Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ద్వాత్రింశదుత్తర శతతమో7ధ్యాయః

అథ సేవాచక్రమ్‌.

ఈశ్వర ఉవాచ:

సేవాచక్రం ప్రవక్ష్యామి లాభాలాభార్థసూచకమ్‌ | పితా మతా తథా భ్రాతా దమ్పతీ చ విశేషతః. 1

తస్మింశ్చక్రేతు విజ్ఞేయం యో యస్మాల్లభ##తే ఫలమ్‌ |

షడూర్ధ్వాః స్థాపయేద్రేఖా భిన్నాశ్చాష్టౌ తు తర్యగ్గాః. 2

కోష్ఠకాః పఞ్చవింశచ్చతేషు వర్ణాన్‌ సమాలిఖేత్‌ | స్వరాన్‌ పఞ్చ సముద్ధృత్య స్పర్శాన్‌ పశ్చాత్సమాలిఖేత్‌.

కకారాదిహకారాన్తాన్హీనాఙ్గాంస్త్రీన్వివర్జయేత్‌ | సిద్ధః సాధ్యః సుసిద్ధశ్చ హ్యరిర్మృతుశ్చ నామతః. 4

అలిర్మృత్యుశ్చ ద్వావేతౌ వర్జయేత్సర్వకర్మసు | ఏషాం మధ్యే యదా నామ లక్షయేత్తు ప్రయత్నతః. 5

ఆత్మపక్షేస్థితాః సత్త్వాః సర్వే శుభదాయకాః | ద్వితీయః పోషకశ్చైవ తృతీయశ్చార్థదాయకః. 6

ఆత్మనాశశ్చతుర్థస్తు పఞ్చమో మృత్యుదాయకః | స్థానమేవార్థలాభాయ మిత్రభృత్యాదిబాన్దవాః. 7

సిద్దః సాధ్యః సుసిద్ధశ్చ సర్వే తే ఫలదాయకాః | అరిర్మృత్యుశ్చ ద్వావేతౌ వర్జయేత్సర్వకర్మసు. 8

అకారాన్తం యథా ప్రోక్తం అ ఇ ఉ ఏ ఓ విదుస్తథా | పునశ్చైవాంశకాన్వక్షే వర్గాష్టక సంస్మృతాన్‌. 9

దేవా అకారవర్గే చ దైత్యాః కవర్గమాశ్రితాః | నాగాశ్చైవ చవర్గాః స్యుర్గన్ధర్వాశ్చటవర్గజాః 10

తవర్గే ఋషయః ప్రోక్తాః రాక్షసాః స్మృతాః | పిశాచాశ్చ యవర్గే చ శవర్గే మానుషాః స్మృతాః 11

దేవేభ్యో బలినో దైత్యా దైత్యేభ్యః పన్నగాస్తథా | పన్నగేభ్యశ్చ గన్దర్వా గన్దర్వాదృషయో వరాః 12

ఋషిభ్యోరాక్షసాః శూరా రాక్షసేభ్యః పిశాచకాః | పిశాచేభ్యో మానుషాః స్యుర్దుర్బలం వర్జయేద్బలీ. 13

పరమేశ్వరుడు పలికెను: ఇపుడు సేవాచక్రమును గూర్చి చెప్పెదను. దీనివలన సేవకునకు సేవ్యుని వలన కలుగు లాభనష్టములు తెలియును. తండ్రి, తల్లి, సోదరులు, స్త్రీపురషులు-వీరి విషయమున దీనిని బాగుగా పరిశీలించవలెను. ఎవ్వడైనను పైన చెప్పిన వారినుండి లాభము పొందగల్గునా లేదా అను విషయమును సేవాచక్రము ద్వారా తెలిసికొనవచ్చును. తూర్పు నుండి పడమటకు ఆరు రేఖలను ఉత్తరమునుండి దక్షిణమునకు ఆరు అడ్డురేఖలను గీయవలెను. ఇట్లు గీయగా ముప్పది యైదు గళ్ళ సేదాచక్రము ఏర్పడును. దానిపై కోష్ఠములందు ఐదు స్వరములను వ్రాసి పిదప స్పర్శవర్జములను వ్రాయవలెను. వీటిలో జ, ఞ,ణ లను విడచివేయవలెను. క్రింది కోష్ఠములలో ( క నుండి హ వరకు) వరుసగ సిద్ధ, సాధ్య, సుసిద్ధ, శత్రు, మృత్యువులు వ్రాయవలెను. ఈ విధముగ వ్రాయగా సేవాచక్రము సర్వాంగసంపన్న మగును. ఈ చక్రము నందలి 'శత్రు' 'మృత్యు' అను కోష్ఠములలో నున్న స్వర-వ్యంజనములను అన్ని కార్యములందు పరిత్యజించవలెను. కాని సిద్ద-సాధ్య-సుసిద్ద-శత్రు-మృత్యు-అను కోష్ఠములందు ఏదైన ఒక కోష్ఠమునందు సేవ్య - సేవకుల నామముల ప్రథమాక్షరములు వచ్చినచో అది సర్వథా శుభము. దీనిలో ద్వితీయకోష్ఠము పోషకము; తృతీయము ధనదాయకము, నాల్గవది ఆత్మనాశకము; ఐదవది మృత్యుప్రదము. మిత్ర-భృత్య బాంధవాదుల విషయమున పరిశీలించు నపుడు (వారి పేర్లున్న) స్థానములు సిద్ధ-సాధ్య-సుసిద్ధము లైనచో ఉత్తమఫలదాయకములు. అన్ని కర్మలందును అరి-మృత్యువులను విడవలెను. అ ఇ ఉ ఏ ఓ లను అకారాంతమును వలె భావింతురు. ఇపుడు వర్గాష్టకసంస్కృతము లగు అంశకములను గూర్చి చెప్పెదను. అవర్గమునకు (అ ఇ ఉ ఏ ఓ) అధిపతులు దేవతలు. కవర్గుకు దైత్యులు, చవర్గుకు పన్నగులు, ఉవర్గుకు గంధర్వులు, తవర్గుకు ఋషులు, పవర్గుకు రాక్షసులు, యవర్గుకు (య ర ల వ) పిశాచములు, శవర్గుకు (శ ష స హ) మనుష్యులు అధిపతులు. వీరిలో దేవతలకంటె దైత్యులు వారికంటె పన్నగులు, వారికంటె గంధర్వులు, వారికంటె రాక్షసులు, వారికంటె పిశాచములు పిశాచములకంటె మనుష్యలు అధికబలవంతులు. బలవంతుడు దుర్బలుని విడువవలెను. సేవ్యసేవకుల నామాద్యక్షరములు ఒకే వర్గమునకు చెందినచో ఉత్తమము.

పునర్మిత్రవిభాగం తు తారాచక్రం క్రమాచ్ఛృణు | నామాద్యక్షరమృక్షం తు స్ఫుటంకృత్వాతు పూర్వతః

ఋక్షే తు సంస్థితాస్తారా నవత్రికా యథాక్రమాత్‌ | జన్మసంపద్విపత్‌క్షేమం నామార్‌క్షాత్తారకా ఇమాః 15

ప్రత్యరిర్ధనదా షష్ఠీ నైధనామైత్రకే పరే | పరమైత్రాన్తి మా తారా జన్మ తారా

త్వశోభనా. 16

సంపత్తారా మహాశ్రేష్ఠా విపత్తారా తు నిష్ఫలా | క్షేమతారా సర్వకార్యే ప్రత్యరిర్హ్యర్థనాశినీ. 17

ధనదా రాజ్యాలాభాది నైధనా కార్యనాశినీ | మైత్రతారా చ మిత్రాయ పరమిత్రా హితావహా. 18

మాత్రా వై స్వరసంజ్ఞా స్యాన్నామమధ్యే క్షి పేత్ప్రియే |

వింశత్యా చ హరేద్భాగం యచ్ఛేషం తత్ఫలం భ##వేత్‌.

వింశత్యా చ హరేద్భాగం యచ్ఛేషం తత్ఫలం భ##వేత్‌. 19

ఉభయోర్నామమధ్యేతు లక్షయేచ్చ ధనం హ్యృణమ్‌|

హీనమాత్రాహ్యృణం జ్ఞేయం ధనం మాత్రాధికం పునః 20

ధనేన మిత్రతా నౄణామృణనైవ హ్యుదాసతా | సేవా చక్రమిదం ప్రోక్తం లాభాలాభాదిదర్శకమ్‌. 21

మేషమిథునమోః ప్రీతిర్మైత్రే మిథునసింహాయోః | తులాసింహౌ మహామైత్రీ చైవం దనుర్ఘటే పునః. 22

అ (48)

మిత్రసేవాం న కుర్వీత మిత్రౌ మీనవృషౌ మతౌ | వృషకర్కటయోర్మైత్రీ కుళీరఘటయోస్తథా. 23

కన్యావృశ్చిక యోరేవం తథా మకరకీటయోః | మీన మకరయోర్మైత్రీ తృతీయైకాదశే స్థితా. 24

తులావృషౌ మహామైత్రీ విద్విష్టౌ వృషవృశ్చికౌ | మిథునధనుషోః ప్రీతిః కర్కటకమకరయోస్తథా. 25

మృగకుమ్భకయోః ప్రీతిః కన్యామినౌ తథై వ చ.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యుద్ధజయార్ణవే సేవాచక్రం నామ ద్వాత్రింశదధిక శతతమో7ద్యాయః

మైత్రీ విభాగమునకు సంబంధించిన తారాచక్రమును గూర్చి వినుము. మొదట నామప్రథమాక్షరమును బట్టి నక్షత్రము తెలసికొని తొమ్మిది తారలను మూడు పర్యాయములు ఆవృత్తిచేయగా ఇరువదియేడు నక్షత్రముల తారలు తెలియును. ఈ విధముగ తన నామనక్షత్రమునకు సంబంధించిన తారను తెలుసుకొనవలెను. జన్మ-సంపత్‌-విపత్‌ క్షేమ-ప్రత్యరి-సాధన-వధ-మైత్ర-అతిమైత్రము లని తొమ్మిది తారలు, వీటిలో జన్మతార అశుభము సంపత్తార అత్యుత్తమము. విపత్తార నిష్ఫలము. క్షేమతార అన్ని కార్యములందును గ్రాహ్యము. ప్రత్యరితారచే ధననాశము కలుగును. సాధకతారచే రాజ్యలాభము కలుగును. వధతార కార్యవినాశనము. మైత్రతార మైత్రీకారకము. అతి మైత్రము హితకారము.

ప్రియురాలా! నామాక్షరమునందలి స్వరముల సంఖ్యను కూడి ఇరువదిచే భాగించి, శేషముచే ఫలముచేయవలెను. (అనగా స్వల్పశేషము కలవాడు అధికశేషము కలవానినుండి లాభము పొందును.) సేవ్యసేవకుల నామాక్షరములలో ఎవనికి అధికస్వరములుండునో అతడు ధని; అల్పస్వరములు కలవాడు ఋణి. ధనస్వరములు మైత్రికిని, ఋణస్వరములు దాసత్వ మునకు మంచివి. ఈ విధముగ లాభనష్టముల జ్ఞానమునకై సేవాచక్రము చెప్పబడినది. మేష - మిథున-రాశులవారి మధ్య ప్రీతి, మిథున-సింహములవారి మధ్య మైత్రి తుల-సింహరాశులవారిమధ్య మహామైత్రి ఉండును. కాని ధనుః కుంభరాశులవారి మధ్య మైత్రి ఉండదు. అందుచే వీరు పరస్పరసేవ చేయరాదు. మీన - వృషభ; వృషభ-కర్కట; కర్కట-కుంభ; మకర-వృశ్చిక; మీన మకరముల వారి మధ్య మైత్రియు, మిథున-కుంభ; తులా-మేషముల వారి మధ్య మహామైత్రి ఉండును. వృషభ-వృశ్చికములవారి మధ్య పరస్పరము వైరముండును,మిధున-ధనస్‌; కర్కట-మకర, మకర-కుంభ, కన్యా-మీన రాశులవారి మధ్య ప్రీతి ఉండును.

అగ్నిహాపురాణమునందు యుద్ధజయార్ణవమున సేవచక్ర మను నూటముప్పదిరెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters