Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చత్వారింశదధిక శతతమోధ్యాయః.

అథ వశ్యాదియోగాః.

ఈశ్వర ఉవాచ :

వశ్యాదియోగాన్వక్ష్యామి లిఖేద్ద్వ్యష్టపదే త్విమాన్‌ | భృంగరాజః సహదేవీ మయూరస్య శిఖా తథా. 1

పత్రం జీవకృతం జాతీ హ్యధఃపుష్పా రుదన్తికా | కుమారీ రుద్రజటా స్యాద్విష్ణుక్రాన్తా సితోర్కకః. 2

లజ్జాలుకా మోహలతా కృష్ణధుస్తూరసంజ్ఞితా | గోరక్షః కర్కటీ చైవ మేషశృంగీ స్నుహీ తథా. 3

బుత్విజౌ వహ్నయో నాగాః పక్షే మునిమనూ శివః | వసవో దిగ్గ్రసా వేదా గ్రహర్తురవించన్ద్రమాః. 4

తిథయశ్చ క్రమాద్భాగా ఓషధీనాం ప్రదక్షిణమ్‌ | ప్రథమేన చతుష్కేన ధూపశ్చోద్వర్తనం పరమ్‌. 5

తృతీయేనాఞ్జనం కుర్యాత్స్నానం కుర్యాచ్చతుష్కతః |

భృంగరాజానులోమాచ్చ చతుర్ధా లేపనం స్మృతమ్‌. 6

మునయో దక్షిణ పార్శ్వే యుగాశ్చార్యోత్తరాః స్మృతాః |

భుజగాః పాదసంఖ్యాశ్చ హీశ్వరా మూర్ధ్ని సంస్థితాః. 7

మధ్యేన సార్కశశిభిర్ధూపః స్యాత్సర్వ కార్యకే | ఏతైర్విలిప్తదేహస్తు త్రిదశైరపి పూజ్యతే. 8

ధూపస్తు షోడశాద్యస్తు గృహాద్యుద్వర్తనే స్మృతః |యుగాద్యాశ్చాఞ్జనే ప్రోక్తా బాణాద్యాః స్నానకర్మణి. 9

రుద్రాద్యా భక్షణ ప్రోక్తా పఃక్షాద్యాః పానకే స్మృతాః | బుత్విగ్వేదర్తునయనైస్తిలకం లోకమోహనమ్‌. 10

సూర్యత్రిదశపక్షైశ్చ శైలైః స్త్రీలేపతో వశా | చన్ద్రేన్ద్రఫణిరుద్రైశ్చ యోనిలేపాద్వశాః స్త్రియాః. 11

తిథిదిగ్యుగబాణౖశ్చ గుటికా తు వశంకరీ | భ##క్ష్యే భోజ్యే తథా పానే దాతవ్యా గుటికా వశీ. 12

ఋత్విగ్గ్రహాక్షిశైలైశ్చ శస్త్రస్తమ్భేముఖే ధృతా | శైలేన్ద్రవేదరన్ద్రైశ్చ హ్యంగలేపాజ్జలే వసేత్‌. 13

బాణాక్షిమనురుద్రైశ్చ గుటికా క్షుత్తృషాదినుత్‌ | త్రిషోడశ దిశాబాణౖర్లేపాత్‌ స్త్రీ దుర్భగా శుభా. 14

త్రిదశాక్షి దివానేత్రైర్లేపాత్క్రీ డేచ్చ పన్నగైః | త్రిదశాక్షేశ భుజగైర్లేపాత్‌ స్త్రీ సూయతే సుతమ్‌. 15

సప్తదిఙ్ముని రన్ధ్రైశ్చ ద్యూతజిద్వస్త్రలేపతః | త్రిదశాక్షాబ్ధిమునిభిర్ధ్వజలేపాద్రతౌ సుతః. 16

గ్రహాబ్ధిసర్పత్రిదశైర్గుటికా స్యాద్వశంకరీ | ఋత్విక్పదస్థితౌషధ్యాః ప్రభావః ప్రతిపాదితః. 17

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యుద్ధజయార్ణవే షోడశపదకం నామ చత్వారింశదధిక శతతమోధ్యాయః.

పరమేశ్వరుడు చెప్పెను ; ఇపుడు వశీకరణాదియోగములను చెప్పెదను. భృంగరాజము (16) సహాదేవి (3) మయూరశిఖ(8), పుత్రజీవక వృక్షము బెరడు(2), అధఃపుష్ప రుద్రదంతిక (4), కుమారి(11) రుద్రజట(8), విష్ణుక్రాంత(10), శ్వేతార్కము(5), లజ్జాలుక(4), మోహలత(9), కృష్ణధత్తూరము(6), గోరక్షకర్కటి (12), మేషశృంగి(1) స్నుహి (15) అను ఓషధుల పేర్లను పదునారు కోష్ఠములు గల చక్రమునందు వ్రాయవలెను. ఓషధుల భాగములు ప్రదక్షిణ క్రమమున 16, 11, 8, 10, 5,4, 9, 6, 12, 1, 15, అను సంఖ్యలలో నిర్దేశింపబడును. మొదటి నాలుగు ఓషధులును చూర్ణము చేసిదాని ధూపమును ఉపయోగించవలెను. లేదా వీటిని నీటితో మర్దించి ముద్ధ చేసి, శరీరావయములకు పట్టించుకొనవలెను. 9, 10, 11, 12, సంఖ్యల ఓషధులతో అంజనము తయారుచేసి నేత్రములందు ధరింపవలెను. చివరి నాలుగు ఓషధులు కలిపిన జలముతో స్నానము చేయవలెను. 5, 6,7,8, సంఖ్యల ఓషధుల మర్దించి అనులేపనము ఉపయోగించవలెను. అధఃపుష్పను. దక్షిణపార్శ్వములందును, లాజవంతి మొదలైనవాటిని వామపార్శ్వమునందును ధరించవలెను. మయూరశిఖను పాదములందును ఘృతకుమారిని శిరస్సుపైనను ధరించవలెను. రుద్రజట, గోరక్షకర్కటి, మేషశృంగుల ధూపమును అన్ని కార్యము లందును ఉనపయోగించవలెను. వీటిని మర్దించి, ముద్ద చేసి శరీరముపై అలముకొన్నవానిని దేవతలు కూడ గౌరవింతురు. భృంగరాజాద్యోషధులు నాలుగును ధూపమునకు ఉపయోగించును. వాటిని మర్దించి శరీరమునకు పూసికొనినచో గ్రహాదిజనిత బాధ తొలగును. లజ్జాలుకాద్యోషధులు అంజనమునకును, శ్వేతార్కాదులు స్నానమునకును ఉపయోగించును, ఘృత కుమార్యాదులు తినుటకును, పుత్రజీపకాదులు నీటితో కలిపి త్రాగుటకును ఉపయోగించును. 16, 4, 6,, 2, సంఖ్యల ఓషధులతో తయారు చేసిన తిలకము సకలలోకమోహనము. గోరక్షకర్కటి కృష్ణధత్తూరము, పుత్రజీవకము, అధఃపుష్ప అను ఓషధులను తన శరీరముపై పూనుకొనుటచే స్త్రీవశ మగును. మేషశృంగి, రుద్రదంతిక, మయూరశిఖ కుమారి అను ఓషధులను యోనియందు లేపము చేయుటచే స్త్రీవశమగును. స్నుహి, అపరాజితా, లాజవంతీ, శ్వేతార్కములతో తయారు చేసిన గుటికలు జనులను వశము చెయును. ఎవనిని వశము చేసికొనవలెనో వాని భక్ష్య-భోజ్య-పేయ పదార్థములలో ఈ గుళికలను కలిపి ఇవవ్వలెను. భృంగరాజ- మోహలతా-పుత్రజీవక-అధఃపుష్పాఓషధులను నోటిలో ధరించుటచే శత్రువు లుపయోగించు అస్త్రశస్త్రములు స్తంభితములగును. అధఃపుష్పా-రుద్రదంతీ-లాజవన్తీ-మోహలతలను శరీరముపై పూసుకున్న వాడు నీటిలో నివసించగలడు. శ్వేతార్క-పుత్రజీవక-రుద్రదంతీ-కుమారీ ఓషధులతో తయారు చేసిన వటి ఆకలిదప్పులు మొదలగు వాటిని తొలగించును, సహదేవీ-భృంగరాజ-అపరాజితా-శ్వేతార్క ఓషధుల లేపముచే దుర్బగ యగు స్త్రీ సుభగయగును. కృష్ణధత్తూర-పుత్రజీవక-విష్ణుక్రాంతా -సహదేవీ-ఓషధులను తన శరీరమునందు పూసుకొన్నవాడు సర్పములతో ఆడుకొనవచ్చును. కృష్ణధత్తూర-పుత్రజీవక-ఘృతకుమారీ-మయూరశిఖా ఓషధులలేపమును పూసుకొనుటచే స్త్రీ సుఖముగా ప్రసవించును. అధఃపుష్పా-అపరాజితా-అధఃపుష్పా-మోహలతా ఓషధులను వస్త్రమునకు లేపము చేసినవాడు ద్యూతమునందు విజయము పొందును. కృష్ణధత్తూర-పుత్రజీవక-అధఃపుష్పా-రుద్రదంతికా ఓషధులను పూసుకొని రతి చేయగా కుమారుడు పుట్టును. మోహలతా-అధఃపుష్పా-గోరక్షకర్కటీ-కృష్ణధత్తూర ఓషధులతో తయారుచేసిన వటి సర్వవశంకరము. ఈ విధముగా పదునారు పదములలో ఉన్న ఓషధుల ప్రభావము వర్ణించబడినది.

అగ్ని మహాపురాణమునందు వశ్యాదియోగవర్ణన మను నూటనలుబదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters