Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకాదశో7ధ్యాయః.

నారదఃశ్రుతం పృథివ్యుపాఖ్యానమతీవ సుమనోహరమ్‌ l గంగోపాఖ్యాన మధునా పద వేద విదాం వర. 1

భారతే భారతీ సాపా త్సా జగామ సురేశ్వరీ l విష్ణుస్వరూపా పరమా స్వయం విష్ణుపదీతిచ. 2

కథం కుత్ర యుగే కేన ప్రార్థితా ప్రేరితా పురా l త్రత్ర్కం శ్రోతు మిచ్ఛామి పాపఘ్నం పుణ్యదం శుభమ్‌. 3

శ్రీనారాయణఃరాజరాజేశ్వరః శ్రీమా న్సగరః సూర్యవంశజః l తస్య భార్యా చవైదర్బీ శైబ్యా చ ద్వే మనోహరే. 4

తత్పత్న్య మేకా పుత్రశ్చ బభూవ సుమనోహరః l అసమంజ ఇతి ఖ్యాతః శైబాయం కులవర్దన. 5

అన్యాచా77రాధయా మాస శంకరం పుత్ర కాముకీ l బభూవ గర్బ స్తస్యా శ్చ హరస్య చ వరేణ హ. 6

గతే శతాబ్దే పూర్ణే చ మాంసపిండం సుషావ సా l తద్దృష్యా సా శివం ధ్యాత్వారురోదోచ్చైః పునఃపునః. 7

శంభు ర్ర్బహ్మణరూపేణ తత్సమీపం జగామ హ l చకార సంవిభ##జ్యైత త్పిండం షష్టిసహస్రదా. 8

సర్వే బభూవుః పుత్రా శ్చ మహాబలపరాక్రమాః l గ్రీష్మమధ్యాహ్న మార్తాండ భ్రాముష్టకళేబరా. 9

కపిలస్య మనేః శాపా ద్బభూవుర్బ స్మసాచ్చతే l రాజా రురోద తచ్ర్చుత్పా జగామ గహనే వనే. 10

తపశ్చచారా7సమంజో గంగానయనకారణాత్‌ l లక్ష వర్షం తప స్తప్త్వా మమార కాలయోగతః. 11

అంశుమాం స్తస్య తనయో గంగానయన కారణాత్‌ l తపః కృత్వా లక్షవర్షం మమార కాలయోగతః. 12

భగీరథ స్తస్యపుత్రో మహాభా గవతః సుదీః l వైష్ణవో విష్ణుభక్తశ్చ గుణవా నజరామరః. 13

తపఃకృత్వా లక్షవర్షం గంగానయన కారణాత్‌ l దదర్శ కృష్ణం గ్రీష్మస్థటిం సూర్యకోటి సమప్రభమ్‌. 14

ద్విభుజం మురళీ హస్తం కిశోరం గోప వేషిణం l గోపాలసుందరీరూపం భక్తాను గ్రహరూపిణమ్‌. 15

పదునొకండవ అధ్యాయము

గంగాచరిత్రము

నారడు డిట్లనెనుః వేదవిదులలో శ్రేష్ఠుడా ! మనోహరమైన భూదేవి చరిత్ర వింటిని . ఇపుడు గంగాదేవి చరిత్ర వినిపింపుము. భారతదేశమునందు గంగాదేవిప భారతీ శపమున నవతరించెను. గంగను సురేశ్వరి విష్ణుస్వరూప పరమ విష్ణు విదియని యందురు. పాపహరము పుణ్యప్రదము శుభంకరము నగు గంగాదేవికథ వరుసగ వినదలచుచున్నాను. గంగ యెవరి ప్రార్థ నవలన నెవని ప్రేరణచేత నవతరించెనో తెసుపుము. శ్రీనారాయణడిట్లనెను: పూర్వము సగరుడను మహారాజ సూర్యవంశమున జన్మించెను. అతనికి వైదర్బిశైబ్యయను నిర్వురు చక్కని భార్యలుండిరి. అ యిర్వురిలో శైబ్యకు మనోహరుడగు కుమారుడు పెట్టెను. అతని పేరు ''అసమంజసుడు''అతడు కులవర్దనుడు; కీర్తిమంతుడు. రెండవ భార్య పుత్రుని బడయగోరి శంకరు నారాధించెను. అపుడు శివుని వరప్రభావమున నామె గర్బము దాల్చెను. నూఱు సంవత్సరములు గడచిన పిదప నామె యొక మాంసపీండమును కనెను. దానిని చూచి యామె శివుని స్మరించి మాటిమాటికి పెద్దగ నేడ్చెను. అపుడు శివుడు బ్రహ్మణ వేశమున నామె ముందునకు మచ్చి యా పిండమును నరువదివేలు భాగములుగ విభజించెను. ఆ భాగములనుండి బలపరాక్రమములుగల పుత్రులు గల్గిరి. వారు పట్టపగటి సూర్యుని భోలిన తేజము గలవారు. వారెల్లరును కపిలముని శాపమువలన బూడిదగ మారిరి. అది విని రాజు పెద్దగ విలపించి యడవుల పట్టి పోయెను . అసమంజు డపుడు గంగను భూమిమీదికి తెచ్చుటకు లక్ష సంవత్సరమలు తపముచేసి తుదకు కాలగర్బమున కలిసిపోయెను. అతని కొడుకు భగీరథుడు; మహభాగవతుడు; బుద్ధిమంతుడు; వైష్ణవుడు; విష్ణుభక్తుడు గుణశాలి; అజరామరుడు; అతడును గంగను నేలకు దెచ్చుటకు లక్ష సంవత్సరములు తపించెను. అపు డతడు గ్రీష్మఋతువులోని కొట్లసూర్యుల కాంతిని బోలిన కాంతిగల కృష్ణుని దర్షించెను. కృష్ణుడు ద్విభుజుడు మురళీమోహనుడు గోపకిశోరుడు సుందర గోపబాలుడు భక్తానుగ్రహ రూపుడుగ నుండెను.

స్వేచ్ఛామయం పరం బ్రహ్మ పరిపూర్ణతమం ప్రభుమ్‌ l బ్రహ్మవిష్ణుశివాద్యైశ్చస్తుతం మునిగణౖర్నుతమ్‌. 16

నిర్లిప్తం సాక్షిరూపంచ నిర్ఝుణం ప్రకృతే ః పరం l ఈషద్దాస్య ప్రసన్నాస్యం భక్తాను గ్రహకారణమ్‌. 17

వహ్ని శుద్ధాం శుకాధానం రత్నభూషణభూషితమ్‌ l తుష్టావ దృష్ట్వా నృపణః ప్రణమ్య చ పునఃపునః 18

లీలయా చ వరం ప్రాప వాంఛితం వంశతారణమ్‌ l కృత్వా చ స్తవనం దివ్యం పులకాంకిత విగ్రహః 19

శ్రీభగవానువాచః భారతం భరతీశాపా ద్గచ్చ శ్రీ ఘ్రణ సురేశ్వరీ l సగరస్య సుతా న్సర్వా న్పూతా న్కురు మమాజ్ఞయా. 20

త్వత్స్వర్షవాయునా పూతాః యాస్యంతి మమ మందిరమ్‌ l బిభ్రతో మమ మూర్తీ శ్చ దివ్యస్యందనకామినిః. 21

మత్పార్షదా భవిష్యంతి సర్వకాలం నిరామయాః | సముచ్చిద్య కర్మభోగా న్కృతాన్‌ జన్మని జన్మని. 22

కోటి జన్మార్జితం పాపం భారతే యత్కృతం నృభి ః l గంగాయా వాతస్పర్శేన నశ్యతీతి శ్రుతౌ శ్రుతమ్‌.23

స్పర్శనాద్దర్శనాద్దేవ్యాః పుణ్యం దశగుణం తతః l మౌసలస్నాన మాత్రేణ సామాన్య దివసే నృణామ్‌. 24

శతకొటి జన్మపాపం నశ్యతీతి శుతౌ శ్రుతమ్‌ l యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికానిచ. 25

జన్మ సంఖ్యార్జితా న్యేవ కామతో7పి కృతాని చ l తాని సర్వాణి నశ్యంతి మౌసలస్నానతో నృణామ్‌. 26

పుణ్యా హస్నానతః పుణ్యం వేదా నైవ వదంతి చ l కించే ద్వదంతి తే విప్ర విఫలమేవ యథాగమమ్‌. 27

బ్రహ్మ విష్ణుశివా ద్యశ్చ సర్వం నైవ వదంతి చ l సామాన్య దివసస్నానసంకల్పం శృణు సందరి. 28

పుణ్యం దశగుణం చైవ మౌసలస్నానతః పరమ్‌ l తత స్త్రింశ ద్గుణం పుణ్యం రవిసంక్రమణ దినే . 29

అమాయాం చాపి తత్తుల్యం ద్విగుణం దక్షిణాయనే l తతో దశగుణం పుణ్యం నరాణా ముత్తరాయణ. 30

కృష్ణుడు సర్వస్వతంత్రుడు: స్వేచ్చామయుడు: పరంబ్రహ్మ పరిపూరణతముడు ఫ్రభువు; బ్రహ్మవిష్ణుశివులచేత మునిగణములచేత నుతింపబడువాడు నిర్లిప్తుడు సాక్షిరూపుడు నిర్గుణడు ప్రకృతిపరుడు భక్తానుగ్రహకారణుడు చిర్నగవులు చిందించువాడు . అగ్ని పూతమైన వస్త్రము ధరించినవాడు రత్న భూషణభూషితడు నగు కృష్ణుని దర్శించి భగిరధుడు మాటి మాటికి నమస్కరించెను. అతడు కృష్ణునిదివ్యస్తోత్త్రముతో నుతించి తనువున పులకలెగయ తన వంశమును తరింపచేయునట్టి వరమును పొందెను. శ్రీభగవాను డిట్లనెను: ఓసురేశ్వరీ గంగాదేవీ ! నీవు భారతీశాపమున భరతదేశ##మేగుము. నాయాజ్ఞ చేత సగరుని కొడుకులను పవిత్రులను చేయుము. వారు నీమీది చల్లని గాలుల తాకిడి చేత పవిత్రులై దివ్యవిమానమలపైనా దివ్యరూపము దాల్చినా దివ్యమందిరముకు చేరగలరు. అచట వారు నాపార్మ్వచరులై యే రోగములు లేక సుఖముండు దురు. వారి కింక జన్నజన్నలందు కర్మభోగము లనుభవింపవలసిన పనిలేదు. భారతదేశమరదు నరులు కొటిజన్నలలో చెసిన పాప మంతయును గంగమీది గాలి పతాకిన మాత్రమున నశించునని వేదములందు గలదు. గంగాదేవిని దర్శించి తాకింనతనే పుణ్యము నూఱురెట్లు పెరుగును. సంకల్పయుక్త విధానమున గాకున్నను (మౌసలస్నానమున-రోకటిని నీటముంచినట్లు) స్నానము చేసినప్పటికిని నరుల పాపములు తొలగును. అట్లు గంగలొ మౌసలస్నానవమైన చేసినవాని నూఱుకొట్ల పాప మంతయును నశించునని వేదములందు గలదు బ్రహ్మహత్యాది పాపాలు నశించును. తెలిసికాకని తెలియకకాని జన్మలో చేసిన పాపము లన్నియును గంగలొ మౌసలస్నాన మాత్రమున నశించును. ఓవిప్రపర్యా! ఇంకపుణ్యదినములందు గంగలొ జేసిన పుణ్యఫలమును వేదములందు సైతము వర్ణింపబడినది చాల కొలదిగ మాత్రమే కలదు. దాని మహిమను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వర్ణింపజాలరు. సుందరీ ! ఇదంతయు వట్టిగ చేసిన స్నానము (మౌసలస్నానము) విషయము. ఇక సంకల్పముతో స్నానము చేసిన ఫలితమును వినుము. దీనివలన మౌసలస్నానముచేత కన్న పదిరేట్లు పుణ్యఫలిత మెక్కువ. ఇంక రవి సంక్రమణమునాడు గంగాస్నానము చేసిన వానికి మప్పదిరెట్లు పున్నె మెక్కువ. అమానాస్యనాటి స్నానముచే నంతియే ఫలము లభించును . దక్షిణాయనమున దానికి రెండింతలు ఫలితము నుత్తరాయనమున దానికి పదింతలు పుణ్యఫలము నబ్బును.

చాతుర్మాస్యాం పౌర్ణమాసగా మనంతం పుణ్యమేవ చ l అక్షయాయాం చ తుత్తుల్యం చైతద్వేదే నిరూపితమ్‌. 31

అసంఖ్య పుణ్యఫలద మేతేఘ స్నాదానకమ్‌ l సామాన్య దివసస్నానా ద్దానాచ్ఛతగుణం ఫలమ్‌. 32

మన్వంతరాద్యయాం తిథౌయుగాద్యాయాం తథౌవచ l మాఘస్యాసిత సప్తమ్యాం భీష్మాష్టమ్యాం తథైవచ. 33

అథ్య ప్యశోకాష్టమ్యాం చ నవమ్యాం తథా హరేః l తతో7పి ద్విగుణం పుణ్యం నందాయాం తవ దుర్లభమ్‌ . 34

దశహరా దశమ్యాంతు యూగాద్యాది సమం ఫలమ్‌ l నందాసమం చ వారుణ్యాం మహాత్పూర్వే చతుర్గుణమ్‌. 35

తతశ్చతుర్గుణం పుణ్యం ద్విమహత్పూర్యకే సతి l పుణ్యం కోటిగుణం చైవ సామాన్య స్నానతో7పియత్‌. 36

చంద్రోపరాగసమయే సూర్యే దశగుణం తతః l పుణ్య మర్దోదయే కాలే తతఃశతగుణం ఫలమ్‌. 37

ఇత్వేతముక్త్వా దేవేశో విరరామ తయోఃపురః l తమువాచ తతో గంగా భక్తినమ్రాత్మకంధరా. 38

యామిచే ద్బారతం నాథా భారతీశాపతః పురా l తవాజ్ఞయాచ రాజేంద్ర తపసాచైవ సాంప్రతమ్‌. 39

దాస్యంతి పాపినో మహ్యం పాపానియాని కానిచ l తాని మే కేన నశ్యంతి తముపాయం వదప్రభో 40

కతికాలం పరిమితం స్థితిర్మే తత్ర భారతే l కదా యాస్యామి దేవేశ తద్విష్ణోః పరమం పదమ్‌. 41

మమాన్యద్వాంఛితం యద్యత్సర్వం జానాసి సర్వవిత్‌ l సర్వాంతరాత్మ న్సర్వజ్ఞ తదుపాయం వదప్రభో. 42

శ్రీభగవానువాచ: జానామి వాంఛితం గంగే తవ సర్వ సురేశ్వరి l పతిస్తే ద్రవరూపాయా లవణోదో భవిష్యతి. 43

స మమాంంశ స్వరూపశ్చ త్వం చ లక్ష్మీ స్వరూపిణీ l విదగ్దాయా విదగ్దేన సంగమో గుణనాన్బువి. 44

యావత్యః సంతి నద్యశ్చభారత్యాద్యశ్చ భారతే l సౌభాగ్యా త్వంచ తాస్వేవ లవణోదస్య సౌరతే. 45

చాతుర్మాస్యము పున్నమి అక్షయ తదియ నవములందు గంగాస్నానమున ననంత పుణ్యఫలము లభించునవి వేదములందు గలదు. వట్టి దినములలోని స్నానదానము కంటె పర్వదినములలో చేసిన స్నానదానములు నూఱు రెట్లకు మించి యనంత పుణ్యఫలము లభించును. మన్వంతరము తొలినాడు యాగాది యందును మాఘశుద్ధ సప్తమినాడు భీష్ట్మాష్టమినాడు అశోకాష్టమినాడు శ్రీరామనవమినాడు చేసిన గంగాస్నానము మహాపుణ్యము లభించును. వీనికి రెండింతలు ఫలము నందాతిథినాడు చేసిన గల్గును. విజయదశమినాటి గంగస్నానము యుగాదినాటి గంగాస్నానమునకు సమానమగును. నందాతిధిలేక మహావారుణి నాడు గంగాస్నానము చేసినచో పూర్వముకన్న నాల్గు రెట్లధికము. మహావారుణినాడు చేసిన గంగాస్నాన పుణ్యము సాధారణ గంగాస్నానముకన్న కోటి రెట్లధిక పుణ్యమునిచ్చును. సూర్యగ్రహణమందలి గంగా స్నానముచే చంద్రగ్రహణమందలి గంగాస్నానము కన్నపది రెట్లెక్కువ ఫలము గల్గును. అర్ధోదయమున దానికి నూఱు రెట్లెక్కువ ఫల మబ్బును. ఇట్లు దేవేశుడుగు భగవానుడు గంగా భగీరధులముందు చెప్పి విరమించగ గంగ వినయమున తలవంచి భక్తితో నిట్లనియెను. ఓనాథా! సరస్వతీ శాపమున నీ యనుమతివలన భగీరథుని తపమువలన నే నిపుడు భారతదేశ మున కేగగలను. కాని ప్రభూ! పాపులేయే పాపమలు నాయందు వదలుదురో యవి నానుండి యెట్లు తొలగునో యాయుపాయము తెల్పుము. భారతదేశమున నే నెంతకాలము నివసింపవలయను. దేవేశా !నేను మరల నీ విష్ణుపదము నెప్పుడు చేరుకొనవలయును. ఓ ప్రభూ! సర్వజ్ఞా! సర్వవిదుడ! నాలోని మిగిలిన కోరిక లన్నియు నీ వెఱుంగుదువు. కనుక నుపాయము తెలుపుము. శ్రీభగవాను డిట్లనియెను: ఓ సురేశ్వరీ!గంగా!నీలోని కోరిక లన్నియు నే నెఱుంగగలను. జలరూపిణివగు నీకు సాగరుడు పతి కాగలడు. సాగరుడు నా యంశస్వరూపుడే. నీవును లక్ష్మీస్వరూపిణివి. రసికహృదయులతోడి రసికురాండ్ర కూటమి యెంతెంతో గుణవంతమైన దగును. సరస్వతి మున్నగునదులును సాగరములో కలియును. అయినను వాని యన్నిటికంటే నీవు మిక్కిలి సౌభాగ్యవతి వగుదువు.

అద్య ప్రభృతి దేవేశి కలేః పంచ సహస్రకమ్‌ l వర్షం స్థితిస్తే భారత్యాఃశాపేన భరతేభువి. 46

నిత్యం త్వ మభ్దినా సార్ధం కరిష్యసిరహో రతిమ్‌ l త్వమేవ రసికా దేవీ రసికేంద్రేణ సంయుతా. 47

త్వాం స్తోష్యంతి చస్తోత్రేణ భగీరథ కృతేన చ l భారతస్థా జనాః సర్వే పూజయిష్యంతి భక్తితః. 48

కణ్వశా ఖోక్త ధ్యానేన ధ్యాత్వా త్వాం పూజయిష్యతి l యఃస్తౌతి ప్రణమేన్నిత్యం సో7శ్వ మేధఫలం లభేత్‌. 49

గంగా గంగేతి యో బ్రూయా ద్యోజనానాం శ##తైరపి- l ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి. 50

సహస్రపాపినాం స్నానా ద్య త్పాపం తే భవిష్యతి l ప్రకృతే ర్భక్త సంస్పర్శా దేవ తద్ధి వినంక్ష్యతి 51

పాపినాంతు సహస్రాణాం శవస్పర్శేన యత్త్వయి l తన్మం తోపాసకస్నానా త్త దఘం చ వినంక్ష్యతి. 52

తత్రైవ త్వ మథిష్ఠానం కరిష్య స్యఘమోచనమ్‌ l సార్ధం సరిద్భిః శ్రేష్ఠాభిః సరస్వత్యాదిభిఃశుభే. 53

తత్తు తీర్థం భ##వే త్సద్యో యత్ర ష్ఠుతద్గుణకీర్తనమ్‌ l త్వద్రేణు స్పర్శమాత్రేణ పూతో భవతి పాతకీ. 54

రేణు ప్రమాణ వర్షం చ దేవలోకే వసే ద్ధ్రువమ్‌ l జ్ఞనేన త్వయి యే భక్త్యా యన్నామస్మృతి పూర్వకమ్‌. 55

సము త్సృజంతి ప్రాణాం శ్చతే గచ్ఛంతి హరే ః పదమ్‌ l పార్షద ప్రవరా స్తే చ భవిష్యంతి హరేశ్చిరమ్‌. 56

లయం ప్రాకృతికంతే చ ద్రక్షంతి చా ప్యసంఖ్యకమ్‌ l మృతస్య బహు పుణ్యన తచ్చవం త్వయి విన్య సేత్‌.

ప్రయాతి స చవైకుంఠం యావదహ్నః స్దితి స్త్వయి l కాయవ్యూహం తతః కృత్వా భోజయిత్వా స్వకర్మకమ్‌. 58

తసై#్మ దదామి సారూప్యం కరోమి తం చ పార్షదమ్‌ అజ్ఞానీ త్వ జ్ఞల స్ప ర్శా ద్య ది ప్రాణా న్సముత్సృజేత్‌. 59

తసై#్మ దదామి సాలోక్యం కరోమితంచ పార్షదమ్‌ | l అన్యత్ర వాత్యజే త్ర్పాణాం ంస్త్వ న్నామ స్మృతి పూర్వకమ్‌. 60

నీవు భారతీ శాపమున భారత దేశమున కలియుగ యైదువేల యేండ్లవఱకుండ గలవు. నీవు నిత్యము రహస్యముగ సాగరముతో రతిసల్పు చుందువు. నీవు రస తరంగిణివి. రసికుడగు సాగరునితో నీకూటమి రసవంతమగును. భారతీయు లెల్లరును భగీరథు డొనరించిన నీ స్తోత్రముతో పూర్ణ భక్తితో నిన్ను సంస్తుతించగలరు. కణ్వశాఖ ప్రకారము నిన్ను పూజుంచి స్తుతించి నమస్కరించినవా డశ్వమేధ ఫలము బడయును. వేయేల ! నూఱామడల దూరమున నుండియు 'గంగా!గంగా'! యని యెలు గెత్తి నిన్ను పిలుచువాని పాపములు పటాపంచలగును. అతడు విష్ణులోకమేగ గలడు. వేలకొలది పాపుల స్నానమున నిన్నంటిన పాప పంకమంతయును ప్రకృతి మంత్రో పాసకులు నిన్ను తాకినంతనే నశించగలదు. వేలకొలది పాపుల శవములు దాకి నీలో మునిగినవారి పాపములు నిన్నంటును ప్రకృతి మంత్రో పాసకులు నిన్ను తాకినంతనే నీ కంటు కొన్న పాపము పటాపంచలగును. ఓ శుభాంగి! నీవు సరస్వతి మున్నగు దివ్వనదులతో గూడి పాపాత్ముల పాపపంకము కడిగి వేయుచుండుము. దివ్య ప్రకృతి మాత గుణమహిమలు కీర్తించుచోటు పరమ పుణ్య తీర్థమగును. నీలోని యిసుకరేణువు తాకినంతనే పాతకి పవిత్రుడుగా గలడు. అచ్చటి రేణువులున్నన్ని యేండ్లతడు శ్రీదేవీ లొకమందు వసింపగలడు. నీ యందలి భక్తితో జ్ఞానముతో నా నామస్మరణము చేయుచు ప్రాణములు వదలు పూణ్యాత్ముడు విష్ణుసాలోక్యము పొందును. అచట వారు నా పార్శ్వచరులై చిరకాలము సుఖములొందగలరు. వారు లెక్కలేనన్ని ప్రాకృత ప్రళయములు గాంచ గల్గుదురు. చనిపోయిన పుణ్యాత్ముని శవము నీజలములందు జేరును. అతడు సూర్యడున్నంత కాలమువైకుంఠమందు వసింపగలడు. పిమ్మటనెన్నో జన్నలెత్తి కర్మలనుభవింపగలడు. అట్టి వానికి నాసారూప్యమిచ్చి నా పార్శ్వచరునిగనతనినుంచు కొందును. ఒక వేళ నజ్ఞాని నీజలముల తాకి ప్రాణములు వదలినచో అతనికిని నా సాలోక్యమిచ్చి నాపార్శ్వచరునిగ నుంచుకొందును. ఒక వేళ నైవడైన నీవులేని చోటున నీ నామము పలుకుచు ప్రాణములు వదలినచో-

తసై#్మ దదామి సాలోక్యం యావద్వై బ్రహ్మణో వయః l అన్యత్ర వాత్యజే త్ర్పాణాం స్త్వ న్నా మస్మృతి పూర్వకమ్‌. 61

తసై#్మ దదామి సారూప్య మసంఖ్యం ప్రాకృతం లయమ్‌ l రత్నేంద్రసార నిర్మాణయానేన సహ పార్షదైః. 62

సద్యః ప్రయాతి గోలోకం మమ తుల్యో భ##వే ద్ధ్రువమ్‌ | తీర్థే7ప్యతీర్థే మరణ విశేషో నాస్తి కశ్చన. 63

మన్మంత్రోపాసకానాం తు నిత్యుం నై వేద్య భోజినామ్‌ | పూతం కర్తు ం స శక్తోహి లీలయా భపవన త్రయమ్‌. 64

రత్నేంద్రసారయానేన గోలోకం సంప్రయాంతి చ | మద్బక్తా బాంధవా యేషాం తే7పి పశ్వాదయో7పి హి. 65

ప్రయాంతి రత్నయానేన గోలోకం చాతి దుర్లభమ్‌ | యత్రయత్ర స్మృతాస్తేచ జ్ఞానేన జ్ఞానినః సతి. 66

జీవన్ముక్తా శ్చ తే పూతా మద్బక్తేః సంవిధానతః | ఇత్యుక్తా శ్రీహరిస్తాం చ ప్రత్యువాచ భగీరథమ్‌. 67

స్తుహి గంగా మిమాం భక్త్యా పూజాంచ కురుసాంప్రతమ్‌ | భగీరథస్తాంతుష్టావ పూజయామాస భక్తితః. 68

కౌధుమో క్తేన ధ్యానేన స్తోత్రేణాపి పునః పునః | ప్రణనామ చ శ్రీకృష్ణం పరమాత్మాన మీశ్వరమ్‌. 69

భగీరథశ్చ గంగా చ సో7ంతర్ధానం చకార హ | నారదః: కేన ధ్యానేన స్తోత్రేణ కేన పూజా క్రమేణ చ. 70

పూజాం చకారనృపతి ర్వద వేదవిదాంవర | శ్రీనారాయణః: స్నాత్వా నిత్యక్రియాం కృత్వా ధృత్వా ధౌతే చ వాససీ. 71

సంపూజ్య దేవషట్కంచ సంయతో భక్తి పూర్వకమ్‌ | గణశం చ దినేశం చ వహ్ని విష్ణుం శివం శివామ్‌, 72

సంపూజ్య దేవషట్కంచ సో7ధి కారీచ పూజనే | గణశం విఘ్ననాశాయ ఆరోగ్యా య దివాకరమ్‌. 73

వహ్నిం శౌచాయ విష్ణుం చ లక్ష్మ్యర్థం పూజయేన్నరః | శివాం జ్ఞానాయ జ్ఞానేశం శివాం చ ముక్తి సిద్ధయే. 74

సంపూజ్యైతాం ల్లభేత్ప్రాజ్ఞో విపరీత మతో న్యథా | దద్యావనేన ధ్యానేన తద్ధ్యానం శృణునారద. 75

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే ఏకాదశో7ధ్యాయః.

అతనికి నేను బ్రహ్మ వయస్సున్నంత కాలము నా సాలోక్య మీయగలను. ఎచ్చోటనైన నిన్ను తలంచుచు ప్రాణములు వదలినవాడు నుండును. అట్టివానికి పెక్కు ప్రాకృత ప్రళయముల వఱకు నాతో సమాన రూప మీయగలను. అట్టివాడు రత్న విమాన మెక్కి నా యనువచచచ రులతో విహరించును. అతడు గోలోకముచేరి నాతో సమాను డగును. ఇట్టివానికి ప్రత్యేకముగ నొక తీర్థమందే చావవలయునను నియమము లేదు. ఇంక నా కృష్ణమంత్రము నిత్య ముపాసించుచు నానైవేద్యము భుజించుచు నుండువాడు తేలికగ ముల్లోకములను పవిత్రము చేయగలడు. అతడు తుదకు నా దివ్య రత్న విమానమున గోలోకము చేరగలడు. అట్టివారి బందుగలు పశువులు మున్నగునవి సైతము దుర్లభ##మైన గోలోకమునకు రత్న విమానముపై వెళ్ళగలరు. నా భక్తులు జ్ఞానులునగు వారలెచ్చటనున్నను నన్నే స్మరించుచుందురు. నా యందలి నిశ్చలభక్తివలన వారు పవిత్రులై జీవన్ముక్తులు గాగలరు. అని గంగతో పలికి శ్రీహరి భగీరథునితో నిట్లు పలికెను. ఇపుడు నీవు భక్తి భావము పెల్లుబుక గంగదేవిని సంస్తుతించి పూజించుము. అంత భగీరథుడు భక్తిభావముతో గంగను పూజించెను. పిదప కౌధుమశాఖోక్త ప్రకారమున మాటిమాటికి భగీరథుడు గంగను స్తోత్రముచేసి ధ్యానించెను. ఈశ్వరుడగు శ్రీకృష్ణ పరమాత్మునకు నమస్కరించెను. అంత శ్రీకృష్ణుడంతర్ధాన మొందెను. గంగ భగీరథుని వెంట నడచెను. నారదు డిట్లనెను: ఓ వేదవిదులలో శ్రేష్ఠుడా! ఏ ధ్యానముచే నే స్తోత్రముచే నే పూజూవిధిచేత భగీరథుడు గంగను పూజించెను. శ్రీనారాయణు డిట్లనెను: తొలుత స్నాన మొనరించి నిత్యక్రియలు నిర్వర్తించుకొని తెల్లని వస్త్రము ధరించవలయును. తర్వాత భక్తితో నార్గురు దేవతలను పూజించిన గాని గంగా పూజకు తగినవాడు గాడు. గణపతి సూర్యుడు అగ్ని విష్ణువు శివుడు శక్తి వీరార్గురు. ఈ యార్గురు దేవతలను పూజించినవానికి గంగను పూజించుటకు యోగ్యత గల్గును. విఘ్నములు తొలగుటకు గణపతిని ఆరోగ్యము కొఱకు సూర్యుని పూజించవలయును. పరిశుద్ధి కొఱ కగ్నిని లక్ష్మీప్రాప్తికి విష్ణుని జ్ఞానమునకు శివుని ముక్తి కొఱకు శక్తిని పూజించవలయును. ప్రాజ్ఞుడైనవాడు వీరందఱిని పూజించవలయును. లేనిచో ఫలితము విపరీత మగును. నారదా! ఇపుడు భగీరథుడే ధ్యానమున గంగను ధ్యానించెనో వినుము.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణ మందలి నవమ స్కంధమున పదునొకండవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters