Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ వింశత్యధికశతతమో7ధ్యాయః

అథ భువనకోశవర్ణనమ్‌.

అగ్నిరువాచ:

విస్తారస్తు స్మృతో భూమేః సహస్రాణి చ సప్తతిః | ఉచ్ఛ్రాయో దశసాహస్రం పాతాలం చైకమేకకమ్‌. 1

అతలం వితలం చైవ నితలం చ గభస్తిమత్‌ | మహాఖ్యం సతలం చాగ్య్రం పాతాలం చాపి సప్తమమ్‌. 2

కృష్ణపీతారుణాః శుక్లశర్కరా శైలకాఞ్చనాః | భూమయస్తేషు రమ్యేషు సన్తి దైత్యాదతయః సుఖమ్‌. 3

పాతాలానామధ్యశ్చాస్తే శేషో విష్ణుశ్చ తామసః | గుణానన్త్యాత్సచానన్తః శిరసాధారయన్మహీమ్‌. 4

భువో7ధో నరకా నైకే న పతేత్తత్ర వైష్ణవః | రవిణాభాసితా పృథ్వీ యావత్తావన్నభో మతమ్‌. 5

భూమేర్యోజనలక్షం తు వసిష్ఠరవిమణ్డలమ్‌ | రవిర్లక్షేణ చన్ద్రశ్చ లక్షాన్నాక్షత్రమిన్దుతః. 6

ద్విలక్షా ద్భాద్బుధశ్చాస్తే బుధాచ్ఛుక్రో ద్విలక్షతః | ద్విలక్షేణ కుజః శుక్రాద్భౌమాద్ద్విలక్షతో గురుః. 7

గురోర్ద్విలక్షతః సౌరిర్లక్షాత్సప్తర్షయః శ##నేః | లక్షాద్ధ్రువో హ్యృషిభ్యస్తు త్త్రెలోక్యం చోచ్ఛ్రయేణ చ . 8

ధ్రువాత్కోట్యా మహర్లోకో యత్ర తే కల్పవాసినః | జనోదత్వికోటిత స్తస్మాద్యత్రాసన్సనకాదయః. 9

జనాత్తపశ్చాష్టకోట్యా వైరాజా యత్ర దేవతాః | షణ్ణవత్యా తు కోటీనాం తపసః సత్యలోకకః. 10

అపునర్మారకా యత్ర బ్రహ్మలోకో హి స స్మృతః|

అగ్ని దేవుడు చెప్పెను: వసిష్ఠా! భూమివిస్తారము డెబ్బది వేలయోజనము లని చెప్పబడినది, రవి ఎత్తు పదివేల యోజనములు. భూమి క్రింద ఏడు పాతాలము లున్నవి. ఒక్కొక్క పాతాలము పదేసి వేల విస్తారము గలది. అతలము, వితలము, నితలము, ప్రకాశమాన మగు మహాతలము, సుతలము. తలాతలము రసాతలము అని వాటిపేర్లు, ఈ పాతాలముల భూములు క్రమముగా నలుపు, పసుపు, ఎరుపు, తెలుపు, శర్కరామయము శిలామయము, సువర్ణమయము అయి ఉండును. ఈ పాతాళము లన్నియు చాల సుందరము లైనవి వాటిలో దైత్యాదాన వాదులు సుఖముగా నివసించుచుందురు. ఈ పాతాళముల క్రింద శ్రీమహావిష్ణువుయొక్క తయోగుణ ప్రధానవిగ్రహ మైన ఆది శేషుడు ఉండను. ఇతనికి ఆనంతగుణము లుండుటచే అనంతుడని పేరు. ఇతడు తన శిరముపై భూమిని ధరించుచుండును. భూమి క్రింద అనేత నరకము లున్నవి. కాని విష్ణుభక్తులు నరకములకు వెళ్ళరు. సూర్యునిచే ప్రకాశింపచేయబడు చున్న పృథ్వి ఎంత విస్తృత మైనదో నభోలోకము గూడ అంత విస్తృత మైనది. వసిష్ఠా! సూర్యుడు పృథివికి ఒక లక్ష యోజనముల దూరమునందుండును. సూర్యునకు లక్ష యోజనముల దూరమున చంద్రుడు ఉండును. చంద్రునకు లక్షయోజనముల దూరమున నక్షత్రమండల మున్నది. నక్షత్రమండలమునకు రెండులక్షల యోజనముల దూరమున బుధుడు, అచటికి రెండు లక్షల యోజనముల దూరమున శుక్రుడు, అచటికి రెండులక్షల యోజనముల దూరమున కుజుడు, అచటికి రెండు లక్షల యోజనముల దూరమున గురుడు, ఆచటకు రెండు లక్షల యోజనముల దూరమునశనియు ఉన్నారు. అక్కడికి లక్ష యోజనముల దూరమున సప్తర్షిమండల మున్నది. సప్తర్షిమండలమునకులక్ష యోజనముల దూరమున ధ్రువుడు ఉన్నాడు. త్రిలోకముల ఎత్తు ఇదియే. ధ్రువునకు కోటి యోజనముల దూరమున మహర్లోక మున్నది. కల్పాంతజీవులగు భృగ్వాదులు ఆ లోకరమునందుందురు. మహార్లోకమునుండి రెండు కోట్ల యోజనముల దూరమున జనలోక మున్నది. సనక-సనందనాది సిద్దపురషులు అచట నివసింతురు. జనలోకము నుండి ఎనిమిది కోట్ల యోజనముల దూరమున తపోలోక మున్నది. అచట వైరాజు లను దేవతలు నివసించుచుందురు. తపోలోకమునుండి తొంబదియారు కోట్ల యోజనముల దూరమున సత్యలోకమున్నది. మృత్యురహితు లగు పుణ్యాత్ములు, దేవతలు, ఋషులు ఆసత్యలోకమునందు నివసింతురు. దానికే బ్రహ్మలోక మని పేరు.

పాదగమ్యస్తు భూర్లోకో భువః సూర్యాన్తరః స్మృతః | 11

స్వర్గలోకో ధ్రువాన్తస్తు నియుతాని చతుర్దశ | ఏతదణ్డకటాహేన వృతో బ్రహ్మణ్డవిస్తరః. 12

వారివహ్న్యనిలాకాశైస్తతో భూతాదినా బహిః | వృతం దశగుణౖ రణ్డం భూతాదిర్మహతా తథా. 13

దశోత్తరాణి శేషాణి ఏకైకస్మాన్యమహామునే | మహాన్త ం చ సమావృత్య ప్రధానం సమవస్థితమ్‌. 14

అనన్తస్య చ తస్యాన్తః సంఖ్యానాం నాపి విద్యతే | హేతుభూతమశేషస్య ప్రకృతిః సా పరా మునే. 15

అసంఖ్యాతాని చాణ్డాని తత్ర జాతాని చేదృశామ్‌ | దారుణ్యగ్నిర్యథా తైలం తిలే తద్వత్పుమానితి. 16

ప్రధానే చ తతో వ్యాపీ చేతనాత్మాత్మవేదనః | ప్రధానం చ పుమాంశ్చైవ సర్వభూతాత్మభూతయా 17

విష్ణుశక్త్యా మహాప్రాజ్ఞకృతౌ సంశ్రయధర్మిణౌ | తయోః సైవ పృథగ్భావే కారణం సంశ్రయస్య చ. 18

క్షోభకారణభూతశ్చ సర్గకాలే మహామునే. 19

జగచ్ఛక్తిస్తయా విష్ణోః ప్రధానప్రతిపాదికామ్‌ | విష్ణుశ క్తిం సమాసాద్య దేవాద్యాః సంభవన్తి హి. 20

స చ విష్ణుః స్వయం బ్రహ్మ యతః సర్వమిదం జగత్‌|

పాదములతో నడచి వెళ్ళునంతవరకు ఉన్నది భూలోకము భూలోకము-సూర్యమండలములమధ్య నున్న లోకము భువర్లోకము. సూర్యలోకమునుండి ధ్రువలోకమువరకును ఉన్నది స్వర్గలోకము. దాని విస్తారము పదునాలుగు లక్షల యోజనములు. ఇదే త్రైలోక్యము. అండకటాహముచే చుట్టబడి యున్న విస్తృత బ్రహ్మాండ మిదియే; ఈ బ్రహ్మాండమును క్రమముగ జల- అగ్ని-వాయు-ఆకాశరూపములగు ఆవరణములు బైట ఆవరించి యున్నవి. వీటి అన్నింటి పైన అహంకారావరణ మున్నది. ఈ జలాద్యావరణములు ఉత్తరోత్తరము పదిరెట్లు చొప్పున ఉండును. ఆహంకారరూపావరణమును మహత్తత్వరూపావరణము చుట్టియున్నది. మహామునీ! ఈ ఆవరణము లన్నియు ఒకదాని కంటె ఒకటి క్రమముగ పదిరెట్లు పెద్దది. ప్రధానము మహత్తత్వమును కూడ ఆవరించి యున్నది. దాని కెన్నడును అంతములేదు గాని అనంతము. అందుచేతనే దానికి సంఖ్యగాని, ప్రమాణము గాని లేదు. మునీ! అది సకల జగత్కారణము. దానికే అపరాప్రకృతి యని పేరు. దానినుండి అసంఖ్యాకము లగు బ్రహ్మాండములు పుట్టినవి. కాష్ఠమునందు అగ్ని, తిలమునందు తైలము ఉన్నట్లు ప్రధానముందు స్వయంప్రకాశ చేతనాత్మకు డగు వ్యాపకుడైన పురుషు డున్నాడు. ఓ మహాప్రాజ్ఞా! పరస్పర సంయుక్తులైన ప్రకృతిపురుషులు సకలభూతముల ఆత్మ యగు విష్ణుశక్తిచే ఆవరింపబడియున్నారు. మాహామునీ! శ్రీ మహావిష్ణుస్వరూప మగు ఆ శక్తియే ప్రకృతి పురుషుల సంయోగ

అ (44)

వియోగములకు హేతువు.సృష్టిసమయమున వాటియందు క్షోభ కలుగుటకు హేతువు అదియే. జలసంపర్కముచే ఎట్లు వాయువు జలకణములందున్న శీతలత్వమునుధరించునో అట్లే మహావిష్ణుశక్తి ప్రకృతిపురుషమయజగత్తును ధరించుచున్నది. విష్ణుశక్తి అశ్రయమువవలననే దేవతాదులు ప్రకట వమగుచున్నారు. ఆ విష్ణువే బ్రహ్మ. సకలజగత్కారణము.

యోజనానాం సహస్రాణి భాస్కరస్య రథో నవ. 21

ఈశాదణ్డస్తథైవాస్య విగుణో మునిసత్తమ | సార్దకోటిస్తథా సప్త నియుతాన్యధికాని వై. 22

యోజనానాం తు తస్యాక్షస్తత్ర చక్రం ప్రతిష్ఠతమ్‌ | త్రినాభీమతి పఞ్ఛారం షణ్ణమి ద్వ్యయనాత్మకమ్‌. 23

సంవత్సరమయం కృత్స్నం కాలచక్రం ప్రతిష్ఠతమ్‌ | చత్వారింశత్సహస్రాణి ద్వితీయాక్షో వివస్వతః. 24

పఞ్చాన్యాని తు సార్దాని స్యన్దనస్య మహామతే | అక్షప్రమాణముభయోః ప్రమాణం తద్యుగార్దయోః. 25

హ్రస్వో7క్షస్తద్యుగార్దం చ ధ్రువాధారం రథస్యవై | హయశ్చ సప్త చ్ఛాన్దంసి గాయత్య్రాదీని సువ్రత.

ఉదయాస్తమనం జ్ఞేయం దర్శనాదర్శనం రవేః | యావన్మాత్రప్రదేశే తు వసిష్ఠావస్థితో ధ్రువః 27

స్వయమాయాతి తావత్తు భూమేరాభూతసంప్లవే | ఊర్ధ్వోత్తరమృషిభ్యస్తు ధ్రువో యత్ర వ్యవస్థితః. 28

ఏతద్విష్ణుపదం దివ్యం తృతీయం వ్యోమ్ని భాస్వరమ్‌|

నిర్దూతదోషపఙ్కానాం యతీనాం స్థానముత్తమమ్‌. 29

తతో గఙ్గా ప్రభవతి సర్వపాపప్రణాశినీ | దివి రూపం గర్జేర్ఞేయం శింశుమారాకృతి ప్రభోః. 30

మునిశ్రేష్ఠా! సూర్యుని రథము విస్తారము తొమ్మిది వేల యోజనములు. దాని ఈషాదండము దీనికి రెట్టింపు-పదెనిమిదివేల యోజనముల పొడవైనది. దాని ఇరుసు ఒకటిన్నర కోట్ల ఏడులక్షల పొడవు గలది. దానిపై చక్రము తగల్చియున్నది. దానికి పూర్వాహ్ణ-మధ్యాహ్న-అపరాహ్నము లను మూడు నాభు లున్నవి. సంవత్సర-పరివత్సర-ఇడావత్పర అనువత్సర-వత్సరములుఐదు ఆకులు. ఆరు ఋతువులు ఆరు నేములు, రెండు ఆయనములు దాని శరీరము. ఈ సంవత్సరమయరథచక్రమున కాలచక్ర మంతయు ప్రతిష్ఠిత మైనది. మహామతీ! సూర్యరథము ధుర నలుబదియైదు వేల పొడవైనది. దాని యుగము (కాడి)లో సగము భాగము రెండు ధురల పరిమాణముతో తుల్యము. ఆ రథము నందలి చిన్న ధురయు దానియుగార్ధము ధ్రువాధారముపై ఉన్నవి. ఉత్తమవ్రతపాలకా! గాయాత్ర్యాది ఛందఃసప్తకము సూర్యుని ఏడు గుఱ్ఱములు. సూర్యుడు కనబడుట ఉదయము-కనపడకుండుట అస్తమయము, వసిష్ఠా! పృథివి మొదలు ధ్రవుని వరకును ఉన్న ప్రదేశము ప్రలయకాలమునందు నశించిపోవును. సప్తర్షుల పైన ఉత్తరముగ ధ్రవుడున్న ప్రదేశము విరాడ్రూపుడగు శ్రీమహావిష్ణువు మూడవ పదము. పుణ్యపాపములు క్షీణింపగా దోషరూపపంకవిముక్తు లగు సంయతచిత్తు లైన మహాత్ములకు అది నివాసస్థానము. ఈ విష్ణుపదమునుండియే గంగ ఆవిర్భవించినది. గంగ సంస్మరణమాత్రముచేతనే సకల పాపములను నశింపచేయును. ఆకాశమునందు శింశుమారాకృతితో నున్న నక్షత్రసముదాయము విష్ణుస్వరూపమైనది.

స్థితః పుచ్ఛే ధ్రువస్తత్ర భ్రమన్‌ భ్రామయతి గ్రహాన్‌ | సరథో7ధిష్ఠితో దేవైరాదిత్యైరృషిభిర్వరైః. 31

గన్దర్వైరప్సరోభిశ్చ గ్రామణీసర్పరాక్షసైః | హిమోష్ణవారివర్షాణాం కారణం భగవాన్రవిః. 32

ఋగ్వేదాదిమయోవిష్ణుః స శుభాశుభకారణమ్‌ | రథస్త్రిచక్రః సోమస్య కున్దాభాస్తస్య వాజినః. 33

వామదక్షిణతో యుక్తాదశ తేన చరత్యసౌ | త్రయస్త్రిం శత్సహస్రాణి త్రయస్త్రింశచ్ఛతాని చ. 34

త్రయస్త్రింశత్తథా దేవాః పిబన్తి క్షణదాకరమ్‌| ఏకాంకలాం చ పితర ఏకామారశ్మిసంస్థితాః. 35

వాయ్వగ్నిద్రవ్యసంభూతో రథశ్చన్ద్రసుతస్య చ అష్టాభిస్తురగైర్యుక్తో బుధస్తేనచరత్యపి. 36

శుక్రస్యాపి రథో7ష్టాశ్వో భౌమస్యాపి రథస్తథా | బృహస్పతే రథో7ష్ణాశ్వః శ##నే రష్టాశ్వకో రథః. 37

స్వర్భానోశ్చ రథోష్టాశ్వః కేతో7శ్చాష్టాశ్వకో రథః | యదద్య వైష్ణవః కాయస్తతో విప్రవసున్దరా. 38

పద్మాకారా సముద్భూతా పర్వతాద్యాదిసంయుతా | జ్యోతిర్భువననద్యద్రిసముద్రవనకం హరిః. 39

యదస్తి నాస్తి తద్విష్ణుర్విష్ణుజ్ఞానవిజృమ్బితమ్‌ | న విజ్ఞానమృతే కిఞ్చిద్‌ జ్ఞానం విష్ణుః పరంపదమ్‌. 40

తత్కుర్యాద్యేన విష్ణుః స్యాత్సత్యం జ్ఞానమనన్తకమ్‌ | పఠేద్భువనకోశం హియః సో7వాప్తసుఖాత్మభాక్‌.

జ్యోతిః శాస్త్రాదివిద్యాశ్చ శుభాశుభాధిపో హరిః.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే భువనకోశవర్ణనం నామ వింశత్యధికశతతమో7ధ్యాయః.

దాని పుఛ్చభాగము ధ్రువుని స్థానము. ధ్రువుడు తాను తిరుగుచు, చంద్రసూర్యాదులను తిప్పుచున్నాడు. సూర్యుని రథమును ప్రతిమాసమునందును, వేరు వేరు దేవతలు, శ్రేష్ఠులైన ఋషులు, గంధర్వులు, అప్సరసుల యక్షులు, సర్పములు, రాక్షసులు అధిష్ఠించి యుందురు. సూర్యుడే చలి, వేడి, వర్షము మొదలగు వాటికి కారణము. ఋగ్యజుః సామవేదాత్మకు డగు శ్రీమహావిష్ణువు ఈ సూర్యుడే. ఇతడే శుభాశుభముల నిచ్చువాడు. మూడు చక్రములు గల చంద్రుని రథమునకు కుడి ఎడమ వైపుల కుందకుసుమము వలె తెల్లగా నుండు పది గుఱ్ఱములు కట్టబడి యుండును. ఆ రథముపై చంద్రుడు సంచరించును. ముప్పదిమూడు వేల ముప్పదిమూడు వందల ముప్పది ముగ్గురు (36,333) దేవతలు చంద్రుని అమృతమయ కళలను పానము చేయుచుందురు. అమావాస్యయందు, పితృదేవతకలు, 'అమా' అను కళనాశ్రయించి, చంద్రుని మిగిలిన రెండు కళలలో ఒక అమృతకళను త్రాగుదురు. చంద్రుని కుమారుడైన బుధుని రథము వాయ్వగ్నిమయ పదార్థ నిర్మితము. ఎనిమిది గుఱ్ఱము లుండును. ఆ రథముపై బుధుడు సంచరించుచుండును. శుక్ర-కుజ-గురు-శని-రాహు-కేతువుల రథములకు గూడ ఎనిమిదేసి గుఱ్రములుండును. విప్రవరా! శ్రీ మహావిష్ణుస్వరూప మగు జలమునుండి పర్వత-సముద్రాదిసహితము, కమలసదృశము అగుపృథివి ఉత్పన్నమైనది. గ్రహ-నక్షత్ర-త్రిలోక-నదీ-పర్వత-సముద్ర-వనాదు లన్నియు విష్ణుస్వరూపములే. విజ్ఞాన విస్తారము కూడ విష్ణుస్వరూపమే. ''విజ్ఞానము కంటె అతిరిక్తమగు వస్తు వేదియును లేదు. శ్రీ మహావిష్ణువు జ్ఞానస్వరూపుడు. ఆతడే పరమవదము. చిత్తశుద్ధి ద్వారా విశుద్ధ జ్ఞానమును పొంది విష్ణుస్వరూపు డగుటకు తగు ఉపాయములను మానవుడు అవలంబించవలెను. సత్యము, అనంత జ్ఞానమురూపము అగు బ్రహ్మమే విష్ణువు. ఈ భువనకోశమును పఠించువాడు పరమాత్మ పదముపొందును. ఇపుడు నేను జ్యోతిశ్శాస్త్రాది విద్యలను గూర్చి చెప్పెదను. ఈ భువనకోశమును పఠించువాడు పరమాత్మ పదమును పొందును. ఇపుడు నేను జ్యోతిశ్శాస్త్రాది విద్యలను గూర్చి చెప్పెదను. వాటిలో చెప్పిన శుభాశుభఫలములకు అధిపతి శ్రమహావిష్ణువే.

అగ్నిమహాపురాణమునందు భువనకోశవర్ణన మను నూటఇరువదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters