Sri Devi Bagavatham-2    Chapters   

అథత్రయస్త్రింశోధ్యాయః

ధర్మరాజ ఉవాచ: హరిసేవారతః శుద్దో యోగసిద్దివ్రతీ సతి | తపస్వీ బ్రహ్మచారీ చ న యాతి నరకం ధ్రువమ్‌. 1

కటువా చా బాంధవాం శ్చ బలలేపేన యెనరః | దగ్దా న్కరోతి బలవా న్వహ్నికుందం ప్రయాతి సః 2

స్వ గాత్రలోమమానా బ్దం తత్ర స్థిత్వా హుతాశ##నే | పశుయోని మవాప్నోతి రౌద్ర దగ్దాం త్రిజన్మని. 3

బ్రాహ్మణం తృషితం తప్తం క్షుధితం గృహ మాగతమ్‌ | న భోజయతి యో మూఢ స్తప్తకుండం ప్రయాతి సః 4

తత్ర తల్లోమ మానం చ వర్షం స్థిత్వా చ దుఃఖదే | తప్తస్థలే వహ్నితల్పే పక్షీ చ సప్త జన్మసు. 5

రవివారే చ సంక్రాంత్యా మమాయాం శ్రాద్దవాసరే | వస్త్రాణాం క్షారసంయోగం కరోతి కేవలం నరః 6

స యాతి క్షారకుండం చ సూత్రమానాబ్దమేవ చ | స వ్రజే ద్రజీకం యోనిం సప్త జన్మసు భారతే. 7

మూలప్రకృతి నిందాంయః కురుతే మానవాధమః | వేదనిం దాం శాస్త్రనిం దాం పురాణానాం తథైవ చ. 8

బ్రహ్మా విష్ణుశివాదీనాం తథా నిందాపరోజనః | గౌరీ వాణ్యాది దేవీనాం తథా నిందాపరోజనః. 9

తే సర్వే నిరయే యాంతి తస్మిన్కుండే భయానకే | నాతః పరతరం కుండం దుఃఖదం తు భవిష్యతి. 10

తత్ర స్థిత్వానేక కల్పం సర్పయోనిం ప్రజేత్పునః | దేవీ నిందాపరాధస్య ప్రాయశ్చిత్తం న విద్యతే. 11

స్వ దత్తాం పరాదత్తాం వా వృత్తిం చ సుర విప్రయోః | షష్టి వర్ష సహప్రాణి విట్కుండం చ ప్రయాతిసః. 12

తాంవంత్యేవ చ వర్షాణి విడ్బోజీ తత్ర తిష్ఠతి | షష్టి వర్ష సహప్రాణి విట్కృమి శ్చ పునర్బువి. 13

పరకీయ తటాకే చ తడాకం యః కరోతి చ | ఉత్సృజే ద్దైవ దోషేణ మూత్రకుండం ప్రయాతి సః. 14

ముప్పదిమూడవ అధ్యాయము

సావిత్ర్యుపాఖ్యానము

ధర్మరాజిట్లనెను : హరిసేవలో నిమగ్నుడు - శుద్ధాత్ముడు యోగసిద్దుడు - తబిసి - బ్రహ్మచారి యగువా రెన్నటికిని నరకమును చూడరు. ఎవడు తన బంధువులను విద్యాధనమదమున పరుషముగ మాటాడునో వారి మనసు నొప్పించునో యతడు వహ్నికుండమున పడును. అతడు తన కెన్ని రోమములు గలవో యన్ని యేడులు దానిలో కుమిలి మ్రగ్గి పిదప నీడలేని వనమునందు మూడు జన్మలవఱకు పశువై పుట్టును. తన యింటి కాకలిదప్పికలతో వచ్చిన బ్రాహ్మణుల యాకలి దప్పులు దీర్చనివాడు తప్తకుండమున గూలును. తన రోమము లెన్నో యన్ని యేండ్లు దానిలో తపించి పిదప నేడు జన్మల దాక మంటలు మండుచోట మండుసెజ్జపై పక్షిగ పుట్టును. ఆదివారము అమావాస్య సంక్రాంతి శ్రాద్దదినము ఈ నాళ్లలో వస్త్రములను క్షారముతో నుతుకువాడు దానిదారము లెన్ని గలవో యన్ని యేండ్లు క్షారకుండమున పడును. పిదప నతడు ఏడు జన్మలవఱకు భారతభూమిపై చాకలిగ పుట్టును. ఏ మానవాధముడు మూలప్రకృతిని వేదశాస్త్ర పురాణములను నిందించునో ఎవడు బ్రహ్మ-విష్ణు-శివులను నిందించునో గౌరి-సరస్వతి మొదలగు దేవతలను నిందించునో ఆ నిందించు వారందఱును క్షారకుండమను భీకర నరకమున గూలుదురు. దుఃఖము గల్గించు కుండములలో దీనిని మించినది లేదు. అందు పెక్కు కల్పము లున్న తర్వాత పాముగ బుట్టును. దేవిని నిందించిన నేరమునకు ప్రాయశ్చిత్తము లేదు. తానుగాని యితరులు గాని యిచ్చిన బ్రాహ్మణవృత్తులు తిరిగి తీసికొనువా డరువది వేలేండ్లు విట్కుండమున బాధలు పడుచుండును. అన్నియేండ్లచట నశుద్దము తినును. పిదప నత డన్నేండ్లవఱకును మలములోని పురుగైపుట్టును. ఇతరుల చెఱువు నెవడు తన చెఱువుగ జేసికొనునో మఱి అందు మూత్రము విడుచునో యతడు మూత్రకుండమున గూలును.

తద్రేణు మాన వర్షం చ తద్బోజీ తత్ర తిష్ఠతి | పునః పూర్ణశతాబ్దం చ సవృషో భారతేభ##వేత్‌. 15

ఏకాకీ మిష్ట మశ్నాతి శ్లేష్మ కుండం ప్రయాతి చ | పూర్ణ మబ్ద శతం చైవ తద్బోజీ తత్ర తిష్ఠతి. 16

తతః పూర్ణశతాబ్దం చ సప్రేతో భారతే భ##వేత్‌ | శ్లేష్మ మూత్ర పరంచైవ పూయం భుంక్తే తతః శుచిః. 17

పితరం మాతరం చైవ గురుం భార్యాం సుతం సుతామ్‌ | యో న పుష్ణా త్యనా థం చ గరకుండం ప్రయాతిసః.

పూర్ణ మబ్దశతం చైవ తద్బోజీ తత్ర తిష్ఠతి | తత్రో ప్రజే ద్బూత యోనిం శతవర్షం తతః శుచిః. 18

దృష్ట్వా7తిథిం వక్రచక్షుః కరోతి యోహిమానవః | పతృ దేవా స్తస్య జలం న గృహ్ణాంతి చ పాపినః. 20

యానికాని చ పాపాని బ్రహ్మహత్యా దికాని చ | ఇహైవ లభ##తే చాంతే దూషికా కుండమా ప్రజేత్‌. 21

పూర్ణమబ్దశతం చైవ తద్బోజీ తత్ర తిష్ఠతి | తతో ప్రజే ద్బూతయోనిం శతవర్షం తతః శుచిః. 22

దత్వా ద్రవ్యం చ విప్రాయ చాన్య సై#్మ దీయతేయది | సతిష్ఠతి వసా కుండం తద్బోజీ శతవత్సరమ్‌. 23

కృకలాసో భ##వేత్సోపి భారతే సప్త జన్మసు | తతో భ##వేన్మహా రౌద్రో దరిద్రోల్పాయురేవ చ. 24

పుమాంసం కామినీ వాపికామినిం వా పుమానథ | యః శుక్రం పాయ యత్యేవ శుక్రకుండం ప్రయాతిసః. 25

పూర్ణ మబ్దశతం చైవ తద్బోజీ తత్ర తిష్ఠతి | కృమి యోనిం శతాబ్దం ప ప్రజే ద్బూత్వా తతః శుచిః. 26

సంతాడ్య చ గురుం విప్రం రక్త పాతం చ కారయేత్‌ | స చ తిష్ఠత్య సృ క్కుండే తద్బోజీ శతవత్సరమ్‌. 27

తతో లభే ద్వ్యా ఘ్రజన్మ సప్త జన్మసు భారతే | తతః శుద్ది మవాప్నోతి మానవ శ్చ క్రమేణహ. 28

అందలి రేణువు లెన్నో యన్ని యేండ్లు మూత్రము త్రాగును, పిదప నూఱండ్లవఱకు నైలపై నెద్దుగ పుట్టును. ఎవడు తీపి వస్తువులు తానొక్కడే తినునో యతడు శ్లేష్మకుండమందుగూలి నూఱడులు దానిని తినుచుండును. ఆ పిదప నేలపై నూఱండ్లవఱకును ప్రేతమై తిరుగుచు శ్లేష్మము - మలమూత్రములు కుడుచుచు పిమ్మట పరిశుద్దు డగును. తల్లిదండ్రు లను-గురువులను-దిక్కులేనివారిని-భార్యను-పిల్లలను పోషింపనివాడు విషకుండమునందు గూలును. అట విషము నూఱండ్లు త్రాగుచు పిదప భూతమై పుట్టి మఱి నూఱండ్లకు పరిశుద్ధాత్ము డగును. ఇంటికి వచ్చిన యతిథిని చూచియును చూడనట్లు మొగము త్రిప్పుకొనువా డిచ్చునట్టి తిలతర్పణము లతని పితరులు గైకొనరు. అతడేయే బ్రహ్మహత్యాది పాతకములు గలవో వాని నెల్ల పొంది పిదప దూషికా(కంటిపుసి) కుండమున గూలును. అతడు దానిని నుఱండ్లవఱకు దినుచు పిదప భూతమై పుట్టి మఱి నూఱండ్లకు పవిత్రుడు గాగలడు. బ్రాహ్మణున కిచ్చెద నన్న ద్రవ్యము మఱియొకని కిచ్చినవాడు వసాకుండమునబడి దానినే తినుచు నూఱండ్లుండును. పిమ్మట నేడుజన్మలు తొండగబుట్టి తర్వాత నల్పాయువుగల దరిద్రుడుగా బుట్టును. స్త్రీకి పురుషుడుగాని పురుషునకు స్త్రీ గాని శుక్రమును త్రావువారు శుక్రకుండమున పతన మందుదురు. అచట దానిని నూఱండ్లు త్రాగుచు నూఱండ్లు కీటకముగ బుట్టి యా తరువాత పవిత్రులు గాగలరు. గురునిగాని బ్రాహ్మణునిగాని గొట్టి యతిని నెత్తురు నేల చిందించనవాడు రక్తకుండమున నూఱండ్లు రక్తపానము చేయును. పిమ్మట భూమిపై నేడు న్మలవఱకు వ్యాఘ్రముగ బుట్టి వరుసగ మానవుడై పుట్టి పవిత్రు డగును.

యోశ్రు తత్యాజ గాయంతం భక్తం దృష్ట్వా సగద్గదం | శ్రీ కృష్ణగుణ సంగీతే హసత్యేవహి యోనరః. 29

స వసే దశ్రుకుండేచ తద్బోజీ శతవర్షకమ్‌ | తతో భ##వే చ్చ చాండాల స్త్రీ జన్మని తతః శుచిం. 30

కరోతి శఠతాం తద్వ న్నిత్యం సుహృది యోనరః | కుండం గాత్రమాలానాం చ స ప్రయాతి శతాబ్దకమ్‌. 31

తతః స గార్దభీం యోని మవాప్నోతి త్రిజన్మసు | త్రిజన్మసు చ సార్గాలీం తతం శుద్ధో భ##వే ద్ద్రువమ్‌. 32

బధిరం యోహసత్యేవ నిందత్యేవాభి మానతః | స వసే త్కర్ణ విట్కుండే తద్మోజి శతవత్సరమ్‌. 33

తతో భ##వేత్స భధిరో దరిద్రః సప్త జన్మసు | సప్త జన్మ స్వంగహీన స్తతః శుద్దిః లబే ద్ద్రువమ్‌. 34

లోభాత్స్వ భరణార్థాయ జీవినం హంతి యోనరః | మజ్జా కుండే వసేత్సోపి తద్బోజీ లక్షవత్సరమ్‌. 35

తతో భ##వేచ్చ శశకో మీనశ్చ సప్త జన్మసు | త్రిజన్మని వరాహశ్చ కుక్కుటః సప్త జన్మసు. 36

ఏణాదయ శ్చ కర్మభ్య స్తతః శుద్దిం లభే ద్ద్రువమ్‌ | స్వకన్యా పాలనం కృత్వా విక్రీణాతి చ యోనరః. 37

అర్థలోభా న్యహా మూఢో మాంసకుండం ప్రయాతి సః | కన్యాలోమ ప్రమాణాబ్దం తద్బోజీ తత్ర తిష్ఠతి. 38

తస్య దండప్రహారం చ కుర్వంతి యమకింకరాః | మాంసభారం మూర్ద్ని కృత్వా రక్తభారం లిహేత్‌క్షుదా. 39

తతో హి భారతే పాపీ కన్యా విట్కృమిగో భ##వేత్‌ | షష్టి వర్ష సహస్రాణి వ్యాధ శ్చ సప్త జన్మసు. 40

త్రిజన్మని వరాహశ్చ కుక్కుటః సప్త జన్మసు | మండూకో హి జలౌకాశ్చ తతః శుద్దిం లభే ద్ద్రువమ్‌. 41

సప్త జన్మసు కాకాశ్చ తతః శుద్దిం లభే ద్రువమ్‌ | వ్రతానా ముపవాసానాం శ్రాద్ధాదీనాం చ సంగమే. 42

హృదయము కరగించు నానందబాష్పములు జాలువారగ మధురకంఠముతో శ్రీకృష్ణుని గుణనామ సంకీర్తనము సల్పు పరమభక్తుని చూచి నవ్వువాడు ఆశ్రుకుండమున నూఱండ్లు పడియుండి పిదప మూడుసారులు చండాలుడై పుట్టును. తన మిత్రులను సుహృత్తులను మోసగించువాడు నూఱండ్లు శరీరమలకుండమున గూలును. పీదప మూడుజన్మలు గాడిదగ మఱి మూడు జన్మలు నక్కగ బుట్టి తర్వాత పరిశుద్దు డగును. చెవిటివారిని చూచి నవ్వి నిందించువాడు కర్మ విట్కుండ మునబడి దానినే తినుచు నూఱడు లుండును. అతడు చెవిటివాడై పుట్టి యేడు జన్మలు దరిద్రుడై మఱియేడు జన్మలు వికలాంగుడై తర్వాత పరిశుద్దు డగును. లోభముతో తన పొట్ట నింపుకొనుట కొక ప్రాణిని నిలువున చంపువాడు లక్షయేండ్లు మజ్జాకుండమునబడి దానినే తినుచుండును. తర్వాత నతడు కుదే లగును. ఏడు జన్మలు చేపగ బుట్టును. మఱి మూడు జన్మలు పందిగ నేడు జన్మలు కోడిగ బుట్టును. ఆ పిదప జింకయై పుట్టి తర్వాత శుద్ధాత్ముడగును. కన్యను కని పెంచి పెద్ద చేసినపిదప ధనాశకు ఆ కన్య నమ్ముకొను మూర్ఖుడు మాంసకుండమున గూలి యా కన్య రోము లెన్నో యన్ని యేడు లదే మాంసము తినుచుండును. అతనిని యమభటుల కర్రలతో మోదుదురు. బరువైన మాంసము నెత్తిపై పెట్టి రక్తము త్రాగింతురు. అపాపాత్ముడు భారతభూమిపై నరువదేండ్లు పురుగుగ బుట్టు యేడు జన్మలకు వ్యాఘ్రముగ బుట్టును. ఆతడు మూడు జన్మలు పందిగ నేడు జన్మలు కోజిగ మఱి యేడు జన్మలు కప్పగ జలగగ పుట్టును. అతడు మఱి యేడు జన్మలు కాకిగ బుట్టి యా పిదప పవిత్రుడు గాగలడు. వ్రతోపవాసము లందును శ్రాద్ధదినము లందును-

కరోతి యః క్షౌరకర్మ సోశుచిః సర్వకర్మసు | స చ తిష్ఠతి కుండం నఖాదీనాం చ సుందరి. 43

తద్దైవదివ మానాబ్దం తద్బోజీ దండతాడితః | స కేశం పార్దివం లింగం యో వార్చయతి భారతే. 44

స తిష్ఠతి కేశకుండే మృద్రేణు మానవర్షకమ్‌ | తదంతే యావనీం యోనిం ప్రయాతి హరకోపతః. 45

శతాబ్దా చ్చుద్ది మాప్నోతి రాక్షసః స భ##వే ద్ద్రువమ్‌ | పితౄణాం యో విష్ణుపదే పిండం నైవ దదాతి చ. 46

స చ తిష్ఠ త్యస్దికుండే స్వలోమాబ్దం మహోల్బణ | తతః సు యోనిం సంప్రాప్య కుఖంజః సప్త జన్మసు. 47

భ##వే న్మహా దరిద్రశ్చ తతః శుద్దో హి దేహతః | యఃసేవతే మహామూఢో గుర్విణీం చ స్వకామినీమ్‌. 48

ప్రతప్తే తామ్ర కుండే చ శతవర్షం స తిష్ఠతి | అవీరాన్నం చ యో భుంక్తే ఋతు స్నాతాన్న మేవచ. 49

లోహకుండే శతాబ్దం చ సచ తిష్ఠతి తప్తకే | స వ్రజే ద్రజకీం యోనిం కాకానాం సప్త జన్మసు. 50

మహీవ్రణీ దరిద్రశ్చ తతః శుద్దో భ##వేన్నరః | యోహి చర్మాక్త హస్తేన దేవద్రవ్య ముపాస్పృశేత్‌. 51

శతవర్స ప్రమానం చ చర్మకుండే స తిష్ఠతి | యః శూద్రేణాభ్యసు జ్ఞాతో భుంక్తే శూద్రాన్న మేవచ. 52

స చ తప్త సురాకుండే శతాబ్దం తిష్ఠతి ద్విజః | తతో భ##వే చ్చూద్రయాజీ బ్రాహ్మణః సప్త జన్మసు. 53

శూద్రశ్రాద్దాన్న భోజీ చ తతః శుద్ధో భ##వే ద్ద్రువమ్‌ | వాగ్దుష్టః కటుకో వాచా తాడయే త్స్వామినం సదా. 54

తీక్షణ కంచక కుండే స తద్బోజీ తత్ర తిష్ఠతి | తాడితో యమదూతేన దండేన చ చతుర్గుణమ్‌. 55

తత ఉచ్చైః శ్రవాః సప్తజన్మ స్వేవ తతః శుచిః | విషేణ జీవనం హంతి నిర్దయోయో హి మానవః. 56

క్షౌరము చేయించుకొనువాడు శుభకర్మలన్నిట అవర్హడు సపవిత్రుడగును. అతడు నఖాది కుండమున గూలుగు. అతడచట నొక దేవదినమువఱకు దానినే తినుచు తన్నులు తినుచుండును. భారతదేశము నందు కేశములులంటిన పార్దివలింగమును నర్చించినచో అతడు కేశకుండమునందు అలింగపు మట్టి రేణువులన్ని యేడులు పడియుండును. పిదప హరుని కోపమువలన నతడు యవనుడుగ బుట్టును. అతడు నూఱండ్లుకుశుద్దుడై పిదప రాక్షసుడగును. పితరులకు గయలో పిండము పెట్టనివాడు తనకెన్ని రోమములు గలవో యన్ని యేడు లస్ధికుండమున పడియుండును. పిదప నేడేండ్ల వఱకు ఖంజుడై (అవిటికాలివాడు) పుట్టును. అతడు తర్వాత దరిద్రుడై పరిశుద్దుడగును. గర్బిణియైన తన భార్యతో గూడువాడు మూడుడు. అతడు నూఱండ్లు తామ్రకుండమున గూలును. ఋతు స్నాత చేతియన్నమును అవీరాన్నమును తినువాడు తప్తలోహకుండమున నేడేండ్లు పడియుండును. అతడేడు జన్మలు చకలిగ నేడు జన్మలు కాకాగ బుట్టును. అతడు తర్వాత ప్రణాబాధగల దరిద్రుడుగ బుట్టి తర్వాత పరిశుద్దుడగును. అపవిత్రమగు చేతితో దేవ ద్రవ్యముము తాకువాడు నూఱడులు చర్మకుండమున పడియుండును. శూద్రుని నిమంత్రణమందుకొని శూద్రాన్నము తినువాడు నూఱువత్సరములు తప్త సురాకుండమున పడును. పిదప నేడేండ్లు శూద్రుడుగ బుట్టును. అతడు మరల శూద్రుని శ్రాద్దాన్నము తిని శుద్దుడగును. పరషవాక్కులతో తన స్వామిమనసు నొప్పించి బాధించువాడు తీక్ష్న కంటక కుండమున బడి దానినే తినును. యమభటులతనిని కఱ్ఱలతోగొట్టుచుందురు. అతడేడు జన్మలుచ్చైః శ్రవముగ బుట్టి పిదప శూద్దాత్ముడగును. దయమాలి విషముత్రాగి ప్రాణములు వదలువాడు-

విషకుండే చ తద్బోజీ సమస్రా బ్దం చ తిష్ఠతి | తతో భ##వే న్నృ ఘాతీ చవ్రణీ చ శతజన్మసు. 57

సప్తజన్మసు కుస్ఠీ చ తతః శుద్దో భ##వే ద్ద్రువమ్‌ | దండేన తాడయే ద్దాం హి వృషం చ వృషవాహకతః. 58

భృత్యద్వారా స్వతంత్రో వా పుణ్యక్షేత్రే చ భారతే | ప్రతప్తే తైలకుండేగ్నౌ తిష్ఠతి స్మ చతుర్యుగమ్‌. 59

గవాంలోమ ప్రమాణాబ్దం వృషో భవతి తత్పరమ్‌ | కుంతేన హంతి యో జీవం వహ్విలోహేన హేలయా. 60

కుంతకుండే వసే త్సోపి వర్షనా మయుతం సతి | తతః సుయోనిం సంప్రాప్యచోదరే వ్యాధిసంయుతః. 61

జన్మ నైతేన క్లేశేన తతః శుద్ధో భ##వేన్నరః | యో భుం క్తేచ వృథాంమాంసలోభీ ద్విజాధమః. 62

హరే రనై వేద్య భోజీ కృమికుండం ప్రయాతి సః | స్వలోమ మాన వర్షం చ తద్బోజీ తత్ర తిష్ఠతి. 63

తతోభ##వే న్ల్మే చ్చజాతి స్త్రీ జన్మని తతోద్విజః | బ్రాహ్మణం శూద్రయాజీ చ శూద్ర శ్రాద్దాన్నభోజకః. 64

శూద్రాణాం శవదహీ చ పూయకుండే వసే ద్ద్రువమ్‌ | యావల్లో మప్రమాణాబ్దం యమదండేన సుప్రతే. 65

తాడితో యమదూతేన తద్బోజీ తత్ర తిష్ఠతి | తతో భారత మాగత్య న శూద్రః సప్తజన్మసు. 66

మహారోగీ దరిద్ర శ్చ బధిరో మూక ఏవ చ | కృష్న పద్మం చ కే యస్యతం సర్పంహంతి యోనరః. 67

స్వలోమ మాన వర్షం సర్వకుండం ప్రయాతి సః | సర్పేణ భక్షితః సోథ యమదూతేన తాడితః. 68

వసే చ్చ సర్ప విడ్బోజీ తతః సర్పో భ##వేద్ద్రువమ్‌ | తతో భ##వేన్మానవ శ్చ స్వల్పాయుర్దద్రు సంయుతః. 69

మహాక్లే శేన తన్మృత్యుః సర్పేణ భక్షితా ద్ద్రువమ్‌ | విధి ప్రదత్తజీ వ్యాంశ్చ క్షుద్ర జంతూం శ్చ హం తియః. 70

విషకుండమున విషముత్రాగుచు వేయేడులుండును. అతడా పిదప నేడుజన్మలు నరఘాతుకుడుగ ప్రణములు గలవాడుగ నుండును. అతడేడు జన్మలు కుష్ఠియై పుట్టి పిదప శుద్దిజెందును. ఆవునుగాని యెద్దునుగాని కొట్టినవాడును సేవకులతో గొట్టించినవాడును తప్తతైపకుండమందు నాల్గుయుగాలు పడియుండును. ఆవువెండ్రుకలెన్నో యన్ని యేండ్లచ్చటి నుండి పిదప నెద్దుగ బుట్టును. బరిసెతోగాని కాలెడియినుముతోగాని యొకనిండు ప్రాణము తీయువాడు పదివేలేండ్లు కుంత కుండముననుండి పిదప మానవుడై పుట్టి గుండెపోటుతో బాధపడును. అతడొక్క జన్మలో బాధలుపడి తర్వాత శుద్ధాత్ముడగును. ఏద్విజాధముడు మాంసలోభమున మాంసము తినునో హరికి నివేదింపక తినునో యతడు కృమికుండమున గూలును. తన వెండ్రుక లెన్నిగలవో యన్ని యేడులు దానిని తినుచుండును. అతడు మూడు జన్మలు యవనుడగ బుట్టి పిదప ద్విజుడగును. శూద్రులచే జన్మము చేయించువాడును శూద్రాన్నము తినువాడును శూద్రుని శవమును దహనము చేయువాడును నగు బ్రామ్మణుడు పూయకుండమున బడియుండును. తనకెన్ని రోమములు గలవో యన్ని యేండ్లు యమదండముతో బాధలు పడుచుండును. పూయకుండమందలి పదార్దము తినుచుయమదూతలు పెట్టు బాధ లనుభవించుచు నతడు పిమ్మట భారతదేశమున నేడు జన్మలు శూద్రుడుగ పుట్టి అతడు దీర్ఘరోగి-చెవిటి-మూగ-బీదవాడు-నగును కృష్ణసర్పమునుగాని పద్మచిహ్నము పడగపై గల సర్పమునుగాని చంపినవాడు తనకెన్ని రోమములుగలవో యన్ని సంవత్సరములు సర్పకుండముననుండును. అచట నతనిని సర్పములు దినును. యమభలులతనిని గొట్టుచుందురు. అతడు సర్పముల మలము తినుచుండును. అతడు సర్పముగ పుట్టును. పిదప దద్రురోగముతో నల్పాయువు గలవాడగును. అతడు పాముకాటుచే చచ్చును. తనకు విధి యేర్ప ఱచిన వృత్తి యున్నను నెవడు జీవహింసచేయునో-

స దంశమశయోః కుండే జంతుమానాబ్దమేవ చ | దివానిశం భక్షితసై#్త రనాహార శ్చ శబ్దవాన్‌. 71

హస్త పాదాది బద్ద శ్చ యమ దూతేన తాడితః | తతో భ##వేత్‌ క్షుద్రజంతు ర్జాతి శ్చ యూవనీ భ##వేత్‌. 72

తతో భ##వే న్మానవ శ్చ సో ంగ హీన స్తతః శుచిః | యోమూఢో మదు మశ్నాతి హత్వా చ మధుమక్షికాః. 73

స ఏవ గారలే కుండే జీవమానాబ్దకం వసేత్‌ | భక్షితో గరలైర్ద గ్దో యమదూతేన తాడిః. 74

తతో హి మక్షికాజాతి స్తతఃశుద్దో భ##వేన్నరః | దండం కరోత్య దండ్యే చ విప్రేదండం కరోతి చ. 75

స కుండం వజ్ర దంష్ట్రాణాం కీటానాంయాతి సత్తరమ్‌ | స తల్లోమ ప్రమాణాబ్దం తత్ర తిష్ఠత్యహర్నిశమ్‌. 76

శబ్ద కృ ద్బ క్షితసై#్త స్తు యమదూతేన తాడితః | కరోతి రోదనం భ##ద్రే హాహాకారం క్షణక్షణ. 77

పునః సూకర యోనౌ చ జాయతే సప్తజన్మసు | త్రిజన్మని కాకయోనౌ తతః శుద్దో భ##వేన్నరః. 78

అర్దలోభేన యోమూఢః ప్రజాదండంకరోతి సః | పృశ్చికానాం చ కుండం చ తల్లోమాబ్దం వసే ద్ద్రు వమ్‌. 79

తతో పృశ్చికజాతిశ్చ సప్తజన్మసు భారతే | తతో సరళ్చాంగ హీనో వ్యాధిశుద్దో భ##వే ద్ద్రువమ్‌. 80

బ్రాహ్మణః శస్త్రధారీయో హ్యన్యేషాం ధావకోభ##వేత్‌| సంధ్యాహీన శ్చ యోవిప్రో గరిభక్తి వహీనకః. 81

స తిష్ఠతి స్వలోమాబ్దం కుండేషు చ శరాదిషు | విద్దః శరాదిభిః శశ్వత్తతః శుద్దో భ##వేన్నరః. 82

కారాగారే సాంధకరే ప్రణీహంతి ప్రజాశ్చయః | ప్రమత్తః స్వస్యదోషేణ గోలకుండం ప్రయాతిసః 83

స పంకతప్త తోయాక్తం సాంధకారం భయంకరమ్‌ | తీక్‌ష్ణ దంష్ట్రై శ్చ కీటైశ్చ సంయుక్తం గోలకుండకమ్‌. 84

అతడా జంతువునకెన్ని యేండ్లాయుపు గలదో యన్నియేండ్లు దంశమశక కుండమున గూలును. అతని నచటి క్రిములు రాత్రింబవళ్ళు తినుచుండును. అతడు తిండిలేక రోదించుచుండును. యమదూతలతని కాల్సేతులు విఱిచి కట్టివేసి కొట్టుదురు. అతడు నీచ జంతువుగ బుట్టి పిదప యవన వంశమున జన్మించును. అతడు తర్వాత వికలాంగుడై యా పిమ్మట పరిశుద్దుడగును. తేనెటీగలను చంపి తేనే త్రాగువాడు ఎన్ని ప్రాణులను చంపిన నన్ని యేడులతడు విషకుండమున బాధపడును. వేడి విషముచేకాలి క్రిములచే తినబడి భటులచేత బాధలుపడును. పిదప తేనెటీగగ బుట్టియతడు పరిశుద్దుడగును. దండనకు తగని విప్రుని దండించువాడు వజ్రదంష్ట్ర కీటకముల కుండమున గూలును. అచటనతని వెండ్రుకలెన్నో యన్నియేడులు బాధలుపడును. అతడు పెద్దపెట్టున నేడ్చును. కీటకము లతనిని తినును. యమభటులు బాధింతురు. అతడు పల్మారు హాహా యనునేడ్చుచుండును. ఏడు పంది జన్మలు - మూడు కాకిజన్మలెత్తిన తర్వాత నతడు శుద్దుడగును. ప్రజలను ధనాశతో దండించునాడు. వృశ్చిక కుండమున తనకెన్ని వెండ్రుకలు గలవో యన్ని యేడులు బాధలు పడుచుండును. అతడేడుసార్లు తేలుజన్మలెత్తి పితప మానవుడై శుద్దుడగును. బ్రహ్మణుడాయుధము బట్టి యితరులను హింసించినను హరిహరభక్తిలేనివాడైనను సంధ్యావందనము చేయకున్నను - అతడు తనకెన్ని వెండ్రులు గలవో యన్ని యేడులు బాణకుండమున బాధలు పడుచుండును. ఆ పిదప నతడు శుద్దాత్ముడగును. చీకటి చెరసాలలో ప్రపుత్తుడై ప్రజలను చంపువాడు తన పాప ఫలితముగ గోలకుండమున గూలును. ఆకుండము సలసలమను బురదనీటిచే చీకట్లుమియుచు భయంకరమైన కోరలుగల పురుగులతో నిండియుండును.

కీటై ర్విద్దో వసేత్తత్ర ప్రజాలలోమాబ్దమేనచ | తతో భ##వేత్ర్పజా భృత్యస్తతః శుద్దో భ##వేత్ర్కమాత్‌. 85

సరోవరా దుత్దితాంశ్చ నక్రా దీన్హంతియో నరః | నక్రకంటకమానాబ్దం నక్రకుండమ ప్రయాతిసః 86

తతో నక్రాది జాతీయే భ##వేన్నక్రాదిషు ధ్రువమ్‌ | తతః సద్యో విశుద్దోహి దండేనైవ పునః పునః 87

వక్షః శ్రోని స్తనాస్యం చ యఃపశ్యతి పరస్త్రియా ః | కామేన కాముకోయోహి పుణ్యక్షేత్రే చ భారతే. 88

స వసేత్కా కతుండే చ కాకైః సంచూర్ణలోచనః | తతః స్వలోమమానాబ్దం భ##వేద్దగ్ద స్త్రీ జన్మని. 89

స్వర్ణస్తేయీ చ యోమూడో భారతే సురవిప్రయోః | స చ మంథాన కుండేవై స్వలోమాబ్దంవసే ద్ద్రువమ్‌. 90

తాడితో యమదూతేన మంథానై శ్చన్నలోచనః | తద్విడ్బోజీ చ తత్రైవ తతశ్చాంధ స్త్రిజన్మని. 91

సప్త జన్మ దరిద్రశ్చ మహాక్రూరశ్చ పాతకీ | భారతే స్వర్ణకారశ్చ స చ స్వర్ణవణిక్తతః 92

యో భారతే తామ్ర చౌరలోహ చోరశ్చ సుందరి | స చ స్వలోమమానాబ్దం బీజకుండం ప్రయాతిసః 93

తత్రైవ బీజవిడ్బోజీ బీజైశ్చ ఛన్నలోచనః | తాడీతో యమదూతేన తతః శుద్దో భ##వేన్నరః 94

భారతే దేవ చౌరశ్చ దేవదద్ర్యా పహరకః | స దుస్తరే వజ్రకుండే స్వలోమాబ్దంవసే ద్ద్రువమ్‌ . 95

దేహ దగో పి తద్వజ్రై రనాహార శ్చ శబ్దకృత్‌ | తాడితో యమదూతై శ్చ తతః శుద్దో భ##వేన్నరః 96

రౌప్య గవ్యాంశుకానాం చ యశ్చౌరః సుర విప్రయోః | తప్త పాషాణకుండే చ స్వలో మాబ్దం వసే ద్ద్రువమ్‌ 97

త్రి జన్మని చ కంసో పి శ్వేతరూప స్త్రి జన్మని | జన్మై కం శ్వేత చిహ్న శ్చ తతోన్యై శ్వేత పక్షిణః 98

ఆ ప్రజల రోమము లెన్నో యన్ని యేండ్లత డచటి కీటకములచే తినబడుచు పిదప ప్రజలస సేవకుడై పుట్టి తరువాత శుద్దాత్ముడగును. సరస్సునుండి పైకిలేచు మొసళ్ళు చంపువాడు మొసలికెన్ని ముండ్లు కలవో యన్నియేండ్లు నక్రకుండమున బాధలు పడును. అతడు తర్వాత మొసలిగ బుట్టి పెక్కు బాధలు పడిపడి పిదప శుద్దుడగును. ఎవ్వడీ పుణ్య భారతభూమిపై పుట్టియును కామవాంఛతో నితర యువతుల స్తనములుఱొమ్ము - పిరుదులు చూచునో అతడు కాకులు కండ్లుపొడుచుచుండునట్టి కాకతుండమున గూలును. తన వెండ్రుకలెన్నో యన్ని యేండ్లుచటనుండి మూడు జన్మలు నిండు మండలచే కాలును. దేవబ్రహ్మణుల బంగారము దొంగిలించువాడు తన వెండ్రుక లెన్నో యన్ని యేండ్లు మంధానకుండమును గూలును. అట వానిని యమభటులు కొట్టుదురు. కన్ను లూడపీకుదురు. మలము తినిపింతురు. అతడు పిదప మూడు జన్మలవఱకును గ్రుడ్డివాడుగ బుట్టును. ఆ పాపాత్ము డేడుజన్మలు దరిద్రుడుగ బుట్టి తరువాత కంసాలిగ బంగార మమ్మువాడుగ బుట్టును. ఓ సుందరీ! రాగిలోహములు దొంగిలించువాడు తన కెన్ని వెండ్రుకలు గలవో యన్ని యేడులు బీజకుండమందు పతనము జెందును. అచట బీజము లంతట మలము తినును. వాని నేత్రములు బీజములచేత కప్పబడును. యమభటు లతనిని బాధింతురు. పిదప నతడు శుద్ధాత్ముడు గాగలడు. దేవుని సొమ్ములు ద్ర్యములు నపహరించువాడు తనకెన్ని వెండ్రుకలు గలవో యన్ని యేడులు వజ్రకుండమున పడును. వాని దేహము వజ్రముచేత కాలుచుండగ భటులతనిని కఱ్ఱలతో బాదుచుండగ తనకెన్ని రోమములు గలవో యన్ని యేండ్లు పాషాణకుండమున బడును. అతడు మూడు జన్మలు బొల్లిగలవాడుగ నొక్క జన్మలో తెల్ల గుర్తుగల పక్షిగ పుట్టును.

తతోరక్తత వికారీ చ శూలీవై మానవో భ##వేత్‌ | సప్త జన్మసు చాల్పాయు స్తతః శుద్ధో భ##వేన్నరః. 99

రైతం కాంస్యమయం పాత్రం యోహరే ద్దేవీ విప్రయోః | తీక్ష్న పాషాణ కుండే చ స్వలోమాబ్దం వనేన్నరః. 100

స భ##వే దశ్వజాతి శ్చ భారతే సప్తజన్మసు | తతోధి కాంగ జాతి శ్చ పాదరోగీ తతః వుచిః. 101

పుం శ్చల్యన్నం చ యో భుం క్తే పుంశ్చలీ జీవ్యజీవనః స్వలోమమాన వర్షం చ లాలా కుండే వసే ద్ద్రువమ్‌. 102

తాడితో యమ దూతేన తద్బోజీ తత్ర దుఃఖితః | తత శ్చ క్షుఃశూలరోగీ తతః శుద్ధః క్రమేణ సః. 103

వ్లుె చ్చసేవీ మసీ జీవీ యో విప్రో భారతే భువి | వసేత్స్వలో మమానాబ్దం మసీకుండే స దుఃఖభాక్‌. 104

తాడితో యమ దూతేన తద్బోజీ తత్ర దుఃఖితః | చచ స్త్రిజన్మని భ##వేత్కృష్ణవర్ణః పశుః సతి. 105

త్రిజన్మని భ##వేచ్చాగః కృష్ణవర్ణ స్త్రిజన్మని | తతః స తాల వృక్షశ్చ తతః శుద్ధో భ##వేన్నరః. 106

ధాన్యాదిశస్యం తాంబూలం యో హరేత్సుర విప్రయోః | ఆసనం చ తథ తల్పం చూర్ణకుండే ప్రయాతిసః. 107

శతాబ్దం తత్ర నినసే ద్యమదూతేన తాడితః | తతో భ##వేన్మేషజాతిః కుక్కుటశ్చ త్రిజన్మని. 108

తతో భ##వే ద్వానర శ్చ కాసవ్యాధియుతో భువి | వంశహీనో దరిద్రశ్చ అల్పాయుశ్చ తతః శుచిః. 109

కరోతి చక్రం విప్రాణాం హృత్వాద్రవ్యం చ యోజనః | స వసే చ్ఛక్రకుండే చ శతాబ్దం దండతాడితః. 110

తతో భ##వేన్మానవశ్చ తైలకార స్త్రిజన్మని | వ్యాధియుక్తో భ##వేద్రోగీ వంశగీన స్తతః శుచిః. 111

గోధనేషు చ విప్రేషు కరోతి వక్రతాం పుమాన్‌ | ప్రయాతి వక్రకుండం స సతిష్ఠేద్యుగశతం సతి. 112

అతడు రక్తపుపోటు శూలరోగముచే పీడితుడై యేడు జన్మలల్పాయువుగలవాడుగ బుట్టి తర్వాత శుద్ధాత్ముడగును. దేవబ్రహ్మాణులరాగి-యిత్తడి పాత్రలు దొంగిలించువాడు. తనకెన్ని రోమములగల వోయన్ని యేండ్లు పాషాణ కుండమున బడును. అతడు తర్వాత భారత దేశమందేడుజన్మలు గుఱ్ఱముగా బుట్టి పవిత్రుడగును. విధవ చేతి యన్నము దినువాడును తనకెన్ని రోమములుగలవో యన్నియేండ్లు లాలాకుండమందు పడును. అతనిని నా భటుల కొట్టుదురు. అతనికి లాలదినిపింతురు. అతడు శూలరోగియై పుట్టి క్రమముగ శుద్దుడగును. యవనులను సేవించువాడును మసియమ్మువాడును తనకెన్ని రోమముల గలవో యన్ని యేడులు మసీకుండమునపడి దుఃఖించును. నా భటులతనినిగొట్టి మసి తినిపింతురు. పిదప నతడు మూడు జన్మలవఱకు నల్లని పశువుగ బుట్టును. అతడు మూడు జన్మలు మేకగబుట్టి తర్వాత చెట్టుగబుట్టి ఆ తర్వాత శుద్ది జెందును. దేవబ్రహ్మణుల ధాన్యమును పంటను తాంబూలమును అసనమును తల్పము నపహరించువాడు చూర్ఱకుండమున వెతలొందును. అచట నా భటుల తనిని నూఱండ్లు కొట్టి బాధింతురు. అతడు మేకగబుట్టి పిదత మూడు కోడి జన్మలు దాల్చును అతడు దగ్గు వ్యాధిగల కోతిగబుట్టి పిమ్మట శుచియగును. విప్రుల ద్రవ్యము హరించి తానితో చక్రము చేయుంచువాడు చక్ర కుండమున నూఱండ్లు యమబాధలు పడుచుండును. పిదప నూనె యమ్ముకొను వాడుగ మూడు జన్మలెత్తి వ్యాధిగ్రస్తుడై వంశహీనుడై తర్వాత శుచియగును. గోవులందును బ్రాహ్మణులందును లోపములెన్నువాడు నూఱుయుగాలవఱకు వక్రుకుండ మున పడి బాధలుపడును.

తతో భ##వేత్స వక్రాంగో హీనాంగః సప్తజన్మని | దరీద్రో వంశహీన శ్చ భార్యాహీన స్తతః శుచి. 113

తతో భ##వేద్గృ ధ్రజన్మా త్రిజన్మని చ సూకరః | త్రిజన్మని బిజాలశ్చ మయూర శ్చ త్రిజన్మని. 114

నిషిద్దం కూర్మమాంసం చ బ్రాహ్మణోయోహిభక్షతి | కూర్మకుండే వసేత్సోపి శతాబ్దం కూర్మభక్షతః. 115

తతో భ##లేత్కూర్మ జన్మాత్రి జన్మని చ సూకరః | త్రిజన్మని బిడాలశ్చ మయూరశ్చ తతః శుచిః. 116

ఘృతం తైలాదికం చైవ యో హరైత్సుర విప్రయోః | స యాతి జ్వాలా కుండం చ భస్మకుండం చ పాతకీ. 117

తత్ర స్థిత్వా శతాబ్దం చ సభ##వేతైల పాచితః | సప్త జన్మని మత్స్య శ్చ మూషకశ్చ తతః శుచిః. 118

సుగంధి తైలం ధాత్రీం వా గంధద్రవ్యాన్య దేవవా | భరతే పుణ్య వర్షే చ యో హరేత్సుర విప్రయోః. 119

స వసేద్దగ్ద కుండే చ భ##వేద్దగ్దో దివానిశమ్‌ | స్వలోమమాన వర్షం చ తతో దుర్గంధికో భ##వేత్‌. 120

దుర్గంధికః సప్తజన్మ మృగనాభి స్త్రిజన్మని | సప్తజన్మాసు మంథాన స్తతో హి మానవో భ##వేత్‌. 121

బలేనైవ చ్చతీనైవ సామరూపేణ వా సతి | బలిష్ఠ శ్చ హరే ద్బూమిం భారతే పరపైతృకీమ్‌. 122

స వసేత్తప్తసూచించ భ##వేత్తాపీ దివానిశమ్‌ | తపైతైలే యథాజీవో దగ్దోభవతి సంతతమ్‌. 123

భస్మసాన్న భవత్యేవ భోగే దేహీన నశ్యతి | సప్త మన్వంతరం పాపీ సంతప్త స్తత్ర తిష్ఠతి. 124

శబ్దం కరోత్య నాహారో యమ దూతేన తాడితః | షష్ఠి వర్ష సహస్రాణి విట్కృమిశ్చ భ##వేత్తతః. 125

తతో భ##వేద్భూమిహీనో దరిద్రశ్చ తతః శుచిః | తతః స్వయోనిం సంప్రాప్య శుభకర్మా చరేత్పునః. 126

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే త్రయస్త్రింశోధ్యాయః.

అతడేడు జన్మ లంగహీనుడగ వికలాంగుడుగబుట్టి పిదప దరిద్రుడు భార్యాహీనుడు వంశహీనుడైపుట్టిశుచి యగును. అతడుపిదప గ్రద్దగ మూడు జన్మలు పందిగ మూడు జన్మలు పిల్లిగ మఱి మూడు జన్మలు నెమలిగ బుట్టును. నిషిద్దమగు తాబేటి మాంసమును దిను బ్రాహ్మణుడు నూఱండ్లు కూర్మకుండమునబడి తాబేళ్లచేత తినబడుచుండును. తర్వాత నతడు తాబేలుగ మూడు జన్మలు పందిగ మూడు జన్మలు పిల్లిగ మూడు జన్ముల దాల్చి తర్వాత నెమలిగ బుట్టి పరిశుద్దుడు గాగలడు. దేవ బ్రాహ్మణుల నెయ్యి - నూనె లపహరించువాడు జ్వాలాకుండమున పడవేయబడును. అచట నతడు నూఱండ్లు నూనెలో సలసల క్రాగి యేడు జన్మలు చేపగ పిదప నెలుకగ బుట్టి తర్వాత పవిత్రుడగును. ఎవ్వడీ పుణ్య భారతభూమి పై దేవ బ్రాహ్మణుల సుగంధ వస్తువుల - నూనె - ఉసిరికాయలు దొంగిలించునో అతడు దగ్దకుండమునందు రాత్రింబగళ్ళు ధగధగ మండుచుండును. అట తన రోమము లెన్నో యన్ని యేండ్లుండి పిదప దుర్వాసన గలవాడై పుట్టును. అత డేడు జన్మలు దుర్వాసన గలవాడుగ మూడు జన్ముల జింకగనేడు జన్మలు మంధానముగ బుట్టి తిరిగి మనుష్యుడు పుట్టును. కటికిమోసముతో దౌర్జన్యముతో నితరుల పిత్రార్జితమైన భూమిని బల్మితో నపహరించు పాతకుడు తప్తసూచిలో రాత్రిం బగళ్ళు సలసలమను నూనెలో తపించు జీవిగ మసలుచుండును. అతడచట బూడిదగ కాలడు; అనుభవమున నశింతడు; అతడచట నేడు మన్వంతరములందాక తపించుచుండును. అత డచట తిండితిప్పలు లేక యమకింకరులచేత బాధలు పడుచు నరువది వేలేండ్లు మలములో పురుగుగ బుట్లును, అతడు పిదప భూవసతిలేని నిఱుపేదగ బుట్టి తర్వాత శుచి గాగలడు; తిరిగి మానవుడై మంచిపనులు చేయును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమున ముప్పదిమూడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters