Sri Devi Bagavatham-2    Chapters   

అథ షష్ఠోధ్యాయః

జనమేజయః : చ్యవనేన కథం వైద్యౌ తౌ కృతౌ సోమపాయినౌ | వచనంచ కథం సత్యం జాతంతస్యమహాత్మనః.

మానుషస్య బలం కీ దృగ్దేవరాజబలం ప్రతి | నిషిద్దౌ భిషజౌ తేన కృతౌ తౌ సోమపాయినౌ. 2

ధర్మనిష్ఠ తదాశ్చర్యం విస్తరేణ వద ప్రభో | చరితం చ్యవనస్యాద్య శ్రోతుకామోస్మి సర్వథా. 3

వ్యాసః : నిశామయ మహారాజ చరితం పరమాద్బుతమ్‌ | చ్యవనస్య మఖే తస్మిన్‌ శర్యాతే ర్బువి భారత. 4

సుకన్యాం సుందరీం ప్రాప్య చ్యవనః సురసన్నిభః | విజహార ప్రసన్నాత్మా దేవకన్యా మివామరః. 5

కదాచిదథ శర్యాతి భార్యా చింతాతురా భృశమ్‌ | పతిం ప్రాహ వేపమానా వచనం రుదతీ ప్రియా. 6

రాజ స్పుత్రీ త్వయా దత్తా మునయేంధాయ కనానే | మృతా జీవతి వా సా తు ద్రష్టవ్యాసర్వథాత్వయా. 7

గచ్ఛ నాథ మునే స్తావ దాశ్రమం ద్రష్టుమాదరాత్‌ | కిం కరోతి సుకన్యాసా ప్రాప్యనాథం తథావిథమ్‌. 8

పుత్రీ దుఃఖేన రాజర్షే దగ్దాస్మి సర్వథా హృది | తామానయ విశాలాక్షీం తపః క్షామాం మదంతికే. 9

పశ్యామి సర్వదా పుత్రీం కృశాంగీం వల్కలావృతౌమ్‌ | అంధం పతిం సమాసాద్య దుఃఖభాజం కృశోదరీమ్‌. 10

ఆరవ అధ్యాయము - సుకన్య వృత్తాంతము

ÇÁƒ«s®ªs[VÇÁ¸R…VV ²T…ÈýÁ®ƒsƒ«sV : ¿RÁùª«sƒ«sª«sVx¤¦¦¦L<ji ®µ…[ª«s\®ªsµR…VùÌÁ ZNPÈýÁV r¡ª«sVFyƒ«sª«sVV gRiÖæÁLi¿Áƒ«sV? A ª«sV¥¦¦¦»R½Vø¬s ª«s¿RÁƒ«s ®ªsVÈýÁV xqs»R½ùª«s¿RÁƒ«s ª«sV¹¸…Vùƒ«sV? BLiúµR…V²R…V ¬s}tsQµ³j…LiÀÁƒ«s r¡ª«sVFyƒ«sª«sVV ®µ…[ª«s\®ªsµR…VùÛÍÁÈýÁV ¿Á[¸R…VgRiÖæÁLji. INRP ª«sWƒ«sª«so¬s ‡ÁÌÁª«sVVª«sVVLiµj…LiúµR… ‡ÁÌÁª«sVV ®ªsVVNRP䪯[LiVVƒ«sµj… gRiµy! J µ³R…LRiø¬suîy! BµR…Li»R½¸R…VV ÀÁú»R½ª«sVVgRi ƒ«sVƒ«sõµj…. ¿RÁùª«sƒ«sV¬s xqsLixmspLñRi ÒÁ„s»R½¿RÁLjiú»R½ª«sVV „sƒ«s NRPV»R½W x¤¦¦¦ÌÁ ª«sVgRiV¿RÁVƒ«sõµj…. „sxqsòLjiLiÀÁ ¾»½ÌÁVöª«sVV. @ƒ«s ªyùxqsV ²T…ÈýÁ®ƒsƒ«sV: J ˳ØLRi»R½ ª«sV¥¦¦¦LSÇØ! ¿RÁùª«sƒ«sª«sVx¤¦¦¦L<ji xmsLRiª«sWµR…V÷»R½ ¿RÁLji»R½ª«sVV ƒyÖÁLixmsoª«sVV. aRPLSù¼½LSÇÁ٠˳ÏÁW„sV\|ms ¸R…VÇìÁ ®ªsVVƒ«sLjiLi¿Áƒ«sV. µy¬s¸R…VLiµR…ª«sVLRiV²R…V ®µ…[ª«sNSLi»R½»][ xqs*LæRi{qsª«sV „sx¤¦¦¦LjiLi¿RÁVƒ«sÈýÁV ¿RÁùª«sƒ«sV²R…VxqsVNRPƒyù xqsVLiµR…Lji¬sËÜLiµj… úxmsxqsƒ«sVõQQ\®²… „sx¤¦¦¦LjiLi¿Áƒ«sV. FsÈýÁ¬sƒ«s INRPƒy²R…V aRPLSù¼½ ˳ØLRiù ÀÁLi»y»R½VLRi\¹¸…V ª«sßáNRPV¿RÁV xmsÌÁzmsLi¿RÁV¿RÁV »R½ƒ«s xms¼½»][ ¬sÈýÁV xmsÖÁZNPƒ«sV. LSÇØ! ª«sVƒ«s xqsVNRPƒ«sù ƒ«s²R…„sÍÜ[ ƒ«sVƒ«sõ úgRiV²ïT…ª«sVV¬s NRPLiÈÁgRiÉíÓÁ¼½„sV. A®ªsV ú‡Á¼½ZNPƒ¯[ ¿RÁ¿Á胯[ ¾»½ÖÁ¸R…VVÈÁ ª«sVLiÀÁµj…. A ª«sVVƒyùúaRPª«sVª«sVVƒ«sNRPV xqsg_LRiª«sª«sVVgRi ®ªsÎÏÁ§þµR…ª«sVV. @ÈÁVª«sLiÉÓÁ xms¼½¬sËÜLiµj… ª«sVƒ«s xqsVNRPƒ«sù ¹¸…[V„sV ¿Á[¸R…VV¿RÁVƒ«sõµ][ gRiµy! A®ªsV ÍÜ[ÍÜ[ƒ«s úNRPVLigji NRPXbPLi¿RÁV¿RÁVLi²R…ª«s¿RÁV胫sV. J LSÇÁL<ki! »R½xmsª«sVV¿Á[ OUPQßÓáLiÀÁƒ«s „saSÍØOTPQ¬s ƒy¿ÁLi»R½NRPV g]¬s LRiª«sVVø. ƒyxmsÉíÓÁ úgRiV²ïT…ª«sVVxqsÖÁ xms¼½¬s ¿Á[xmsÉíÓÁ ƒyLRiÀdÁLRiÌÁV gRiÉíÓÁ ÍÜ[ƒ«s NRPV„sVÖÁ NRPXbPLiÀÁƒ«sµj…. A®ªsVƒ«sV »R½xmsöNRP ¿RÁW²R…ª«sÌÁ¸R…VVƒ«sV.

శర్యాతిః : gRi¿yè ®ªsWద్య విశాలాక్షి సుకన్యాం ద్రష్టు మాదరాత్‌ | ప్రియపుత్రీం వరారోహే మునింతం సంశిత వ్రతమ్‌. 11

వ్యాసః ఏవ ముక్త్వాతు శర్యాతిః కామినీం శోకసంకులామ్‌ జాగామ రథ మారుహ్య త్వరితశ్చాశ్రమంమునేః. 12

గత్వా೭೭ శ్రమ సమీపేతు తమపశ్య న్మహీపతిః | నవ¸°వనసంపన్నం దేవపుత్రోపమం మునిమ్‌. 13

తం విలోక్యామరాకారం విస్మయం నృపతిర్గతః | కిం కృతం కుత్సితం కర్మ పుత్ర్యాలోకవిగర్హితమ్‌. 14

నిహతోసౌ మునిర్వృద్ధస్త్వనయాన్యః పతిః కృతః | కామపీడితయా కామం ప్రశాంతోప్యతి నిర్ధనః. 15

దుఃసహోయం పుష్పధన్వా విశేషేణచ¸°వనే | కులే కలంకః సుమహా ననయా మానవే కృతః. 16

ధిక్తస్య జీవితంలోకే యస్య పుత్రీ హి కుత్సితా | సర్వపాపై స్తు దుఃఖాయ పుత్రీ భవతి దేహినామ్‌. 17

మయా త్వనుచితం కర్మ కృతం స్వార్థస్య సిద్దయే | వృద్దా యాందాయ యా దత్తా పుత్రీ సర్వాత్మనా కిల. 18

కన్యా యోగ్యాయ దాత వ్యాపిత్రా సర్వాత్మనా కిల | తాదృశం హిఫలం ప్రాప్తంయా దృశంవై కృతంమయా. 19

హన్మిచే దద్యతనయాందుః శీలాం పాపకారిణీమ్‌ | స్త్రీహత్యా దుస్తరా స్యా న్మే తథా పుత్ర్యా విశేషతః. 20

మనువంశ స్తు విఖ్యాతః సకలంకః కృతో మయా | లోకాపవాదో బలవా న్దు స్త్యాజ్యా స్నేహశృంఖలా. 21

కిం కరోమీతి చింతాబ్దౌ యదామగ్నః సపార్థివః | సుకన్యయా తదా దైవా ద్దృష్ట శ్చింతాకులః పితా. 22

సా దృష్ట్వా తం జగామాశు సుకన్యా పితురంతికే | గత్వా పప్రచ్చ భూపాలం ప్రేమపూరితమానసా. 23

శర్యాతి యిట్లనెను : ఓ విశాలాక్షీ ! వరారోహా ! మన సుకన్యను సంశితవ్రతుడగు మునిపుంగవుని చూచుటకు సాదర ముగ నిపుడే వెళ్లగలను. ఇట్లు శర్యాతి శోకసంకులయగు తన భార్యతో బలికి రథ మధిరోహించి వేవేగ మున్యాశ్రమము జేర నరిగెను. అట ఆశ్రమ సమీపమున కరిగి నవ¸°వనసంపన్నుడు దేవకుమార సమానుడునైన మునివరుని చూచెను. అమరసన్నిభుడగు మునినిగాంచి విస్మయమంది నా పుత్రి యెంత లోకనింద్యమైన నీచకార్య మొనరించెనే యని రాజు తలంచెను. ఈమె మదనబాధలకు తాళ##లేక ప్రశాంతుడు వృద్దుడు నిర్ధనుడునైన పతిని చంపి వేరొక్కని పతిగ చేసికొన్నది. ఈ పూవిలుకానిని సహింపశక్యము గాదు. నిండుపరువమున సాధ్యము కానేకాదు. ఈమె మూలమున మా మనువంశమునకు తీరని మచ్చ గల్గినది. ఎవని కూతురు నిందుతురాలో యతని జీవితము వ్యర్థము. సర్వపాపముల దుఃఖము లనుభవించుటకే ప్రాణులకు కూతురు పుట్టును. నేను నా స్వార్థము నెఱవేరుట కెంతటితగని పని చేసితిని. అక్కటా! ఒక ముసలి చీకునకు నా యనుంగుపట్టి నంటగట్టితినే! తండ్రి తన కుమారి నెల్లవిధముల తగినవానికి దానము చేయవలయును. నేనెట్టి పని చేసితినో యట్టి ఫల మనుభవించితిని. ఇపుడు నేను పాపకారిణిని చెడునడతగల దానిని నా కూతును చంపినచో తీరని స్త్రీహత్యయు నాకు గల్గును. మనువంశ మెంతయో ప్రసిద్ధి గాంచినది. అది నేటికి నావలన కళంకితమైనది. లోకాపవాదము బలవత్తర మైనది. స్నేహబంధములు త్రెంపరానివి. ఇట్లు రాజు చింతాసాగరములో మునిగి యేమి చేయుటకును దోచకుండెను అంతలో దైవయోగమున చింతాకులుడగు తండ్రిని సుకన్య గాంచెను. ఆమె యతని సన్నిధికేగి ప్రేమ నిండిన మనస్సుతో నిట్లు ప్రశ్నించెను:

కిం విచారయసే రాజం శ్చింతావ్యాకులితాననః | ఉపవిష్టం మునిం వీక్ష్య యువాన మంబుజేక్షణమ్‌. 24

ఏహ్యేహి పురుషవ్యాఘ్ర ప్రణమస్వ పతిం మమ | మా విషాదం నృప శ్రేష్ఠ సాంవ్రతం కురు మానద. 25

వ్యాసః : ఇతి పుత్ర్యా వచః శ్రుత్వా శర్యాతిః క్రోధపీడితః | ప్రోవాచ వచనం రాజాపురః స్థాం తనయాం తతః. 26

రాజోవాచః క్వ మునిశ్చ్యవనః పుత్రి వృద్ధోంధ స్తపసోత్తమః |

కో యం యువా మదోన్మత్తః సందేహోత్ర మహాన్మమ. 27

మునిః కిం నిహతః పాపే త్వయా దుష్కృతకారిణి | నూతనోసౌ పతిః కామాత్కృతః కులవినాశిని. 28

సోహం చింతాతురస్తేన పశ్యామ్యా శ్రమసం స్థితమ్‌ | కిం కృతం దుష్కృతం కర్మ కులటాచరితం కిల. 29

నిమగ్నోహం దురాచారే శోకాబ్దౌత్వ త్కృతేధునా | దృష్ట్వైనం పురుషం దివ్యమదృష్ట్వా చ్యవనం మునిమ్‌.

విహస్య తమువాచాశు సా శ్రుత్వా వచనం పితుః | గృహీత్వా೭೭నీయ పితరం భర్తురంతిక మాదరాత్‌. 31

చ్యవనోసౌ మునిస్తాత జామాతా తే న సంశయః | అశ్విభ్యా మీదృశః కాంతః కృతః కమలలోచనః. 32

యదృచ్ఛయాత్ర సంప్రాప్తౌ నాసత్యా వాశ్రమే మమ | తాభ్యాం కరుణయా నూనం చ్యవన స్తాదృశః కృతః.

ఓ రాజా! కమలనయనుడు నవయువకుడునగు మునివరుని వీక్షించి యేల వ్యాకులచిత్తముతో విచారించుచున్నావు? మునివంశసంభవా! రాజశ్రేష్ఠా! విషాదము చెందకుము. దిగులు మానుము. రారమ్ము. నాపతి కిపిడు ప్రణమిల్లుము. అని తన యెదుట పలుకుచున్న కూతు మాటలువిని శర్యాతి కోపగించుకొని యామె కిట్లనియెను: ఓ పుత్రీ! ముని యెక్కడ! గ్రుడ్డిముసలి తబిసి యేడ! ఈ మదోన్మత్తుడగు యువకు డేడ? నాకిందు సందియము గల్గుచున్నది. కులపాంసనురాలా! పాపిష్ఠురాలా! మునిపతిని చంపితివి. కామపీడచేత నవయువకుని పతిని చేపట్టి కుల్కుచున్నావే. ఈ యాశ్రమమందలి మునిని గానక చింతాతురుడనైతిని. నీ వెంత చెడుపని చేసితివే! కులటకు తగిన పని చేసితివి గదే! ఓసి దుష్టురాలా! నీవలన నే నిపుడు శోకసాగరమున మునిగితిని. చ్యవన మునిని గానక యొక దివ్యపురుషుని గాంచుచున్నాను. ఆమె తన తండ్రి మాటలువిని నవ్వి యతనిని సాదరముగ తన పతి సమీపమునకు గొని వచ్చెను. ఓ తండ్రీ! ఇతడే చ్యవనుడు. ఇతడే నీ యల్లుడు. అశ్వినుల దయవలన నిట్లు సుమనోహరుడుగ జేయబడెను. నా మాట నమ్ముము. అశ్వినులు తమంతతామే యీ యాశ్రమమున కేతెంచిరి. వారి దయవలన చ్యవను డిట్లు చేయబడెను.

నాహం తవ సుతా తాత యథాస్యాం పాపకారిణీ | తథా త్వం మన్యసే రాజ న్విమూఢో రూపసంశ##యే. 34

ప్రణమ త్వం మునిం రాజ న్బార్గవం చ్యవనం పితః | అపృచ్ఛ కారణం సర్వం కథయిష్యతి విస్తరమ్‌. 35

ఇతి శ్రుత్వా వచః పుత్ర్యాః శర్యాతి స్త్వరితస్తదా | ప్రణనామ మునిం తత్ర గత్వా పప్రచ్ఛ సాదరమ్‌. 36

రాజోవాచ : కథయస్వ స్వవృత్తాంతం భార్గవాశు యథోచితమ్‌ | నయనేచ కథం ప్రాప్తే క్వగతాతే జరా పునః. 37

సంశయోయం మహన్మేస్తి రూపం దృష్ట్యాపి సుందరమ్‌ |

వద విస్తరతో బ్రహ్మన్‌ శ్రుత్వాహం సుఖ మాప్నుయామ్‌. 38

చ్యవనః : నాసత్యా వత్ర సంప్రాప్తౌ దేవానాం భిషజా వుభౌ | ఉపకారః కృతస్తాభ్యాం కృపయానృపసత్తమ. 39

మయా తాభ్యాం వరో దత్త ఉపకారస్య హేతవే | కరిష్యామి మఖే రాజ్ఞో భవంతౌ సోమపాయినౌ. 40

ఏవం మయా వయః ప్రాప్తం లోచనే విమలే తథా | స్వస్థో భవ మహారాజ సంవిశస్వాసనే శుభే. 41

ఇత్యుక్తః సతు విప్రేణ సభార్యః పృథివీపతిః | సుఖోపవిష్టః కల్యాణీః కథాశ్చకే మహాత్మనా. 42

అథైనం భార్గవః ప్రాప రాజానం పరిసాంత్వయగ్‌ | యాజయిష్యామి రాజంస్త్వాం సంభారా నుపకల్పయ 43

ఓ తండ్రీ! నేను నీ కూతురను. పాపచారిణిగాను నీ వీతని మోహనరూపమునకు ముగ్దుడవై నన్ను పాపమతిగ దలంచితివి. తండ్రీ! రాజా! నీ వీ భార్గవుడగు చ్యవనునికి నమస్కరింపుము. ఇది జరిగిన కారణ మడుగుము. ఇతడు విపులముగ మెత్తము చెప్పగలడు. అను తన కుమార్తె మాటలువిని శర్యాతి వెంటనే మునిచెంత కేగి గౌరవ పురస్సరముగ నతనికి ఙనమస్కరించి యిట్లనెను: ఓ భార్గవా! జరిగిన వృత్తాంతమంతయు వివరింపుము. నీకు మరల కన్ను లెట్లు కనిపించెను? నీ ముదిమి యేమయ్యెను? ఓ బ్రాహ్మణోత్తమా! నీ సుందరరూపము గాంచినంతనే నాకు సంశయము గల్గుచున్నది. విషయము వివరించుము. విని యానందింతును. అనగా చ్యవను డిట్లనెను : ఓ రాజా! అశ్విను లిచటి కేగుదెంచిరి. వారు దేవవైద్యులు. నాకు దయతో వారు మహోపకారమొనరించిరి. వారిని నీ యజ్ఞమునందు సోమపాయులుగ జేయుదునని వారు నాకు చేసిన యుపకారమునకు మారుగ వారికి వర మొసంగితిని. మహారాజా! ఇట్లు వారివలన నాకు చక్కని వయస్సు చూపును గల్గెను. ఇక నిశ్చింతగ నుండుము. సుఖాసనమున కూర్చుండుము. అని ముని పలుకగ రాజును అతని భార్యయు సుకముగ గూర్చుం డిరి. ముని వారికి మంచివిషయములు చెప్పదొడగెను. పిమ్మట భార్గవుడు రాజు నోదార్చుచు నిట్లనెను : ఓ రాజా! నీచే యజ్ఞము చేయింతును. యాగద్రవ్యములు సమకూర్చుకొనుము.

మయా ప్రతిశ్రుతం తాభ్యాం కర్తవ్యౌ సొమపౌయువామ్‌ | తత్కర్తవ్యం నృపశ్రేష్ఠ తవ యజ్ఞేతి విస్తరే. 44

ఇంద్రం నివారయిష్యామి క్రుద్దం తేజోబలేనవై | పాయయిష్యామి రాజేంద్ర సోమం సోమమఖే తవ. 45

తతః పరమసంతుష్టః శర్యాతిః పృథివీపతిః | చ్యవనస్య మహారాజ తద్వాక్యం ప్రత్యపూజయత్‌. 46

సమ్మాన్య చ్యవనం రాజా జగామ నగరం ప్రతి | సభార్య శ్చాతిసంతుష్టః కుర్వన్వార్తాం మునేః కిల. 47

ప్రశ##స్తేహని యజ్ఞీయే సర్వకామ సమృద్దిమాన్‌ | కారయామాస శర్యాతి ర్యజ్ఞాయతన ముత్తమమ్‌. 48

సమానీయ మునీ న్పూజ్యా న్వసిష్ఠప్రముఖా నసౌ | భార్గవో యాజయామాస చ్యవనః పృథివీపతిమ్‌. 49

వితతే తు యథా యజ్ఞే దేవాః సర్వే సువాసవాః | ఆజగ్ము శ్చాశ్చినౌ తత్ర సోమార్థ ముపజగ్మతుః. 50

ఇంద్రస్తు శంకిత స్తత్ర వీక్ష్య తావశ్వినా వుభౌ | పప్రచ్ఛ చ సురా న్సర్వా న్కిమేతౌ సముపాగతౌ. 51

చికిత్స కౌ న సోమార్హౌ కేనానీతా విహేతి చ | నా బ్రువ న్నమరా స్తత్ర రాజ్ఞస్తు వితతే మఖే. 52

అగృహ్ణా చ్చ్యవనః సోమ మశ్వినోర్దేవయోస్తదా | శక్రస్తం వారయామాస మాగృహాణౖ తయోర్గృహమ్‌. 53

తమహ చ్యవన స్తత్ర కథమేతౌ రవేః సుతౌ | న గ్రహర్హౌ చ నాసత్యౌ బ్రూహి సత్యం శచీపతే. 54

రాజా! మిమ్ములను సోమపాయులుగ జేతునని వారికి మాట యిచ్చితిని. అది నీ విపుల యాగముననే జరుగవలయును. ఓ రాజేంద్రా ! ఇంద్రుడు తేజోబలముతో కన్ను మిన్ను గానకున్నను నే నతని నడ్డుగొనగలను. నీ సోమయాగమున వారిచే సోమము త్రావింతును. అపుడు శర్యాతి మహారాజు సంతోషమంది చ్యవనుని మాట యొప్పుకొనెను. రాజు చ్యవనుని సమ్నానించి సంతుష్టుడై మునితో కుశలప్రశ్నములుచేసి పిదప తన భార్యతో తన నగరమున కేగెను. ఒక శుభదినమున సకల కామసంపత్స మృద్ధి గల శర్యాతి రాజు యజ్ఞమునకై తగినస్థలమును చక్కగ సిద్దపఱచెను. పిదప చ్యవనుడు వసిష్ఠ ముఖ్యులగు మునుల నాహ్వానించి రాజుతో జన్న మాచరింపజేసెను. యజ్ఞము ప్రారంభముకాగా సొమపానముకొఱకు దేవతలు ఇంద్రుడు-అశ్వినులుఝ-నేగుదెంచిరి. వారిలో నశ్వినులనుగాంచి సందేహించి యింద్రుడు దేవతలతో ''వీరును వచ్చి రేమి? దేవవైద్యులు సొమపానమునకు తగరు వీరి నెవరు రమ్మనిరి?'' అనెను. దేవతలు రాజు చేయు ఆ జన్నమున మాటాడకుండిరి. అంత చ్యవను డశ్వి దేవతల కిచ్చుటకై సోమరసము గ్రహించగా దేవేంద్రు డడ్డుపడి వారికీయకుమని మునిని వారించెను. అపుడు చ్యవను డిట్లనెను : ఈ సూర్యపుత్రు లేల సోమపానమునకు తగరు? ఇంద్రా! నిజము చెప్పుము.

న సంకరౌ సముత్పన్నౌ ధర్మపత్నీసుతౌ రవేః | కేన దోషేణ దేవేంద్ర నార్హౌ సోమం బిషగ్వరౌ. 55

నిర్ణయోత్ర మఖే శక్ర కర్తవ్యో దైవతైః సహ | గ్రాహయిష్యా మ్యహం సోమం కృతౌతౌసోమపౌమయా. 56

ప్రేరితోసౌ మయా రాజా మఖాయ మఘవన్కిల | ఏతదర్థం కరిష్యామి సత్యం మే వచనం విభో. 57

ఆభ్యా ముపకృతం శక్ర తథా దత్తం నవం వయః | తస్మా త్పృత్యుపకార స్తుకర్తవ్యః సర్వథా మయా. 58

ఇంద్రః : చికిత్సకౌ కృతా వేతౌ నాసత్యౌ నిందితౌ సురైః | ఉభావేతౌ న సోమార్హౌ మాగృహాణౖ తయోర్గృహమ్‌.

చ్యవనః అహల్యాజార సంయచ్చ కోపం చాద్య నిరర్థకమ్‌ | వృత్రఘ్ను కిం హినాసత్యౌనసోమార్హౌసురాత్మజౌ.

ఏవం వివాదే సముపస్థితే చ నకోపి వాచం తమువాచ భూప |

గ్రహం తయో ర్బార్గవతిగ్మతేజాః సంగ్రాహయామాస తపోబలేన. 61

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ సప్తమస్కంధే షష్ఠోధ్యాయః.

వీరు సంకరజన్ములు వారు గారు. రవి కతని ధర్మపత్నియందు జన్మించినవారు. ఏ దోషముచే వీరుసోమార్హులు కారో తెల్పుము. దేవేంద్రా! ఈ విషయముగూర్చి దేవతలతో నాలోచింపుము. నేను వీరికి సోమము త్రావింతునని మాట యిచ్చితిని. ఇందులకై నేను శర్యాతిని యజ్ఞమునకు ప్రేరించితిని. నా వాక్కు సత్యవాక్కని నిరూపించగలను. శక్రా ! వీరు నాకు నవ¸°వన మొసంగి మేలొనరించిరి. దానికై వారికి నేను ప్రత్యుపకారము చేయదలంచితిని. అనగా విని ఇంద్రు డిట్లనెను : అశ్వినులు దేవవైద్యులు. వీరు దేవతలచే నిందింపబడిరి. వీరిర్వురును సోమార్హులు గారు. వారికై సోమము తీసి కొనకుము. అన చ్యవను డిట్లనెను : ఓ అహల్యాజారా ! వృత్రఘ్నూ! పనికిమాలిన కోపము వదలుము. ఈ సూర్యపుత్రులు సోమార్హు లెట్లు గారు? ఇట్లు వారికి వివాదము చెలరేగుచుండగ నొక్కరును నోరెత్తకుండిరి. ఐనను భార్గవుడు మాత్రము తపోబలముతో వారికై సోమము గ్రహించెను.

ఇది శ్రీదేవీ భాగవతమందలి సప్తమ స్కంధమందు షష్ఠాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters