Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ షోడశోత్తరశతతమో7ధ్యాయః.

అగ్ని రువాచ :

ఉద్యతశ్చేద్గయాం యాతుం శ్రాద్దం కృత్వా విధానతః | విధాయ కార్పటీవేషం గ్రామస్యాపి ప్రదక్షిణమ్‌. 1

మధ్యాహ్నే చోద్యతి స్నాత్వా గీతవాద్యైర్హ్యుపాస్య చ | సావిత్రపురతః సన్ధ్యాం పిణ్డదానం చ తత్పదే. 2

అగస్త్యస్య పదే కుర్యాద్యోనిద్వారం ప్రవిశ్య చ | నిర్గతో న పునర్యోనిం ప్రవిశేన్ముచ్యత భవాత్‌. 3

బలిం కాక శిలాయాం చ కుమారం చ వమేత్తతః | స్వర్గద్వార్యాం సోమకుణ్డ వాయుతీర్థేథ పిండదః. 4

భ##వేధాకాశగఙ్గాయాం కపిలాయాం చ పిణ్డదః | కపిలేవం శివం నత్వా రుక్మికుణ్డ చ పిణ్డదః. 5

కోటితీర్థే చ కోటీశం నత్వామోఘపదే నరః | గదాలోకే వా నరకే గోప్రచరే చ పిణ్డదః. 6

నత్వా గావం వైతరిణ్యామేకవింశకులోద్దృతిః | శ్రాద్ధపిణ్డప్రదాతా స్యాత్‌ క్రౌఞ్చపాదే చ పిణ్డదః. 7

తృతీయాయాం విశాలాయాం నిశ్చిరాయాం చ పిణ్డదః | బుణమోక్షే పాపమోక్షే బస్మకుణ్డ7థ భస్మనా. 8

స్నానకృన్ముచ్యతే పాపాన్న మేద్దేవం జనార్దనమ్‌ | ఏష పిణ్డో మయా దత్తస్తవ హస్తే జనార్దన. 9

పరలోకగతే మహ్యమక్షయ్యముపతిష్ఠతామ్‌ | గయాయాం పితృరూపేణ స్వయమేవ జనార్దనః. 10

తం దృష్ట్వా పుణ్డరీకాక్షం ముచ్యతే వై బుణత్రయాత్‌ |

మార్కణ్డయేశ్వరం నత్వా నమేద్గృధ్రీశ్వరం నరః. 11

మూలక్షేత్రే మహేశస్య ధారాయాం పిణ్డదో భ##వేత్‌ | గృధ్రకూటే గృధ్రవటే ధౌతపాదే చ పిణ్డదః. 12

పుష్కరిణ్యాం కర్దమారే రామతీర్థే చ పిణ్డదః | ప్రభాసేశం నమేత్ర్పేతశిలాయాం పిణ్డదో భ##వేత్‌. 13

అగ్నిదేవుడు పలికెను :- మహానదిలో గాయత్రీమంత్రముతోచనే స్నానము చేసి సంధ్యోపాసన చేయవలెను. ప్రాతఃకాలమునందు గాయత్రీ సంముఖమున శ్రాద్ద పిండదానములు అక్షయము లగును. సూర్యోదయ సమయమునందు, మధ్యాహ్నకాలమునందును స్నానము చేసి గీతవాద్యాదులతో సావిత్రీ ఉపాసన చేసి, తత్సంముఖముననే సంధ్యా వందన మాచరించి నదీతటమున పిండదానము చేయవలెను. పిదప అగస్త్యపదమున పిండదానము చేసి, యోనిద్వారమున ప్రవేశించి బైటకు రావలెను. ఇట్లు చేసినవాడు మరల మాతృయోనియందు ప్రవేశించడు; అతనికి పునర్జన్మ ఉండదు. పిదప కాకశిలపై బలి ఇచ్చి కార్తికేయునకు నమస్కారము చేయవలెను. స్వర్గద్వార సోమకుండ - వాయుతీర్థములందు పిండ దానము చేయవలెను. పిదప ఆకాశగంగా - కపిలాతములపై పిండదానము చేయవలెను. అచట కపిలేశ్వరు డగు శివునకు నమస్కరించి ఆమోఘపద - గదాలోల - వాసరక - గోప్రచార తీర్థములందు పిండప్రదానము చేయవలెను. వైతరణియందు గోవుకు నమస్కారము చేసి, పిండదానము చేసినవాడు ఇరువదియొక్క తరములను ఉద్దరించును. వైతరణీ తీరముపై శ్రాద్ధపిండదానములు చేసి పిదప క్రౌంచపాదమున పిండదానము చేయవలెను. తృతీయాతిథియందు విశాలా - నిశ్చిరా - బుణమోక్ష - పాపమోక్షములందు పిండప్రదానము చేయవలెను. భస్మకుండమునందు భస్మస్నానము చేసినవాడు సర్వపాపవిముక్తుడగును. అచట జనార్దనునకు నమస్కరించి ఈ విధముగ ప్రార్థించవలెను - '' జనార్దనా ! ఈ పిండమును నీ చేతిలో ఉంచుచున్నాను. నా కిది పరలోకమునందు అక్షయరూపమున లభించుగాక''. సాక్షాత్‌ విష్ణుమూర్తియే గయలో పితృదేవతారూపమున విరాజిల్లు చున్నాడు. ఆ పుండరీకాక్షుని దర్శనము చేసికొనినవాడు బుణత్రయవిముక్తుడగును. పిదప మార్కండెయేశ్వరునకును గృధ్రేశ్వరునకును నమస్కారము చేయవలెను. మహాదేవుని మూలక్షేత్రమైన ధారలో పిండప్రదానము చేయవలెను. గృధ్ర కూట - గృధ్రవట - ధౌతపాదములందు కూడ పిండప్రదానము చేయవలెను. పుష్కరిణి కర్దమాల - రామ తీర్థములందు పిండప్రదానము చేసి, ప్రభాసేశ్వరునకు నమస్కరించి, ప్రేతశిలపై పిండప్రదానము చేయవలెను.

దివ్యాన్తరిక్షభూమిష్ఠాః పితరో బాన్దవాదయః | ప్రేతాదిరూపముక్తాః స్యుః పిణ్డౖర్దత్తైత్మయాఖిలాః. 14

స్థానత్రయే ప్రేతశిలా గయాశిరసి పావనీ | ప్రభాసే ప్రేతకుణ్డ చ పిణ్డదస్తారయేత్కులమ్‌. 15

వసిష్ఠేశం నమస్కృత్య తదగ్రే పిణ్డదో భ##వేత్‌ | గయానాభౌ సుషుమ్నాయాం మహాకోష్ఠ్యాం చ పిణ్డదః. 16

గదాధరాగ్రతో ముణ్డపృష్ఠే దేవ్యాశ్చ సన్నిధౌ | ముణ్డపృష్ఠం నమేదాదౌ క్షేత్రపాలాదిసం యుతమ్‌. 17

పూజయిత్వా భయం న స్యాద్విషరోగాది నాశనమ్‌ |

బ్రహ్మాణం చ నమస్కృత్య బ్రహ్మలోకం నయేత్కులమ్‌. 18

సుభద్రాం బలభద్రం చ ప్రపూజ్య పురుషోత్తమమ్‌ | సర్వకామసమాయుక్తః కులముద్ధృత్య నాకభాక్‌. 19

హృషీ కేశం నమస్కృత్య తదగ్రే పిణ్డదో భ##వేత్‌ | మాధవం పూజయిత్వా చ దేవో వైమానికో భ##వేత్‌. 20

మహాలక్ష్మీం ప్రార్చ్య గౌరీం మఙ్గలాం చ సరస్వతీమ్‌ | పితౄనుద్ధృత్య స్వర్గస్థో భుక్తభోగో7త్ర శాస్త్రధీః.

ద్వాదశాదిత్యమభ్యర్చ్య వహ్నిం రవేన్తమిన్ద్రకమ్‌ | రోగాదిముక్తః స్వర్గీ స్యాచ్ఛ్రీకపర్దివినాయకమ్‌. 22

ప్రపూజ్య కార్తికేయం చ నిర్విఘ్నః సిద్దిమాప్నుయాత్‌ | సోమనాథం చ కాలేవం కేదారం ప్రపితామహమ్‌.

సిద్ధేశ్వరం చ రుద్రేశం రామేశం బ్రహ్మకేశ్వరమ్‌ | అష్ట లిఙ్గాని గుహ్యాని పూజయిత్వా తు సర్వభాక్‌. 24

నారాయణం వరాహం చ నారసింహం నమేచ్ఛ్రియే | బ్రహ్మవిష్ణుమహేశాఖ్యం త్రిపురఘ్నమశేషదమ్‌. 25

సీతాం రామం చ గరుడం వామనం సంప్రపూజ్య చ |

సర్వకామానవాప్నోనతి బ్రహ్మలోకం నయేత్పితౄన్‌. 26

దేవైః సార్థం సంప్రపూజ్య దేవమాదిగదాధరమ్‌ | బుణత్రయవినిర్ముక్తస్తారయేత్సకలం కులమ్‌. 27

''దివ్యలోక - అంతరిక్షలోక - భూలోకములలో ప్రేతరూపమున నున్న నా పితరులు, ఇతర బంధువులును, ఈ పిండముల ప్రభావముచే ముక్తి పొందుదురుగాక అని చెప్పుచూ పిండ ప్రదానము చేయవలెను. గయాశీర్షము, ప్రభాస తీర్థము, ప్రేతకుండము అను మూడు స్థానములందు ప్రేతశిల అత్యన్తపావన మైన దని చెప్పబడినది. ఇచట పిండప్రదానము చేయువాడు కులోద్ధారము చేసినవా డగును. వసిష్ఠేశ్వరునకు నమస్కరించి అతని ఎదుట పిండప్రదానము చేయవలెను. గయానాభి - సుషుమ్నా - మహాకోష్ఠులందు కూడ పిండప్రదానము చేయవలెను. గదాధరుని ఎదుట, ముండపృష్ఠము పై, దేవీసమీపమున పిండప్రదానము చేయవలెను. వారి పూజచే భయము నశించును. విషరోగాదులు దూర మగును. బ్రహ్మకు నమస్కరించినవాడు తన కులమును బ్రహ్మలోకమునకు పంపును. సుభ్రదను, బలభద్రుని, పురుషోత్తముని పూజించినవాడు సకల కామములను పొంది కులమును ఉద్దరించును! ఆంతమున స్వర్గమునకు పోవును. హృషీకేశునకు నమస్కరించి అతని ఎదుట పిండప్రదానము చేయవలెను. మాధవుని పూజించినవాడు విమానములో సంచరించు దేవతగా అగును. మహాలక్ష్మీ - గౌరీ - సరస్వతుల పూజ చేసినవాడు తన పితరులను ఉద్ధరించి, తాను కూడ స్వర్గమునకు వెళ్ళి అచట బోగములు ననుభవించి, తిరిగి ఈ లోకమునందు జనించి శాస్త్రవిచారము చేయ పండితు డగును; పిదప ద్వాదశాదిత్యులను అగ్నిని, రేవంతకుని, ఇంద్రుని పూజించినవాడు రోగాదివిముక్తుడై అంతమున స్వర్గమునకు పోవును. శ్రీ వరసిద్ధి వినాయకుని, కార్తికేయుని పూజించువానికి నిర్విఘ్నముగ సిద్ధి లభించును. సోమనాధ - కాలేశ్వర - కేదార - ప్రపితామహ సిద్ధేశ్వర - రుద్రేశ్వర - రామేశ్వర - బ్రహ్మకేశ్వరులను ఎనిమిది గుప్తలింగములను పూజించుటచే మానవుడు సర్వమును పొందగలడు. లక్ష్మిప్రాప్తి కోరువాడు నారాయణునకు, వారాహునకు, నరసింహనకును నమస్కరించవలెను. బ్రహ్మకును విష్ణువునకును - త్రిపురనాశకు డగు మహేశ్వరునకును గూడ ప్రణామము చేయవలెను. వారు అన్ని కోరికలను తీర్చు దేవతలు. సీతా - రామ - గరుడ - వామనులను పూజించువాడు సకలకామములను పొందును. పితరులను బ్రహ్మలోకమునకు పంపును. దేవతాసహితుడైన ఆది గదాధరుని పూజించినవాడు బుణత్రయవిముక్తుడై తన కులము నంతను తరింపచేయును.

దేవరూపా శిలా పుణ్యా తస్మాద్దేవయయీ శిలా | గయాయాం న హి తత్‌ స్థానం యత్ర తీర్థం న విద్యతే.

యన్యామ్నా పాతయేత్పిణ్డం తన్నయేద్ర్బహ్మ శాశ్వతమ్‌ |

ఫల్గ్వీశం ఫల్గు చణ్డీం చ ప్రణమ్యాఙ్గార కేశ్వరమ్‌. 29

మాతఙ్గసయ పదే శ్రాద్దీ భరతాశ్రమకే భ##వేత్‌ | హసంతీర్థే కోటితీర్థే యత్ర పాణ్డుశిలాన్నదః. 30

తత్ర స్యాదగ్నిధారాయాం మధుస్రవసి పిణ్డదః | రుద్రేవం కిలికిలేశం నమేద్ధృది వినాయకమ్‌. 31

పిణ్డదో ధేనుకారణ్య పదే ధేనోర్నమేచ్చ గామ్‌ | సర్వాన్‌ పితౄంస్తారయేచ్చ సరస్వత్యాం చ పిణ్డదః. 32

సన్ధ్యాముపాస్య సాయాహ్నే నమేద్దేవీం సరస్వతీమ్‌ | త్రిసన్ద్యాకృద్భవేద్విప్రో వేదవేదాఙ్గపారగః. 33

గయాం ప్రదక్షిణీకృత్య గయావిప్రాన్‌ ప్రపూజ్య చ |

అన్నదానాదికం సర్వం కృతం తత్రాక్షయం భ##వేత్‌. 34

స్తుత్వా సంప్రార్థయేద్దేవమాదిదేవం గదాధరమ్‌ | గదాధరం గయావాసం పిత్రాదీనాం గతిప్రదమ్‌. 35

ధర్మార్థకామమోక్షార్థం యోగదం ప్రణమామ్యహమ్‌ | దేహేన్ద్రియమనోబుద్ధిప్రాణాహఙ్కారవర్జితమ్‌. 36

నిత్యశుద్ధం బుద్ధియుక్తం సత్యం బ్ర నమామ్యహమ్‌హ్మ | అనిన్ద్యమద్వయం దేవం దేవదానవవన్దితమ్‌. 37

దేవదేవీవృన్దయుక్తం సర్వదా ప్రణమామ్యహమ్‌ | కలికల్మషకాలార్తిదమనం వనమాలినమ్‌. 38

పాలితాఖిలలోకేశం కులోద్ధరణమానసమ్‌ | వ్యక్తావ్యక్తవిభక్తాత్మా విభక్తాత్మానమాత్మని. 39

స్థితం స్థిరతరం సారంవ వన్దే ఘోరాఘమర్దనమ్‌ | ఆగతో7స్మి గయాం దేవ పితృకార్యే గదాధర. 40

త్వం మే సాక్షీ భవాద్యేహ అనృణో7హ మృణత్రయాత్‌ | సాక్షిణః సన్తు మే దేవా బ్రహ్మేశానాదయస్తథా.

మయా గయాం సమాసాద్య పితౄణాం నిష్కృతిః కృతా |

గయామాహాత్మ్యపఠనాచ్ర్ఛాద్ధాదౌ బ్రహ్మలోకభాక్‌. 42

పితౄణామక్షయం శ్రాద్ధమక్షయం బ్రహ్మలోకదమ్‌.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయ గయామాహాత్మ్యం నామ షోడశాధికశతతమో7ధ్యాయః.

ప్రేతశిల దేవరూపమైన దగుటచే పరమ పవిత్ర మైనది. గయలో ఆ శిల దేవయయి. గయలో ఎవరి ఈ పిండదానము అది ఆతనిని సనాతన బ్రహ్మమునందు ప్రతిష్ఠింపచేయును. ఫల్గ్వీశ్వర - ఫల్గుచండీ- అంగారకేశ్వలకు నమస్కరించి మతంగముని స్థానమునందు పిండప్రదానము చేయవలెను. పిదప భరతాశ్రమమునందు కూడ పిండ ప్రదానము చేయవలెను. అదే విధముగ హంసతీర్థ-కోటితీర్థములందు గూడ చేయవలెను, పాండుశిలానద మున్న స్థానము నందు అగ్నిధారా-మధుశ్రవాతీర్థములందు పిండదానము చేయవలెను. పిదప ఇంద్రేశ్వర-కిలకిలేశ్వర-వృద్ధివినాయకులకు నమస్కరించి, ధేనుకారణ్యము పిండప్రదానము చేసి ధేనుపదమునందు గోవుకు నమస్కారము చేయవలెను. అందరు పితరులను ఉద్ధరింబడుదురు. పిదప సరస్వతీతీర్థమునకు వెళ్ళి పిండప్రదానము, చేయవలెను. సాయంకాలమన సంధ్యోపాసన చేసి సరస్వతీదేవికి నమస్కరించవలెను. ఇట్లుచేయువాడు త్రికాలసంధ్యావందనము చేయు, వేదవేదాంగపారంగతు డైన బ్రాహ్మణుడు అగును. గయాప్రదక్షిణముచేసి అక్కడ నున్న బ్రాహ్మణులను పూజించుటచే గయాతీర్థములో చేసిన అన్న దానాదిక పుణ్యము అక్షయ మగును. గదాధరుని స్తుతించి ఈ విధముగా ప్రార్థించ వలెను. ''ఆదిదేవుడును, గదాధారియు గయానివాసియు, పితరులకు సద్గతినిచ్చువాడును, యోగదాతయు అగు గదాధరునకు ధర్మార్థకామమోక్షప్రాప్తికై నమస్కరించుచున్నాను. అతడు దేహేంద్రియమనో బుద్ధిప్రాణాహంకారశూన్యుడు. నిత్యశుద్ధ-బుద్ధ-ముక్త-స్వభావుడు, ద్వైతశూన్యుడు దేవదానవాదివందితుడు దేవతలను, దేవీగణమును కూడ సర్వదా ఆయన సేవ చేయుచుందురు. నేను అతనికి నమస్కరించుచున్నాను: అతడు కలికల్మషములను, కలిపీడను తొలగించువాడు. అతని కంఠమున వనమాల ప్రకాశించుచున్నది. సకలలోకపాలకులను పాలించువాడు కూడ ఆతడే. అందరి కులములను ఉద్ధరించుట కై నిశ్చయించుకొని యున్నవాడు. తన స్వరూపమును వ్యక్తావ్యక్తరూపము లగు అన్ని వస్తువులందును విభజించి యున్నను అతడు వాస్తవమున అవిభక్తస్వరూపుడు. అత్యంతస్థిరుడు సారభూతుడు; భయంకరములగు పాపములను తొలగించువాడు. నేను అతని చరణములకు నమస్కరించుచున్నాను. దేవా! గదాధరా! నేను నా పితరులకు శ్రాద్దము చేయుటకై గయకువచ్చినాను. నీవే ఈ విషయమున సాక్షిగా నుండుము. నే నీనాడు బుణత్రయవిముక్తుడ నైతిని. బ్రహ్మరుద్రాదిదేవతలు నాకు సాక్షులుగా ఉందురుగాక. గయ వచ్చి నేను పితరులను ఉద్ధరించితిని. శ్రాద్ధాది సమయములందు ఈ గయామాహాత్మ్యమును పలికించుటచే మానవుడు బ్రహ్మలోకమునకు పోవును. గయలో చేసిన పితృశ్రాద్దము, అక్షయము. అక్షయబ్రహ్మలోకము నిచ్చును.

అగ్నిమహాపురాణమునందు గయాశ్రాద్ధవిధి యను నూటపదునారవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters