Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వాత్రింశోధ్యాయః

శ్రీనారాయణ ఉవాచ : మాయాబీజం మహామంత్రం ప్రదాయ విధిపూర్వకమ్‌ | కర్మాశుభ విపాకం తామువాచ చ రవేః సుత: 1

ధర్మరాజ ఉవాచ: శుభకర్మవి పాకా న్న నరకం యాతి మానవః | కర్మాశుభ విపాకం చ కథాయామి నిశామయ. 2

నానా పురాణభేదేన నామభేదేన భామిని | నానా ప్రకారం స్వర్గం చ యాతి జీవః స్వ కర్మభిః 3

శుభ కర్మ విపాకాన్న నరకం యాతి కర్మభిః | కు కర్మణా చ నరకం యాతి నానావిధం నరః 4

నరకాణాం చ కుండాని సంతి నానా విధాని చ | నానాశాస్త్ర ప్రమాణన కర్మ భేదేన యాని చ 5

విస్తృ తాని చ గర్తానిక్లేశదాని చ దుఃఖినామ్‌ | భయం కరాణి ఘోరాణి హే వత్సే కుత్సితా ని చ 6

షడశీతి చ కుండాని ఏవ మన్యాని సంతి చ | నిబోధ తేషాం నామాని ప్రసిద్దాని. శ్రుతౌ సతి. 7

వహ్ని కుండం తప్తకుండం క్షారకుండం భయానకమ్‌ | విట్కుండం మూత్రకుండం చశ్లేష్మ కుండం చ దుస్సహమ్‌. 8

గరకుండం దూషికుండం వసాకుండం తధైవ చ | శుక్రకుండ మసృక్కుండ మశ్రుకుండం చ కుత్సితమ్‌. 9

కుండం గాత్రమాలానాం చ కర్ణవిట్కుండ మేవచ | మజ్జా కుండం మాంసకుండం నక్రకుండం చ దుస్తరమ్‌. 10

లోమకుండం కేశకుండం మస్థి కుండం చ దుఃఖదమ్‌ | తామ్రకుండం లోహకుండం ప్రత ప్తం క్లేశదం మహత్‌. 11

చర్మకుండం తప్తసురా కుండం చ పరికీర్తితమ్‌ | తీక్షణ కంటక కుండం చ విషోదం విష కుండకమ్‌. 12

ప్రతప్త కుండం తైలస్యకుంత కుండం చ దుర్వహమ్‌ | కృమికుండం పూయకుండం సర్పకుండం దురంతకమ్‌ 13

మశకుండం దంశకుండం భీమం గరళకుండకమ్‌ | కుండం చ వజ్రదంష్ట్రాణాం వ్బశ్చికానాంచ సుప్రతే. 14

ముప్పది రెండవ యధ్యాయము

సావిత్రుపాఖ్యానము

శ్రీనారాయణు డిట్లనెను: యముడు సావిత్రికి మహామంత్రమగు మాయాబీజమును విధిపూర్వకముగనుపదేశించి అశుభకర్మ విపాకము గూర్చి యిట్లు చెప్పసాగెను. నరుడు శుభ కర్మ విపాకమువలన నరకమునకు పోడు. ఇక అశుభకర్మ విపాకముంగూర్చి వివరింతును. వినుము. భామినీ ! జీవుడు తన చేసికొనిన కర్మలను బట్టి పెక్కు పురాణములందు పలు నామములతో చెప్పబడిన విధముగ స్వర్గమునకు పోవును. శుభకర్మ విపాకమువలన మానవుడు నరకమును గూలడు. అశుభకర్మలు చేయుటవలన పెక్కు విధములగు నరకములందు పతనమొందును. నరక కుండములు పలుశాస్త్రములందు పలురీతులుగ పలుకర్మ భేదములనుబట్టి చెప్పబడినవి. అవి దుఃఖితులకు పాపాత్ములకు తీరని వెతలు గల్గించును. అవి భయంకరములు - ఘోరములు - కుత్సితములు. వేదములందు ముఖ్యముగ నెనుబదియారు నరకములగూర్చి తెల్పబడినది. వానిపేర్లు వినుము. ఘోరమైన వహ్నికుండము తప్తకుండము క్షారకుండము విట్కుండము మూత్రకుండము దుర్బరమైన శ్లేష్మ కుండము గరకుండము దూషి (కంటిపుసి) కుండము వసాకుండము శుక్రకుండము అసృక్కుండము అశ్రుకుండము శరీరమల కుండము కర్ణవిట్కుండము మజ్జాకుండము మాంసకుండము నక్రకుండము లోమకుండము కేశకుండము అస్థికుండము తామ్రకుండము లోహకుండము క్లేశముగల్గించు తప్తకుండము. చర్మకుండము తప్తసురాకుండము తీక్షణకంటకకుండము విషోదకుండము విషకుండము తప్తతైలకుండము భరింపరానికుంతకుండమ పూయకుండము సర్పకుండము మశకుండము దంశకుండము భీమకుండము గరళకుండము వజ్రదంష్టృకుండము వృశ్చికకుండము.

శరకుండం శూలకుండం ఖడ్గకుండం చ భీషణమ్‌ | గోలకుండం నక్రకుండం కాకకుండం శుచాస్పదమ్‌ . 15

మంథానకుండం బీజకుండం వజ్రకుండం చ దుస్సహమ్‌ | తప్త పాషాణకుండం చ తీక్షణపాషాణ కుండకమ్‌ . 16

లాలాకుండం మసీకుండం చూర్ణకుడం తథైవ చ | చక్ర కుండం వక్ర కుండం కూర్మకుండం మహోల్బణమ్‌. 17

జ్వాలాకుండం భస్మకుండం దగ్దకుండం శుచిస్మతే | తప్త సూచీమసి పత్రం క్షురధారం సూచీముఖమ్‌. 18

గోకాముఖం నక్రముఖం గజదంశం చ గోముఖమ్‌ | కుంభీపాకం కాలసూత్రం మత్స్యోదం కృమి కంతుకమ్‌. 19

పాంసుభోజ్యం పాశ##వేష్టం శూల ప్రోతంప్రకంపనమ్‌ | ఉల్కాముఖ మంధకూపం వేధనం తాడనం తథా. 20

జాలరంధ్రం దేహచూర్ణదళనం పోషణం కషమ్‌ | శూర్పజ్వాలాము ఖంచైవ ధూమాంధం నాగవేష్టనమ్‌. 21

కుండాన్యేతాని సావిత్రి పాపినాం క్లేశదాని చ | నియుతైః కింనరగణౖ రక్షితాని చ సంతతమ్‌. 22

దండ హసై#్తః పాశ హసై#్త ర్మదమత్తైర్బ యంకరైః | శక్తి హసై#్త ర్గదా హసై#్త రసిహసై#్తః సుదారుణౖః 23

తమోయుక్తై ర్దయాహీనై ర్నివార్యై శ్చ న సర్వతః | తేజస్విభిశ్చ నిఃశంకై రాతామ్రపింగలోచనైః 24

యోగయుక్తైః సిద్ది యుక్తైర్నానారూప ధరై ర్బటైః | ఆసన్న మృత్యుభిర్దు ష్టైః పాపిభిః సర్వజీవిభిః 25

స్వకర్మ నిరతైః సర్వైః శాక్తైః సౌరైశ్చ గాణపైః | అదృశ్శ్యైః పుణ్యకృ ద్బి శ్చ సిద్దైర్యోగిభి రేవచ. 26

స్వ ధర్మ నిరతై ర్వాపి వితతై ర్వా స్వ తంత్రకైః | బలవద్బి శ్చ నిఃశంకైః స్వప్న దృష్టైశ్చ వైష్ణవైః 27

ఏత త్తే కథితం సాధ్వి కుండసంఖ్యా నిరూపణమ్‌ | యేషాం నివాసో యత్కుండే నిబోధ కథయామి తే. 28

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే నారద నారాయణ సంవాదే సావిత్ర్యు పాఖ్యానే ద్వాత్రింశోధ్యాయః

శరకుండము శూలకుండము ఖడ్గకుండము గోలకుండము నక్రకుండము దుఃఖకరమైన కాకకుండము మంథాన కుండము బీజకుండము దుస్సహమైన వజ్రకుండము తప్తపాషాణకుండము తీక్షపాషాణకుండము లాలాకుండము మసీ కుండము చూర్ణకుండము చక్రకుండము వక్రకుండము భీకరమైన కూర్మకుండము జ్వాలా కుండము భస్మకుండము దగ్ద కుండము తప్తసూచి అసిపత్రము క్షురధార సూచీముఖము గోకాముఖము నక్రముఖము గోముఖము గజదంశము కుంభీపాకము కాలసూత్రము మత్య్సోదము కృమికంతుకము షాంసుభోజ్యము పాశ##వేష్టము శూలప్రోతము ప్రకంపనము ఉల్కాముఖము అంధకూపము వేధనము తాడనము. జాలరంధ్రము దేహచూర్ణము దళనము శోషణము కశాఘాతము శూర్పజ్వాలా ముఖము ధూమాంధము నాగవేష్టనము సావిత్రీ ! ఈ కుండలములన్నియును పాపులకు క్లేశములు గల్గించును. ఇవి లక్షలాది కిన్నెర గణములచేత రక్షింపబడుచుండును. వారు మహాభయంకరముగమదించి దండము - పాశము - శక్తి - గద కత్తి చేతు లందు దాల్చి యుందురు. వారెఱ్ఱనిమిడిగ్రుడ్లతో దయమాలి నల్లగశక్తిమంతులై యుందురు. వారిలో కొందఱు యోగులు; కొందఱు సిద్దులు కొందఱు నానారూపధరులు. వీరు పాపాత్ములకు గనబడుదురు. స్వధర్మ నిరతులు శాక్తేయులు గాణా పత్యులు సూర్యాపాసకులునైన పుణ్యాత్ములను వీరు జూడరు. స్వధర్మరతులు స్వతంత్రులు దైవబలము గల వైష్ణవులు నైన వారికి కలలోనైన వీరు కనబడరు. సాధ్వీ! ఇట్లు నీకు నరకకుండముల సంఖ్య తెల్పితిని. ఇపుడింక నేకుండమున నెట్టివారు పడుదురో చెప్పుదును వినుము.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున నారద నారాయణ సంవాదమున సావిత్ర్యుపాఖ్యానమున ముప్పదిరెండవ అధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters