Paramacharya pavanagadhalu    Chapters   

67. నగరేషు కాంచీ

మధుర మీనాక్షి, కంచి కామాక్షీ, కాశీ విశాలాక్షి అని అమ్మవారు ముఖ్యంగా యీ మూడుచోట్లా ప్రసిద్ధి చెందింది.

'నారీషు రంభా

నగరేషు కాంచీ,

అన్న నానుడిని బట్టి కాంచీ నగర ప్రశస్తి తెలుస్తుంది.

కాంచీపురం భారతమాతకు మొలనూలులా (వడ్డాణంలా) వుంటుంది. కాంచీ అంటే అర్థం కూడా మొలనూలే. కాంచీ నగరం శ్రీ చక్రాకృతిగా వుంది. అందులో కామాక్షిగుడి మధ్యలో బిందు స్థానంలో వుంటుంది. కామాక్షిదేవే కంచికి ప్రధాన దేవత. ఈ వూళ్లోని అన్ని దేవాలయాల గోపురాలూ కామాక్షి గుడివేపు తిరిగి వుంటాయి.

కంచిలో చిదాకాశరూపమే (బిలాకౌశం) అమ్మవారి కారణరూపం. శ్రీ రాజరాజేశ్వరీ స్వరూపిణి అయిన యీ తల్లి యిక్కడ సిద్దాసనంలో స్థూలరూపంలో దర్శనమిస్తుంది. ఆమెకు నాలుగు చేతులు వున్నాయి. పంచపుష్పబాణాలు, పాశం, చెరకుగడతో చేయబడిన విల్లు, అంకుశం-వీటిని ఆమె ధరిస్తుంది. అమ్మవారి విగ్రహం ముందు శ్రీఆదిశంకరులు సాలగ్రామశిల మీద స్వయంగా శ్రీచక్రాన్ని లిఖించి ప్రతిష్ఠించారు. అది అమ్మవారి సూక్ష్మరూపం. అర్చనలన్నీ యంత్రరాజమైన ఆ శ్రీచక్రానికే జరుగుతాయి.

కామాక్షిని పూజించిన వారిలో అగస్త్యమహర్షి కూడా వున్నారు. ఆయన సూచన మేరకే శ్రీరామచంద్రుడు కూడా సీతా వియోగసమయంలో యిక్కడికి వచ్చి ఈశ్వరార్చన చేశాడని చెబుతారు.

'కామాక్షి సదృశీదేవి

నాస్తి మంగళ##దేవతా'

అని (కామాక్షి వంటి మంగళ##దేవత, శుభం కలిగించేదేవి మరొకరు లేరు) ప్రశస్తి.

కంచిలో కామకోటి పీఠం వుంది. ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాలు నాలుగేనని అందులో కంచి కామకోటి పీఠం లేదనే వివాదం వున్నా, యిప్పుడు దాన్నెవరు అంతగా పాటించడం లేదు. ఆదిశంకర భగవత్పాదులు చివరలో కాంచి నగరానికే వచ్చి తాము కాశీనుంచి తెచ్చిన అయిదు స్ఫటిక లింగాలలో ఒకటైన యోగలింగాన్నీ, శ్రీమేరువునూ కామకోటి పీఠంలో వుంచి వాటిని అర్చిస్తూ వచ్చారు. తరువాత యిక్కడే విదేహకైవల్యం (సిద్ధి) పొందారని చెబుతారు.

ఇక్కడి ఏకామ్రేశ్వరాలయంలో ఒక ఆమ్ర వృక్షం (మామిడి చెట్టు) వుంది. వేదాలన్నీ ఈ చెట్టు రూపాన్ని ధరించాయని ప్రతీతి. అందుకే యిక్కడి ఈశ్వరునికి ఏ కామ్రేశ్వరుడని పేరు వచ్చింది. రథ సప్తమినాడు సూర్యకిరణాలు ఏ కామ్రేశ్వరుని పాదాలను తాకుతాయి. అది ఈ ఆలయ వాస్తు విశేషం. ఏకామ్రేశ్వరుడు పృధ్వి లింగం అంటారు. మోక్షాన్నిచ్చే క్షేత్రాలు ఏడు. అవి: అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, ద్వారక ఈ విషయాన్నే

'అయోధ్యా, మధురా, మాయా

కాశీ, కాంచీ, అవంతికా

పురీ ద్వారవతీ చైవ

సపై#్తతే మోక్ష దాయకాః'

అనే శ్లోకం ద్వారా నిత్యం స్మరిస్తుంటారు.

కంచిలో సర్వతీర్థం అనే సరస్సు వుంది. ఈ సరస్సులోని నీటిలో సర్వతీర్థాలు కలిసి వున్నాయంటారు.

చిదంబరంలో కనక సభయందు నటరాజు ఆకాశలింగంగా నిలిచాడు. కోరిన కోర్కెలను తీర్చి మోక్షమిచ్చే కామాక్షి కంచిలో బిలాకాశరూపంలో వుంది. చిదంబరంలో ఆకాశం సభలో మాత్రమే వుంది. కాని కంచి మొత్తం ఆకాశ##క్షేత్రమే.

కంచి కలుషశోధిని అంటారు. ఇక్కడ ఒక్కరోజు నివసించినా పాపాలు నశించి ముక్తి లభిస్తుంది. లలితాసహస్రనామాలలో 'కామకోటి నిలయాయై నమః' అని వుండగా లలితా అష్టోత్తర శతనామాలలో 'కామకోటి మహాపీఠ మధ్యస్థాయైనమః' అని వుంది. అట్టి త్రిపుర సుందరి వెలిసిన శివజిత్‌ క్షేత్రం కంచి, 'శివజిత్‌' అంటే 'శివుణ్ణి జయించిన' అని అర్థం. శివుడు తపస్సు చేసికొంటుండగా పార్వతి ఆయనకు సపర్యలు చేస్తున్నది అప్పటికి వారికి వివాహం కాలేదు. వారిద్దరకూ జన్మించే కుమారుడు తారకాసుర సంహారం చేయగలడు. అందుకని వారిద్దరికీ పెండ్లి అయేలా చూడాలి. ఈ దేవకార్యాన్ని నిర్వహించటానికి వచ్చిన మన్మధుడు శివునిపై పూలబాణాలు వేశాడు. ఆయన మనస్సు దాని ప్రభావానికి లొంగలేదు. ఇవాళ యిలా ఎందుకు జరుగుతోంది? అని శివుడు ఆలోచించి, దీనికి కారణం ఎవరా అని కళ్లు తెరిచి చుట్టూ చూశాడు. ఆయనకు మన్మథుడు కన్పించగా ఆగ్రహించి మూడో కంటిమంటతో కామదహనం చేశాడు. తరువాత మన్మథుడు అనంగుడై (శరీరంలేనివాడు), కామకోష్టం (కామకోటి)కు వెళ్లి కామాక్షిని గూర్చి తపస్సు చేశాడు. కామాక్షిదేవి ప్రసన్నమై అతనికి దివ్యశరీరం అనుగ్రహించింది. అంతటితో ఆగక అన్ని శివక్షేత్రాలలో వున్న అమ్మవారి కళను ఉపసంహరించి, ఆ శక్తులనన్నిటిని కంచి కామాక్షి ఆలయంలోని బిలాకాశంలోకి ఆకర్షించింది. అందువల్ల శివుని పక్కన ఎక్కడా అంబ లేకుండా అయింది.

బ్రహ్మ శివుని అర్చించటానికి కైలాసం పోగా శివుడు వొంటరివాడై కన్పించాడు. ఏ శివాలయానికి పోయినా పక్కన అమ్మవారు లేదు. శక్తి సాన్నిధ్యం లేని శివసన్నిధి కామాక్షి దేవి మహిమ అని బ్రహ్మ గ్రహించి, ఆమెను గురించి తానూ తపస్సు చేశాడు. 12 సంవత్సరాల ఉగ్ర తపస్సు తరువాత అమ్మవారు ప్రత్యక్షమై శివజిత్‌ క్షేత్రమైన కంచిలో తప్ప అన్ని శివక్షేత్రాలలో ఎప్పటి వలె శక్తి సాన్నిధ్యం వుండేలా అనుగ్రహించింది. బిలాకాశంలో శక్తి ఆకర్షణ చేసిన దాని వల్ల కంచిలోని శివాలయంలో మాత్రం దేవీ సన్నిధి లేదు.

కాశీ క్షేత్రంలో స్పర్శదోషం లేదు. కంచిలోను అంతే, పూజీజగన్నాథంలో అన్నం చేతికి తగిలిన అంటు దోషం లేదు. అందుకే 'సర్వం జగన్నాథం' అంటారు.

పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు మరీ ముఖ్యం. జలంధర్‌లో జ్వాలాముఖి, అస్సాంలో కామరూప (కామాక్ష), కంచిలో కామాక్షి, జ్వాలాముఖిని భృగుమహర్షి భజించాడు. కామరూపను వ్యాసులవారు పూజించారు. కామాక్షిని హయగ్రీవులు అర్చించారు.

కంచిలో వున్న కామకోటిపీఠాన్నీ కర్నాటక యుద్దం వల్ల వొకప్పుడు కుంభకోణానికి తరలించారు. శ్రీచంద్రశేఖర సరస్వతి (పరమాచార్య) దానిని తిరికి కంచికి చేర్చారు.

కంచిలో రెండు భాగాలున్నాయి. ఒక సగం శివకంచి, రెండవ సగం విష్ణుకంచి, శంకరనారాయణుడన్నా, హరిహరుడన్నా యిదే. వరదరాజస్వామి ఉన్నది యిక్కడే. వరదుడంటే వరాలిచ్చే వాడు. తిరుమల వేంకటేశ్వరుని హస్తాలలో ఒకటి వరదహస్తం.

కంచిలో 108 శివలింగాలున్నాయి. 18 విష్ణు క్షేత్రాలున్నాయి.

కామాక్షి మనకిచ్చే ప్రసాదం ఏమిటి? ఆమె మేధను యిస్తుంది. ఇంగ్లీషులో 'జీనియస్‌' అంటారు జీనియస్‌ ఎప్పుడూ మంచిగా వుంటుందని లేదు. అది విపరీత మార్గాలలో పోవచ్చు. కాని మన 'మేధ' విషయంలో అలా కుదరదు. మన సంస్కృతిలో మేధ అంటే సంపదను సద్వినియోగం చేసేందుకుపయోగించే తెలివితేటలు. తైత్తిరీయోపనిషత్తులో సంపదను కోరుకునేముందు, మేధాదానం చేయమని - దానిని సద్వినియోగం చేసే బుద్ధిని యివ్వమని, ముందు ప్రార్ధించు అని వుంది. అట్టి మేధా ప్రదానం చేసిందీ, చేసేది కామాక్షియే.

Paramacharya pavanagadhalu    Chapters