Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ అష్టత్రింశదుత్తర శతతమోధ్యాయః.

అథ షట్కర్మాణి.

ఈశ్వర ఉవాచ :

షట్కర్మాణి ప్రవక్ష్యామి సర్వమన్త్రేషు తచ్ఛృణు | ఆదౌ సాధ్యం లిఖేత్పూర్వం చాన్తే మన్త్రసమన్వితమ్‌. 1

పల్లవః స తు విజ్ఞేయో మహోచ్చాటకరః పరః | ఆదౌ మన్త్రస్తతః సాధ్యో మధ్యే సాధ్యః పునర్మనుః. 2

యోగాఖ్యః సంప్రదాయోయం కులోత్పాదేషు యోజయేత్‌ |

ఆదౌ మన్త్రపదం దద్యాన్మధ్యే సాధ్యం నియోజయేత్‌. 3

పురశ్చాన్తే లిఖేన్మన్త్రం సాధ్యం మన్త్రపదం పునః | రోధకః సంప్రదాయస్తు స్తమ్భనాదిఘ యోజయేత్‌. 4

అధోర్ధం యామ్యవామే తు మధ్యే సాధ్యంతు యోజయేత్‌ |

నమ్పుటః స తు విజ్ఞేయో వశ్యకార్యేషు యోజయేత్‌. 5

మన్త్రాక్షరం యథాసాధ్యం ప్రధితం చాక్షరాక్షరమ్‌ | ప్రథమః సంప్రదాయః స్యాదాకృష్టివశకారకః.6

మన్త్రాక్షరద్వయం లిఖ్య ఏకం సాధ్యాక్షరం పునః | విదర్భః స తు విజ్ఞేయో వశ్యకార్యేషు యోజయేత్‌. 7

ఆకర్షణాది యత్కర్మ వసన్తే చైవ కారయేత్‌ | తాపజ్వరే తథా వశ్యే స్వాహా చాకర్షణ శుభమ్‌. 8

నమస్కారపదం చైవ శాన్తివృద్ధౌ ప్రయెజయేత్‌ | పౌష్టి కేషు వషట్కారమాకర్షే వశ్యకర్మణి. 9

విద్వేషోచ్చాటనే మృత్యౌ ఫట్‌ స్యాత్ఖణ్డీకృతా శుభే | లాభాదౌ మన్త్రదీక్షాదౌ వషట్కారస్తు సిద్ధిదః. 10

యమోసి యమరాజోసి కాలరూపోసి ధర్మరాట్‌ | మయా దత్తమిమం శత్రుమచిరేణ నిపాతయ. 11

నిపాతయామి యత్నేన నిర్వృతో భవ సాధక | సంహృష్టమనసా బ్రూయాద్ధేశికోరి ప్రసూదనః. 12

పక్షే శుక్లే యమం ప్రార్చ్య హోమాదేతత్ర్పసిద్ధ్యతి |

ఆత్మానం భైరవం ధ్యాత్వా తతో మధ్యే కులేశ్వరమ్‌. 13

రాత్రౌ వార్తాం విజానాతి ఆత్మనశ్చ పరస్య చ | దుర్గే దుర్గే రక్షణీతి దుర్గాం ప్రార్చ్యారిహా భ##వేత్‌. 14

జప్త్వా హసక్షమలవరయూం భైరవీం ఘాతయేదరిమ్‌.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే యుద్ధజయార్ణవే షట్కర్మనిరూపణం

నామఅష్టత్రింశదధిక శతతమోధ్యాయః.

పరమేశ్వరుడు చెప్పెను : అన్ని మంత్రముల సాధ్యరూపములకు ఆరు కర్మలను గూర్చి చెప్పెదను వినుము. శాంతి, వశ్యము, స్తంభనము, ద్వేషము, ఉచ్చాటనము, మారణము అని ఆరు కర్మలు. ఈ కర్మ లన్నింటియందును ఆరు సంప్రదాయములు లేదా విన్యాసము లుండును. అవి - పల్లవ-యోగ- రోధక-సంపుట -గ్రథన-విదర్భములు. ఎవని ఉచ్చాటనము చేయవలెనో వాని పేరు భూర్జ పత్రాదులపై వ్రాయవలెను. పిదప ఉచ్చాటన మంత్రము వ్రాయవలెను. ఈ విధముగ వ్రాయు సంప్రదాయమునకు పల్లవ మని పేరు. ఇది ఉచ్చకోటికి చెందిన ఉచ్చాటనము చేయు ప్రయోగము. మొదట మంత్రము వ్రాసి పిదప సాధ్యవ్యక్తి పేరు వ్రాయవలెను. చివర మరల మంత్రము వ్రాయవలెను. దీనికి 'యోగ' సంప్రదాయ మని పేరు. శత్రువు కులము నంతను సంహరిచుటకై ఈ ప్రయోగము చేయవలెను. మొదట మంత్రము వ్రాసి, మద్యసాధ్యనామము వ్రాసి, అంతమునందు మరల మంత్రము వ్రాసి, మరల సాధ్యనామమును వ్రాసి, మరల మంత్రము వ్రాయవలెను. ఇది రోధక సంప్రదాయము. దీని ప్రయోగము స్తంభనాదులందు చేయవలెను. మంత్రమునకు పైన, క్రింద, కుడి-ఎడమ ప్రక్కల, మధ్య సాధ్యనామము వ్రాయగా ఇది 'సంపుటము'. దీనిని వశ్యాకర్షణ కర్మమున ప్రయోగించవలెను. మంత్రాక్షరము ఒకటి వ్రాసి, పిదప సాధ్యనామాక్షరము వ్రాసి, మరల రెండవ మంత్రాక్షరము వ్రాసి, పిదప నామాక్షరము రెండవది వ్రాసి- ఈ విధముగా మంత్రాక్షరములు, నామాక్షరము ఒకదాని తరువాత ఒకటి వ్రాసినచో దీనికి గ్రథన సంప్రదాయ మని పేరు. దీనిని ఆకర్షణ-వశీకరణములందు చేయవలెను. మొదట మంత్రాక్షరములు రెండు వ్రాసి, సాధ్యనామాక్షరము ఒకటి వ్రాయవలెను. ఈ విధముగ వ్రాయుచు పూర్తి చేయగా విదర్భ మని పేరు. దీనిని వశీకరణ ఆకర్షణములకు ఉపయోగింతురు. ఆకర్షణాది మంత్రానుష్ఠానము వసంతమునందు చేయవలెను. తాపజ్వరనివారణ-వశీకరణ-ఆకర్షణకర్మలందు 'స్వాహా' ప్రయోగము శుభకరము. శాంతి- వృద్ధికర్మలందు 'నమః' ప్రయోగము చేయవలెను. పౌష్టికకర్మ-వశీకరణములందు 'వషట్‌' ను ప్రయోగించవలెను. లాభాదులందును. మంత్రదీక్షాదులందును వషట్కారమే సిద్ధిదాయకము. మంత్రదీక్ష నిచ్చు ఆచార్యుని యమునిగా భావించి--''ప్రభో ! నీవు యముడవు యమధర్మరాజువు. కాలరూపుడవు. ధర్మరాజువు. నేను సమర్పించు ఈ శత్రువును శీఘ్రముగా సంహరింపుము' అని ప్రార్థించవలెను. అపుడు శత్రుసంహారకు డగు ఆచార్యుడు ప్రసన్నచిత్తముతో ఈ విధముగ ప్రత్యుత్తరము ఇవ్వవలెను---''సాధకా! నీవు సఫలుడ వగుదువు గాక. నేను ప్రయత్నపూర్వకముగ శత్రువును చంపెదను'' శ్వేత కమలముపై యమధర్మరాజును పూజించి, హోమము చేయుటచే ఈ ప్రయోగము సఫల మగును. తనను భైరవునిగా భావించుచు తనలో కులేశ్వరి కూడ ఉన్నట్లు భావన చేయవలెన. ఇట్లు చేయుటచే సాధకునకు రాత్రియందు తన వృత్తాన్తము, శత్రువునకు సంబంధించిన వృత్తాంతము తెలియును. ''దుర్గే దుర్గే రక్షిణి'' అను మంత్రముతో దుర్గాపూజ చేయుటచే సాధకుడు శత్రునాశనసమర్థు డగును. ''హ స క్ష మ ల వ ర యు మ్‌ '' అను భైరవీ మంత్రమును జపించుటచే సాధకుడు శత్రుసంహారము చేయగల్గును.

అగ్నిమహాపురాణమునందు యద్ధజయార్ణవమున షట్కర్మనిరూపణ

మను నూటముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters