Paramacharya pavanagadhalu    Chapters   

78. ఆభాణకం

ఒకసారి పుట్టపర్తి నారాయణాచార్యలు గారు, పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న శ్రీవారణాసి రామమూర్తి (రేణు) గారు స్వాముల వారి దర్శనం చేసుకున్నారు.

అప్పుడు గజేంద్ర మోక్షంలో

''తన వెంటన్‌ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతమున్‌ దాని వె

న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుః కౌమోదకీశంఖ చ

క్రనికాయంబును నారదుండు ధ్వజినీ కాంతుండుదా వొచ్చి రొ

య్యన వైకుంఠపురంబునం గలుగువారాబాలగోపాలమున్‌''

అన్న పద్యం గురించి చర్చ వచ్చింది.

రామమూర్తి గారు దానిని వినిపించారు. అది విని స్వామి 'యిదే విధంగా సంస్కృతంలో (వ్యాసభాగవతంలో కాదు) ఒక ఆభాణకం వుంది తెలుసా'' అన్నారు.

నారాయణచార్యుల గారు గాని, రేణుగారు గాని దానిని గురించి వినలేదు.

అప్పుడు స్వామి వినిపించారు:

లీలాలోలతమాం రమా మగణయన్‌ నీలా మనాలోకయన్‌

ముంచన్‌ కించ మహీం, అహేశ్వర మయం ముంచన్‌ హఠాద్వంచయన్‌

ఆకర్షన్‌ ద్విజరాజ మప్యతిజవాత్‌ గ్రాహాచ్చ సంరక్షితుం

శ్రీగోవింద ఉది త్వరత్వర ఉదైత్‌ గ్రాహా గ్రహార్తం గజం'

శివాపచారాన్ని గురువు తొలగిస్తాడు. కాని గురువు పట్ల అపచారం చేస్తే ఎవరు తొలగించగలరు? - అని రుద్రయామళం అడుగుతుంది. శివునికన్న గురువే ఉత్తముడు. మనం ఏ కార్యం ప్రారంభించినా ఓం గురుభ్యోనమః అంటూ మొదలెట్టాలి. అందుకనే శ్రీరుద్రంలో నమః శంకరాయచ అన్న తరువాతే 'ఏ నమం శివాయ చ' అని పంచాక్షరిని చెప్పారు.

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters