Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చాశదుత్తర శతతమో7ధ్యాయః

అథ మన్వన్తరాణి.

అగ్నిరువాచ :

మన్వన్తరాణి వక్ష్యామి హ్యాద్యః స్వాయమ్భువో మనుః |

ఆగ్నీధ్రాద్యాస్తస్య సుతా యమో నామ తదా సురాః. 1

ఔర్వాద్యాః సప్తర్షయ ఇన్ద్రశ్చైవ శతక్రతుః | పారావతాః సతుషితా దేవా | స్వారోచిషే7న్తరే. 2

విపశ్చిత్తత్ర దేవేన్ద్ర ఊర్జస్తంభాదయో ద్విజాః | చైత్ర కింపురుషాః పుత్రాస్తృతీయశ్చోత్తమో మనుః 3

సుశాన్తిరిన్ద్రో దేవాశ్చ సుధామాద్యా వసిష్ఠజాః | సప్తర్షయో7జాద్యాః పుత్రాశ్చతుర్థ స్తామసో మనుః. 4

స్వరూపాద్యాః సురగణాః శిఖిరిన్ద్రః సురేశ్వరః | జ్యోతిర్దామాదయో విప్రా నవ ఖ్యాతిముఖాః సుతాః. 5

రైవతే వితథశ్చేన్ద్రో హ్యమితాభాస్తథాసురాః | హిరణ్యరోమాద్యా మునయో బలబన్ధాదయః సుతాః 6

మనోజవశ్చాక్షుషే7థ ఇన్ద్రః స్వాత్యాదయః సురాః | సుమేధాద్యా మహర్షయః పూరుప్రభృతయః సుతాః.

వివస్వతః సుతో విప్రః శ్రాద్ధదేవో మనస్తతః | ఆధిత్యవసురుద్రాద్యా దేవా ఇన్ద్రః పురన్దరః. 8

వసిష్ఠః కశ్యపో7థా త్రిర్జమదగ్నిః సగౌతమః | విశ్వామిత్రభరద్వాజౌ మునయః సప్త సాంప్రతమ్‌. 9

ఇక్ష్వాకుప్రముఖాః పుత్రా అంశేన హరిరాభవత్‌ | స్వాయమ్భువే మానసో7భూదజితస్తదనన్తరే. 10

సత్యో హరిర్దేవవరో వైకుణ్ఠో వామనః క్రమాత్‌ | ఛాయాజః సూర్యపుత్రస్తు భవితా చాష్టమో మనుః 11

పూర్వస్య చ సవర్ణో7సౌ సావర్ణిర్భవితాష్టమః | సుతపాద్యా దేవగణా దీప్తిమధ్ద్రౌణికాదయః. 12

మునయో బలిరిన్ద్రశ్చ విరజప్రముఖాః సుతాః | నవమో దక్షసావర్ణిః పారాద్యాశ్చ తదా సురాః. 13

ఇన్ద్రశ్చైవాద్భుతస్తేషాం సవనాద్యా ద్విజోత్తమాః | ధృతకేత్వాదయః పుత్రా బ్రహ్మసావర్ణిరిత్యతః. 14

సుఖాదయో దేవగణాస్తేషాం శాన్తిః శతక్రతుః | హవిష్యాద్యాశ్చ మునయః సుక్షేత్రాద్యాశ్చ తత్సుతాః. 15

అగ్నిదేవుడు చెప్పెను : ఇపుడు మన్వంతరములను గూర్చి చెప్పెదను. స్వాయం భువమనువు మొదటివాడు. ఆగ్నీధ్రాదులు ఆతని కుమారులు. ఈ స్వాయంభువ మన్వంతహరమున దేవతలు యములు: ఔర్యాదులు సప్తర్షులు, శతక్రతువు ఇంద్రుడు. రెండవది స్వారోచిష మన్వంతరము. పారావతులు, తుషితులు అనువారు దేవతలు. చైత్ర కింపురుషులు స్వారోచిషమనువు కుమారులు. విపశ్చిత్తు ఇంద్రుడు. ఊర్జస్వంతుడు మొదలగువారు సప్తర్షులు. మూడవ వాడు ఉత్తముడు. అజాదులు అతని పుత్రులు. ఆతని మన్వంతరమున సుశాంతి ఇంద్రుడు; సుధామాదులు దేవతలు; వసిష్ఠపుత్రులు సప్తర్షులు. నాల్గవ మనువు తామసుడు. ఆతనికి ఖ్యాతి మొదలగువారు తొమ్మండుగురు కుమారులు. ఆతని మన్వంతరమున స్వరూపాదులు దేవతలు. శిఖరి ఇంద్రుడు. జ్యోతిర్హోమాదులు సప్తర్షులు. ఖ్యాతి మొదలగు తొమ్మండుగురు సుతులు. ఐదవదగు రైవత మన్వంతరమున వితథుడు ఇంద్రుడు. అమితాభులు దేవతలు. హిరణ్య రోమాదులు సప్తర్షులు. బలబంధాదులు రైవతుని కుమారులు. ఆరవదైన చాక్షుషమన్వంతరమున మనోజవుడు ఇంద్రుడు. స్వాత్యాదులు దేవతలు. సుమేధన్‌ మొదలగువారు సప్తర్షులు. పురు మొదలగువారు చాక్షుషుని పుత్రులు. ఏడవ మన్వంతరమున సూర్యుపుత్రుడైన శ్రాద్ధదేవుడు మను వాయెను. ఈతని మన్వంతరమున ఆదిత్య-వసు-రుద్రాదులు దేవతలు. పురందరుడు ఇంద్రుడు. వసిష్ఠ-కాశ్యప-అత్రి-జమరగ్ని-గౌతమ-విశ్వామిత్ర-భరద్వాజులు సప్తర్షులు. ఇది ఇపుడు జరుగుతూన్న మన్వంతరము. వైవస్వతమనువునకు ఇక్ష్వాకు మొదలగువారు పుత్రులు. ఈ అన్ని మన్వంతరములందును శ్రీమహా విష్ణువు అంశావతారరూపమున అవతరించెను. స్వాయంభువమన్వంతరమునందు 'మానసుడు' అను పేరుతోను, పిదప మిగిలిన ఆరు మన్వంతరములందు, క్రమముగా - అజిత - సత్య - హరి - దేవవర - వైకుంఠ - వామన-రూపములతోను అవతరించెను. ఛాయాదేవీ గర్భసంజాతుడైన పుత్రుడు సావర్ణి ఏడవ మనువు కాగలడు. ఇతని వర్ణము (శరీరచ్చాయ) తన అన్నదైన శ్రాద్ధ దేవుని శరీరచ్ఛాయతో సమముగా నుండును. అందుచే 'సావర్ణి' అని పేరు. ఇతని కాలమున సుతపస్‌ మొదలగువారు దేవతలు గాన పరమతేజః శాలు లైన అశ్వత్థామాదులు సప్తర్షులు గాను, బలి ఇంద్రుడు గాను అగుదురు. విరజాదులు మను పుత్రులు. తొమ్మిదవ మనువు పేరు దక్షసావర్ణి. ఆతని మన్వంతరమున పారాదులు దేవతలుగాను, అధ్భుతుడు ఇంద్రుడుగాని, సవనుడు మొదలగు వారు సప్తర్షులు గాను అగుదురు. మను పుత్రుడు ధృతకేతువు. పదవ మనువు బ్రహ్మసావర్ణి. సుఖాదులు దేవగణములుగాను, శాంతి ఇంద్రుడు గాను, హవిష్యాదులు సప్తర్షులు గాని అగుదురు సుక్షేత్రాదులు మనుపుత్రులు.

ధర్మసావర్ణికశ్చాయం విహఙ్గాద్యా స్తదా సురాః | గణశ్చైన్ద్రో నిశ్చరాద్యా మునయః పుత్రకా మనోః. 16

సర్వత్రగాద్యా రుద్రాఖ్యః సావర్ణిర్భవితా మనుః | ఋతధామా సురేన్ద్రశ్చ హరితాద్యాశ్ఛ దేవతాః. 17

తపస్యాద్యాః సప్తర్షయః సుతా వై దేవవన్ముఖాః | మనుస్త్రయోదశో రౌచ్యః సుత్రామాణాదయః సు రాః 18

ఇన్ద్రోదివస్పతిస్తేషాం దానవాదివిమర్దనః | నిర్మోహాద్యాః సప్తర్షయశ్చిత్రసేనాదయః సుతాః 19

మనుశ్చతుర్దశో భౌత్యః శుచిరిన్ద్రో భవిష్యతి | చాక్షుషాద్యాః సురగణా అగ్నిబాహ్వాదయో ద్విజాః. 20

చతుర్దశస్య భౌత్యస్య పుత్రా ఊరుముఖా మనోః | ప్రవర్తయన్తి వేదాంశ్చ భువి సప్తర్షయో దివః. 21

దేవా యజ్ఞభుజస్తే తు భూః పుత్రైః పరిపాల్యతే | బ్రహ్మణో దివసే బ్రహ్మన్‌ మనవస్తు చతుర్ధశ. 22

మన్వాద్యాశ్చ హరిర్వేదం ద్వాపరాన్తే బిభేద సః |ఆద్యో మేదశ్చతుష్పాదః శతసహస్రంమితః 23

ఏకశ్చాసీద్యజు ర్వేదస్తం చతుర్ధా వ్యకల్పయత్‌ | ఆధ్వర్యవం యజుర్భిస్తు ఋర్భిర్హౌత్రం తథా మునిః. 24

ఔద్గాత్రం సామభిశ్చక్రే బ్రహ్మత్వం చాప్యథర్విభిః | ప్రథమం వ్యాసశిష్యస్తు పైలో హ్యృగ్వేదపారగః. 25

ఇన్ద్రప్రమితయే ప్రాదాద్బాష్కలాయ చ సంహితామ్‌ | బౌధ్యాదిభ్యో దదౌ సో7పి చతుర్దా నిజసంహితమ్‌.

యజుర్వేదతరోః శాఖాః సప్తవింశన్మహామతిః | వైశమ్పాయననామాసౌ వ్యాసశిష్యశ్బకార వై. 27

కాణ్వా వాజసనేయాద్యా యాజ్ఞవల్క్యాదిభిః స్మృతాః | సామవేదతరోః శాభా వ్యాసశిష్యం స జైమినిః. 28

సుమన్తుశ్చ సుకర్మా చ హ్యేకైకాం సంహితాం తతః |

గృహ్ణతే చ సుకర్మాఖ్యః సహస్రం సంహితా గురుః. 29

సుమన్తుశ్చాథర్వతరుం వ్యాసశిష్యో బిభేద తమ్‌ | శిష్యానధ్యాపయామాస పైప్పలాదాన్‌ సహస్రశః. 30

పురాణసంహితాం చక్రే సూతో వ్యాసప్రసాదతః.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే మన్వన్తరవేద విభాగో నామ పఞ్చాశదధిక శతతమో7ధ్యాయః

పిదపధర్మసావర్జి అను పదునొకొండవ మనువు అధికారమునందుండును. ఆ మన్వంతరమునందు విహంగాదులు దేవతలు, గణుడు ఇంద్రుడు; నిశ్చరాదులు సప్తర్షులు కాగలరు. సర్వత్రగాదులు, మనువుత్రులగుదురు. పండ్రెండవ మనువు రుద్రసావర్ణి. ఆ మన్వంతరమున ఋతధాముడు ఇంద్రుడు. హరితాదులు దేవతలు. తపస్యాదులు సప్తర్షులు అగుదురు. దేవవంతుడు మొదలు వారు మనుపుత్రు లగుదురు. పదమూడవ మనువు రౌచ్యుడు. ఆ సమయమున సుత్రామణ్యాదులు దేవతలుగను, దివస్పతి ఇంద్రుడుగను అగుదురు. ఈ ఇంద్రుడు దైత్యదానవాదులను మర్దించును. నిర్మోహాదులు సప్తర్షులుగ నుందురు. చిత్రరసేనాదుల మనుపుత్రులు. పదునాల్గవ మనువు భౌత్యుడు. ఆ సమయమున శుచి ఇంద్రుడుగను, చాక్షుషాదులు దేవతలుగను అగ్నిబాహ్వాదులు సప్తర్షులుగను ఉందురు. ఉరు మొదలగువారు మనుపుత్రులు. సప్తర్షులు భూమండలముపై వేద ప్రచారము చేయుచుందురు. దేవతాగణములలు భుజింతురు. మనుపుత్రులు ఈ భూమిని పాలింతురు. ఓ మునీ! ఒక్క బ్రహ్మదివసమున పదునాలుగురు మనువులు ఆవిర్భవింతురు. దేవతా ఇంద్రాదులు పదునాల్గుసార్లు పుట్టుదురు. ద్వాపరాంతమున శ్రీమహావిష్ణువువేదవ్యాస రూపమున అవతరించి, వేదవిభాగము చేయును. మొట్టమొదట వేదము ఒక్కటే. దానిలో నాలుగు చరణములు, ఒక లక్ష ఋక్కులు ఉన్నవి మొదట యజుర్వేద మొక్కటిగానే ఉండగావ్యాసుడు దానిని నాల్గుగా విభజించెను. అధ్వర్యువు యజుర్వేదము చేతను. హోత ఋగ్వేదము చేతను, ఉద్గాత సామమంత్రముల చేతను, బ్రహ్మ అథర్వవేదము చేతను. తమ తమ ఆర్త్విజ్యము నడుపువలె నని నిశ్చయించెను. వ్యాసుని ప్రథమ శిష్యుడైన పైలుడు ఋగ్వేదపారంగతుడు. ఇంద్రుడు ప్రమతికిని, బాష్కలుకును సంహితను ఇచ్చెను. బాష్కలుడు తన సంహితను నాల్గుగా విభజించ బౌద్ధాదులకు ఇచ్చెను. వ్యాసశిష్యుడును. బుద్ధిమంతుడును అగు వైశంపాయనుడు యజుర్వేద మను వృక్షమునకు ఇరువది ఏడుశాఖలు నిర్మించెను. యాజ్ఞవల్క్యాదులు కాణ్వ-వాజసనేయాది శాఖలను సంపాదించిరి. వ్యాసశిష్యుడైన జైమిని సామవేద మను పృక్షమునకు శాఖలు నిర్మించెను. సుమంతు-సుకర్మలు ఒక్కొక్క సంహిత రచించిరి. సుకర్మ తన గురువునుండి వెయ్యి సంహితలను గ్రహించెను.వ్యాస శిష్యుడైన సుమంతుడు అథర్వవేదమునకు ఒక శాక ఏర్పరచి పైప్పలుడు మొదలగు వేలకొలది శిష్యులకు నేర్పెను. వ్యాసుని అనుగ్రహముచే సూతుడు పురాణసంహితా విస్తారము చేసెను.

అగ్నిమహాపురాణమునందు మన్వంతరవర్ణనమును నూట ఏబదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters