Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రయోదశో7ధ్యాయః

అథ భారతాఖ్యానమ్‌.

అగ్ని రువాచ :-

భారతం సంప్రవక్ష్యామి కృష్ణమాహాత్మ్యలక్షణమ్‌ | భూభారమహరద్విష్ణుర్ని మిత్తీకృత్య పాణ్డవాన్‌. 1

అగ్ని పలికెను.

కృష్ణుని మహాత్మ్యమునకు లక్షణమైన భారతము చెప్పెదను. విష్ణువు పాండవులను నిమిత్తముగా చేసికొని భూ భారమును హరించెను.

విష్ణనాభ్యబ్జజో బ్రహ్మా బ్రహ్మపుత్రో7త్రిరత్రితః | సోమః సోమాద్బుధస్తస్మాదైల ఆసీత్పురూరవాః 2

తస్మాదాయుస్తతో రాజా నహూషో7తో యయాతికః |

తతః పూరస్తస్య వంశే భరతో7థ నృపః కురుః 3

తద్వంశే శన్తను స్తస్మాద్భీష్మో గఙ్గసుతో7నుజౌ | చిత్రాఙ్గదో విచ్త్రశ్చ సత్యవత్యాం చ శన్తనోః 4

విష్ణువు నాభికమలమునుండి బ్రహ్మ పుట్టెను. అతని పుత్రుడు అత్రి. అత్రికి చంద్రుడు, అతనికి బుధుడు, అతనికి ఐలుడు, అతనికి పురూరవుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు, ఆతనికి. యయాతి, ఆతనికి పూరువు, పుట్టెను. అతని వంశమునందు భరతుడు, పిమ్మట కురువును పుట్టెను. అతని వంశమునందు శంతనువు జన్మించెను. అతనికి గంగాపుత్రుడైన భీష్ముడు జనించెను. శంతనువునకు సత్యవతియందు, భీష్ముని తమ్ములుగా చిత్రాంగద- విచిత్రలు పుట్టిరి.

స్వర్గ గతే శన్తనౌ చ భీష్మో భార్యవివర్జితః | అపాలయధ్భ్రతృరాజ్యం బాలశ్చిత్రాఙ్గదో హతః 5

చిత్రాఙ్గదేనం ద్వే కన్యే కాశిరాజస్య చామ్బికా | అమ్బాలికా చ భీష్మణ ఆనీతే విజితారిణా. 6

భార్యే విచిత్రవీర్యస్య యక్ష్మణా స దివం గతః

శంతనువు స్వర్గస్థుడైన పిమ్మట భీష్ముడు బ్రహ్మచారిగనే ఉండి సోదరల రాజ్యము పాలించెను. చిన్నవాడైన చిత్రాంగుదుని, చిత్రాంగదుడనెడు గంధర్వుడు సంహరించెను. భీష్ముడు శత్రువులను జయించి కాశిరాజు కుమార్తెలైన అంబికాంబాలికలను తీసికొనివచ్చి విచిత్రవీర్యుని భార్యలనుగా చేసెను. విచిత్రవీర్యుడు రాజయక్ష్మచే స్వర్గస్థుడయ్యెను.

సత్యవత్యా హ్యనుమతా దమ్బికాయాం నృపో7భవత్‌ |

ధృతరాష్ట్రోమ్బాలికాయం పాణ్డుశ్చ వ్యాసతః సుతః 7

గాన్ధార్యాం ధృతరాష్ట్రాచ్చ దుర్యోధనముఖం శతమ్‌ | శతశృఙ్గాశ్రమపదే భార్యా యోగాదథో మృతః 8

ఋషిశాపాత్తతో ధర్మాత్కున్త్యాం పాణ్డోర్యుధిష్ఠిర ః | వాతాద్భీమో7ర్జునః శక్రాన్మాద్ర్యామశ్వికుమారతః 9

నకులః సహదేవశ్చ పాణ్డుర్మాద్రీయుతో మృతః |

కర్ణః కున్త్యాం హి కన్యాయాం జాతో దుర్యోధనాశ్రితః 10

సత్యవతి అనుమతిచో వ్యాసునివలన అంబికయందు రాజైన ధృతరాష్ట్రుడును అంబాలికయందు పాండురాజును జనించిరి. ధృతరాష్ట్రుని వలన గాంధారియందు దుర్యోధనుడు మొదలగు నూర్గురు కుమారులు జనించిరి. పాండురాజు భార్యయైన కుంతియందు యమధర్మ రాజువలన యుధిష్ఠిరుడును. వాయుదేవునివలన భీముడును. దేవేంద్రునివలన అర్జునుడును జనించెను. అశ్వినీ దేవతల వలన మాద్రియందు నకులసహదేవులు పుట్టిరి. శతశృంగాశ్రమమునందు ఋషి శాపము పొందిన పాండురాజు, మాద్రీసంగము చేయుటవలన మరణించెను. మాద్రి అతనిని అనుగమించెను. కుంతి అవివాహితయై ఉండగా జనించిన కర్ణుడు దుర్యోధనుని ఆశ్రయించెను.

కురుపాణ్డవయోర్యుద్ధం దైవయోగాద్బభూవ హ. 11

దుర్యోధనో జతుగృహే పాణ్డవానదహత్కుధీః | దగ్ధాగారా ద్వినిష్క్రాన్తా మాతృషష్ఠాస్తు పాణ్డవాః. 12

దైవవశముచే కురుపాండవుల మధ్య వైరము ఏర్పడెను. దుష్టబుద్ధియైన దుర్యోధనుడు లక్క ఇంటిలో పాండవులను కాల్చెను. కాని తల్లితో కూడిన పంచపాండవులును కాలిపోయిన ఇంటినుండి తప్పించుకొని వెళ్ళిపోయిరి.

తతస్త ఏకచక్రాయాం బ్రాహ్మణస్య నివేశ##నే | మునివేషాః స్థితాః సర్వే నిహత్య బక రాక్షసమ్‌. 13

పిమ్మట ఆ పాండవులు ఏకచక్రనగరమునందు మునివేషధారులై ఒక బ్రాహ్మణుని ఇంట నివసించిరి. అచట వారు బకరాక్షసుని చంపిరి.

యయుః పాఞ్చొలవిషయం ద్రౌపద్యాస్తే స్వయంవరే | సంప్రాప్తా బహువేషేణ ద్రౌపదీ పఞ్జపాణ్డవైః 14

వారు ద్రౌపదీస్వయంవరనిమిత్తమై పాంచాలదేశమునకు వెళ్లిరి. అచట వివిధాలంకారభూషిత యైన ద్రౌపదిని పాండవు లైదుగురును భార్యగా పొందిరి.

అర్ధరాజ్యం తతః ప్రాప్తా జ్ఞాతా దుర్యోధనాదిభిః | గాణ్డీవం చ ధనుర్దివ్యం పావకాద్రథముత్తమమ్‌. 15

సారథిం చార్జునః సంఖ్యే కృష్ణమక్షయ్యసాయకాన్‌ | బ్రహ్మస్త్రాదీంస్తదా ద్రోణాత్సర్వే శస్త్రవిశారదాః 16

దుర్యోధనాదులచే గుర్తింపబడిన ఆ పాండవులు అర్దరాజ్యమును పొందిరి. అర్జునుడు, అగ్ని దేవునుండి గాండీవ మను దివ్యధనస్సును, ఉత్తమమైన రథమును, అక్షయ్యమైన బాణములు గల అమ్ములపొదలను పొందెను. ద్రోణునివలన బ్రహ్మద్యస్త్రములను పొందెను. కృష్ణుని యుద్ధసమయమున సారథిగా పొందెను. వారందరరును శస్త్రాస్త్రములందు నమర్థులైరి.

కృష్ణేన సో7ర్జునో వహ్నిం ఖాణ్డవే సమతర్పయేత్‌ | ఇన్ద్రవృష్టిం వారయంశ్చ శరవర్షేణ పాణ్ణవః 17

పాండుకుమారుడైన అర్జునుడు తన శరవర్షముచే, ఇంద్రుడు కురిపించిన వర్షమును అడ్డగించి, కృష్ణసహాయముతో, ఖాండవవనమునందు అగ్నిని సంతృప్తిని చేసెను.

జితా దిశః పాణ్ణవైశ్చ రాజ్యం చక్రే యుధిష్ఠరః | బహుస్వర్ణం రాజసూయం నసేహే తం సుయోధనః 18

పాండవులు నలుదిక్కులను జయించిరి. యధిష్ఠిరుడు రాజ్యము చేసెను. అధిక మగు సువర్ణదానము గల రాజసూయయాగమును చేసెను. దుర్యోధనుడు దీని నంతను సహింపలేకపోయెను.

భ్రాత్రా దుఃశాసనేనోక్తః కర్ణేన ప్రాప్తభూతినా| ద్యూతకార్యే శకునినా ద్యూతేన నయుధిష్ఠరమ్‌. 19

అజయత్తస్య రాజ్యం చ సభాస్థో మాయయా హసన్‌ |

సోదరుడైన దుఃశాసనుడును, ఐశ్వర్యము లభించిన కర్ణుడును, శకునియు చెప్పగా యుధిష్ఠిరుని ద్యూతము నకై ఆహ్వానించి, ఆ ద్యూతశాలలో యుధిష్ఠిరుని మోనము చేసి నవ్వుచు, అతని రాజ్యమును హరించెను.

జితో యుదిష్ఠిరో భ్రాతృయుతశ్చారణ్యకం య¸°. 20

వనే ద్వాదశ వర్షాణి ప్రతిజ్ఞాతాని సో7నయత్‌ | అష్టాశీతి సహస్రాణి భోజయన్‌ పూర్వవద్ధ్విజాన్‌ . 21

సధౌమ్యో ద్రౌపదీషష్ఠ స్తతః ప్రాయాద్విరాటకమ్‌ | కజ్కో ద్విజో హ్యవిజ్ఞాతో రాజా భీమో7థ సూపకృత్‌.

బృహన్నడార్జునో భార్యా సైరన్ధ్రీ యమజౌ తథా | అన్యనామ్నా భీమసేనః కీచకం చావధీన్నిశి. 23

ద్రౌవదీం హర్తుకామం తమర్జునశ్చాజయత్కురూన్‌ | కుర్వతో గోగ్రహాదీంశ్చ తైర్‌జ్ఞాతాః పాణ్డవా అథ. 24

ద్యూతమునందు ఓడిపోయిన యుధిష్ఠిరుడు సోదరులతోడను, ద్రౌపదితోడను, ధౌమ్యునితోడను అరణ్యమునకు వెళ్లి ప్రతిజ్ఞచేసిన విధముగ అచట పండ్రెండు సంవత్సరములు గడపెను. అచట పూర్వము నందు వలె, ప్రతిదివసము నందును, ఎనుబది ఎనిమిదివేలమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టుచుండెను. పిమ్మట వారందరును విరాటుని చేరిరి. యుధిష్ఠిరుడు కంకుడనెడు. బ్రాహ్మణుడుగను, భీముడు వంటవాడుగను, అర్జునుడు బృహన్నలగను అయి ఇతరులకు తెలియ కుండునట్లు అచట నివసించిరి. నకులసహదేవులు వేరు పేర్లుతో ఉండిరి. ద్రౌపదిని హరింప నభిలషించిన కీచకుని భీమ సేనుడు రాత్రివేళ సంహరించెను. గోగ్రహణాదికమును చేయ వచ్చిన కౌరవులను అర్జునుడు జయించెను. అప్పుడు ఆ కౌరవులు వారు పాండవు లని గుర్తించిరి.

సుభద్రా కృష్ణభగినీ అర్జునాత్సమజీజనత్‌ | అభిమన్యుం దదౌ తసై#్మ విరాటశ్చోత్తరాం సుతామ్‌. 25

కృష్ణుని సోదరియైన సుభద్రకు అర్జునునివలన అభిమన్యడను కుమారుడు కలిగెను. విరాటుడు అతనికి తన కుమార్తెయైన ఉత్తర నిచ్చెను.

ఆసిత్సప్తాక్షౌహిణీశో ధర్మరాజో రణాయ సః | కృష్ణో దూతో7బ్రవీద్గత్వా దుర్యోధన మమర్షణమ్‌. 26

ఏకాదశాక్షౌహిణీశం నృపం దుర్యోధనం తదా | యుధిష్ఠిరాయార్ధరాజ్యం దేహి గ్రామాంశ్చ పఞ్ఛ వా. 27

యుధ్యస్వ వా వచః శ్రుత్వా కృష్ణమాహ సుయోధనః |

ధర్మరాజు యుద్ధమునకై ఏడు అక్షౌహిణుల సైన్యమును నన్నద్దము చేసికొనెను. కృష్ణుడు అమర్ష పూర్ణుడును, పదకొండు అక్షోహిణులకు అధిపతియు అగు దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్లి - "యుధిష్ఠిరునకు సగము రాజ్యము నిమ్ము. లేదా ఐదు గ్రామాల నైన ఇమ్ము. అట్లు కానిచో యుద్ధము చేయము" అని చెప్పెను. ఆ మాటలు విని సుయోధనుడు శ్రీ కృష్ణునితో ఇట్లు పలికెను.

సుయోధన ఉవాచ:

భూసూచ్యగ్రం న దాస్యామి యోత్స్యే సఙ్గ్రహణోద్యతః 28

అగ్నిరువాచ:

విశ్వరూపం దర్శయిత్వా అధృష్యం విదురార్చితః | ప్రాగద్యుధిష్ఠిరం ప్రాహ యోధయైనం సుయోధనమ్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ త్రయోదశో7ధ్యాయః

సుయోధను డిట్లనెను - ''సూది మోపినంత నేల నైనను ఇవ్వను. యుద్దము చేసెదను. యుద్ధమునకై సిద్ధముగా ఉన్నాను." అగ్ని పలికెను. అంత శ్రీ కృష్ణుడు ఎదిరింప శక్యముకాని విశ్వరూపము చూపి, విదురుని చేత పూజింపబడినవాడై, యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్లి, "ఆ సుయోధననితో యుద్ధము చేయుము" అని చెప్పెను.

అగ్ని మహాపురాణములో భారతాఖ్యన మన పదమూడవ అధ్యయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters