ్బునా సస్నేమానాం శుద్దిః నంమార్జనాద్గృహే. 4

బోధనాన్ర్మక్షణాద్వస్త్రే మ్భత్తికాద్భిర్విశోధనమ్‌ | బహువస్త్రే ప్రోక్షణాచ్చ దారవాణాం చ తక్షణాత్‌. 5

ప్రోక్షణాత్సంహతానాం తు ద్రవాణాం చ తథోత్ల్పవాత్‌ | శయనాససయానానాం శూర్పస్య శకటస్య చ. 6

శుద్ధిః సంప్రోక్షణాద్‌ జ్ఞేయా పలాలేన్దనయో స్తథా | సిద్దార్థకానాం కల్కేన శృఙ్గద న్తమయస్య చ. 7

గోవాలైః పలపాత్రానామస్థ్నాం స్యాచ్ఛృఙ్గవత్తథా |

నిర్వాసానాం గుడానాం చ లవణానాం చ శోషణాత్‌. 8

కుసుమ్భకుసుమానాం చ హ్యూర్ణాకార్పాసయోస్తథా | శుద్ధం నదీగతం తోయం పుణ్యం తద్యత్ర్పసారితమ్‌.

ముఖవర్జం చ గౌః శుద్ధా శుద్ధమశ్వాజయోర్ముఖమ్‌ | నారీణాం చైవ వత్సానాం శకునీనాం శునో ముఖమ్‌. 10

ముఖైః ప్రస్రవణం వృత్తే మృగయాయాం సదా శుచి |

భుక్త్వా క్షుత్వా తథా సుప్త్వా పీత్వా చామ్భో విగాహ్య చ. 11

రథ్యామాక్రమ్య చాచామే ద్వాసో విపరిధాయ చ | మార్జారశ్చఙ్ర్కమాచ్ఛుద్ధశ్చ తుర్థేహ్ని రజస్వలా. 12

స్నాతా స్త్రీ పఞ్చమే యోగ్యా దైవే పిత్ర్యే చ కర్మణి | పఞ్చాపానే దశైకస్మిన్నుభయోః సప్తమృత్తికాః.

ఏకాం లిఙ్గే మృదం దద్యాత్కరయోస్త్రిద్విమృత్తికాః | బ్రాహ్మచారివనస్థానం యతీనాం చ చతుర్గుణమ్‌.

శ్రీఫలై రంశుపట్టానాం క్షౌమానాం గౌరసర్షపైః | శుద్ధిః | పర్యుక్ష్య తోయేన మృగలోమ్నాం ప్రకీర్తితా. 15

పుష్పాణాం చ ఫలానాం చ ప్రోక్షణాజ్జలతోఖిలమ్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ద్రవ్యశుద్ధిర్నామ షట్పఞ్చాశదధిక శతతమోధ్యాయః

పుష్కరుడు చెప్పెను : ఇపుడు ద్రవ్యశుద్ధిని గూర్చి చెప్పెదను. మట్టి పాత్ర మరల కాల్చుటచే శుద్ధమగును. మలమూత్రాదిస్పర్శచే అశుద్ధ మైన పాత్ర కాల్చినను శుద్ధము కాదు. సువర్ణపాత్రము అపవిత్రవస్తువుల స్పర్శ కలిగినచో కడిగివేసిన శుద్ధ మగును. తామ్రపాత్ర పులుపు తగిల్చి నీటితో కడిగిన శుద్ధ మగును. కాంస్య-లోహపాత్రలు పరాగముతో రాచిన శుద్ధము లగును. కేవలము జలముచే కడిగినంత మాత్రముననే ముత్యములు మొదలగునవి శుద్ధ మగును. జలము నుండి పుట్టిన శంఖాదులతో తయారుచేసిన పాత్రలు, ఱాతి పాత్రలు, శాకము, త్రాడు, ఫలములు, పుష్పములు, మూలములు, వెదురు మొదలైనవాటితో తయారుచేసిన వస్తువులు జలముచే కడిగిన శుద్ధము లగును. యజ్ఞమునందు, యజ్ఞ పాత్రలు కుడిచేతితో కుశలతో మార్జనము చేసినచో శుద్ధ మగును. ఘృతము, తైలము తగిలి జిడ్డుగా నున్న పాత్రలు వేడినీటితో శుద్ధము లగును. చీపురుతో తుడిచి, అలుకుటచే ఇల్లు శుద్ధి యగును. శోధనప్రోక్షణములచే వస్త్రశుద్ధి యగును. మృత్తి కోదకముతో శోధనము చేయవలెను. చాలవస్త్రముల సముదాయము నీరుచల్లుటచే శుద్ధ మగును. దారుపాత్రములు చెక్కుటచే శుద్ధము లగును. శయ్యాదివస్తువులు,, అనేక వస్తువులు కలియగా ఏర్పడినవి జలప్రోక్షణముచే శుద్ధము లగును. రెండు కుశపత్రములచే ఉత్ల్పవనము చేయుటచే ఘృతతైలాదులకు శుద్ధి. శయ్య, ఆసనము, వాహనము, చేట, శకటము, పలాలేంధనములు జలసంప్రోక్షణముచే శుద్ధ మగును. శృంగదంతాదులతో తయారుచేసిన వస్తువులు పచ్చఆవాలు ముద్ద చేసి పూసినచో శుద్ధ మగును. నారికేలము ఆనపకాయ మొదలగు వాటితో తయారుచేసిన పాత్రలు ఆవుతోకయందలి వెండ్రుకలతో రాయగా శుద్ధ మగును శంఖాద్యస్థి నిర్మితపాత్రల శద్ధి శృంగనిర్మితపాత్రల వలె ఆవాలముద్ద పూయుటచే అగును. జిగురు బెల్లము, ఉప్పు, కుసుంభ పుష్పము, ఉన్ని పత్తి ఎండలో ఎండ బెట్టుటచే శుద్ధ మగును. నదీజలము సర్వదా శుద్ధము, ఆపణములో అమ్మజూపిన వస్తువులు శుద్ధములు. ముఖము తప్ప గోవు అవయవము లన్నియు శుద్ధములు. గుఱ్ఱము, మేక-వీటి ముఖములు శుద్ధములు. స్త్రీల ముఖము సర్వదా శుద్ధము. పాల పితుకు నపుడు లేగదూడ ముఖము, చెట్టుపై పండ్లు కొట్టిన పక్షుల ముఖము, వేటాడు సమయమున కుక్కల ముఖము పవిత్రములు. భోజనము, ఉమ్మివేయుట, నిద్రించుట, నీరు త్రాగుట, స్నానము, మార్గగమనము, వస్త్రధారణము, ఈ పనులు చేసిన పిమ్మట ఆచమనము చేయవలెను. పిల్లి ఇటు అటు తిరుగటచే శుద్ధము. రజస్వల నాల్గవ దివసమున శుద్ధి యగును. ఋతుస్నాత యైన స్త్రీ ఐదవ రోజున దేవ-పితృ కార్యములో పాల్గొనవచ్చును. శౌచానంతరము ఐదు పర్యాయములు గుదమునందును, పదిమార్లు ఎడమ చేతియందును, మరల ఏడు సార్లు రెండు చేతులందును, ఒకమారు లింగమునందును, మరల రెండుమూడు సార్లు చేతులందును మట్టి రాసుకొని కడుగుకొనవలెను. ఇది గృహస్థులకు చెప్పిన శౌచవిధానము. బ్రాహ్మచారి-వానప్రస్థ సంన్యాసులకు ఇంతకు నాలుగు రెట్లు శౌచము విహితము. సిలుకు బట్టల శుద్ధి బిల్వఫలములోని గుంజుతోను, క్షౌమముల శుద్ధి తెల్ల ఆవాలతోను, మృగచర్మ-రోమాదులతో నిర్మితములగు వస్త్రముల శుద్ధి నీరు చల్లుట చేతను అగును. పుష్ఫ ఫలములు కూడ జలప్రోక్షణముచే శుద్ధము లగును.

Sri Madhagni Mahapuranamu-1    Chapters