Paramacharya pavanagadhalu    Chapters   

4. ప్రస్తావన

శ్రీకంచి కామకోటి పీఠాధిపతులు, జగద్గురు శంకరాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి (పరమాచార్య) వారిని గురించి తెలియని వారు అరుదు. వారి పావనగాథలు అసంఖ్యాకం. అందులో కొన్నింటిని పుస్తకరూపంగా కూర్చారు. శ్రీ భండారు పర్వతాలరావు. వాటిని ప్రచురించి, తెలుగు పాఠకలోకానికి సమర్పించే సదవకాశం మాకు లభించినందులకు సంతోషిస్తున్నాము.

పొద్దు పొడిచిందా, లేదా అని చూడటానికి దీపం వెలిగించనక్కరలేదు. కాని కొన్ని సార్లు గది కిటికీ తెరిచి చూడాల్సిరావచ్చు. లోక ప్రసిద్ధ చరిత్రులయిన పరమాచార్య పవిత్ర జీవిత విశేషాలను తెలుసుకోడానికి అలా తెరిచిన చిన్న కిటికి తలుపు మాత్రమే, ఈ పుస్తకం.

ఉన్నత పాఠశాలలోపు విద్యార్థులకు, ఎక్కువగా చదువుకో లేకపోయిన గ్రామీణ ప్రజలకు, మహిళలకు గూడా సులభంగా అర్థమయ్యే శైలిలో ఈ కథలను కూర్చటం, అందరికీ అందుబాటులో వుండే విధంగా యీ పుస్తకం వెల కేవలం రూ.10.00 వుంచటం జరిగింది. పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము కంచి కామకోటి పీఠానికే సమర్పించబడుతుంది. పరమాచార్య గురించి మరింత ఎక్కువగా తెలుసుకోగోరే వారి ఉపయోగార్థం అందుకుపయోగించే పుస్తకాల జాబితా కూడా యిందులో చేర్చటం జరిగింది. ఈ పుస్తకాన్ని వెలువరించటంలో సహాయ సహకారాలందజేసిన వారందరకూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యీ చిన్న ప్రయత్నాన్ని పాఠకులాదరించగలరని ఆశిస్తున్నాము.

- జంధ్యాల హరినారాయణ, I.A.S.,

అధ్యక్షులు

నేషనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌

హైదరాబాదు

కంచి కామాక్షి

పాద పద్మాలకు

- భక్తిప్రపత్తులతో

-రచయిత

Paramacharya pavanagadhalu    Chapters