Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చవింశత్యుత్తర శతతమోధ్యాయః.

అథ యుద్ధ జయార్ణవే నానాచక్రాణి.

ఈశ్వర ఉవాచ :

ఓం హ్రీం కర్ణమోటని బహురూపే బహుదంష్ట్రే హూం ఫట్‌ ఓం హః ఓం గ్రస గ్రస కృన్త కృన్త ఛక ఛక హూం ఫట్‌ నమః.

పఠ్యమానోహ్యయం మన్త్రః క్రుద్దైః సంరక్తలోచనైః | మారణ పాతనే వాపి మోహనోచ్చాటనే భ##వేత్‌. 1

(అ) 46

కర్ణమోటా మహావిద్యా సర్వవర్ణేషు రక్షికా |

నానావిద్యా :

పఞ్చోదయం ప్రవక్ష్యామి స్వరోదయసమాశ్రితమ్‌. 2

నాభిహృదన్తరం యావత్తావచ్చరతి మారుతః | ఉచ్చాటయేద్రణాదౌ తు కర్ణాక్షీణి ప్రభేదయేత్‌. 3

కరోతి సాధకః క్రుద్ధో జపహోమపరాయణః | హృదయాత్పాయుకం కణ్ఠం జ్వరదాహారి మారణ. 4

కణ్ఠోద్భవో రసో వాయుః శాన్తికం పౌష్టికం రసమ్‌ |

దివ్యం స్తమ్భం సమాకర్షం గన్ధో నాసాన్తికో భ్రువః. 5

గన్ధలీనం మనః కృత్వా స్తమ్భయేన్నాత్ర సంశయః | స్తమ్భనం కీలానాద్యం చ కరోత్యేవ హి సాధకః. 6

చణ్డఘణ్టా కరాలీ చ సుముఖీ దుర్ముఖీ తథా | రేవతీ ప్రథమా ఘోరా వాయుచక్రేషు తా యజేత్‌. 7

ఉచ్చాటకారికా దేవ్యః స్థితాస్తేజసి సంస్థితాః | సౌమ్యా చ భీషణా దేవీ జయా చ విజయా తథా. 8

అజితా పరాజితా మహాకోటీ చ రౌద్రయా | శుష్కకాయా ప్రాణహరా రసచక్రే స్థితా అమూః. 9

విరూపాక్షీ పరా దివ్యాస్తథా చాకాశమాతరః | సంహారీ జాతహారీ చ దంష్ట్రాలా శుష్కరేవతీ. 10

పిపీలికా పుష్టిహారా మహాపుష్టిప్రవర్దనా | భద్రకారీ సుభ్రదా చ భద్రభీమా సుభ్రదికా. 11

స్థిరా నిష్ఠురా దివ్యా నిష్కమ్పా గదినీ తథా | ద్వాత్రింశన్మాతరశ్చక్రే హ్యష్టాష్ట క్రమశః స్థితాః. 12

పరమేశ్వరుడు చెప్పెను : ''ఓం హ్రీం కర్ణమోటని బహురూపే బహుదంష్ట్రే హూం ఫట్‌ ఓం హః ఓం గ్రస గ్రస, కృన్త, కృన్త, ఛక, ఛక, హూం ఫట్‌ నమః ''- ఇది కర్ణమోటీ మహావిద్య. ఇది అన్ని వర్ణములందును రక్ష నిచ్చునది. ఈ మంత్రమును చదివినంతమాత్రముననే మనుష్యుడు క్రోధావిష్ణు డగును, వాని కండ్లు ఎర్రవడును. ఈ మంత్రము మారణ-పాతన-మోహన-ఉచ్చాటనములయం దుపయోగించును. అపుడు స్వరోదయముతో పాటు పంచవిధవాయుస్థానములను, వాటి ప్రయోజనములను చెప్పెదను. హృదయమునుండి నాభివరకును వాయుసంచారము జ.రుగుచుండును. దానికి మారుతచక్ర మని పేరు. జపహోమాదులు చేయు సాధకుడు, క్రోధవంతుడై, దానిచే సంగ్రామాది కార్యములందు ఉచ్చాటనాదికార్యములు చేయును. కర్ణములనుండి నేత్రముల వరకును ఉన్న వాయువుచే ప్రభేదన కార్యమును, హృదమమునుండి గుదము వరకును ఉండు వాయువుచే జ్వరదాహములను, శత్రుమారణమును చేయవలెను. ఈ వాయువు పేరు వాయుచక్రము. హృదయమునుండి కంఠము వరకును ఉన్న వాయువునకు రస మని పేరు. దీనికి రసచక్ర మని పేరు. దీనిచే శాంతిప్రయోగము చేయబడును. దాని గుణము పౌష్టికరసతుల్యము. కనుబొమ్మల నుండి నాసికాభాగమువరకును ఉన్న వాయువు పేరు దివ్యము. దీనికి తేజశ్చక్రమని పేరు. దీనికి గంధము గుణము. దీనిచే స్తంభన-ఆకర్షణములు చేయబడును. సాధకుడు మనస్సును నాసికాగ్రమునందు స్థిరము చేసి, నిస్సందేహముగ స్తంభన. కీలనములు చేయును. పైన చెప్పిన వాయు చక్రమునందు చండఘంటా, కరాలీ, సుముఖీ, దుర్ముఖీ, రేవతీ, ప్రథమా, ఘోర అను శక్తులను అర్చించవలెను. ఉచ్చాటనము చేయ శక్తులు తేజశ్చక్రమునం దుండును. సౌమ్య, భీషణీ, దేవీ జయా, విజయా, అజితా, అపరాజితా, మహాకోటీ, మహారౌద్రీ, శుష్కకాయా, ప్రాణహరా అను పదకొండుగురుశక్తులు రసచక్రమునందుండును. విరూపాక్షీ-పరా-దివ్యలు, పదకొండుగురు ఆకాశమాతృకలు, సంహారీ, జాతహారీ, దంష్ట్రాలా, శుష్కరేవతీ, పిపీలికా, పుష్టిహరా, మహాపుష్టి, ప్రవర్ధనా, భద్రకాళీ, సుభద్రా, భద్రభీమా, సుభద్రికా, స్థిరా, నిష్ఠురా-దివ్యా, నిష్కంపా, గదినీ, రేవతీ అను ముప్పదిఇద్దరు మాతృకలు మారుత - వాయు - రస - దివ్యచక్రములు నాల్గింటి యందును ఎనమండుగురు చొప్పున ఉందురు.

ఏక ఏవ రవిశ్చన్ద్ర ఏకశ్చైకైక శక్తికా | భూతభేదేన తీర్థాని యథా తోయం మహీతలే. 13

ప్రాణ ఏకో మణ్డలైశ్చ భిద్యతే భూతపఞ్జరే | వామదక్షిణయోగేన దశధా సంప్రవర్తతే. 14

బిన్దుముణ్డవిచిత్రం చ తత్త్వవస్త్రేణ వేష్టితమ్‌ | బ్రహ్మాణ్డన కపాలేన పిబేత్తు పరమామృతమ్‌. 15

పఞ్చవర్గబలాద్యుద్ధ్యే జయో భవతి తచ్చృణు | అ ఆ క చ త ప యా శ ఆద్యో వర్గ ఈరితః. 16

ఇ ఈ ఖ ఛ ఠ థ ఫ రాః షవర్గశ్చ ద్వితీయక ః | ఉ ఊ గ జ డ ద బ లాః సవర్గశ్చ తృతీయకః. 17

ఏ ఐ ఘ ఝ ఢ ద భ వా హవర్గశ్చ చతుర్థకః |

ఓ ఔ అం అః ఙ ఞ ణ నా మవర్గః పఞ్చమో భ##వేత్‌. 18

వర్ణాశ్చాభ్యుదయే నౄణాం చత్వారింశచ్చ పఞ్చ చ |

బాలః కుమారో యువా స్యాద్వృద్ధో మృత్యుశ్చ నామతః. 19

ఆత్మపీడా శోషకః స్యాదుదాసీనశ్చ కాలకః | కృత్తికాప్రతిపద్భౌమ ఆత్మనో లాభదః స్మృతః. 20

షష్ఠీభౌమో మఘాపీడా హ్యార్ద్రా చైకాదశీ కుజః | మృత్యర్మఘా ద్వితీయా జ్ఞో లాభశ్చార్ద్రా చ సప్తమీ.

బుధే హానిర్భరణీ జ్ఞః శ్రవణం కాల ఈదృశః | జీవో లాభాయ చ భ##వేత్తృతీయా పూర్వఫల్గునీ. 22

జీవో7ష్టమీ ధనిష్ఠార్ద్రా జీవో7శ్లేషా త్రయోదశీ | మృత్యుః శుక్రశ్చ తుర్థీస్యాత్పూర్వభాద్రపదా శ్రియే. 23

పూర్వాషాడా చ నవమీ శుక్ర ః పీడాకరో భ##వేత్‌ | మఘా శనిః పూర్ణిమా చ యోగో మ్భత్యుకరః స్మృతః.

సూర్యుడు ఒక్కడే : చంద్రుడను ఒక్కడే ; వారి శక్తులు కూడ భూతభేదమును బట్టి ఒక్కొక్కటియే; భూమిపై నున్న నదీజలమునకు స్థానభేదమును బట్టి తీర్థసంజ్ఞ కలిగి నట్లే శరీరమునందలి అస్థిపంజరములో నున్న ఒకే ప్రాణము అనేక మండలముల రూపమున విభక్త మైనది. వాయుదక్షిణాంగములతో యోగముచే అదే వాయువు పది విధము లైనట్లు, అదే వాయువు తత్త్వరూప మగు వస్త్రమునందు దాగి విచిత్రబిందురూప మగు ముండము ద్వారా, కపాలరూప బ్రహ్మాండమునకు సంబంధించిన అమృతమును త్రాగుచుండును. పంచవర్గబలముచే యుద్ధమునం దెట్లు జయము కలుగునో వినుము. అ, ఆ, క,చ, ట,త,ప,య,శ లు ప్రథమవర్గము. ఇ,ఈ, ఖ,ఛ,ఠ,థ,ఫ,ర,ష లుద్వితీయవర్గము. ఉ ఊ, గ,జడ,ద,బ,ల, స లు తృతీయవర్గము. ఏ, ఐ,ఘ,ఝ,ఠ,ధ,భ,వ,హ లు చతుర్థవర్గము. ఓ,ఔ,అం,ఆః,ఙ,ఞ,ణ,న,మలు పంచమవర్గము. ఈ నలుబదియైదు అక్షరములును మానవులకు ఆభ్యుదయ మిచ్చునవి. వీటికి వరుసగ బాల-కుమార-యువన్‌-వృద్ధ-మృత్యువు లని పేరు. కాలము-ఆత్మపీడము, శోషకము, ఉదాసీనము అని మూడు విధములు. మంగళవారమునందు ప్రతిపత్తు, కృత్తిక వచ్చినచో అవి లాభదాయకములు. మంగళవారమున షష్టీ-మఘానక్షత్రములు వచ్చినచో అవి పీడాకరములు. మంగళవారమున ఏకాదశీ-ఆర్ద్రానక్షత్రములు వచ్చినచో అవి మృత్యుదాయకములు. బుధవారమున ద్వితీయా-మఘాయోగము, సప్తమీ ఆర్ద్రానక్షత్రయోగము లాభదాయకములు. బుధవార-భరణీనక్షత్రయోగము హానికరము. బుధవార-శ్రవణ నక్షత్రయోగము ''కాలయోగము'' బృహస్పతివారమున తృతీయా-పూర్వఫల్గునీ యోగము లాభకరము. బృహస్పతివారమున - అష్టమీతిథి-ధనిష్ఠానక్షత్రయోగము, అష్టమీ-ఆర్ద్రాయోగము. త్రయోదశీ-ఆశ్లేషాయోగము మృత్యుకారకములు. శుక్రవారమున చతుర్థీ-పూర్వాభాద్రాయోగము లక్ష్మీవృద్ధికరము. శుక్రవారమున-నవమీ-పూర్వాషాఢాయోగము దుఃఖప్రదము; ద్వితీయ భరణీ నక్షత్రయోగము యమదండము వలె హానికరము. శనివారమున పంచమీ-కృత్తికాయోగము లాభకరము; దశమీ-ఆశ్లేషా యోగము పీడాకరము. పూర్ణిమా మఘాయోగము మృత్యుప్రదము.

అథ తిథియోగః :

పూర్వోత్తరాగ్ని నైరృత్యదక్షిణానిలచన్ద్రమాః. 26

బ్రహ్మాద్యాః స్యుర్దృష్టయః స్యుః ప్రతిపన్న వమీముఖాః |

రాశిభిః సహితా దృష్టా గ్రహాద్యాః సిద్ధయే స్మృతాః. 27

మేషాద్యాశ్చతురః కుమ్భా జయః పూర్ణే7న్యథా మృతిః |

సూర్యాదిరిక్తా పూర్ణా చ క్రమాదేవం ప్రదాపయేత్‌. 28

రణ సూర్యే ఫలం నాస్తి సోమే భఙ్గః ప్రశామ్యతి | కుజేన కలహం విద్యాద్బుధః కామాయ వై గురుః. 29

జయాయ మనసే శుక్రో మన్దే భఙ్గో రణ భ##వేత్‌ | దేయాని పిఙ్గలాచక్రే సూర్యగాని చ భాని హి. 30

ముఖే నేత్రే లలాటే7థ శిరోహస్తోరుపాదకే | పాడే మృతిస్త్రిఋక్షే స్యాత్త్రీణి పక్షే7ర్థనాశనమ్‌. 31

ముఖస్థే చ భ##వేత్పీడా శిరఃస్థే కార్యనాశనమ్‌ | కుక్షిస్థితే ఫలం స్యాచ్చ రాహుచక్రం వదామ్యహమ్‌. 32

ఇన్ద్రాచ్చ నైరృతం గచ్ఛేన్నైరృతాత్సోమమేవ చ | సోమాద్దుతాశనం వహ్నేరాప్య మాప్యాచ్ఛివాలయమ్‌.

రుద్రాద్యమం యమాద్వాయుం వాయోశ్చన్ద్రం వ్రజేత్పునః |

భుఙ్త్కే చతస్రో నాడ్యస్తు రాహుపృష్ఠే జయో రణ.

అగ్రతో మృత్యుమాప్నోతి తిథిరాహుం వదామి తే | ఆగ్నేయాదిశివాన్తం చ పూర్ణిమామాదితః ప్రియే. 35

పూర్వే కృష్ణాష్టమీయావద్రాహుదృష్టౌ భయో భ##వేత్‌ | ఐశాన్యాగ్నేయనైరృత్యవాయవ్యే ఫణిరాహుకః. 36

మేషాద్యా దిశి పూర్వాదౌ యత్రాదిత్యో7గ్రతో మృతిః | తృతీయా కృష్ణపక్షే తు సప్తమీ దశమీ తథా. 37

చతుర్దశీ తథా శుక్లే చతుర్థ్యేకాదశీ తిథిః | పఞ్చదశీ విష్టయః స్యుః పూర్ణిమాగ్నేయవాయవే. 38

పూర్వ-ఉత్తర-ఆగ్నేయ-నైరృతి-దక్షిణ-వాయవ్య-పశ్చిమ-ఈశాన్యములు పరస్పరము చూచుకొనును. ప్రతిపత్తు నవమి మొదలగు తిథులలో మేషాదిరాశులతో రవ్యాదివారములను కలపవలెను. ఈ యోగము కార్యసిద్ధికరము. ఉదా : తూర్పు, ప్రతిపత్తు, మేషలగ్నము, రవివారము- ఈ యోగము పూర్వదిశయందు యుద్ధాదికార్యములందు సిద్ధిప్రదము, మేషాదిరాశులు నాలుగు, కుంభము--ఈలగ్నములు పూర్ణవిజయము నిచ్చును. ఇతర రాశులు మృత్యుకారకములు. సూర్యాది గ్రహములను, రిక్తాపూర్ణాదితిథులను వెనుక దిక్కులవిషయమున చెప్పి నట్లు న్యాసము చేయవలెను. సూర్యసంబంధముచే యుద్ధము నందు ఉత్తమఫల మేదియు లభించదు. సోమసంబంధము సంధిని కలిగించును. మంగలసంబంధముచే కలహమగును. బుధసంబంధమున యుద్ధము చేయుటచే అభీష్టసాధనములు చేకూరును. గురుసంబంధముచే విజయలాభము కలుగును. శుక్రసంబంధముచే అభీష్టసిద్ధి యగును. శనిసంబంధముచే పరాజయము కలుగును. ఒక పక్షి ఆకారము గీసి దానిముఖ-నేత్ర-లలాట-శీర్ష-హస్త-కుక్షి-చరణ-పక్షములందు సూర్యనక్షత్రము మొదలు మూడేసి నక్షత్రములు వ్రాయవలెను. పాదమునందున్న మూడు నక్షత్రములలో యుద్ధము చేసినచో మృత్యు వగును. రెక్కలపైనున్న మూడు నక్షత్రములందు ధననాశము. ముఖము నందలి మూడు నక్షత్రములందు పీడ కలుగును. శిరస్సునందున్న మూడు నక్షత్రములందు కార్యనాశనము. కుక్షియందులి మూడు నక్షత్రములందు యుద్ధము చేయగా ఉత్తమఫలము లభించును. తూర్పునుండి నైరృతివరకును, నైరృతినుండి ఉత్తరమువరకును, ఉత్తరమునుండి ఆగ్నేయమువరకును, ఆగ్నేయమునుండి పశ్చిమమువరకును, పశ్చిమమునుండి ఈశాన్యమువరకును, ఈశాన్యమునుండి దక్షిణమువరకును, దక్షిణమునుండి వాయవ్యము వరకును, వాయవ్యమునుండి ఉత్తరము వరకును నాలుగేసి దండముల వరకు రాహుభ్రమణ ముండును. రాహువును పృష్ఠమునందుంచుకొని యుద్ధము చేయుట జయప్రదము. రాహువు ఎదురుగా ఉండగా యుద్ధము చేసినచో మృత్యువు. ఇపుడు తిథిరాహువిషయము చెప్పెదను. పూర్ణిమ పిమ్మట కృష్ణప్రతిపత్తు మొదలు ఆగ్నేయమునుండి ఈశాన్యమువరకు, అనగా కృష్ణ అస్టమివరకురాహువు పూర్వాదిదిక్కున ఉండును. అచట యుద్ధము చేయుటచే జయము కలుగును. ఈశాన్యమునుండి ఆగ్నేయము వరకును, నైరృతి నుండి వాయవ్యము వరకును రాహుభ్రమణ ముండును. మేషాదిరాశులను పూర్వాదిదిక్కులందుంచవలెను. ఇట్లుంచగా మేష-సింహ-ధనూరాశులు తూర్పునను, వృషభ-కన్యా-మకరరాశులు దక్షిణమునందును, మిథున-తులా-కుంభములు పశ్చిమమునందును, కర్కటక-వృశ్చిక-మీనములు ఉత్తరమునందును ఉండును. సూర్యరాశిని పట్టి సూర్యుని దిక్కు తెలిసికొని, సూర్యుడు సమ్ముఖుడై ఉన్నపుడు యుద్ధము చేయుట మృత్యుకారకము, కృష్ణపక్షమునందు తృతీయా-సప్తమీ-దశమీ-చతుర్దశీతిథులు భద్రతిథులు. శుక్లపక్షమునందు చతుర్థీ-ఏకాదశీ-అష్టమీ పూర్ణిమలు భద్రతిథులు. ఆగ్నేయమునుండి వాయవ్యమువరకును భద్రానివాసము.

అ క చ ట త ప య శా వర్గాః సూర్యాదయో గ్రహాః |

గృధ్రోలూకశ్యేనకాశ్చ పిఙ్గలః కౌశికః క్రమాత్‌. 39

సారసశ్చ మయూరశ్చ గోరఙ్కుః పక్షిణః స్మృతాః |

ఆదౌ సాధ్యో హుతో మన్త్ర ఉచ్చాటే పల్లవః స్మృతః. 40

వశ్యే జ్వరే తథాకర్షే ప్రయోగః సిద్ధికారకః | శాన్తౌ ప్రీతౌ నమస్కారో వౌషట్‌ పుష్టౌ వశాదిషు. 41

హుం మృత్యౌ ప్రీతిసంనాశే విద్వేషోచ్చాటనే చ ఫట్‌ |

వషట్‌ సుతే చ దీప్త్యాదౌ మన్త్రాణాం జాతయశ్చ షట్‌. 42

ఓషధీః సంప్రవక్ష్యామి మమారక్షావిధాయినీః | మహాకాలీ తథా చణ్డీ వారాహీ చేశ్వరీ తథా. 43

సుదర్శనా తథేన్ద్రాణీ గాత్రస్థా రక్షయన్తితమ్‌ | బలా చాతిబలా భీరుర్ముసలీసహదేవ్యపి. 44

జాతీ చ మల్లికా యూథీ గారుడీ తుఙ్గరాజకః | చక్రరూపా మహౌషధ్యో ధారితా విజయాదయః. 45

గ్రహణ చ మహాదేవి ఉదృతాః శుభదాయికాః | మృదా చ కుఞ్జరం కృత్వా సర్వలక్షణలక్షితమ్‌. 46

తస్య పాదతలే కృత్వా స్తమ్భయోచ్ఛత్రుమాత్మనః | నగాగ్రే చైత్యవృక్షే చ వజ్రాహతప్రదేశ కే. 47

వల్మీకమృదమాహృత్య మాతరౌ యోజయేత్తతః |

ఓం నమో మహాభైరవాయ వికృతదంష్ట్రోగ్రరూపాయ పిఙ్గలాక్షాయత్రిశూలఖడ్గధరాయ వౌషట్‌.

పూజయేత్కర్దమం దేవి స్తమ్భయేచ్ఛస్త్రజాలకమ్‌. 48

అ,క,చ, ట,త, ప, య, శ- అని ఎనిమిదివర్గములు. వీటి అధిపతులు వరుసగ సూర్య-చంద్ర-కుజ-బుధ-గురు-శుక్ర-శని-రాహువులు. ఈ వర్గముల పక్షులు క్రమముగ గృధ్ర-ఉలూక-శ్యేన-పింగళ-కౌశిక-సారస-మయూర-గోరంకు పక్షులు మొదట హోమములు చేసి మంత్రసిద్ధి చేసికొనవలెను. ఉచ్చాటనమున మంత్రప్రయోగము పల్లవరూపమున చేయవలెను. వశ్య-జ్వర-ఆకర్షణములందు పల్లవప్రయోగము సిద్ధి కరము. శాంతియందును, మోహన ప్రయోగమునందును, 'నమః' అని చెప్పుట మంచిది. పుష్టి-వశీకరణములందు 'వౌషట్‌' మారణ-ప్రీతివినాశములందు 'హుం' ప్రయోగించవలెను. విద్వేషణమునందును, ఉచ్చాటనమునందును 'ఫట్‌' చెప్పుట మంచిది. పుత్రాదిప్రాప్తి ప్రయోగమునందును దీప్త్యాదులదును 'వషట్‌' చెప్పుట మంచిది. ఈ విధముగ మంత్రములలో ఆరు జాతు లేర్పడినవి. ఇపుడు అన్ని విధముల రక్షణము నిచ్చు ఓషధులను గూర్చి చెప్పుచున్నాను. మహాకాళీ, చండీ, వారహీ, ఈశ్వరీ సుదర్శనా, ఇంద్రాణీ-ఈ ఓషధులను శరీరముపై ధరించుటచే ధారకునకు రక్ష కలుగును. బలా, అతిబలా, భీరు, ముసలీ, సహదేవీ, జాతీ, మల్లికా, యూథీ, గారుడీ, భృంగరాజ, చక్రరూపా- ఈ మహౌషధులను ధరించుటచే యుద్ధమునందు విజయము కలుగును. మహాదేవీ ! ఈ ఓషధులను గ్రహణ సమయమున వెలికి తీయుట శుభదాయకము. మట్టితో సర్వాంగ సంపన్న మైన ఏనుగ మూర్తి ఒకటి నిర్మించి, దాని పాదము క్రింద శత్రువుమూర్తి నుంచి, స్తంభన ప్రయోగము చేయవలెను. లేదా - ఒకే వృక్షమున్న ఒక పర్వతోపరిభాగమునందు ఆ చెట్టు క్రింద గాని, పిడుగుపడిన చోటున గాని, పుట్టమట్టితో ఒక స్త్రీమూర్తి నిర్మించి - ''ఓం నమో మహాభైరవాయ వికృతదంష్ట్రోగ్ర రూపాయ పిఙ్గలాక్షాయ, త్రిశూలఖడ్గధరాయ 'వౌషట్‌' అను మంత్రముచే ఆ మృత్తికమయ దేవీమూర్తికి పూజ చేసి, శత్రువువద్ద నున్న శస్త్ర సమూహమును స్తంభింపచేయవలెను.

అగ్నికార్యం ప్రవక్ష్యామి రణాదౌ జయవర్ధనమ్‌ | శ్మశానే నిశి కాష్ఠాగ్నౌ నగ్నో ముక్తశిఖోనరః. 49

దక్షిణాస్యస్తు జుహూయాన్నృమాంసం రుధిరం విషమ్‌ | తుషాస్థిఖణ్డమిశ్రం తు శత్రునామ్నా శతాష్టకమ్‌.

ఓం నమో భగవతి కౌమారి లల లల లాలయ లాలయ ఘణ్టా

దేవి అముకం మారయ మారయ సహసా నమో7స్తు తే భగవతి

విద్యే స్వాహా.

అనయా విద్యయా హోమాద్బన్ధనం జాయతే రిపోః.

ఓం వజ్రకాయ వక్రతుణ్డ కపిలపిఙ్గల కరాల వదన ఊర్ధ్వ

కేశ మహాబల రక్తముఖ తడిజ్జిహ్వ మహారౌద్ర దంష్ట్రోత్కట

కహకరాలిన్‌ మహాదృథప్రహార లఙ్కేశ్వరసేతుబన్ధప్రవాహ

గగనచర ఏహ్యేహి భగవన్‌ మహాబల పరాక్రమ భైరవో జ్ఞాప

యతి ఏ హ్యేహి మహారౌద్ర దీర్ఘలాఙ్గూ లేన అముకం వేష్టయ

వేష్టయ జమ్భయ జమ్భయ ఖన ఖన వైతేహూం ఫట్‌

అష్టత్రింశచ్ఛతం దేవి హనుమాన్సర్వకర్మకృత్‌ | పటే హనూమత్సన్ధర్శాద్భఙ్గమాయాన్తి శత్రవః. 51

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యుద్ధజయార్ణవే నానాచక్రవర్ణనం నామ పఞ్చవింశత్యధిక శతతమోధ్యాయః.

ఇపుడు యుద్ధమున విజయము చేకూర్చు అగ్నికార్యమును గూర్చి చెప్పెదను. రాత్రి శ్శశానమునకు వెళ్ళినగ్నుడై శిఖ విరబోసికొని, దక్షిణాభిముఖముగ కూర్చుండి జ్వలించుచున్న చితియందు మనుష్యమాంసరక్తములను, విషమును, ఊక ఎముకలు కలిపి, శత్రువు పేరు చెప్పుచు- ''ఓం నమో...... విద్యేస్వాహా'' అను (మూలములోనున్న) మంత్రముతో ఎనిమిదివందల పర్యాయములు హోమము చేయవలెను. అట్లు చేయగా శత్రువు బద్ధు డైపోవును. (గ్రుడ్డివాడగును.) దేవీ! ''ఓం వజ్రకాయ..........హుం ఫట్‌'' అను (మూలములో నున్న) మంత్రమును మూడువేల ఎనిమిదివందల (3800) పర్యాయములు జపము చేయగా హనుమంతుడు అన్ని కార్యములను సమకూర్చును. వస్త్రముపై వ్రాసిన హనుమన్మూర్తిని చూపగనే శత్రవులు నశింతురు.

అగ్ని మహాపురాణమునందు, యుద్ధజయార్ణవమున నానాచక్రవర్ణన మను నూటఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters