Sri Devi Bagavatham-2    Chapters   

అథ త్రయోవింశో7ధ్యాయః.

శ్రీ నారాయణ ఉవాచ : శివ స్తత్వం సమాకర్ణ్య తత్త్వజ్ఞానవిశారదః | య¸° స్వయం చ సమరే స్వగణౖః సహ నారద. 1

శంఖచూడ: శివం దృష్ట్వా విమానాదవరుహ్య చ | ననామ పరయా భక్త్యా శిరసా దండవ ద్బువి. 2

తం ప్రణమ్య చ వేగేన విమానమారురోహ సః | తూర్ణం చకార సన్నాహం ధను ర్జగ్రాహ దుర్వహమ్‌. 3

శివదానవయో ర్యు ద్దం పూర్ణ మబ్దశతం పురా | న బభూవతు రన్యో న్యం బ్రహ్మన్‌ జయపరాజ¸°. 4

న్యస్తశస్త్ర శ్చ భగవాన్న్య స్త శస్త్ర శ్చ దానవః | రథ స్థః శంఖచూడ శ్చ వృషస్థో వృషభద్వజః. 5

దానవానాం చ శతక మద్ధృతం చ బభూవహ | రణ యే యే మృతా శంభుర్జీవయామాసతాన్విభుః. 6

ఏతస్మిన్నంతరే వృద్ద బ్రాహ్మణః పరమాతురః | ఆగత్య చ రణస్థాన మువాచ దానవేశ్వరమ్‌. 7

వృద్ధబ్రాహ్మణ ఉవాచ : దేహి భిక్షాం చ రాజేంద్ర మహ్యం విప్రాయ సాంప్రతమ్‌ |

త్వం సర్వ సంపదాం దాతా యన్మే మనసి వాంఛితమ్‌. 8

నిరీహాయ చ వృద్ధాయ తృషితాయ చ సాంప్రతమ్‌ | పశ్చాత్త్వాం కథయిష్యామి పురః సత్యం చ కుర్వితి. 9

ఓ మిత్యువా చ రాజేంద్ర ప్రసన్నవ దనేక్షణః | కవచార్థీ జనశ్చాహ మిత్యువాచాతి మాయయా. 10

ఇరువదిమూడవ అధ్యాయము

శక్తి ప్రాదుర్బావము-తులస్యుపాఖ్యానము

$ƒyLki¸R…VßáV ²T…ÈýÁ®ƒsƒ«sV : JLiVV ƒyLRiµy! »R½»R½òQ*Çì؃«s„sµR…V²R…gRiV bPª«so²R…V LRißá ª«sX»yòLi»R½ª«sVLi»R½¸R…VVƒ«sV „s¬s »R½ƒ«s LRiVúµR… gRiß᪫sVVÌÁƒ«sVgRiW²T… ¸R…VVµôR…ª«sVVƒ«sV »R½LRiÛÍÁƒ«sV. aRPLiÅÁ¿RÁW²R…V²R…V bPª«so¬sgSLiÀÁ „sª«sWƒ«sª«sVV µj…gji xmsLRiª«sV˳ÏÁNTPò»][ @»R½²R…V ®ªsLiÈÁ®ƒs[ „sª«sWƒ«s ®ªsVNTPä g]xmsö „sÌýÁV ¿Á[‡ÁW¬s ¸R…VÈíÁ¥¦¦¦xqs ®ªsVVƒ«slLi胫sV. bPª«saRPLiÅÁ¿RÁW²R…VÌÁ ª«sVµ³R…ù F¡LSÈÁª«sVV ƒ«sWâàá[Li²ýR…V rygjiƒ«sƒ«sV A¸R…VVµôR…ª«sVVÍÜ[ ®ƒsª«sLjiNTPÇÁ¸R…WxmsÇÁ¸R…Vª«sVVÌÁV gRiÌÁVgRiÛÍÁ[µR…V. @xmso²R…V bPª«so\®²…µôR…V\|ms¬s µyƒ«sª«so²R…V LRi´R…ª«sVV\|ms¬s »R½ª«sV ¸R…W¸R…VVµ³R…ª«sVVÌÁV ª«sµR…ÖÁ N]Li»R½ „súaRP„sVLiÀÁLji. ¸R…VVµôðR…ª«sVVÍÜ[ xmsÌÁVª«soLRiV µyƒ«sª«soÌÁV ¿RÁ¬sF¡LiVVLji. ª«sVLRißÓáLiÀÁƒ«s ®µ…[ª«s»R½ÌÁƒ«sV bPª«so²R…V ª«sVLRiÌÁ ú‡Á¼½NTPLi¿RÁV¿RÁVLi®²…ƒ«sV. @®µ…[ xqsª«sV¸R…Vª«sVVƒ«s ƒ¯NRP ª«sVVµR…VxqsÖÁ úËØx¤¦¦¦øßáV ²y»R½VLRi»R½»][ ª«sÀÁè µyƒ«sª«so¬s»][ ¬sÈýÁ¬s¹¸…Vƒ«sV. LSÛÇÁ[Liúµy ! ®ƒs[ƒ«sV úËØx¤¦¦¦øßáV²R…ƒ«sV. ƒy NTPxmso²R…V Õ³ÁORPQ |msÈíÁVª«sVV. ƒy ª«sVµj…ÍÜ[¬s N][Ljiä ¼d½LRiV誫sVV. ¬dsª«so xqsNRPÌÁ xqsLixmsµR…ÌÁV µyƒ«sª«sVV ¿Á[¸R…VgRiÌÁ ª«sV¥¦¦¦µy»R½ª«so. ®ƒs[ƒ«sV ª«sVVµR…VxqsÖÁªy²R…ƒ«sV ; G ¸R…Wµ³yLRiª«sVV ÛÍÁ[¬sªy²R…ƒ«sV. ®ªsVVµR…ÌÁV úxms¼½ÇìÁ ¿Á[¸R…VVª«sVV. »R½LS*¼½ ƒy N][Ljiä ®ªsÌýÁ²T…Li»R½Vƒ«sV. µyƒ«sª«sxms¼½ úxmsxqsƒ«sVõQQ\®²… ¬ds LiVVxtísQª«sVV ª«sÀÁ胫sÛÉýÁ[ N][LRiVN]ª«sVøƒ«sgRi ª«sW¸R…W„s „súxmso ²R…»R½¬s¬s NRPXxtñsQ NRPª«s¿RÁ „sVª«sVø¬sN][LRiVN]®ƒsƒ«sV.

తచ్ర్చు త్వా కవచం దివ్యం జగ్రాహ హరిరేవచ | శంఖచూడ స్యరూపేణ జగామ తులసీం ప్రతి. 11

గత్వా తస్యాం మాయయా చ వీర్యాధానం న కార చ | అథ శంభుర్హరేః శూలం జగ్రాహ దానవం ప్రతి. 12

గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ ప్రళయాగ్ని శిఖోపమమ్‌ | దుర్ని వార్యం చ దుర్ధర్షమవ్యర్థం వైరిఘాతుకమ్‌. 13

తేజసా చక్రతుల్యం చ సర్వశస్త్రా స్త్ర సారకమ్‌ | శివకేశవయో రన్య దుర్వహం చ భయంకరమ్‌. 14

ధనుః సహస్రం దైర్ఘ్యేణ ప్రస్థేన శతహస్తకమ్‌ | సజీవం బ్రహ్మరూపంచ నిత్యరూప మనిర్దిశమ్‌. 15

సంహర్తుం సర్వ బ్రహ్మాండ మలం యత్స్వీయలీలయా | చిక్షేప తోలనం కృత్వా శంఖచూడే చ నారద. 16

రాజా చాపంపరిత్యజ్య శ్రీకృష్ణచరణాంబుజమ్‌ | ధ్యానే చకార భక్త్యా చ కృత్వా యోగాసనం ధియా. 17

శూలం చ భ్రమణం కృత్వా పపాత దానవోపరి | చకార భస్మసాత్తం చ సరథంచాథలీలయా. 18

రాజా ధృత్వా దివ్యరూపం కిశోరం గోపవేషకమ్‌ | ద్విభుజం మురళీహస్తం రత్నభూషణ భూషితమ్‌ . 19

రత్నేంద్రసార నిర్మాణం వేష్టితం గోపకోటిభిః | గోలోకా దాగతం యాన మారురోహ పురం య¸°. 20

శంఖచూడుడు విప్రునకు తన కవచ మీయగనే దానిని దాల్చి విప్రుడు శ్రీహరి రూపమున తులసి చెంత కేగెను. అతడు తులసితో వలపు టుయ్యాలలో నూగి యామె యందు గర్బాదానము నొనరించెను. శివుడు హరి శూలము చేపట్టెను. అది గ్రీష్మమందలి పగటింటి సూర్యునివలె ప్రళయాగ్ని శిఖలు గ్రక్కుచు దుర్నివారమై మొక్కపోనిదై శత్రుమారకమై వెల్గులు విరజిమ్ముచుండెను. ఆ శూలము చక్రమును బోలిన తేజము గలది; సకల శస్త్రాస్త్రముల సారము; శివకేశవులకు దక్కొరుల కసాధ్యమైనది; శత్రుభీకరమైనది. త్రుశూలము వేయి ధనువుల పొడవున నూఱు చేతుల వెడల్పున సజీవమై బ్రహ్మరూపమై నిత్యమై తెలియరానిదై యుండెను. అది లీలగ బ్రహ్మాండము లెల్లనుప సంహరింపజాలినది. అట్టి త్రిశూలమును గిరగిర త్రిప్పి దానవపతిపై విసిరివేసెను. అపుడు శంఖచూడుడు ధనువు విడిచి యోగాసనమున శ్రీకృష్ణుని పదారవిందములుధ్యానింపసాగెను. అంత త్రిశూలము గిరగిర తిరిగి దానవునిపై బడి యతనిని నతని రథమును భస్మ మొనర్చెను. దానవ పతి యపుడు గోపబాలకుని దివ్యరూపము దాల్చి రత్నభూషణభూషితుడై రెండు చేతుల మురళి మ్రోయించుచు కోట్ల కొలది గోపికలు చుట్టు తన్ను కొలువగ గోలోకముండి వచ్చిన రత్న నిర్మితమైన విమాన మెక్కి గోలోకమున కరిగెను.

గత్వా ననామ శిరసా స రాధాకృష్ణయోర్మునే | భక్త్యా చ చరణాంభోజం రాసేబృదావనే వనే. 21

సుదామానం చ తౌదృష్ట్వా ప్రసన్న వదనేక్షణౌ | క్రోడే చక్రతు రత్యంతం ప్రేవ్ణూ తిపరిసంయుతౌ. 22

అథ శూలం చ వేగేన ప్రయ¸° తంచసాదరమ్‌ | అస్థిభిః శంఖచూడస్య శంఖజాతిర్బభూవహ. 23

నానా ప్రకారరూపేణ శశ్వత్పూతా సురార్చనే | ప్రశస్తం శంఖతోయం చ దేవానాం ప్రీతిదం పరమ్‌. 24

తీర్థతోయ స్వరూపం చ పవిత్రం శంభునా వినా | శంఖ శబ్ధోభ##వేద్యత్ర తత్ర లక్ష్మీః సుసంస్థిరా. 25

స స్నాతః సర్వతీర్థేషు యః స్నాతః శంఖవారిణా | శంఖో హరే రధిష్ఠానం యత్ర శంఖస్తతో హరిః. 26

తత్రైవ వసతే లక్ష్మీ ర్దూరీభూత మమంగళమ్‌ | స్త్రీణాంచశంఖ ధ్వనిభిః శూద్రాణాంచ విశేషతః. 27

భీతా రుష్టా యాతి లక్ష్మీస్తత్థ్సలాదన్య దేశతః | శివోపి దానవం హత్వా శివలోకం జగామహ. 28

ప్రహృష్టో వృషభారూఢః స్వగణౖశ్చసమావృతః | సురాః స్వవిషయం ప్రాపుఃపరమానందసంయుతాః. 29

నేదుర్దుందుభయః స్వర్గే జగుర్గంధర్వకిన్నరాః | బభూవ పుష్పవృష్టి శ్చ శివస్యోపరి సంతతమ్‌. 30

ప్రశశంసుః సురాస్తం చ మునీంద్ర ప్రవరాదయః |

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే త్రయోవింశోధ్యాయః.

అతడు రాసస్థలమగు బృందావనమునందు విరాజిల్లుచున్న రాధాకృష్ణులకు పరమభక్తితో తలవంచి నమస్కరించెను. రాధాకృష్ణులును సుదాముని చూచి ప్రసన్నులై పరమప్రీతితో నతనిని చేరదీసిరి. త్రిశూలమును వేవేగ కృష్ణుని జేరెను. శంఖచూడుని యస్థులనుండి శంఖముల జాంతి పుట్టెను. శంఖములు పెక్కు రూపములుగ పవిత్రములై దేవతార్చనకు పనికి వచ్చుచుండును. శంఖతోయము దేవతల కెంతేని ప్రీతిదాయకము. ఈ శంఖతీర్థము పవిత్రమైనది. శంఖతీర్థమును శివుని తలపై చల్లరాదు. శంఖనాద మున్నచోటు లక్ష్మినిలయము. శంఖజలమున స్నాన మాడినవాడు సర్వతీర్థముల స్నాన మాడిననా డగును. శంఖము హరి కధిష్ఠానము. శంఖ మున్నచోట హరి యుండును. శంఖ మున్నచోట సిరి తాండవించును; అమంగళము ప్రతిహత మగును. శూద్రులుగా స్త్రీలు గాని శంఖధ్వని చేయరాదు. అటుల చేసినచో లక్ష్మిభయముతో కోపముతో నచ్చోటు వదలి దూరదేశ##మేగును. ఆ విధముగ శివుడు దానవుని తెగటార్చికైలాసధామమున కరిగెను. ఆ ప్రకారమున శివు డెద్దునెక్కి తన గణములు తన్ను చేరి కొలువగకైలాసగిరి మీది కరిగెను. దేవతలు నానంద భరితులై తమతమ నివాసముల కరిగిరి. స్వర్గమున దేవదుందుభులు మొరసెను. కిన్నర గంధర్వులు పాడిరి. శివునిపై పూలజల్లు కురిసెను. గొప్ప గొప్ప మునులను దేవతలును శివుని ఘనముగ నమస్సుమములతో నర్చించిరి.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున నిరువది మూడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters